< Daniel 8 >

1 En la troisième année du règne de Baltasar, une vision m'apparut à moi, Daniel, après celle qui m'était d'abord apparue.
బెల్షస్సరు రాజు పరిపాలన మూడవ సంవత్సరంలో దానియేలు అనే నాకు మొదట కలిగిన దర్శనం గాక మరొక దర్శనం కలిగింది.
2 J'étais dans le palais à Suse, qui est au pays d'Élam, et j'étais sur la rive du fleuve Ubal.
నేను దర్శనం చూశాను. చూస్తుండగా నేను ఏలాము ప్రాంతానికి చెందిన షూషను అనే పట్టణం కోటలో ఉండగా నాకు దర్శనం వచ్చింది.
3 Et je levai les yeux, et je regardai; et voilà qu'un bélier se tenait devant l'Ubal. Et il avait de grandes cornes, et l'une était plus grande que l'autre, et allait toujours croissant.
నేను ఊలయి అనే నది ఒడ్డున ఉన్నట్టు నాకు దర్శనం వచ్చింది. నేను కళ్ళెత్తి చూడగా, ఒక పొట్టేలు ఆ నది ఒడ్డున నిలబడి ఉంది. దానికి రెండు కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు పొడవుగా ఉన్నాయి. అయితే ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉంది. ఎత్తుగా ఉన్నది తరువాత మొలిచింది.
4 Et je vis le bélier frappant de ses cornes du côté de la mer, de l'aquilon et du midi; et devant lui nulle bête ne pouvait tenir, et nul ne pouvait échapper à ses coups, et il fit ce qu'il voulut, et il devint grand.
ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమానికి, ఉత్తరానికి, దక్షిణానికి, పరుగులు పెడుతూ ఉండడం కనిపించింది. ఇలా జరుగుతుండగా దాన్ని ఎదిరించడానికైనా, దానికి చిక్కకుండా తప్పించుకోడానికైనా, ఏ జంతువుకూ శక్తి లేకపోయింది. అది తనకిష్టమైనట్టు చేస్తూ గొప్పదయింది.
5 Et j'étais là, le regardant; et voilà qu'un jeune bouc vint du sud-ouest, sur la face de toute la terre, et il ne touchait pas à terre; et ce bouc avait une corne entre les yeux.
నేను ఈ సంగతి ఆలోచిస్తుంటే ఒక మేకపోతు పడమట నుండి వచ్చి, కాళ్లు నేలపై మోపకుండా భూమి అంతటా పరుగులు తీసింది. దాని రెండు కళ్ళ మధ్య ఒక గొప్ప కొమ్ము ఉంది.
6 Et il arriva jusqu'au bélier qui avait des cornes, celui que j'avais vu en face de l'Ubal; et il s'élança contre lui dans toute la force de sa fureur.
ఈ మేకపోతు నది ఒడ్డున నేను చూసిన రెండు కొమ్ములున్న పొట్టేలు దగ్గరికి వచ్చి, భయంకరమైన కోపంతో బలంతో దాన్ని కుమ్మింది.
7 Et je le vis atteindre le bélier, et il se rua sur lui, et il le frappa, et lui brisa les deux cornes: et le bélier fut sans force pour lui résister en face. Puis il le jeta contre terre, et il le foula aux pieds, et nul n'était là pour délivrer le bélier de ses coups.
నేను చూస్తుండగా ఆ మేకపోతు పొట్టేలుపై తిరగబడి, భీకరమైన రౌద్రంతో దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను విరగ్గొట్టింది. ఆ పొట్టేలు దాని నెదిరించలేక పోయింది. ఆ మేకపోతు దాన్ని నేలపై పడేసి తొక్కుతూ ఉంది. దాని బలాన్ని అదుపు చేసి ఆ పొట్టేలును తప్పించడం ఎవరివల్లా కాలేదు.
8 Or le bouc grandit à l'excès; et pendant qu'il croissait en force, sa grande corne se brisa, et quatre autres cornes lui poussèrent au-dessous de celle-ci, des quatre côtés du ciel, d'où viennent les vents.
ఆ మేకపోతు విపరీతంగా పెరిగి పోయింది. అది బాగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగింది. విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగాయి.
9 Et de l'une de ces cornes sortit une autre corne puissante, qui s'éleva prodigieusement contre le midi et contre un peuple fort;
ఈ కొమ్ముల్లో ఒక దానిలో నుండి ఒక చిన్నకొమ్ము మొలిచింది. అది దక్షిణానికి, తూర్పుకు, ఇశ్రాయేలు మహిమాన్విత దేశం వైపుకు అత్యధికంగా ప్రబలింది.
10 Et même elle s'éleva jusqu'à l'armée du ciel; et elle fit tomber du ciel une partie de l'armée et une partie des étoiles, et elles furent foulées aux pieds.
౧౦ఆకాశ సైన్యంతో యుద్ధమాడేటంతగా అది పెరిగిపోయి నక్షత్రాల్లో కొన్నిటిని పడేసి కాళ్లతో తొక్కేస్తూ ఉంది.
11 Et il en fut ainsi, jusqu'à ce que le chef de l'armée eût délivré ses captifs; et à cause de ce bouc les sacrifices furent interrompus, et il prospèrera, et le sanctuaire sera désolé.
౧౧ఆ సైన్యాధిపతికి విరోధంగా గొప్పదైపోయి, అనుదిన బలి అర్పణలను ఆపి వేసి ఆయన ఆలయాన్ని పాడు చేసింది.
12 Et au lieu de victimes les offrandes furent le péché, et la justice fut renversée à terre. Pour lui, il fera son œuvre, et il prospèrera.
౧౨తిరుగుబాటు మూలంగా ఆ మేకపోతు కొమ్ముకు ఒక సేన ఇవ్వడం జరిగింది. అతడు సత్యాన్ని నేలపాలు చేసి ఇష్టానుసారంగా జరిగిస్తూ వర్థిల్లాడు.
13 Et j'entendis l'un des saints qui parlait, et l'un des saints dit à un autre qui m'était inconnu: Jusques à quand durera cette vision des sacrifices abolis, du péché, cause de cette désolation, du sanctuaire et de l'armée céleste foulés aux pieds.
౧౩అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాటలాడగా విన్నాను. అంతలో మాట్లాడుతూ ఉన్న ఆ పరిశుద్ధునితో మరొక పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే “దహన బలిని గూర్చి, నాశనకారకమైన పాపం గురించి, ఆలయం అప్పగించడం, ఆకాశ సైన్యం కాలి కింద తొక్క బడడం కనిపించిన ఈ దర్శనం నెరవేరడానికి ఎన్నాళ్లు పడుతుంది” అని మాట్లాడుకున్నారు.
14 Et le premier répondit: Du soir au matin, durant deux mille quatre cents jours, puis le sanctuaire sera purifié.
౧౪అతడు “2, 300 రోజుల వరకే” అని నాతో చెప్పాడు. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు జరుగుతుంది.
15 Et ceci advint: tandis que moi, Daniel, j'avais cette vision et que je cherchais à la comprendre, voilà que la vision d'un homme se dressa devant moi.
౧౫దానియేలు అనే నేను ఈ దర్శనం చూశాను. దాన్ని గ్రహించ గలిగిన వివేకం పొందాలని నాకు అనిపించింది. మనిషి రూపం ఉన్న ఒకడు నా ఎదుట నిలబడ్డాడు.
16 Et j'entendis une voix d'homme, entre l'Ubal et moi, et elle appela et dit: Gabriel, explique à celui-ci sa vision.
౧౬అప్పుడు ఊలయి నదీతీరాల మధ్య నిలిచి పలుకుతున్న ఒక మనిషి స్వరం విన్నాను. అది “గాబ్రియేలూ, ఈ దర్శనభావాన్ని ఇతనికి తెలియజెయ్యి” అని వినిపించింది.
17 Et Gabriel s'approcha, et il se tint auprès de moi, et pendant qu'il venait j'étais frappé de crainte; et je tombai la face contre terre, et il me dit: Comprends, fils de l'homme; car cette vision s'accomplira au temps marqué.
౧౭అప్పుడతడు నేను నిలబడి ఉన్న చోటుకు వచ్చాడు. అతడు రాగానే నేను హడలిపోయి సాష్టాంగపడ్డాను. అతడు “నరపుత్రుడా, ఈ దర్శనం అంత్యకాలాన్ని గురించినది అని తెలుసుకో” అన్నాడు.
18 Et pendant qu'il me dit ces paroles, je retombai encore la face contre terre, et il me toucha, et il me remit debout sur mes pieds.
౧౮అతడు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు గాఢనిద్ర పట్టి నేలపై సాష్టాంగపడ్డాను. కాబట్టి అతడు నన్ను పట్టుకుని లేపి నిలబెట్టాడు.
19 Et il me dit: Je vais te faire savoir ce qui adviendra aux derniers jours de la colère; car c'est aussi le temps marqué pour l'accomplissement de ta vision.
౧౯అతడు “ఉగ్రత పూర్తి అయ్యే కాలంలో జరగబోయే విషయాలు నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది నిర్ణయించిన అంత్యకాలాన్ని గురించినది.
20 Le bélier que tu as vu ayant des cornes est le roi des Mèdes et des Perses.
౨౦నీవు చూసిన రెండు కొమ్ములున్న పొట్టేలు మాదీయుల పారసీకుల రాజులను సూచిస్తున్నది.
21 Le bouc est le roi des Hellènes; et la grande corne qu'il avait entre les deux yeux est leur premier roi.
౨౧బొచ్చు ఉన్న ఆ మేకపోతు గ్రీకుల రాజు. దాని రెండు కళ్ళ మధ్యనున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచిస్తున్నది.
22 Et quand elle a été brisée, les quatre cornes qui se sont élevées au- dessous sont quatre rois qui s'élèveront parmi les nations, mais non par leur propre force.
౨౨అది పెరిగిన తరువాత దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టాయి గదా. నలుగురు రాజులు ఆ జాతిలో పుడతారు గాని వారికి అతనికున్నంత బలం ఉండదు.
23 Et à la fin de leurs règnes, quand la mesure de leurs péchés sera remplie, un roi s'élèvera, au front impudent, comprenant les énigmes.
౨౩వారి పరిపాలన అంతంలో వారి అతిక్రమాలు పూర్తి ఆవుతుండగా, క్రూరముఖం ఒక రాజు వస్తాడు. అతడు చాలా యుక్తిపరుడు.
24 Et sa force sera grande, et il détruira des choses admirables, et il prospèrera, et il entreprendra, et il détruira les forts et le peuple saint.
౨౪అతడు శక్తిశాలి గాని అది అతని స్వశక్తి కాదు. అతడు విస్తృతంగా విధ్వంసం జరిగిస్తాడు. తాను చేసే ప్రతి దానిలోనూ సఫలుడౌతాడు. అతడు బలిష్టులైన ప్రజలను పరిశుద్ధ ప్రజలను నాశనం చేస్తాడు.
25 Et le joug de sa chaîne sera bien dirigé; la fraude à la main, il se glorifiera en son cœur; il fera périr par ses ruses une multitude d'hommes, et il s'affermira par la ruine de plusieurs; et il les écrasera comme un œuf dans la main.
౨౫అతడు కుటిల బుద్ధితో మోసం ద్వారా వర్థిల్లుతాడు. అతడు రాజాధిరాజుతో సైతం యుద్ధం చేస్తాడు. అయితే చివరికి అతడు కూలిపోతాడు-కానీ అది మానవ బలం వల్ల జరగదు.
26 Cette vision que tu as eue du soir au matin est véritable; mets-y le sceau, parce qu'elle ne s'accomplira qu'après bien des jours.
౨౬ఆ దినాలను గూర్చిన దర్శనాన్ని గూర్చి చెప్పినది వాస్తవం, నీవైతే ఈ దర్శనం వెల్లడి చేయవద్దు. ఎందుకంటే అది భవిషత్తులో నెరవేరుతుంది.”
27 Après cela, moi, Daniel, je fus alité et je tombai dans la langueur; puis je me levai, et je m'appliquai aux affaires du roi, et je fus émerveillé de ma vision; mais il n'y eut personne pour la comprendre.
౨౭దానియేలు అనే నేను తట్టుకోలేక కొన్నాళ్లు నీరసంగా పడి ఉన్నాను. తరువాత నేను లేచి రాజు కోసం చేయవలసిన పని చేస్తూ వచ్చాను. ఈ దర్శనాన్ని గూర్చి నిర్ఘాంతపోయిన స్థితిలో ఉండిపోయాను. దాన్ని అర్థం చేసుకోగలిగిన వారెవరూ లేరు.

< Daniel 8 >