< Josué 17 >
1 Le lot attribué à la tribu de Manassé, parce qu’il était le premier-né de Joseph, échut à Makhir, premier-né de Manassé, père de Ghilead; et, comme il était belliqueux, il eut le Galaad et le Basan.
౧మనష్షే యోసేపు పెద్ద కుమారుడు కాబట్టి అతని గోత్రానికి, అంటే మనష్షే పెద్ద కుమారుడు గిలాదు దేశాధిపతి అయిన మాకీరుకు చీట్ల వలన వంతు వచ్చింది. అతడు యుద్ధవీరుడు కాబట్టి అతనికి గిలాదు బాషాను వచ్చాయి.
2 Les autres descendants de Manassé reçurent selon leurs familles, savoir: les fils d’Abiézer, ceux de Hêlek, ceux d’Asriel, ceux de Sichem, ceux de Héfer et ceux de Chemida, formant la descendance mâle de Manassé, fils de Joseph, selon leurs familles.
౨మనష్షీయుల్లో మిగిలిన వారికి, అంటే అబీయెజెరీయులకూ హెలకీయులకూ అశ్రీయేలీయులకూ షెకెమీయులకూ హెపెరీయులకూ షెమీదీయులకూ వారి వారి వంశాల ప్రకారం వంతు వచ్చింది. వారి వంశాలను బట్టి యోసేపు కుమారుడు మనష్షే మగ సంతానమది.
3 Mais Celofhad, fils de Héfer, fils de Ghilead, fils de Makhir, fils de Manassé, n’avait pas de fils, rien que des filles, lesquelles se nommaient: Mahla, Noa, Hogla, Milca et Tirça.
౩మనష్షే మునిమనుమడూ మాకీరు ఇనుమనుమడూ గిలాదు మనుమడూ హెపెరు కుమారుడూ అయిన సెలోపెహాదుకు కూతుర్లే గాని కుమారులు పుట్టలేదు. అతని కూతుర్ల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.
4 Elles se présentèrent devant le pontife Eléazar, devant Josué, fils de Noun, et les phylarques, en disant: "L’Eternel a ordonné à Moïse de nous attribuer un patrimoine parmi nos frères." Et on leur attribua, selon la parole de l’Eternel, un patrimoine parmi les frères de leur père.
౪వారు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ, ప్రధానుల దగ్గరికి వచ్చి “మా సోదరుల మధ్య మాకు స్వాస్థ్యమివ్వాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు” అని చెప్పారు. కాబట్టి, యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టుగా వారి తండ్రి సోదరులతో బాటు వారికి స్వాస్థ్యం ఇచ్చాడు.
5 A Manassé échurent donc dix parts, outre le pays de Galaad et le Basan, situés au delà du Jourdain;
౫కాబట్టి యొర్దాను అవతల ఉన్న గిలాదు బాషానులు కాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చాయి.
6 car les descendantes de Manassé obtinrent une propriété parmi ses descendants, tandis que le pays de Galaad appartint aux autres descendants de Manassé.
౬ఎందుకంటే మనష్షీయుల స్త్రీ సంతానం వారి పురుష సంతానం స్వాస్థ్యం పొందాయి. గిలాదు దేశం మిగతా మనష్షీయులకు స్వాస్థ్యం అయింది.
7 Or, la limite de Manassé était, en partant d’Aser: Mikhmetat, situé devant Sichem: de là elle s’étendait à droite vers les habitants d’En-Tappouah
౭మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెముకు తూర్పుగా ఉన్న మిక్మెతావరకూ దక్షిణాన ఏన్తప్పూయ నివాసుల వైపుకు వ్యాపించింది.
8 (Manassé possédait le canton de Tappouah, mais Tappouah même, à la frontière de Manassé, était aux enfants d’Ephraïm).
౮తప్పూయ భూభాగం మనష్షీయులది. అయితే మనష్షీయుల సరిహద్దు లోని తప్పూయ పట్టణం ఎఫ్రాయిమీయులది అయింది.
9 La limite descendait jusqu’au midi du torrent de Kana: les villes de ce côté, enclavées parmi celles de Manassé, appartenaient à Ephraïm, tandis que la limite de Manassé était au nord du torrent et se terminait à la mer.
౯ఆ సరిహద్దు కానా వాగు వరకూ ఆ వాగుకు వ్యాపించింది. వాగుకు దక్షిణాన ఉన్న మనష్షీయుల పట్టణాలు దగ్గరి ప్రాంతం ఎఫ్రాయిమీయులకు సంక్రమించింది. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ వాగుకు ఉత్తరంగా సముద్రం వరకూ వ్యాపించింది.
10 A Ephraïm ce qui était au sud, à Manassé ce qui était au nord, avec la mer pour limite; ils touchaient Aser au nord, Issachar à l’orient.
౧౦దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకు ఉత్తరభూమి మనష్షీయులకు వచ్చింది. సముద్రం వారి సరిహద్దు. ఉత్తరం వైపున అది ఆషేరీయుల సరిహద్దుకు, తూర్పు వైపున ఇశ్శాఖారీయుల సరిహద్దుకు అనుకుని ఉంది.
11 Manassé eut encore, dans les cantons d’Issachar et d’Aser, Bethcheân avec ses bourgades, Yibleam avec les siennes, les habitants de Dor et de En-Dor avec leurs dépendances, ceux de Taanakh et de Meghiddo avec les leurs, trois provinces.
౧౧ఇశ్శాఖారీయుల ప్రదేశంలో ఆషేరీయుల ప్రదేశంలో బేత్ షెయాను, దాని గ్రామాలూ ఇబ్లెయాము, దాని గ్రామాలూ దోరు నివాసులు, దాని గ్రామాలూ ఏన్దోరు నివాసులు, దాని గ్రామాలూ తానాకు నివాసులు, దాని గ్రామాలూ మెగిద్దో నివాసులు, దాని గ్రామాలూ అంటే మూడు కొండల ప్రదేశం మనష్షీయులకు వచ్చింది.
12 Toutefois, les enfants de Manassé ne purent déposséder la population de ces villes, les Cananéens étant résolus à demeurer dans ce pays.
౧౨కనానీయులు ఆ దేశంలో నివసించాలని గట్టిగా ప్రయత్నించారు కాబట్టి మనష్షీయులు ఆ పట్టణాలను స్వాధీనపరచుకోలేక పోయారు.
13 Devenus plus forts, les Israélites soumirent les Cananéens à un tribut, mais ne les expulsèrent point.
౧౩ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయులతో వెట్టిచాకిరి చేయించుకున్నారు కాని వారి దేశాన్ని మాత్రం పూర్తిగా స్వాధీనపరచుకోలేదు.
14 Les descendants de Joseph se plaignirent en ces termes à Josué: "Pourquoi nous as-tu donné pour héritage un seul lot et un seul district, alors que nous formons une population nombreuse, tellement l’Eternel nous a bénis?"
౧౪అప్పుడు యోసేపు వంశంవారు యెహోషువతో “మాకు ఒక్క చీటితో ఒక్క వంతే స్వాస్థ్యంగా ఇచ్చావేంటి? మేము గొప్ప జనం గదా? ఇంతవరకూ యెహోవా మమ్మల్ని దీవించాడు” అని మనవి చేశారు.
15 Josué leur répondit: "Si vous êtes tellement nombreux, montez dans la région boisée, et ouvrez-vous y un passage au pays des Phérézéens et des Rephaïm, puisque la chaîne d’Ephraïm est trop étroite pour vous."
౧౫యెహోషువ వారితో “మీరు గొప్ప జనం కాబట్టి ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం మీకు ఇరుకుగా ఉంటే మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయులు రెఫాయీయులు ఉన్న ప్రదేశానికి వెళ్లి అడవి నరుక్కొని అక్కడ ఉండండి” అన్నాడు.
16 "En effet, reprirent les descendants de Joseph, la montagne ne nous suffit point, et, d’autre part, tous les Cananéens de la plaine ont des chariots de fer, ainsi que ceux de Bethcheân et de ses dépendances, et ceux de la vallée de Jézreél."
౧౬అందుకు యోసేపు వంశం వారు “ఆ కొండ ప్రాంతం మాకు చాలదు, లోయ ప్రాంతంలో ఉంటున్న కనానీయులందరికీ అంటే బేత్ షెయానులో, దాని గ్రామాల్లో యెజ్రెయేలు లోయలో ఉన్న వాళ్లకు ఇనుప రథాలు ఉన్నాయి” అన్నారు.
17 Mais Josué dit à la famille de Joseph, aux tribus d’Ephraïm et de Manassé: "Vous êtes un peuple nombreux, vous êtes pleins d’énergie, vous ne sauriez avoir un lot unique.
౧౭అప్పడు యెహోషువ యోసేపు సంతతి వారైన ఎఫ్రాయిమీయులను, మనష్షీయులను చూసి “మీరు ఒక గొప్ప జనం,
18 La montagne doit être à vous! Ce n’est que bois, mais vous la déboiserez, et vous en posséderez jusqu’aux points extrêmes; car vous en chasserez le Cananéen, malgré ses chariots de fer, malgré sa puissance!"
౧౮మీది గొప్ప బలం. మీకు ఒక్క వాటా మాత్రమే ఉండకూడదు. ఆ కొండ మీదే, అది అడవి కాబట్టి మీరు దాన్ని నరికి స్వాధీనం చేసుకోవాలి. కనానీయులకు ఇనుప రథాలున్నా, వాళ్ళు బలవంతులైనా మీరు వారిని వెళ్ళగొట్టగలరు” అన్నాడు.