< Jérémie 29 >

1 Sur les Philistins
యెరూషలేము నుంచి నెబుకద్నెజరు బబులోనుకు చెరపట్టి తీసుకెళ్ళిన వాళ్ళలో ఉన్న యాజకులకూ, ప్రవక్తలకూ, ప్రజలందరికీ ప్రవక్త అయిన యిర్మీయా యెరూషలేము నుంచి పంపించిన వ్రాత చుట్ట లోని మాటలు ఇవి.
2 Voici ce que dit le Seigneur: Voilà que les eaux viendront du nord, et elles seront comme un torrent débordé, et elles inonderont la terre et tout ce qui la remplit, la ville et ses habitants. Et les hommes crieront, et tous les habitants de la terre gémiront,
రాజైన యెకొన్యా, రాజమాత, ఇంకా యూదాలో, యెరూషలేములో ఉన్న ఉన్నతాధికారులూ, శిల్పకారులూ, కంసాలులూ, యెరూషలేము నుంచి వెళ్ళిపోయిన తరువాత ఇది జరిగింది.
3 En entendant les tumultes de l'invasion, le bruit des sabots de la cavalerie, le tremblement des chars et le fracas des roues. Les pères ne se sont point retournés pour regarder leurs fils, car leurs mains étaient défaillantes,
అతడు ఈ పత్రాన్ని యూదా రాజైన సిద్కియా పంపిన షాఫాను కొడుకు ఎల్యాశా, హిల్కీయా కొడుకు గెమర్యాల చేత బబులోను రాజైన నెబుకద్నెజరుకు పంపాడు.
4 En ce jour qui est venu pour la ruine des Philistins. Et j'effacerai Tyr et Sidon, avec le reste de leurs auxiliaires, parce que le Seigneur exterminera tous ceux des îles qui auront survécu.
అందులో ఇలా ఉంది “ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా తన ఉద్దేశం చొప్పున బబులోనుకు బందీలుగా వెళ్ళిన వాళ్ళందరికీ ఇలా చెబుతున్నాడు,
5 Gaza est devenue chauve, Ascalon est tombée, et ce qu'il y avait encore d'Énacim.
‘ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండండి. తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి.
6 Jusques à quand frapperas-tu, glaive du Seigneur? Combien de temps s'écoulera avant que tu sois au repos? rentre dans ton fourreau; arrête-toi et reste suspendu.
పెళ్ళిళ్ళు చేసుకుని కొడుకులనూ కూతుళ్ళనూ కనండి. అక్కడ మీరు తక్కువ సంఖ్యలో ఉండకుండా అభివృద్ధి పొందడానికి మీ కొడుకులకూ, కూతుళ్ళకూ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను కొడుకులూ కూతుళ్ళూ కననివ్వండి.
7 Comment se reposerait-il? Le Seigneur lui a ordonné de s'élever contre Ascalon, contre la région maritime et contre les autres cités.
నేను మిమ్మల్ని బందీలుగా తీసుకెళ్ళిన పట్టణం క్షేమం కోరి దాని కోసం యెహోవాకు ప్రార్థన చేయండి. ఎందుకంటే, దానికి క్షేమం కలిగితే మీకు క్షేమం కలుగుతుంది.’
8
ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘మీ మధ్య ఉన్న ప్రవక్తలు, మంత్రగాళ్ళు మిమ్మల్ని మోసం చెయ్యనివ్వకుండా చూసుకోండి. మీలో కలలు కనే వాళ్ళు చెప్పే మాటలు వినకండి.
9
వాళ్ళు నా పేరట అబద్ధ ప్రవచనాలు మీతో చెప్తారు. నేను వాళ్ళను పంపలేదు.’ ఇదే యెహోవా వాక్కు.
౧౦ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు, ‘బబులోను మిమ్మల్ని డెబ్భై సంవత్సరాలు పాలించిన తరువాత, నేను మీకు సాయం చేసి, నేను మీకోసం పలికిన శుభ వచనం నెరవేర్చి, ఈ స్థలానికి మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను.
౧౧ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.
౧౨అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను.
౧౩మీరు పూర్ణమనస్సుతో నన్ను అన్వేషిస్తారు కాబట్టి, నన్ను కనుగొంటారు.
౧౪అప్పుడు నేను మీకు దొరుకుతాను,’ ఇది యెహోవా వాక్కు. ‘తరువాత, నేను మిమ్మల్ని నిర్బంధంలో నుంచి రప్పించి, మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లోనుంచి, స్థలాల్లోనుంచి మిమ్మల్ని పోగు చేస్తాను.’ ఇది యెహోవా వాక్కు. ‘ఎక్కడినుంచి మిమ్మల్ని బందీలుగా పంపానో, అక్కడికే మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను,’
౧౫బబులోనులో యెహోవా మాకు ప్రవక్తలను నియమించాడని మీరు అన్నారు గనుక,
౧౬దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుతో, మీతోబాటు బందీలుగా వెళ్ళకుండా ఈ పట్టణంలో నివాసం ఉన్న మీ సహోదరులతో, ప్రజలందరితో యెహోవా ఈ మాట అంటున్నాడు,
౧౭సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నేను వాళ్ళ మీదికి ఖడ్గం, కరువు, తెగులు పంపబోతున్నాను. తినడానికి వీలు లేని కుళ్ళిపోయిన అంజూరు పళ్ళలా వాళ్ళను చేస్తాను.
౧౮తరువాత ఖడ్గంతో, కరువుతో, తెగులుతో నేను వాళ్ళను తరుముతాను. భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటి దృష్టిలో వాళ్లను ఒక అసహ్యంగా చేస్తాను. నేను వాళ్ళను చెదరగొట్టిన దేశాల్లో వాళ్ళను శాపానికీ, తృణీకారానికీ, ఎగతాళికీ ప్రతీకగా చేస్తాను.
౧౯ఎందుకంటే వాళ్ళు నా మాట వినలేదు,’ ఇది యెహోవా వాక్కు. ‘నా సేవకులైన ప్రవక్తల ద్వారా నా వాక్కు పదేపదే పంపాను. కాని, మీరు వినలేదు’ ఇది యెహోవా వాక్కు.”
౨౦“నేను యెరూషలేము నుంచి బబులోనుకు బందీలుగా పంపిన ప్రజలారా, మీరందరూ యెహోవా మాట వినండి.
౨౧నా పేరును బట్టి మీకు అబద్ధ ప్రవచనాలు ప్రకటించే కోలాయా కొడుకు అహాబు గురించి, మయశేయా కొడుకు సిద్కియా గురించి, ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, చూడండి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వాళ్ళను అప్పగించబోతున్నాను. మీ కళ్ళ ఎదుట అతడు వాళ్ళను చంపుతాడు.
౨౨అప్పుడు వీళ్ళ గురించి బబులోనులో ఉన్న వాళ్ళందరూ శాపవచనాలు పలుకుతారు. ‘బబులోను రాజు అగ్నిలో కాల్పించిన సిద్కియాలాగా, అహాబులాగా యెహోవా నిన్ను చేస్తాడు గాక,’ అని శాపం పెడతారు.
౨౩ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళు ఇశ్రాయేలీయుల్లో దుర్మార్గం జరిగిస్తూ, తమ పొరుగువాళ్ళ భార్యలతో వ్యభిచారం చేస్తూ, నేను వాళ్లకు ప్రకటించని అబద్ధపు మాటలు నా పేరట ప్రకటించారు. నేనే ఈ సంగతి తెలుసుకున్నాను, నేనే దానికి సాక్షం,” ఇదే యెహోవా వాక్కు.
౨౪“నెహెలామీయుడైన షెమయా గురించి ఇలా చెప్పు.
౨౫ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, యాజకుడైన మయశేయా కొడుకు జెఫన్యాకూ, యాజకులకందరికీ, నీ సొంత పేరుతో ఉత్తరాలు పంపి,
౨౬‘యాజకుడైన యెహోయాదాకు బదులుగా యెహోవా మందిర విషయాల్లో విచారణకర్త అయిన యాజకునిగా యెహోవా నిన్ను నియమించాడు. వెర్రివాళ్లై తమను తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్న వాళ్ళను నువ్వు సంకెళ్లతో బంధించి బొండలో బిగించాలి’ అన్నావు.
౨౭‘కాబట్టి ఇప్పుడు, నీకు ప్రత్యర్ధిగా, తనను తాను ప్రవక్తగా చేసుకున్న అనాతోతీయుడైన యిర్మీయాను నువ్వెందుకు చీవాట్లు పెట్టలేదు?
౨౮మీరు ఇక్కడ చాలాకాలం ఉంటారు. ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండండి, తోటలు నాటి వాటి ఫలాలు తినండి,’ అని బబులోనులో ఉన్న మాకు అతడు వర్తమానం పంపాడు,”
౨౯అప్పుడు యాజకుడైన జెఫన్యా, ప్రవక్త అయిన యిర్మీయా వింటూ ఉండగా ఆ పత్రికను చదివి వినిపించాడు.
౩౦అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
౩౧“బందీలుగా ఉన్న వాళ్ళందరికీ నువ్వు కబురంపి ఇలా చెప్పు, ‘యెహోవా నెహెలామీయుడైన షెమయా గురించి ఇలా అంటున్నాడు, నేను అతణ్ణి పంపకపోయినా, షెమయా మీకు ప్రవచించి మీరు అబద్ధపు మాటలు నమ్మేలా చేశాడు కాబట్టి,
౩౨నెహెలామీయుడైన షెమయా యెహోవాకు వ్యతిరేకంగా అబద్ధం ప్రకటించాడు కాబట్టి అతన్నీ, అతని సంతానాన్నీ నేను శిక్షించబోతున్నాను. ఈ ప్రజల్లో కాపురం ఉండేవాడు ఒక్కడూ అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేసే మేలు అతడు చూడడు.’ ఇది యెహోవా వాక్కు.”

< Jérémie 29 >