< 1 Chroniques 9 >
1 Tous les Israélites avaient été immatriculés et enregistrés dans les livres des rois d’Israël. Ceux de Juda avaient été déportés à Babylone à cause de leurs méfaits.
౧ఈ విధంగా ఇశ్రాయేలీయులందరి పేర్లూ తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో నమోదయ్యాయి. యూదావాళ్ళు చేసిన పాపం కారణంగా వాళ్ళు బబులోనుకి బందీలుగా కునిపోబడ్డారు.
2 Les premiers habitants qui rentrèrent en possession de leurs immeubles, dans leurs anciennes villes, étaient Israélites, prêtres, lévites et serviteurs du temple.
౨తరువాత మొదటగా కొందరు ఇశ్రాయేలీయులూ, యాజకులూ, లేవీయులూ, దేవాలయ సేవకులూ తమ సొంత పట్టణాల్లో తిరిగి నివాసం ఏర్పరచుకున్నారు.
3 A Jérusalem s’établirent des descendants de Juda, de Benjamin, d’Ephraïm et de Manassé:
౩అలాగే కొందరు యూదావాళ్ళూ, బెన్యామీనీయులూ, ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలకు చెందిన వాళ్ళూ యెరూషలేములో నివాసమున్నారు.
4 Outaï, fils d’Ammihoud, fils d’Omri, fils d’Imri, fils de Bâni, issus des fils de Péreç, fils de Juda.
౪ఈ విధంగా నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో ఊతైయూ ఉన్నాడు. ఊతైయూ అమీహూదు కొడుకు. అమీహూదు ఒమ్రీ కొడుకు. ఒమ్రీ ఇమ్రీ కొడుకు. ఇమ్రీ బానీ కొడుకు. బానీ పెరెసు వంశం వాడు. పెరెసు యూదా కొడుకు.
5 Des Silonites: Assaïa, l’aîné, et ses fils.
౫షిలోనీ వాళ్ళలో పెద్దవాడు ఆశాయా, అతని సంతానమూ,
6 Des Zérahites: Yeouêl; leurs frères étaient six cent quatre-vingt-dix.
౬జెరహు సంతతి వాళ్ళలో యెవుయేలు, అతని సోదరులైన ఆరు వందల తొంభై మందీ ఉన్నారు.
7 Des Benjaminites: Sallou, fils de Mechoullam, fils de Hodavia, fils de Hassenoua;
౭ఇంకా బెన్యామీనీయుల్లో సెనూయా కొడుకు హోదవ్యాకి పుట్టిన మెషుల్లాము కొడుకైన సల్లూ,
8 Yibneya, fils de Yeroham; Ela, fils d’Ouzzi, fils de Mikhri, et Mechoullam, fils de Chefatia, fils de Reouêl, fils de Yibniya.
౮యెరోహాము కొడుకైన ఇబ్నెయా, మిక్రి పుట్టిన ఉజ్జీకి పుట్టిన ఏలా, ఇబ్నీయా కొడుకైన రగూవేలుకి పుట్టిన షెఫట్యా కొడుకైన మెషుల్లామూ ఉన్నారు.
9 Leurs frères, selon leurs généalogies, étaient au nombre de neuf cent cinquante-six. Tous ces hommes étaient chefs de clans de leurs familles.
౯వీళ్ళూ వీళ్ళ సోదరులూ కలసి వంశావళి లెక్కల్లో తొమ్మిది వందల యాభై ఆరు మంది అయ్యారు. వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులుగా ఉన్నారు.
10 Des prêtres: Yedaïa, Yoyarib, Yakhîn,
౧౦యాజకుల్లో యెదాయా, యెహోయారీబు, యాకీను ఉన్నారు.
11 Azaria, fils de Hilkia, fils de Mechoullam, fils de Çadok, fils de Meraïot, fils d’Ahitoub, préposé à la maison de Dieu,
౧౧అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో అజర్యా ఉన్నాడు. ఈ అజర్యా హిల్కీయా కొడుకు. హిల్కీయా మెషుల్లాము కొడుకు. మెషుల్లాము సాదోకు కొడుకు. సాదోకు మెరాయోతు కొడుకు. మెరాయోతు దేవుని మందిరంలో అధిపతిగా ఉన్న అహీటూబు కొడుకు.
12 Adaïa, fils de Yeroham, fils de Pachhour, fils de Malkiya, et Massaï, fils d’Adiêl, fils de Yahzêra, fils de Mechoullam, fils de Mechillêmit, fils d’Immer.
౧౨అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో అదాయా ఉన్నాడు. అదాయా యెరోహాము కొడుకు. యెరోహాము పషూరు కొడుకు. పసూరు మల్కీయా కొడుకు. ఇంకా అదీయేలు కొడుకు మశై కూడా ఉన్నాడు. అదీయేలు యహజేరా కొడుకు. యహజేరా మెషుల్లాము కొడుకు. మెషుల్లాము మెషిల్లేమీతు కొడుకు. మెషిల్లేమీతు ఇమ్మెరు కొడుకు.
13 Leurs frères, chefs de leurs familles, étaient mille sept cent soixante, gens résolus, voués au service du culte de la maison de Dieu.
౧౩వీరితో పాటు వీరి వంశానికి నాయకులుగా ఉన్న ఒక వెయ్యీ ఏడు వందల అరవై మంది ఉన్నారు. వీళ్ళంతా దేవుని మందిరానికి సంబంధించిన సేవల్లో ఎంతో సమర్ధులు.
14 Des Lévites: Chemaïa, fils de Hachoub, fils d’Azrikâm, fils de Hachabia, voilà pour les descendants de Merari;
౧౪ఇక లేవీయుల్లో షెమయా ఉన్నాడు. షెమయా హష్షూబు కొడుకు. హష్షూబు అజ్రీకాము కొడుకు. అజ్రీకాము హషబ్యా కొడుకు. హషబ్యా మెరారి వంశం వాడు.
15 Bakbakkar, Hérech, Galal, Mattania, fils de Mikha, fils de Zikhri, fils d’Assaph;
౧౫బక్బక్కరూ, హెరెషూ, గాలాలూ, వీరితో పాటు మత్తన్యా ఉన్నాడు. మత్తన్యా మీకా కొడుకు. మీకా జిఖ్రీ కొడుకు. జిఖ్రీ ఆసాపు కొడుకు.
16 Obadia, fils de Chemaïa, fils de Galal, fils de Yedouthoun, et Bérékhia, fils d’Assa, fils d’Elkana, qui habitait les villages de Netofa.
౧౬ఇంకా ఓబద్యా ఉన్నాడు. ఈ ఓబద్యా షెమయా కొడుకు. షెమయా గాలాలు కొడుకు. గాలాలు యెదూతోను కొడుకు. నెటోపాతీయుల గ్రామాల్లో నివసించిన ఎల్కానా మనుమడూ ఆసా కొడుకూ అయిన బెరెక్యా ఉన్నాడు.
17 Les portiers: Challoum, Akkoub, Talmôn, Ahimân et leurs frères. Challoum était leur chef.
౧౭ఇక షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను, వీళ్ళ బంధువులూ ద్వారపాలకులుగా ఉన్నారు. వీళ్ళకి షల్లూము నాయకుడు.
18 Ils sont encore maintenant établis à la Porte du Roi, à l’Est. Ce sont là les portiers des camps des Lévites.
౧౮లేవీ గోత్రానికి చెందిన వీళ్ళు తూర్పు వైపు ఉండే రాజ ద్వారానికి కాపలా కాసేవాళ్ళు.
19 Et Challoum, fils de Korê, fils d’Ebiassaf, fils de Coré, ainsi que ses frères issus de la famille paternelle les Korahites étaient préposés aux travaux du service; c’étaient les gardiens des entrées du Tabernacle. Leurs ancêtres avaient le service du camp de l’Eternel, en gardaient les avenues.
౧౯కోరహు కొడుకైన ఎబ్యాసాపుకి పుట్టిన కోరే కొడుకైన షల్లూము అతని బంధువులూ, అతని తండ్రి తెగకు చెందిన కోరహీయులూ మందిర సేవలో గుడారానికి కాపలాగా ఉండేవాళ్ళు. వాళ్ళ పూర్వీకులు యెహోవా మందిర ద్వారాలకు కావలి కాస్తూ ఉండేవాళ్ళు.
20 Phinéas, fils d’Eléazar, était autrefois leur chef; l’Eternel était avec lui.
౨౦గతంలో ఎలియాజరు కొడుకైన ఫీనెహాసు వాళ్ళపై అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.
21 Zacharie, fils de Méchélémia, était le portier de l’entrée de la Tente d’assignation.
౨౧మెషెలెమ్యా కొడుకైన జెకర్యా మందిర ప్రవేశ ద్వారానికి కాపలాగా ఉన్నాడు.
22 Tous ceux qui avaient été choisis pour être portiers aux seuils étaient au nombre de deux cent douze. Ils demeuraient dans leurs villages inscrits dans un rôle; David et Samuel le Voyant les avaient installés dans leurs fonctions permanentes.
౨౨ఇలా ద్వారాల దగ్గర కాపలా కాయడానికి ఏర్పాటైన వాళ్ళు మొత్తం రెండువందల పన్నెండు మంది. వీళ్ళ పేర్లు తమ తమ గ్రామాల వరుసలో వంశావళిలో నమోదు అయ్యాయి. వీళ్ళు విశ్వసనీయులూ, ఆధారపడదగ్గ వాళ్ళూ కాబట్టి దావీదూ, దీర్ఘదర్శి అయిన సమూయేలూ వీరిని నియమించారు.
23 C’Étaient eux et leurs descendants qui étaient préposés aux portes de la maison de l’Eternel, du Tabernacle, selon leur tour de garde.
౨౩వాళ్ళూ వాళ్ళ కొడుకులూ యెహోవా మందిర ద్వారాల దగ్గర, అంటే ప్రత్యక్ష గుడారం ద్వారాల దగ్గర కాపలా కాశారు.
24 Les portiers étaient postés aux quatre points cardinaux, à l’Est, à l’Ouest, au Nord et au Sud.
౨౪ఇలా కాపలా కాసేవారు గుడారం నాలుగు దిక్కుల్లో తూర్పు వైపునా, పడమర వైపునా, ఉత్తరం వైపునా, దక్షిణం వైపునా నిలుచున్నారు.
25 Leurs frères, qui étaient dans leurs villages, venaient alternativement les rejoindre pour sept jours.
౨౫గ్రామాలనుండి వాళ్ళ బంధువులు వాళ్ళ క్రమంలో ఏడు రోజులకోసారి వాళ్ళ దగ్గరికి వచ్చి సహాయం చేసేవాళ్ళు.
26 Car les quatre chefs des portiers, qui étaient Lévites, demeuraient là, eux, d’une manière permanente. Ils étaient préposés aussi aux salles et aux magasins dans la maison de Dieu.
౨౬అయితే లేవీయులైన నలుగురు ప్రముఖ ద్వారపాలకులు మిగిలిన వాళ్ళపై అజమాయిషీ చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని మందిరంలోని గదులనూ, ఖజానాలనూ భద్రపరచే బాధ్యత వాళ్ళదే.
27 Ils passaient la nuit autour de la maison de Dieu, car ils étaient de garde; et c’étaient eux qui détenaient la clef pour chaque matin.
౨౭వాళ్ళు దేవుని మందిరానికి కావలివారు కాబట్టి రాత్రంతా మేలుకుని కాపలా కాయడం, ఉదయాన్నే మందిరపు ద్వారాలు తెరవడం వాళ్ళ విధి.
28 D’Autres avaient la garde des vases du culte: ils les comptaient à l’entrée et à la sortie.
౨౮వాళ్ళల్లో కొంతమంది మందిరంలో సేవకు ఉపయోగించే సామగ్రిని కనిపెట్టుకుని ఉండాలి. వాటిని బయటకు తీసుకు వెళ్తున్నప్పుడూ, లోపలికి తెస్తున్నప్పుడూ వాళ్ళు వాటిని లెక్కిస్తారు.
29 D’Autres étaient préposés aux ustensiles, à tous ceux du Sanctuaire, à la fleur de farine, au vin, à l’huile, à l’encens et aux aromates.
౨౯మిగిలిన సామగ్రినీ, పరిశుద్ధ స్థలం లో పాత్రలనూ జాగ్రత్త పరిచే బాధ్యత మరి కొందరిపై ఉంటుంది. సన్నని పిండి, ద్రాక్షారసం, నూనె, సాంబ్రాణి, ఇతర పరిమళ సామగ్రి వంటి సరుకులను వీళ్ళు జాగ్రత్త చేస్తారు.
30 Mais c’étaient des prêtres qui préparaient les onctions avec ces aromates.
౩౦యాజకుల కొడుకుల్లో కొందరు సుగంధద్రవ్యాలను, పరిమళ తైలాన్నీ తయారు చేస్తారు.
31 Mattitia, un des Lévites, l’aîné de Challoum, le Korahite, avait la charge permanente de la confection des gâteaux faits à la poêle.
౩౧అర్పణల కోసం రొట్టెను తయారుచేసే బాధ్యత లేవీయుడైన మత్తిత్యాది. ఇతను కోరహు సంతతికి చెందిన షల్లూముకి పెద్ద కొడుకు.
32 C’Étaient des Kehatites, leurs frères, qui étaient préposés aux pains de proposition, pour les préparer semaine par semaine.
౩౨వాళ్ళ బంధువులైన కహాతీయుల్లో కొందరికి ప్రతి విశ్రాంతి దినాన సన్నిధి రొట్టెలు సిద్ధపరిచే బాధ్యత ఉంది.
33 Tels sont les chantres, chefs de familles lévitiques, demeurant dans les chambres, exemptés de tout autre service, car jour et nuit ils avaient à faire.
౩౩గాయకులూ లేవీయుల వంశ నాయకులూ పని లేనప్పుడు మందిరం గదుల్లో నివాసముంటారు. ఎందుకంటే వీళ్ళు రాత్రీ పగలూ తేడా లేకుండా సేవ చేయాలి.
34 Tels sont les chefs des familles lévitiques, selon leur généalogie; eux, ils demeuraient à Jérusalem.
౩౪వీళ్ళు తమ వంశావళి జాబితా ప్రకారం లేవీ గోత్రంలో నాయకులుగా, పెద్దలుగా ఉన్నవాళ్ళు. వీళ్ళు యెరూషలేములో నివాసమున్నారు.
35 A Gabaon demeuraient le "père" de Gabaon, Yeïêl, dont la femme s’appelait Maakha,
౩౫గిబియోను తండ్రి యెహీయేలు. ఇతను గిబియోను పట్టణంలో నివాసమున్నాడు. ఇతని భార్య పేరు మయకా.
36 son fils aîné Abdôn, Çour, Kich, Baal, Ner, Nadab,
౩౬ఇతని పెద్దకొడుకు అబ్దోను. తరువాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
37 Ghedor, Ahio, Zekharia et Miklôt.
౩౭గెదోరు, అహ్యో, జెకర్యా, మిక్లోతు అనేవాళ్ళు పుట్టారు.
38 Miklôt engendra Chimeâm. Ceux-là aussi, à l’encontre de leurs frères, habitaient Jérusalem avec leurs frères.
౩౮మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు యెరూషలేములో నివాసముండే తమ బంధువులకు సమీపంగా ఉండే ఇళ్లలోనే నివసించారు.
39 Ner engendra Kich, celui-ci Saül, celui-ci Jonathan, Malki-Choua, Abinadab et Echbaal.
౩౯నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకి యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.
40 Le fils de Jonathan était Merib-Baal, qui donna le jour à Mikha.
౪౦యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకి మీకా పుట్టాడు.
41 Les fils de Mikha furent: Pitôn, Méléc et Tahrêa.
౪౧మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనేవాళ్ళు.
42 Ahaz engendra Yara, celui-ci Alémet, Azmavet et Zimri. Zimri engendra Moça,
౪౨ఆహాజుకి యరా పుట్టాడు. యరాకి ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ పుట్టారు. జిమ్రీకి మోజా పుట్టాడు.
43 celui-ci Binea, celui-ci Refaïa, celui-ci Elassa, celui-ci Acêl.
౪౩మోజాకు బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రెఫాయా. రెఫాయా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.
44 Acêl eut six fils, dont voici les noms: Azrikâm, Bokhrou, Ismaël, Chearia, Obadia et Hanân. Tels étaient les fils d’Acêl.
౪౪ఆజేలుకి అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను అనే పేర్లున్న ఆరుగురు కొడుకులున్నారు. వీళ్ళు ఆజేలు కొడుకులు.