< 1 Samuel 12 >

1 Ensuite, Samuel dit à tout Israël: Voyez, j'ai fait tout ce que vous m'avez demandé, et je vous ai donné un roi.
అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ పిలిచి ఇలా చెప్పాడు. “వినండి, మీ కోరిక నేను మన్నించి మిమ్మల్ని ఏలడానికి ఒకరిని రాజుగా నియమించాను.
2 Voici maintenant qu'un roi marche à votre tête; pour moi, je suis vieux et vais me tenir en repos; je laisse parmi vous mes fils, après avoir marché à votre tête depuis ma naissance jusqu'à ce jour.
మీకు అవసరమైన పనులు మీ రాజు జరిగిస్తాడు. నా తల నెరిసిపోయింది, నేను ముసలివాణ్ణి అయ్యాను. నా కొడుకులు మీ మధ్యలో ఉన్నారు. చిన్నప్పటి నుండి ఈరోజు వరకూ నేను మీ మధ్య ఉండి మీ పనులు చేస్తూ వచ్చాను.
3 Or, répondez-moi devant le Seigneur et devant son oint: A qui de vous ai- je pris un bœuf ou un âne? Qui de vous ai-je opprimé? qui ai-je violenté? de qui ai-je accepté l'offrande de quoi que ce soit, même d'une chaussure? Déclarez-le, et je restituerai.
ఇదిగో నన్ను చూడండి, నేను ఎవరి ఎద్దునైనా అక్రమంగా తీసుకొన్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకొన్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధపెట్టానా? న్యాయం దాచిపెట్టడానికి ఎవరి దగ్గరైనా ముడుపులు తీసుకున్నానా? అలా చేసి ఉంటే, యెహోవా ముందూ యెహోవా చేత అభిషేకం పొందినవాని ముందూ నామీద సాక్ష్యం చెప్పించండి. అప్పుడు నేను మీ సమక్షంలో వాటన్నిటినీ తిరిగి ఇచ్చివేస్తాను.”
4 Et chacun dit à Samuel: Tu n'as point commis d'iniquités envers nous; tu ne nous as point opprimés, tu ne nous a point violentés, tu n'as rien pris à aucun d'entre nous.
అందుకు ప్రజలు “నువ్వు మాకు ఎలాంటి అన్యాయమూ చేయలేదు, ఏ విధంగానూ బాధ కలిగించలేదు, ఎవరి దగ్గరా నువ్వు దేనినీ తీసుకోలేదు” అని అతనితో చెప్పారు.
5 Et Samuel dit au peuple: Le Seigneur est témoin, l'oint du Seigneur est témoin aujourd'hui que vous n'avez rien à me réclamer; et ils dirent: Témoin.
అతడు “అలాంటిది నా దగ్గర ఏదీ మీకు దొరకదని యెహోవా, ఇంకా ఆయన అభిషేకం చేయించినవాడు కూడా ఈనాడు మీ మీద సాక్షులుగా ఉన్నారు” అని చెప్పినప్పుడు “అవును, సాక్షులే” అని వారంతా జవాబిచ్చారు.
6 Samuel dit encore au peuple: Je prends à témoin le Seigneur qui a suscité Moïse et Aaron, qui a tiré vos pères de l'Égypte.
సమూయేలు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాడు. “మోషేను, అహరోనును నాయకులుగా నియమించి మీ పూర్వీకులను ఐగుప్తు దేశం నుండి రప్పించినవాడు యెహోవాయే గదా
7 Maintenant, tenez-vous tranquilles; je vais vous juger devant le Seigneur, je vous dévoilerai toute la justice du Seigneur, tout ce qu'il a fait pour vous et pour vos pères.
కాబట్టి యెహోవా మీకు, మీ పూర్వీకులకు చేసిన న్యాయమైన ఉపకారాలను బట్టి యెహోవా సన్నిధానంలో నేను మీతో వాదించడానికి మీరు ఇక్కడే ఉండండి.
8 Lorsque Jacob et ses fils se furent établis en Égypte, l'Égypte les humilia; et vos pères crièrent au Seigneur, et le Seigneur envoya Moïse avec Aaron qui conduisirent vos pères hors de l'Égypte, et les mirent en possession de cette terre promise.
యాకోబు ఐగుప్తుకు వచ్చిన తరువాత మీ పూర్వికులు యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన మోషే అహరోనులను పంపించి వారిని ఐగుప్తు నుండి నడిపించి వారు వచ్చి ఈ ప్రాంతంలో నివసించేలా చేశాడు.
9 Ensuite, vos pères méconnurent le Seigneur leur Dieu, et il les livra aux mains de Sisara, général de Jabin, roi d'Azor; puis, aux mains des Philistins; puis, aux mains du roi de Moab, et il combattit du côté de leurs ennemis.
అయితే వారు తమ దేవుడైన యెహోవాను నిర్లక్ష్యం చేసినప్పుడు వారిని హాసోరు సేనాధిపతి సీసెరా చేతికీ ఫిలిష్తీయుల చేతికీ మోయాబు రాజు చేతికీ అప్పగించాడు. వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి హింసించారు.
10 Alors, ils crièrent au Seigneur; ils dirent: Nous avons péché, car nous avons abandonné le Seigneur, et nous avons servi Baal dans les bois sacrés; délivrez-nous des mains de nos ennemis, et nous vous servirons.
౧౦అప్పుడు వారు, ‘మేము యెహోవాను నిర్లక్ష్యం చేసి బయలు దేవుళ్ళనూ అష్తారోతు దేవిని పూజించడం ద్వారా పాపం చేశాం. మా శత్రువుల చేతి నుండి నువ్వు మమ్మల్ని విడిపించు. నిన్ను మాత్రమే సేవిస్తాం’ అని యెహోవాను వేడుకున్నారు.
11 Et le Seigneur a suscité Jérobaal, puis Barac, puis Jephté, puis Samuel; il vous a délivrés des mains des ennemis qui vous entourent, et vous avez habité en paix vos maisons.
౧౧యెహోవా యెరుబ్బయలును, బెదానును, యెఫ్తాను, సమూయేలును పంపి, నలుదిక్కులా ఉన్న మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడం వల్ల మీరు భయం లేకుండా నివసిస్తున్నారు.
12 Et, vous avez vu récemment que Naas, roi des fils d'Ammon, marchait contre vous, et vous avez dit: Nous le voulons, il faut qu'un roi règne sur nous. Et cependant, le Seigneur notre Dieu était notre roi!
౧౨అయితే అమ్మోనీయుల రాజు నాహాషు మీపైకి దండెత్తినప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సంరక్షుడుగా ఉన్నప్పటికీ, ‘ఆయన వద్దు, ఒక రాజు మమ్మల్ని ఏలాలి’ అని మీరు నన్ను అడిగారు.
13 Or maintenant, voici le roi que vous avez élu; vous voyez que le Seigneur vous a donné un roi, et vous prospèrerez,
౧౩మీరు ఇష్టపూర్వకంగా నియమించుకొన్న రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీపైన రాజుగా నిర్ణయించాడు.
14 Si vous craignez le Seigneur, si vous le servez, si vous êtes dociles à sa voix, si vous ne résistez point à ses paroles, si vous et votre roi vous marchez avec le Seigneur.
౧౪మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనకు విధేయత చూపి ఆయనను సేవించి, ఆయన ఆజ్ఞలకు లోబడి, మీరూ, మిమ్మల్ని పాలించే మీ రాజూ మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే మీకు మేలు, క్షేమం కలుగుతాయి.
15 Mais si vous êtes indociles à la voix du Seigneur, si vous résistez à ses paroles, la main du Seigneur s'appesantira sur vous et sur votre roi.
౧౫అలా కాక, యెహోవా మాట వినకుండా ఆయన ఆజ్ఞలకు లోబడకపోతే యెహోవా కృప మీ పూర్వీకులకు వ్యతిరేకంగా ఉన్నట్టు మీ పట్ల కూడా విరోధంగా ఉంటుంది.
16 Maintenant retirez-vous tranquilles, et vous verrez le grand prodige que le Seigneur va faire éclater à vos yeux.
౧౬మీరు నిలబడి చూస్తూ ఉండగానే యెహోవా జరిగించే ఈ గొప్ప పనులను చూడండి.
17 N'est-ce pas aujourd'hui la moisson du froment? Je vais invoquer le Seigneur; il vous enverra le tonnerre et la pluie, et vous reconnaîtrez et vous verrez combien a été grande votre méchanceté devant le Seigneur, quand vous avez demandé pour vous un roi.
౧౭ఇది గోదుమ పంట కోసే కాలం గదా. మీ కోసం రాజును నియమించమని కోరుకోవడం ద్వారా యెహోవా దృష్టిలో మీరు ఘోరమైన తప్పిదం చేశారని మీరు గ్రహించి తెలుసుకొనేలా యెహోవా ఉరుములు, వర్షం పంపాలని నేను ఆయనను వేడుకొంటున్నాను.”
18 Samuel invoqua donc le Seigneur, et, en ce jour-là, le Seigneur envoya le tonnerre et la pluie. Alors, tout le peuple eut une grande crainte du Seigneur et de Samuel.
౧౮సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములు, వర్షం పంపించగా ప్రజలంతా యెహోవాకు, సమూయేలుకు అమితంగా భయపడ్డారు.
19 Et tout le peuple dit à Samuel: Prie le Seigneur ton Dieu pour tes serviteurs, afin que nous ne mourions pas, parce qu'à nos péchés nous avons ajouté la faute de demander pour nous un roi.
౧౯వారు సమూయేలుతో ఇలా అన్నారు. “రాజు కావాలని మేము అడగడం ద్వారా మా పాపాలన్నిటి కంటే ఎక్కువ పాపం చేశాం. అందువల్ల మేమంతా చనిపోకుండేలా దీనులమైన మా కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యి.”
20 Et Samuel dit au peuple: N'ayez point de crainte; vous avez commis réellement tous cette faute; mais ne vous écartez pas des voies du Seigneur, servez-le de tout votre cœur;
౨౦అప్పుడు సమూయేలు ప్రజలతో “భయపడవద్దు. మీరు ఈ పాపం చేసింది నిజమే, అయినప్పటికీ యెహోవాను విడిచిపెట్టకుండా ఆయన మాట వింటూ, నిండు హృదయంతో ఆయనను సేవించండి.
21 Ne vous laissez pas égarer par des dieux qui n'existent point, qui ne peuvent rien, qui ne délivrent personne, puisqu'ils ne sont que néant.
౨౧ఆయనను నిర్లక్షం చేయకండి, ఆయన్ను నిర్లక్ష్యపెట్టేవారు పనికిమాలినవైన కాపాడలేని విగ్రహాలను పూజిస్తారు. అవి నిజంగా బొమ్మలే.
22 Tandis que le Seigneur, à cause de son grand nom, ne répudiera pas son peuple, car le Seigneur vous a visiblement choisis pour être son peuple.
౨౨యెహోవా మిమ్మల్ని తన ప్రజగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన గొప్పదైన తన నామం కోసం తన ప్రజలను విడిచిపెట్టడు.
23 Pour moi, je me garderai de pécher contre le Seigneur, et de cesser de prier pour vous. Je servirai le Seigneur, et je vous montrerai la voie bonne et droite.
౨౩నేను మాత్రం ఇంకా ఎక్కువ ఆసక్తితో మీ కోసం ప్రార్థన చేస్తాను. లేకపోతే నేను యెహోవా దృష్టిలో పాపం చేసినవాడనవుతాను. ఆయనశ్రేష్ఠమైన మంచి మార్గం మీకు బోధిస్తాను.
24 Mais craignez le Seigneur, servez-le dans la vérité et de tout votre cœur, puisque vous avez vu les grandes choses qu'il a faites parmi vous.
౨౪ఆయన మీ కోసం ఎన్ని గొప్ప పనులు చేశాడో అది మీరు జ్ఞాపకం ఉంచుకుని యెహోవాపట్ల భయభక్తులు కలిగి, కపటం లేని నిండు మనస్సుతో ఆయనను పూజించడం ఎంతో అవసరం.
25 Et si vous retombez dans le péché, vous périrez vous et votre roi.
౨౫మీరు చెడ్డ పనులు చేస్తూ ఉన్నట్టయితే మీరూ, మీ రాజూ నశించిపోతారు.”

< 1 Samuel 12 >