< Psaumes 21 >
1 Au chef des chantres. Psaume de David. Seigneur, le roi se réjouit de ta puissance; par ton secours, comme éclate son allégresse!
౧ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. యెహోవా, రాజు నీ బలాన్నిబట్టి సంతోషిస్తున్నాడు. నువ్వు ఇచ్చిన రక్షణనుబట్టి అతడు ఎంతగానో హర్షిస్తున్నాడు!
2 Tu lui as accordé le désir de son cœur; le souhait sorti de ses lèvres, tu ne l’as pas repoussé.
౨అతని హృదయవాంఛను నువ్వు మంజూరు చేశావు, అతని పెదాల్లోనుంచి వచ్చిన ప్రార్థన నువ్వు అంగీకరించక మానలేదు.
3 Oui, tu es venu à lui avec des bénédictions de bonheur, tu as posé sur sa tête une couronne d’or fin.
౩అతని కోసం శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు తెస్తావు, నువ్వు అతని తల మీద మేలిమి బంగారు కిరీటం పెట్టావు.
4 Il t’a demandé le don de la vie: tu le lui as octroyé; ce sont de longs jours se suivant sans fin.
౪ఆయుష్షు ఇమ్మని అతడు నిన్ను అడిగాడు. నువ్వు దాన్ని అతనికిచ్చావు. శాశ్వతకాలం ఉండే దీర్ఘాయుష్షు అతనికిచ్చావు.
5 Grande est sa gloire, grâce à ton appui; tu lui as prodigué splendeur et magnificence.
౫నీ జయం వల్ల అతనికి గొప్ప మహిమ కలిగింది. శోభ, ఘనత నువ్వు అతనికి కలగజేశావు.
6 Oui, tu as fait de lui à jamais une source de bénédictions; par ta présence, tu l’as mis au comble de la joie.
౬శాశ్వత ఆశీర్వాదం నువ్వు అతనికి మంజూరు చేశావు. నీ సన్నిధిలో ఉన్న ఆనందంతో అతన్ని సంతోషపరిచావు.
7 C’Est que le roi a confiance en l’Eternel, et, par la bienveillance du Très-Haut, il ne chancelle pas.
౭ఎందుకంటే రాజు యెహోవాలో నమ్మకం ఉంచుతున్నాడు. సర్వోన్నతుని నిబంధన నమ్మకత్వాన్ని బట్టి అతడు కదలకుండా ఉంటాడు.
8 Ta main atteindra tous tes ennemis, ta droite atteindra ceux qui te haïssent.
౮నీ చెయ్యి నీ శత్రువులందరినీ పట్టుకుంటుంది. నిన్ను ద్వేషించే వాళ్ళందరినీ నీ కుడిచెయ్యి పట్టుకుంటుంది.
9 A l’heure de ta colère, tu les traiteras tel un four ardent; l’Eternel les anéantira dans son courroux, et le feu les dévorera.
౯నువ్వు నీ కోపసమయంలో అగ్నిగుండంలో వాళ్ళను దహిస్తావు. తన ప్రచండ కోపంలో యెహోవా వాళ్ళను లయం చేస్తాడు, ఆ అగ్ని వాళ్ళను దహించేస్తుంది.
10 Tu feras disparaître leurs rejetons de la terre, et leur postérité du milieu des hommes.
౧౦భూమిమీద ఉండకుండా వాళ్ళ పిల్లలనూ, మానవ జాతిలో ఉండకుండా వాళ్ళ వంశస్థులనూ నువ్వు నాశనం చేస్తావు.
11 Car ils ont machiné le mal contre toi, ils ont conçu des desseins perfides, mais ont été frappés d’impuissance.
౧౧వారు నీకు కీడు చెయ్యాలని ఉద్దేశించారు. ఒక రహస్య పథకం పన్నారు గాని అది సఫలం కాలేదు.
12 Certes, tu les réduiras à tourner le dos: avec les cordes de ton arc tu viseras leur face.
౧౨నువ్వు వాళ్ళను వెనక్కి తిప్పుతావు. వాళ్ళ ఎదుట నువ్వు నీ విల్లు ఎక్కుపెడతావు.
13 Lève-toi, ô Seigneur, dans ta force; nous chanterons, nous célébrerons ta puissance.
౧౩యెహోవా, నీ బలాన్నిబట్టి నిన్ను నువ్వు హెచ్చించుకో. నీ శక్తిని బట్టి నిన్ను స్తుతించి కీర్తిస్తాము.