< 2 Rois 22 >
1 Josias avait huit ans quand il monta sur le trône, et il régna trente et un ans à Jérusalem; sa mère se nommait Jedia, fille d'Edia de Basuroth.
౧యోషీయా ఏలడం ఆరంభించినప్పుడు, అతని వయసు ఎనిమిది సంవత్సరాలు. అతడు యెరూషలేములో 31 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కతు ఊరివాడైన అదాయా కూతురు.
2 Et il fit ce qui est droit aux yeux du Seigneur; il marcha dans toutes les voies de David, son aïeul; il n'en dévia ni à droite ni à gauche.
౨అతడు యెహోవా దృష్టిలో యథార్ధంగా నడుస్తూ, కుడి ఎడమలకు తిరగకుండా తన పితరుడు దావీదు చూపించిన దారిలో నడిచాడు.
3 En la troisième année du règne de Josias, le huitième mois, le roi envoya Saphan, fils d'Ezélie, fils de Mésollam, scribe du temple du Seigneur, disant:
౩రాజైన యోషీయా పరిపాలనలో 18 వ సంవత్సరంలో, అతడు మెషుల్లాముకు పుట్టిన అజల్యా కొడుకూ, శాస్త్రి అయిన షాఫానును యెహోవా మందిరానికి వెళ్ళమన్నాడు. రాజు అతనితో,
4 Monte auprès d'Helcias le grand prêtre; compte l'argent offert par le peuple dans le temple, et recueilli par les gardiens de la porte.
౪“నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరికి వెళ్లి, ద్వారపాలకులు ప్రజల దగ్గర వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన డబ్బు మొత్తం ఎంతో లెక్క చూడమని అతనితో చెప్పు.
5 Qu'ils remettent cet argent aux ouvriers employés dans le temple. Et l'on donna cet argent aux ouvriers du temple, pour qu'ils y fissent des réparations.
౫యెహోవా మందిరపు పనికి అధికారులుగా ఉండి పని జరిగించేవాళ్ళ చేతికి ఆ డబ్బు అప్పగించాలి. ఆ తరువాత యెహోవా మందిరంలో శిథిలమైన స్థలాలను బాగుచేయడానికి యెహోవా మందిరపు పనిచేసే కూలివాళ్లకు వారు ఆ డబ్బు ఇవ్వాలి.
6 On le donna aux charpentiers, aux constructeurs, aux maçons, pour acheter du bois et des pierres de taille, et consolider le temple.
౬వడ్రంగి వాళ్ళకూ, శిల్పకారులకూ, తాపీ పని వాళ్ళకూ, మందిరాన్ని బాగు చెయ్యడానికి మానులు, చెక్కిన రాళ్ళు కొనడానికి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పు” అన్నాడు.
7 Mais on ne leur demanda pas compte de l'argent qui leur fut confié, parce que les travaux furent exécutés de bonne foi.
౭ఆ అధికారులు నమ్మకస్థులు గనుక వాళ్ళ చేతికి అప్పగించిన డబ్బు గురించి వాళ్ళ దగ్గర లెక్క తీసుకోవలసిన పని లేదు.
8 Or, le grand prêtre Helcias dit à Saphan le scribe: J'ai trouvé dans le temple le livre de la loi. Et il lui donna le livre; puis, Saphan le lut.
౮అప్పుడు, ప్రధానయాజకుడైన హిల్కీయా “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథాన్ని, షాఫానుకు అప్పగించాడు. అతడు దాన్ని చదివి
9 Ensuite, il entra auprès du roi dans le temple; il lui rapporta ce qui avait été fait, et il dit: Tes serviteurs ont fondu l'argent trouvé dans le temple du Seigneur, et ils l'ont remis aux ouvriers du temple.
౯రాజు దగ్గరికి తిరిగి వచ్చి “మీ సేవకులు మందిరంలో దొరికిన డబ్బు సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులుగా ఉండి, పని జరిగించేవాళ్ళ చేతికి అప్పగించారు” అని వార్త చెప్పి,
10 Et Saphan le scribe ajouta: Le prêtre Helcias m'a donné un livre. Et Saphan le lut devant le roi.
౧౦“యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించాడు” అని రాజుతో చెప్పి ఆ గ్రంథం రాజు సముఖంలో చదివాడు.
11 Quand Josias ouït les paroles du livre de la loi, il déchira ses vêtements,
౧౧రాజు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు.
12 Et il donna ses ordres à Helcias le prêtre, à Achicam, fils de Saphan, à Achobor, fils de Michée, à Saphan le scribe, à Amie, serviteur du roi, et il leur dit:
౧౨తరువాత రాజు యాజకుడైన హిల్కీయా, షాఫాను కొడుకు అహీకాము, మీకాయా కొడుకు అక్బోరు అనే వాళ్ళనూ, షాఫాను అనే శాస్త్రినీ, అశాయా అనే రాజసేవకుల్లో ఒకణ్ణి పిలిచి వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు.
13 Allez au Seigneur vous enquérir de moi, de tout le peuple, de tout Juda, concernant les paroles de ce livre qu'on a trouvé; car la colère dont le Seigneur s'est enflammé contre nous est grande, parce que nos pères n'ont point écouté les paroles de ce livre pour faire selon ce qui est écrit à notre sujet.
౧౩“మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలోని మాటలను గురించి నా విషయంలో, ప్రజల విషయంలో, యూదా వాళ్ళందరి విషయంలో, యెహోవాను అడగండి. మన పూర్వికులు తమ విషయంలో రాసి ఉన్న దానంతటి ప్రకారం చెయ్యకుండా ఈ గ్రంథపు మాటలు వినలేదు గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత ఎక్కువగా మండుతూ ఉంది” అన్నాడు.
14 Et le prêtre Helcias, Achicam, Achobor, Saphan et Asaïe, allèrent chez la prophétesse Olda, mère de Sellem, fils de Thécuan, fils d'Aras, gardien des vêtements. Elle demeurait à Jérusalem dans le quartier de Masena, et ils lui parlèrent.
౧౪కాబట్టి యాజకుడైన హిల్కీయా, అహికాము, అక్బోరు, షాఫాను, అశాయా, స్త్రీ ప్రవక్త హుల్దా దగ్గరికి వచ్చారు. ఈమె వస్త్రశాలకు అధికారి అయిన హర్హషుకు పుట్టిన తిక్వా కొడుకు షల్లూము భార్య. ఈమె యెరూషలేములో రెండో భాగంలో కాపురం ఉంది. ఈమె దగ్గరికి వారు వచ్చి మాటలాడారు.
15 Et elle leur répondit: Voici ce que dit le Seigneur Dieu d'Israël: Dites à l'homme qui vous a envoyés près de moi:
౧౫ఆమె వాళ్ళతో “మిమ్మల్ని నా దగ్గరికి పంపిన వానితో ఈ మాట చెప్పండి.
16 Voici ce que dit le Seigneur: Voilà que j'apporte des maux à ce lieu et à ceux qui l'habitent, selon les paroles du livre qu'a lu le roi de Juda;
౧౬యెహోవా చెప్పేదేమంటే, యూదా రాజు చదివించిన గ్రంథంలో రాసి ఉన్న కీడంతా, ఏదీ విడిచి పెట్టకుండా నేను ఈ స్థలం మీదకీ, దాని పౌరుల మీదకీ రప్పిస్తాను.
17 En punition de ce qu'ils m'ont abandonné, et de ce qu'ils ont encensé d'autres dieux, de sorte qu'ils m'ont irrité par toutes les œuvres de leurs mains; car ma colère est enflammée contre ce lieu, et elle ne s'éteindra pas.
౧౭ఈ ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ చేసిన ప్రతి పనీ నాకు కోపం పుట్టించింది గనుక నా కోపం ఆరిపోకుండా, ఈ స్థలం మీద రగులుకుంటుంది.
18 Quant au roi de Juda, qui vous a envoyés vous enquérir au Seigneur, dites-lui: Voici ce que dit le Seigneur Dieu d'Israël au sujet des paroles que tu as entendues:
౧౮యెహోవాను సంప్రదించడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ మాట తెలియపరచండి.
19 En récompense de ce que ton cœur ne s'est point endurci, de ce que devant moi tu es rentré en toi-même quand tu as ouï ce que j'ai dit contre ce lieu et contre ceux qui l'habitent, pour qu'ils soient effacés et maudits; de ce que tu as déchiré tes vêtements et pleuré en ma présence: eh bien! moi aussi j'ai entendu, dit le Seigneur.
౧౯ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం పాడవుతుందని, దాని కాపురస్థులు శాపానికి గురి అవుతారని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వం కలిగి, నీ బట్టలు చింపుకుని నా సన్నిధిలో కన్నీళ్లు కార్చావు గనుక నీవు చేసిన మనవి నేను అంగీకరించాను.
20 Il n'en sera pas ainsi: voilà que je te réunis à tes pères; tu descendras en paix dans ton sépulcre, et tes yeux ne verront aucun des maux que j'apporte en ce lieu.
౨౦నేను నిన్ను నీ పితరుల దగ్గరికి చేరుస్తాను. నీవు ప్రశాంతంగా సమాధికి వెళ్తావు. నేను ఈ స్థలం మీదకి రప్పించే కీడును నీవు నీ కళ్ళతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు” అని చెప్పింది. అప్పుడు, వారు ఈ వార్త రాజు దగ్గరికి తెచ్చారు.