< Jérémie 4 >
1 Si tu revenais, ô Israël, dit le Seigneur, revenais à moi, si tu écartais tes abominations loin de ma face, sans plus errer de côté et d’autre,
౧యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు తిరిగి రాదలిస్తే నా దగ్గరకే రావాలి. మీరు మీ హేయమైన విగ్రహాలను తీసివేసి నా సన్నిధి నుండి ఇటూ అటూ తప్పిపోకుండా ఉంటే,
2 et si tu jurais "par l’Eternel vivant", en vérité, en droiture et justice mais les peuples par lui se diraient heureux, et par lui se diraient glorieux!
౨యథార్థంగా, నీతి నిజాయితీతో “యెహోవా జీవం తోడు” అని ప్రమాణం చేస్తే, జాతులకు ఆయనలో ఆశీర్వాదం దొరుకుతుంది. వారు ఆయనలోనే అతిశయిస్తారు.
3 Car c’est ainsi que parle l’Eternel aux gens de Juda et de Jérusalem: "Creusez-vous des sillons, et ne jetez pas vos semences parmi les épines.
౩యూదా వారికీ యెరూషలేము నివాసులకూ యెహోవా చెప్పేదేమంటే, ముళ్ల పొదల్లో విత్తనాలు చల్లవద్దు. మీ బీడు భూమిని దున్నండి.
4 Tâchez de vous circoncire en l’honneur de l’Eternel et d’enlever les excroissances de votre coeur; sans cela ma colère éclatera comme le feu, et brûlera sans qu’on puisse l’éteindre, à cause de la perversité de vos actes."
౪యూదా, యెరూషలేము ప్రజలారా, మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. మీ దుష్టక్రియలను బట్టి నా కోపం అగ్నిలాగా మండుతున్నది. దాన్ని ఎవరూ ఆర్పివేయలేరు. కాబట్టి యెహోవాకు లోబడి ఉండండి.
5 Annoncez en Juda, proclamez à Jérusalem et dites: "Qu’on fasse retentir la trompette dans le pays! Criez à plein gosier et dites: "Rassemblez-vous, afin de nous retirer dans les villes fortes!"
౫యెరూషలేములో వినబడేలా యూదాలో ఇలా ప్రకటించండి. “దేశంలో బూర ఊదండి.” గట్టిగా ఇలా హెచ్చరిక చేయండి. “ప్రాకారాలతో ఉన్న పట్టణాల్లోకి వెళ్దాం రండి.”
6 Dressez une bannière dans la direction de Sion, fuyez, ne vous arrêtez pas! Car je fais venir du Nord une calamité, une terrible catastrophe.
౬సీయోనుకు కనబడేలా జెండా ఎత్తండి. తప్పించుకోడానికి పారిపోండి. ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే యెహోవా అనే నేను ఉత్తరదిక్కు నుండి కీడును రప్పిస్తున్నాను. గొప్ప వినాశనాన్ని రప్పిస్తున్నాను.
7 Un lion s’est élancé de son hallier, un destructeur de nations s’est mis en route, quittant sa résidence, pour réduire ton pays en ruine; tes villes deviendront des solitudes inhabitées.
౭పొదల్లో నుండి సింహం బయలుదేరింది. జాతుల వినాశకుడు బయలు దేరాడు. నీ దేశాన్ని నాశనం చేయడానికి, నీ పట్టణాలను శిథిలాలుగా మార్చి ఎవరూ నివసించకుండా చేయడానికి అతడు తన చోటు నుండి బయలు దేరాడు.
8 C’Est pourquoi ceignez-vous de cilices, exhalez votre douleur, lamentez-vous, puisque le feu de la colère divine ne se détourne pas de nous.
౮యెహోవా కోపాగ్ని మన మీద నుండి తొలగిపోలేదు. కాబట్టి గోనె పట్ట కట్టుకోండి. రోదనతో విలపించండి.
9 En ce jour, il arrivera, dit l’Eternel, que le coeur du roi et le coeur des chefs seront éperdus; atterrés seront les prêtres et stupéfaits les prophètes.
౯యెహోవా చెప్పేదేమంటే “ఆ రోజు రాజూ అతని అధికారులూ ధైర్యం కోల్పోతారు. యాజకులు నిర్ఘాంతపోతారు. ప్రవక్తలు విస్మయానికి గురౌతారు.”
10 Et je m’écriai: "Eh quoi! Eternel Dieu! Ainsi donc tu aurais complètement leurré ce peuple et Jérusalem, quand tu disais: "Vous obtiendrez la paix!—Et le glaive pénètre jusqu’à l’âme!
౧౦అప్పుడు నేనిలా అన్నాను “అయ్యో, ప్రభూ యెహోవా! ‘మీకు క్షేమంగా ఉంటుంది’ అని చెప్పి యెరూషలేము ప్రజలను మోసం చేశావు. ఇప్పుడేమో ఖడ్గం వారి ప్రాణాల మీద పడి హతం చేస్తూ ఉంది.”
11 En ce temps-là, on dira à ce peuple et à Jérusalem: "II y a un vent embrasé sur les hauteurs dans le désert, venant dans la direction de la fille de mon peuple, mais ne servant ni à vanner ni à épurer le grain.
౧౧ఆ రోజుల్లో ఆ ప్రజలకు యెరూషలేము నివాసుల గూర్చి ఇలా చెబుతారు. “ఎడారిలో చెట్లులేని మెరకల నుండి నా ప్రజల పైకి వడగాలి వీస్తున్నది. అది తూర్పార పట్టడానికో, శుద్ధి చేయడానికో కాదు.
12 Un souffle violent m’arrive de là; maintenant je vais, moi aussi, prononcer l’arrêt contre eux.
౧౨నా మాట చొప్పున అంతకంటే మరింత బలమైన గాలి వీస్తుంది. ఇప్పుడు వారి మీదికి రాబోయే తీర్పులు ప్రకటిస్తాను.”
13 Voici, il s’élance comme les nuages; ses chars ressemblent à l’ouragan, ses chevaux sont plus rapides que les aigles. Malheur à nous! Car nous sommes, saccagés.
౧౩ఆయన రాక మేఘాలు కమ్ముతున్నట్టుగా ఉంది. ఆయన రథాలు సుడిగాలిలాగా, ఆయన గుర్రాలు గరుడ పక్షుల కంటే వేగంగా పరుగెత్తుతున్నాయి. అయ్యో, మనం నాశనమై పోయాం.
14 O Jérusalem, lave ton coeur de toute perversité pour être sauvée: jusqu’à quand logeras-tu dans ton sein tes pensées criminelles?
౧౪యెరూషలేమా, నీకు విమోచన కావాలంటే నీ హృదయంలోని చెడుగును కడుక్కో. ఎంతకాలం పాపం చేయాలని కోరుకుంటావు?
15 Car une voix se fait entendre de Dan et annonce la calamité depuis la montagne d’Ephraïm.
౧౫దాను పట్టణం నుండి ఒకడు ప్రకటన చేస్తున్నాడు, కీడు రాబోతున్నదని ఎఫ్రాయిము కొండల్లో ఒకడు చాటిస్తున్నాడు,
16 "Faites-le savoir aux nations, allons, apprenez-le à Jérusalem, que des assiégeants arrivent d’un pays lointain et poussent des clameurs contre les villes de Juda!"
౧౬దూరదేశం నుండి ముట్టడి వేసేవారు వచ్చి “యూదా పట్టణాలను పట్టుకోబోతున్నాం” అని పెద్దపెద్ద కేకలు వేస్తున్నారని యెరూషలేముకు, ఇతర రాజ్యాలకు ప్రకటించండి.
17 Comme les gardiens des champs, ils l’enserrent de tous côtés, parce qu’elle s’est révoltée contre moi, dit l’Eternel.
౧౭యూదా నా మీద తిరుగుబాటు చేసింది కాబట్టి వారు పొలాన్ని కావలి కాసేవారిలాగా యూదాను కూడా ముట్టడిస్తారు. ఇదే యెహోవా వాక్కు.
18 C’Est ta conduite, ce sont tes actes qui t’ont valu cela; de là ton malheur, qui est si amer, car il t’atteint jusqu’au coeur.
౧౮నీ ప్రవర్తన, నీ క్రియలే ఈ ఆపదను నీ మీదికి రప్పించాయి. నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదుగా ఉండి నీ హృదయాన్ని గట్టిగా తాకుతున్నది కదా?
19 O mes entrailles, mes entrailles! Je frémis jusqu’au fond de mon coeur! Tout mon coeur est en émoi, je ne puis le calmer; car tu entends, ô mon âme, le son de la trompette. Les fanfares belliqueuses.
౧౯నా హృదయం! నా హృదయం! వేదనతో నా అంతరంగం అల్లాడుతూ ఉంది. నా గుండె బాధగా కొట్టుకుంటూ ఉంది. తాళలేకపోతున్నాను. బాకానాదం వినబడుతున్నది, యుద్ధ ఘోష విని నేను తట్టుకోలేను.
20 On annonce désastres sur désastres, que tout le pays est saccagé; mes tentes ont été saccagées soudainement, mes pavillons en un clin d’oeil.
౨౦కీడు తరవాత కీడు వస్తూ ఉంది. దేశమంతా నాశనమైంది. హటాత్తుగా నా గుడారాలు, క్షణాల్లో వాటి తెరలు పాడైపోయాయి.
21 Jusqu’à quand verrai-je des bannières? Entendrai-je les trompettes retentissantes?
౨౧ఇంకెన్నాళ్లు నేను ధ్వజాన్ని చూస్తూ, బాకానాదం వింటూ ఉండాలి?
22 Certes, mon peuple est dénué de raison, ils ne me connaissent pas; ce sont des enfants insensés, sans aucun discernement, intelligents seulement pour mal faire, incapables de faire le bien.
౨౨నా ప్రజలు మూర్ఖులు. వారికి నేను తెలియదు. వారు తెలివితక్కువ పిల్లలు, వారికి గ్రహింపు లేదు. చెడు జరిగించడంలో వారికి నైపుణ్యం ఉంది గానీ మంచి చేయడం వారికి అసలు తెలియదు.
23 J’Ai regardé la terre, et voici tout y était chaos informe; et vers les cieuxleur lumière avait disparu.
౨౩నేను భూమిని చూశాను. అది ఆకారం కోల్పోయి శూన్యంగా ఉంది. ఆకాశాన్ని చూశాను, అక్కడ వెలుగు లేదు.
24 J’Ai regardé les montagnes, elles étaient tremblantes; toutes les collineselles étaient violemment agitées.
౨౪పర్వతాలను చూస్తే అవి కంపిస్తూ ఉన్నాయి, కొండలన్నీ కదిలిపోతున్నాయి.
25 J’Ai regardé et voici, il n’y avait plus d’hommes, et tous les oiseaux du ciel avaient pris leur vol.
౨౫నేను చూసినప్పుడు మనిషి ఒక్కడు కూడా లేడు. ఆకాశపక్షులన్నీ ఎగిరిపోయాయి.
26 J’Ai regardé et voici, la campagne fertile était devenue un désert, et toutes ses villes étaient renversées par l’action de l’Eternel, par le feu de sa colère.
౨౬నేను చూస్తూ ఉండగా యెహోవా కోపాగ్నికి ఫలవంతమైన భూమి ఎడారిలా మారింది. అందులోని పట్టణాలన్నీ పూర్తిగా కూలిపోయాయి.
27 Oui, ainsi parle l’Eternel: "Tout le pays deviendra une solitude, bien que je ne consomme pas la ruine."
౨౭యెహోవా చెప్పేదేమంటే, ఈ దేశమంతా పాడైపోతుంది. అయితే దాన్ని పూర్తిగా నాశనం చేయను.
28 C’Est pour cette raison que la terre est en deuil, et les cieux là-haut sont ténébreux, parce que j’ai annoncé ce que j’ai résolu et que je n’entends ni me raviser ni me rétracter.
౨౮దాని విషయం భూమి దుఃఖిస్తుంది. ఆకాశం చీకటి కమ్ముతుంది. నేను నిర్ణయించాను, వెనక్కి తగ్గను. పశ్చాత్తాప పడను, దాన్ని రద్దు చేయను.
29 Devant la clameur des cavaliers et des archers, toute la ville est en fuite; on pénètre dans les fourrés, on escalade les rochers; toute ville est abandonnée, pas un homme n’y reste.
౨౯రౌతులూ విలుకాళ్ళూ చేసే శబ్దం విని పట్టణ ప్రజలంతా పారిపోయి అడవుల్లో దూరుతున్నారు, ఉన్నత ప్రాంతాల్లో రాళ్ళ మధ్యకు ఎక్కుతున్నారు. ప్రతి పట్టణం నిర్మానుష్యంగా మారింది. వాటిలో ఎవరూ నివసించడం లేదు.
30 Et toi, si complètement ruinée, que vas-tu faire? Tu aurais beau te vêtir de pourpre, te parer de tes bijoux d’or, allonger tes yeux au moyen du fard: vainement tu te ferais belle, les amoureux te dédaignent, c’est à ta vie qu’ils en veulent.
౩౦నీవు ధ్వంసం అయ్యావు. ఏమి చేయగలవు? ఎరుపు రంగు బట్టలు కట్టుకుని, బంగారు నగలు ధరించి, కాటుకతో నీ కళ్ళు పెద్దగా కనబడేలా చేసుకున్నావు, నీ అలంకరణ అంతా వ్యర్ధం. ఇంతకు ముందు నిన్ను ప్రేమించిన వారు నిన్ను తృణీకరిస్తారు. పైగా వారే నిన్ను చంపడానికి చూస్తారు.
31 Car j’entends des plaintes comme celles d’une femme en travail, des cris d’angoisse comme ceux d’une mère mettant au monde son premier-né: c’est la voix de Sion qui exhale des soupirs, qui se tord les bras: "Malheur à moi, mon âme est à bout de force devant les meurtriers!"
౩౧స్త్రీ పురిటినొప్పులతో కేకలు వేస్తున్నట్టు, తొలి కాన్పులో స్త్రీ కేకలు వేస్తున్నట్టు సీయోను కన్య “అయ్యో, నాకు బాధ! నా హంతకుల చేతిలో చిక్కి నేను మూర్చబోతున్నాను” అని ఎగశ్వాసతో చేతులు చాస్తూ వేస్తున్న కేకలు నాకు వినబడుతున్నాయి.