< Isaïe 34 >

1 Approchez, peuples, pour entendre, nations, soyez attentives; que la terre écoute, elle et tout ce qui la remplit, le globe avec toutes ses créatures!
రాజ్యాలన్నీ నా దగ్గరికి వచ్చి నేను చెప్పేది వినండి, ప్రజలందరూ జాగ్రత్తగా ఆలకించండి. భూమీ దాని సంపూర్ణతా, లోకం, దానిలో పుట్టినదంతా వినాలి.
2 Car l’Eternel est irrité contre tous les peuples et en colère contre toutes leurs légions: il les a frappés d’anathème, voués au carnage.
యెహోవా కోపం రాజ్యాల మీదికి వస్తున్నది, ఆయన ఆగ్రహం వారి సర్వ సేనల మీదికీ వస్తున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించాడు.
3 Leurs morts jonchent le sol, leurs cadavres répandent une odeur putride, leur sang fait fondre les montagnes.
వారిలో చనిపోయిన వారిని ఎవరూ సమాధి చేయరు. వారి శవాలు కంపుకొడతాయి. వారి రక్తం కొండలను నింపేస్తుంది.
4 Toute la milice céleste se dissout, les cieux sont roulés comme un livre, et tous leurs astres tombent comme tombent la feuille de la vigne et le fruit desséché du figuier.
ఆకాశ నక్షత్రాలన్నీ వాడిపోతాయి. ఆకాశం కాగితపు చుట్టలాగా చుట్టుకుపోతుంది. ద్రాక్షవల్లి నుండి, అంజూరపు చెట్టు నుండి వాడిన ఆకులు రాలినట్టు దాని నక్షత్రాలన్నీ రాలిపోతాయి.
5 Déjà mon glaive est ivre de sang au ciel; le voici qui s’abat sur Edom, sur le peuple que j’ai frappé d’anathème, pour faire justice.
నిజంగా ఆకాశంలో నా ఖడ్గం మత్తెక్కినట్టు ఎదోము మీదికీ, నేను నాశనానికి నిర్ణయించిన జనం మీదికీ దిగివస్తుంది.
6 Le glaive du Seigneur dégoutte de sang, est luisant de graisse: c’est le sang des agneaux et des boucs, la graisse des reins des béliers; car un festin se prépare pour le Seigneur, à Boçra, de grandes hécatombes dans le pays d’Edom.
యెహోవా ఖడ్గం రక్తమయమవుతుంది. అది కొవ్వుతో కప్పి ఉంటుంది. గొర్రెపిల్లల, మేకల రక్తం చేతా, పొట్లేళ్ల మూత్రపిండాల మీది కొవ్వు చేతా కప్పి ఉంటుంది. ఎందుకంటే బొస్రా నగరంలో యెహోవా బలి జరిగిస్తాడు. ఎదోము దేశంలో గొప్ప వధ చేస్తాడు.
7 Des buffles tombent en même temps, des taureaux et des bœufs; leur pays est inondé de sang, et la poussière de leur sol saturée de graisse.
వాటితోపాటు అడవి ఎద్దులు, కోడె దూడలు వధకు పోతున్నాయి. ఎదోమీయుల భూమి రక్తంతో నానుతూ ఉంది. వారి దేశపు మట్టి కొవ్వుతో నిండిపోయింది.
8 C’Est un jour de vengeance pour l’Eternel, une année de représailles pour la cause de Sion.
అది యెహోవా శిక్ష అమలుపరిచే రోజు. సీయోను పక్షంగా ప్రతీకారం చేసే సంవత్సరం.
9 Les rivières d’Edom se changeront en poix, sa poussière en soufre; ainsi son pays sera comme de la poix en feu,
ఎదోము కాలువలు కీలులాగా, దాని మట్టి గంధకంగా మారిపోతుంది. దాని భూమి మండుతున్న గంధకంగా ఉంటుంది.
10 qui ne s’éteindra ni la nuit ni le jour, et d’où s’échapperont sans cesse des colonnes de fumée. Il demeurera en ruines de génération en génération, et, en aucun temps, nul n’y passera plus.
౧౦అది రాత్రీ, పగలూ ఆరిపోకుండా ఉంటుంది. దాని పొగ ఎల్లప్పుడూ రేగుతూ ఉంటుంది. అది తరతరాలు పాడుగా ఉంటుంది. దానిలో గుండా ఇక ఎవ్వరూ ఎన్నటికీ ప్రయాణించరు.
11 C’Est le pélican et le hibou qui en prendront possession; la chouette et le corbeau en feront leur demeure. On étendra sur ce pays le cordeau de la destruction et le niveau de la ruine.
౧౧గూడబాతులు, అడవి మృగాలు దాన్ని ఆక్రమించుకుంటాయి. గుడ్లగూబలు, కాకులు అందులో నివసిస్తాయి. ఆయన నాశనం అనే కొలనూలును చాపుతాడు. వినాశనం అనే ఒడంబాన్ని చేత పట్టుకుంటాడు.
12 Ses nobles il n’y en aura plus pour proclamer la royauté, et tous ses grands seront réduits à néant.
౧౨రాజ్యం గురించి ప్రకటించడానికి వారి ప్రధానులు అక్కడ ఉండరు. దాన్ని పరిపాలించే వాళ్ళంతా గతించిపోయారు.
13 Ses palais seront envahis par les broussailles, ses forteresses par les orties et les chardons; ils deviendront la demeure des chacals, le séjour des autruches.
౧౩ఎదోము నగరాల్లో ముళ్లచెట్లు పెరుగుతాయి. దాని దుర్గాల్లో దురదగొండ్లు, గచ్చపొదలు ఎదుగుతాయి. అది అడవికుక్కలకు, నిప్పుకోళ్లకు నివాసంగా ఉంటుంది.
14 Là se rencontreront chats sauvages et chiens sauvages, là les satyres se donneront rendez-vous, là Lilit elle-même établira son gîte et trouvera une retraite tranquille.
౧౪క్రూర జంతువులు, హైనాలు అక్కడ కలిసి తిరుగుతాయి. అడవిమేకలు ఒకదానిపై ఒకటి అరుస్తూ ఉంటాయి. అక్కడ చీకటి పక్షులు నివాసముంటాయి.
15 Là aussi nichera la vipère; elle y déposera ses œufs, les fera éclore et rassemblera les petits sous son ombre; là enfin se réuniront en troupe les vautours.
౧౫గుడ్లగూబలు గూళ్ళు కట్టుకుని, గుడ్లు పెట్టి పొదుగుతాయి. అక్కడే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కలుసుకుంటాయి.
16 Interrogez le livre de Dieu et lisez: nulle de ces bêtes ne fait défaut, l’absence d’aucune n’est signalée. C’Est que la bouche de l’Eternel les a convoquées, c’est ton souffle qui les a groupées.
౧౬యెహోవా గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించండి. ఆ జంతువులన్నీ అక్కడ ఉండి తీరుతాయి. దేని జతపక్షి దాని దగ్గర ఉంటుంది. ఎందుకంటే యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు. ఆయన ఆత్మ వాటిని పోగు చేస్తాడు.
17 Lui-même a jeté le sort pour elles, et sa main leur a mesuré une part au cordeau: elles en conserveront éternellement la possession et y séjourneront de génération en génération.
౧౭అవి రావాలని ఆయన చీట్లు వేశాడు. ఆయన కొలనూలు పట్టుకుని వాటికి ఆ దేశాన్ని పంచిపెడతాడు. అవి శాశ్వతంగా దాన్ని ఆక్రమించుకుని ఉంటాయి. యుగయుగాలు దానిలో నివసిస్తాయి.

< Isaïe 34 >