< 2 Chroniques 12 >

1 Or, quand Roboam eut organisé son royaume et s'y fut affermi, il abandonna les commandements du Seigneur, et tout le peuple suivit son exemple.
రెహబాము రాజ్యం స్థిరపడి, అతడు బలపడిన తరవాత అతడు, ఇశ్రాయేలీయులంతా యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు.
2 Et la cinquième année de son règne, parce qu'il avait péché contre le Seigneur, Susacim (Sésac), roi d'Égypte, marcha contre Jérusalem,
వారు యెహోవాకు అపనమ్మకంగా ఉన్నందు వలన రాజైన రెహబాము పాలనలో ఐదో సంవత్సరంలో ఐగుప్తు రాజు షీషకు 1, 200 రథాలు, 60,000 మంది గుర్రపు రౌతులతో యెరూషలేము మీదికి దండెత్తాడు.
3 Avec douze cents chars, soixante mille chevaux et une multitude innombrable des Libyens, de Troglodytes et d'Ethiopiens.
అతనితో బాటు ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు లెక్కకు మించి ఉన్నారు.
4 Et ils s'emparèrent de toutes les forteresses de Juda, et ils arrivèrent devant Jérusalem,
షీషకు యూదాకు దగ్గరగా ఉన్న ప్రాకార పురాలను పట్టుకుని యెరూషలేము వరకూ వచ్చాడు.
5 Et Samaïas le prophète alla trouver Roboam et les princes de Juda, qui s'étaient réunis à Jérusalem par crainte de Susacim, et il leur dit: Voici que dit le Seigneur: Vous m'avez abandonné, et moi je vous abandonnerai pour vous livrer à Susacim.
అప్పుడు షెమయా ప్రవక్త రెహబాము దగ్గరికీ, షీషకుకు భయపడి యెరూషలేముకు పారిపోయి వచ్చిన యూదా అధిపతుల దగ్గరికి వచ్చి “‘మీరు నన్ను విడిచిపెట్టారు కాబట్టి నేను మిమ్మల్ని షీషకు చేతికి అప్పగించాను’ అని యెహోవా సెలవిస్తున్నాడు” అని చెప్పాడు.
6 Et le roi et les chefs de Juda eurent honte, et ils dirent: Le Seigneur est juste.
అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులు, రాజు వినయంగా తల వంచుకుని “యెహోవా న్యాయవంతుడు” అని ఒప్పుకున్నారు.
7 Quand le Seigneur vit qu'ils s'étaient repentis, la parole du Seigneur vint à Samaïas, disant: Ils se sont repentis, je ne les détruirai pas; je leur accorderai comme une ombre de salut, et ma colère ne tombera pas sur Jérusalem.
వారు తమను తాము తగ్గించుకోవడం యెహోవా చూశాడు. యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చాడు. “వారు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనం చేయను. షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలో వారికి రక్షణ దయచేస్తాను.
8 Ils seront asservis, et ils connaîtront la différence de ma servitude avec la servitude des rois de la terre.
అయితే నన్ను సేవించడానికీ, భూరాజులకు దాసులై ఉండడానికీ ఎంత తేడా ఉందో వారు గ్రహించడం కోసం వారు అతనికి దాసులవుతారు.”
9 Et Susacim, roi d'Égypte, marcha contre Jérusalem; il prit tous les trésors du temple du Seigneur, et tous les trésors du palais du roi, il prit tout; il prit aussi les boucliers d'or qu'avait faits Salomon.
ఐగుప్తురాజు షీషకు యెరూషలేము మీదికి వచ్చి, యెహోవా మందిరంలో, రాజనగరంలో ఉన్న ధనాగారాలన్నిటినీ దోచుకుని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకు వెళ్ళాడు.
10 (Le roi Roboam les remplaça par des boucliers d'airain). Et le roi Susacim mit au-dessus de lui des capitaines de ses gardes surveillant la porte du palais.
౧౦రెహబాము వాటికి బదులు ఇత్తడి డాళ్ళు చేయించి వాటిని రాజనగరం ద్వారాన్ని కాసే సైనికుల అధిపతులకి అప్పగించాడు.
11 Et lorsque le roi entrait dans le temple du Seigneur, les gardes y entraient aussi, et avec les coureurs ceux qui allaient à la rencontre des coureurs.
౧౧రాజు యెహోవా మందిరంలోకి ప్రవేశించిన ప్రతిసారీ రక్షక భటులు వచ్చి వాటిని మోసేవారు. ఆ తరువాత వాటిని మళ్లీ గదిలో ఉంచేవారు.
12 Mais parce qu'il s'était repenti, le Seigneur détourna de lui sa colère, et il ne fut pas entièrement détruit; car il y avait encore en Juda de bonnes pensées.
౧౨అతడు తనను తాను తగ్గించుకోవడం వలన, యూదావారిలో కొంతమట్టుకు మంచి ఇంకా మిగిలే ఉండడం వలన, యెహోవా అతనిని పూర్తిగా నశింపజేయకుండా తన కోపాన్ని అతని మీద నుండి మళ్లించుకున్నాడు.
13 Et le roi Roboam se raffermit en Jérusalem et il régna; il avait quarante et un ans quand il monta sur le trône, et il régna dix-sept ans à Jérusalem dans la ville que, parmi toutes les tribus d'Israël, le Seigneur s'était choisie pour que son nom y fût invoqué; sa mère, nommée Noomma, était Ammonite.
౧౩రెహబాము రాజు యెరూషలేములో స్థిరపడి పాలించాడు. అతడు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు 41 సంవత్సరాల వయసు వాడు. తన నామాన్ని అక్కడ ఉంచడానికి ఇశ్రాయేలీయుల గోత్రాల స్థలాలన్నిటిలో నుండి యెహోవా కోరుకొన్న పట్టణమైన యెరూషలేములో అతడు 17 సంవత్సరాలు పాలించాడు, అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు.
14 Et il fit le mal parce qu'il ne dirigea pas son cœur à la recherche de Dieu.
౧౪అతడు యెహోవాను వెతకడంలో స్థిరంగా నిలబడక చెడు క్రియలు చేశాడు.
15 Quant aux discours de Roboam, les premiers et les derniers, et à ses actions, ne sont-ils pas écrits dans les Récits de Samaïas le prophète, et d'Addo le voyant? Roboam fut toujours en guerre avec Jéroboam.
౧౫రెహబాము చేసిన ఇతర కార్యాలన్నిటి గురించి ప్రవక్త షెమయా, దీర్ఘదర్శి ఇద్దో రచించిన గ్రంథాల్లో రాసి ఉంది. వాటిలో ఇంకా వంశావళులూ రెహబాముకూ యరొబాముకూ జరిగిన నిరంతర యుద్ధాల వివరాలున్నాయి.
16 Et Roboam alla rejoindre ses pères, et il fut enseveli dans la ville de David; et Abias, son fils, régna à sa place.
౧౬రెహబాము తన పూర్వీకులతో కూడా కన్నుమూసినవ్పుడు అతనిని దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అప్పుడు అతని కొడుకు అబీయా అతనికి బదులుగా రాజయ్యాడు.

< 2 Chroniques 12 >