< Ézéchiel 5 >
1 O toi, fils de l’homme, prends-toi un glaive affilé, prends-le en guise de rasoir de barbiers; tu te le passeras sur la tète et sur la barbe; puis tu prendras une balance à poids et tu les diviseras.
౧“తరువాత నరపుత్రుడా, నువ్వు నీ కోసం మంగలి కత్తి లాంటి ఒక పదునైన కత్తి తీసుకో. దాంతో నీ తలను, గడ్డాన్నీ క్షౌరం చేసుకో. ఆ వెంట్రుకలను తూచడానికీ, భాగాలు చేయడానికీ ఒక త్రాసు తీసుకో.
2 Tu en feras brûler un tiers dans le feu au milieu de la ville, quand seront révolus les jours du siège; puis tu en prendras un tiers, que tu frapperas avec le glaive tout autour, et tu en disperseras un tiers au vent, et je tirerai le glaive derrière eux.
౨పట్టణాన్ని ముట్టడించిన రోజులు ముగిసిన తరువాత ఆ వెంట్రుకల్లో మూడో భాగాన్ని పట్టణం మధ్యలో తగలబెట్టు. మిగిలిన మూడో భాగాన్ని పట్టణం చుట్టూ తిరుగుతూ కత్తితో కొట్టు. మిగిలిన మూడో భాగాన్ని గాలికి ఎగిరి పోనీ. నేను కత్తి దూసి ప్రజలను తరుముతాను.
3 Et de là tu prendras une petite quantité que tu serreras dans les pans de tes vêtements.
౩అయితే కొద్దిగా వెంట్రుకలను తీసుకుని నీ చెంగుకి కట్టుకో.
4 Et tu en prendras encore et tu les jetteras au milieu du feu et tu les brûleras dans le feu; il en sortira un feu contre toute la maison d’Israël.
౪మళ్ళీ వాటిలో కొన్నిటిని తీసి అగ్నిలో వేసి కాల్చి వెయ్యి. అక్కడ నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు జాతినంతటినీ తగులబెట్టేస్తుంది.”
5 Ainsi parle le Seigneur Dieu: "Voilà Jérusalem: je l’avais placée au milieu des nations et autour d’elle étaient des pays.
౫ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు. “ఇది అనేక జాతుల మధ్య నేను ఉంచిన యెరూషలేము పట్టణం. నేను అనేక రాజ్యాలు దాని చుట్టూ ఉండేలా చేశాను.
6 Et elle s’est insurgée contre mes prescriptions avec plus d’impiété que les nations, et contre mes statuts plus que les pays qui l’environnent; oui, ils ont fait fi de mes prescriptions et n’ont pas marché selon mes statuts.
౬అయితే ఆమె ఇతర జాతుల కంటే దుర్మార్గంగా నా శాసనాలను తిరస్కరించింది. ఇతర రాజ్యాల కంటే దుర్మార్గంగా నా నియమాలను తిరస్కరించింది. వాళ్ళు నా న్యాయ నిర్ణయాలను తిరస్కరించి నా నియమాల ప్రకారం నడుచుకోలేదు.”
7 C’Est pourquoi, ainsi a dit le Seigneur Dieu, parce que vous avez été plus agités que les nations qui vous entourent, que vous n’avez pas marché selon mes statuts. Et que vous n’avez pas exécuté mes règlements, et que vous n’avez pas agi selon les règlements des nations qui vous entourent,
౭కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీ చుట్టూ ఉన్న జాతుల కంటే మీరు నాకు ఎక్కువ బాధ కలిగిస్తున్నారు. నా శాసనాల ప్రకారం మీరు నడుచుకోలేదు. నా నియమాలను బట్టి నడుచుకోలేదు. కనీసం మీ చుట్టూ ఉన్న రాజ్యాల నియమాలను బట్టి కూడా మీరు నడుచుకోలేదు.
8 c’est pourquoi, ainsi a dit le Seigneur Dieu, me voici sur toi, moi aussi; et j’accomplirai au milieu de toi des jugements aux yeux des nations.
౮కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి, నేనే మీకు విరోధంగా చర్యలు తీసుకుంటాను. ఇతర జాతులు చూస్తూ ఉండగా మీ మధ్య నా తీర్పు అమలు పరుస్తాను.
9 Je ferai contre toi ce que je n’ai jamais fait et ce que je ne ferai plus, à cause de toutes tes abominations.
౯నీ అసహ్యమైన పనుల కారణంగా నేను ఇంతకు ముందెప్పుడూ చేయని, భవిష్యత్తులో పునరావృతం కాని కార్యాన్ని నీకు చేస్తాను.
10 En vérité, des pères mangeront leurs enfants au milieu de toi, et des enfants mangeront leurs pères, et j’accomplirai contre toi des jugements et je disperserai tout ce qui restera de toi à tous les vents.
౧౦దాని మూలంగా మీలో తండ్రులు తమ పిల్లలను తింటారు. కొడుకులు తమ తండ్రులను తింటారు. నా తీర్పును నేను అమలు పరుస్తాను. మీలో మిగిలిన వాళ్ళందరినీ నలు దిక్కులకూ చెదరగొడతాను.
11 En vérité, par ma vie, dit le Seigneur Dieu, je l’affirme, parce quo tu as déshonoré mon sanctuaire par toutes tes Infamies et toutes tes abominations. Moi aussi j’exercerai des ravages, mon oeil ne sera pas Indulgent, et moi aussi je serai sans pitié.
౧౧కాబట్టి నా ప్రాణం పైన ఒట్టు” ఇది ప్రభువైన యెహోవా ప్రకటన. “నీ అసహ్యమైన విషయాలతో నా మందిరాన్ని అపవిత్రం చేశావు కాబట్టి నేను నీ సంఖ్యను కచ్చితంగా తగ్గిస్తాను. నీ మీద కనికరం చూపను. నిన్ను కాపాడను.
12 Un tiers de toi périra par la peste et s’épuisera par la famine au milieu de toi; un tiers tombera sous le glaive dans tes alentours, et je dispersera` un tiers à tous les vents et tirerai le glaive derrière eux.
౧౨మీ మధ్యలో కరువు వస్తుంది. అప్పుడు వచ్చే తెగులు మూలంగా మీలో మూడో భాగం మరణిస్తారు. యుద్ధం వచ్చి నీ చుట్టూ మరో మూడో భాగం కత్తికి బలౌతారు. మరో మూడో భాగాన్ని అన్ని దిక్కులకీ చెదరగొడతాను. కత్తి దూసి వారిని తరముతాను.
13 Et ma colère Ira jusqu’au bout, j’assouvirai ma fureur sur eux, et je me trouverai satisfait; ils sauront alors que je suis l’Eternel, que j’ai parlé dans mon zèle jaloux, quand j’aurai épuisé ma fureur sur eux.
౧౩అప్పుడుగానీ నా మహా కోపం చల్లారదు. నా మహోగ్రతకి స్వస్తి పలుకుతాను. నేను సంతృప్తి చెందుతాను. వాళ్లకు వ్యతిరేకంగా నా మహోగ్రత చూపి ముగించిన తరువాత యెహోవానైన నేను నా మహోగ్రతలో మాట్లాడానని వాళ్ళు తెలుసుకుంటారు.
14 Et je ferai de toi une ruine et un opprobre parmi les nations qui t’entourent, aux yeux, de tout passant.
౧౪నిన్ను చూసే వాళ్ళందరికీ నువ్వు నిర్జనంగానూ, నిందకు తగిన దానిగానూ కనిపించేలా చేస్తాను.
15 Ce sera un opprobre et une cause d’outrage, une leçon et une stupeur pour les nations qui t’entourent, quand j’accomplirai sur toi des jugements avec colère et fureur et avec de violents sévices c’est moi l’Eternel, qui ai parlé.
౧౫కాబట్టి యెరూషలేము ఇతర జాతులు ఖండించడానికీ, ఎగతాళి చేయడానికీ వీలుగా మారుతుంది. చుట్టూ ఉన్న దేశాలకు ఒక హెచ్చరికగానూ, భయం పుట్టించేదిగానూ ఉంటుంది. ఎందుకంటే నేను మహా కోపంతో, మహోగ్రతతో, తీవ్రమైన గద్దింపుతో నా శిక్షను అమలు చేస్తాను. యెహోవానైన నేనే ప్రకటన చేస్తున్నాను.
16 Quand j’aurai envoyé contre eux les aiguillons cruels de la famine, ces instruments de destruction, que j’enverrai pour vous détruire, j’aggraverai contre vous la famine et je briserai pour vous le bâton de pain.
౧౬నీ పైకి నేను కఠినమైన కరువు బాణాలు వేస్తాను. అవి నువ్వు నాశనం కావడానికి కారణం అవుతాయి. ఎందుకంటే నీ పైకి వచ్చిన కరువును అధికం చేస్తాను. నీ ఆహారానికి ఆధారంగా ఉన్న వాటిని విరిచి వేస్తాను.
17 Et j’enverrai contre vous la famine et les bêtes féroces, qui te laisseront sans enfants, et la peste et le sang passeront sur toi, et j’amènerai le glaive sur toi. C’Est moi l’Eternel qui ai parlé."
౧౭నీకు విరోధంగా కరువునూ, వినాశనాన్నీ పంపిస్తాను. దాంతో నువ్వు సంతానం లేకుండా ఉంటావు. తెగులూ, రక్తపాతం నీకు కలుగుతాయి. నీకు విరోధంగా ఖడ్గాన్ని పంపుతాను. ఈ ప్రకటన చేస్తున్నది నేనే, యెహోవాను.”