< 1 Chroniques 5 >
1 Voici les descendants de Ruben, le premier-né d’Israël. (C’Était, en effet, le premier-né, mais comme il avait profané la couche de son père, son droit d’aînesse fut attribué aux fils de Joseph, fils d’Israël, sans que ce dernier portât, dans les généalogies, le titre d’aîné.
౧ఇశ్రాయేలుకు పెద్దకొడుకైన రూబేను సంతానం గూర్చిన వివరాలు. ఇతడు పెద్ద కొడుకే గానీ అతని ప్రథమ సంతానపు జన్మహక్కును అతని నుండి తీసివేసి ఇశ్రాయేలుకు మరో కొడుకైన యోసేపు కొడుకులకు బదలాయించడం జరిగింది. ఎందుకంటే రూబేను తన తండ్రి మంచాన్ని అపవిత్రం చేశాడు.
2 Si Juda l’emporta sur ses frères et donna le jour à un prince, c’est à Joseph que fut dévolue l’aînesse.)
౨తన సోదరులందరికంటే యూదా ప్రముఖుడు. యూదా వంశంలోనుండే పరిపాలకుడు రానున్నాడు. అయినా ప్రథమ సంతానపు జన్మహక్కు యోసేపు పరమయింది.
3 Fils de Ruben, premier-né d’Israël: Hénoc, Pallou, Heçrôn et Karmi.
౩ఇశ్రాయేలుకు పెద్ద కొడుకుగా పుట్టిన రూబేను కొడుకులు ఎవరంటే హనోకు, పల్లూ, హెస్రోను, కర్మీ అనే వారు.
4 Fils de Joël: Chemaïa; celui-ci eut pour fils Gog, celui-ci Chimeï,
౪యోవేలు వారసుల వివరాలిలా ఉన్నాయి. యోవేలు కొడుకు షెమయా, షెమయా కొడుకు గోగు, గోగు కొడుకు షిమీ,
5 celui-ci Mikha, celui-ci Reaïa, celui-ci Baal,
౫షిమీ కొడుకు మీకా, మీకా కొడుకు రెవాయా, రెవాయా కొడుకు బయలు,
6 celui-ci Beêra, qu’exila Tilgath Pilneécer, roi d’Assyrie. C’Était un phylarque de Ruben.
౬బయలు కొడుకు బెయేర. ఇతడు రూబేనీయులకు నాయకుడు. అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు ఇతణ్ణి బందీగా చేసి తీసుకు వెళ్ళాడు.
7 Ses frères, selon leurs familles, enregistrées d’après leur généalogie, étaient Yeïêl, en tête, puis Zekhariahou,
౭వాళ్ళ వంశావళి లెక్కల్లో ఉన్న తమ కుటుంబాల ప్రకారం అతని సోదరులెవరంటే ప్రధాని అయిన యెహీయేలూ, జెకర్యా,
8 Béla, fils d’Azaz, fils de Chéma, fils de Joël; Béla demeurait à Aroêr et s’étendait jusqu’à Nebo et Baal Meôn.
౮యోవేలు కొడుకైన షెమ మనుమడూ ఆజాజు కొడుకూ అయిన బెల అనే వాళ్ళు. వీళ్ళు అరోయేరు లోనూ, నెబో, బయల్మెయోనుల వరకూ నివాసం ఏర్పరచుకున్నారు.
9 A l’Est, son habitation atteignait l’entrée du désert, depuis le fleuve de l’Euphrate, car leurs troupeaux s’étaient accrus dans le pays de Galaad.
౯వాళ్ళ పశువులు గిలాదు దేశంలో అతి విస్తారమయ్యాయి. కాబట్టి వాళ్ళు తూర్పున యూఫ్రటీసు నది దగ్గరనుండి అరణ్యపు సరిహద్దుల వరకూ నివాసాలు ఏర్పరచుకున్నారు.
10 Au temps de Saül, ils avaient fait la guerre avec les Hagriites, qui étaient tombés en leur pouvoir; ils s’étaient installés dans leurs tentes, sur toute la bande orientale attenante au Galaad.
౧౦సౌలు పరిపాలనా కాలంలో వాళ్ళు హగ్రీ జాతి వారితో యుద్ధం చేసి వాళ్ళను హతమార్చారు. గిలాదు తూర్పు వైపు వరకూ ఉన్న ప్రాంతమంతా నివాసమున్నారు.
11 Les enfants de Gad, à l’opposite, demeuraient dans le pays du Basan jusqu’à Salca.
౧౧వాళ్ళకెదురుగా ఉన్న బాషాను దేశంలో సలేకా వరకూ గాదు గోత్రం వాళ్ళు నివసించారు.
12 En tête venait Joël, en second Chafam, puis Yanaï et Chafat dans le Basan.
౧౨వాళ్ళ నాయకులు యోవేలు, షాపాము అనేవాళ్ళు. వీళ్ళు తమ తమ కుటుంబాల నాయకులు. వీళ్ళ తరువాత షాపాతు, యహనై అనే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు బాషానులో నివసించారు.
13 Leurs frères, classés selon leurs maisons paternelles, étaient: Mikhaêl, Mechoullam, Chéba, Yoraï, Yakân, Zïa et Eber, en tout sept.
౧౩వీళ్ళ తండ్రుల వైపు కుటుంబాల బంధువులు మొత్తం ఏడుగురున్నారు. వాళ్ళు మిఖాయేలు, మెషుల్లాము, షేబా, యోరై, యకాను, జీయా, ఏబెరు అనే వాళ్ళు.
14 Ceux-ci furent les fils d’Abihaïl, fils de Houri, fils de Yaroab, fils de Galaad, fils de Mikhaël, fils de Yechichaï, fils de Yahdo, fils de Bouz.
౧౪వీళ్ళు హూరీ అనే వాడికి పుట్టిన అబీహాయిలు కొడుకులు. ఈ హూరీ యరోయకీ, యారోయ గిలాదుకీ, గిలాదు మిఖాయేలుకీ, మిఖాయేలు యెషీషైకీ, యెషీషై యహదోకీ, యహదో బూజుకీ పుట్టారు.
15 Ahi, fils d’Abdiël, fils de Gouni, était le chef de leur clan familial.
౧౫గూనీకి పుట్టిన అబ్దీయేలు కుమారుడు అహీ వాళ్ళ తండ్రుల కుటుంబాలకు నాయకుడు.
16 Ils demeuraient dans le Galaad, le Basan et leurs bourgades, et dans tous les pâturages de Saron formant issues.
౧౬వారు బాషానులోని గిలాదులోనూ, మిగిలిన ఊళ్లలోనూ, షారోను సరిహద్దుల వరకూ ఉన్న పచ్చని భూముల్లోనూ నివాసమున్నారు.
17 Tous furent enregistrés au temps de Jotham, roi de Juda, et au temps de Jéroboam, roi d’Israël.
౧౭యూదా రాజు యోతాము కాలంలోనూ ఇశ్రాయేలు రాజు యరొబాము కాలంలోనూ వీళ్ళను వాళ్ళ వంశావళి లెక్కల్లో నమోదు చేశారు.
18 Les Rubénites, les Gadites et ceux de la demi-tribu de Manassé, qui étaient guerriers, porteurs de boucliers et d’épées, archers et exercés aux combats, formaient un effectif de quarante-quatre mille sept cent soixante soldats.
౧౮రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థ గోత్రం వాళ్ళల్లో బల్లెం, కత్తి పట్టగలిగిన వాళ్ళూ, బాణాలు వేయడంలో నేర్పరులూ, యుద్ధం చేయడానికి సన్నద్ధమైన వాళ్ళూ మొత్తం నలభై నాలుగు వేల ఏడు వందల అరవైమంది ఉన్నారు.
19 Ils firent la guerre aux Hagriites et aux gens de Yetour, de Nafich et de Nodab.
౧౯వీళ్ళు హగ్రీ జాతి వాళ్ళ పైనా, యెతూరు వాళ్ళపైనా, నాపీషు వాళ్ళపైనా, నోదాబు వాళ్ళపైనా దాడులు చేసారు.
20 Ils furent victorieux et reçurent la soumission des Hagriites et de tous leurs auxiliaires, car ils avaient invoqué Dieu dans le combat et avaient été exaucés pour avoir mis leur confiance en Lui.
౨౦యుద్ధంలో వాళ్ళకు దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా హగ్రీ జాతి వాళ్ళూ, వాళ్ళతో ఉన్న వాళ్ళంతా ఓడిపోయారు. యుద్ధంలో ఇశ్రాయేలీయులు దేవునికి విజ్ఞాపన చేశారు. వాళ్ళు తన పైన నమ్మకముంచారు గనక దేవుడు వాళ్ళ ప్రార్థనను అంగీకరించాడు.
21 Ils razzièrent leurs troupeaux, leurs chameaux au nombre de cinquante mille, deux cent cinquante mille têtes de menu bétail, deux mille ânes et cent mille personnes.
౨౧కాబట్టి ఇశ్రాయేలీయులు జయించడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు యాభై వేల ఒంటెలనూ, రెండు లక్షల యాభై వేల గొర్రెలనూ, రెండు వేల గాడిదలనూ, లక్ష మంది మనుషులనూ స్వాధీనం చేసుకున్నారు.
22 Beaucoup avaient succombé dans le combat, car Dieu est le maître de la guerre. Ils occupèrent ces lieux jusqu’à l’exil.
౨౨దేవుడు యుద్ధంలో వారికి సహాయం చేశాడు గనుక వాళ్ళు అనేక మందిని హతమార్చారు. తరువాత కాలంలో చెరలోకి వెళ్ళేంత వరకూ రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళంతా హగ్రీ జాతి వాళ్ళ దేశంలోనే నివాసం ఉన్నారు.
23 Ceux de la demi-tribu de Manassé habitaient le pays qui s’étend du Basan à Baal-Hermôn, à Senir et à la montagne de Hermôn. Ils étaient nombreux.
౨౩మనష్షే అర్థగోత్రం వాళ్ళు ఆ బాషాను దేశంలో నివసించి అభివృద్ధి చెందారు. బాషాను నుండి బయల్హెర్మోను వరకూ ఇంకా హెర్మోను పర్వతం అయిన శెనీరు వరకూ వ్యాపించారు.
24 Voici quels furent les chefs de leurs clans familiaux: Efer, Yicheï, Eliël, Azriël, Jérémie, Hodavia et Yahdiël. C’Étaient de vaillants hommes, des gens fameux, que ces chefs de leurs clans familiaux.
౨౪వాళ్ళ కుటుంబాలకు నాయకులు ఎవరంటే ఏఫెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహదీయేలు అనే వాళ్లు. వీళ్ళు ధైర్యవంతులు, బలవంతులు, ప్రసిద్ధులైన వాళ్ళు. తమ తమ కుటుంబాలకు నాయకులు.
25 Mais ils devinrent infidèles au Dieu de leurs ancêtres, en se prostituant aux divinités des peuples du pays que Dieu avait exterminés devant eux.
౨౫కానీ వాళ్ళు తమ పూర్వీకుల దేవునిపై తిరుగుబాటు చేశారు. దేవుడు తమ కళ్ళెదుట ఏ జాతులనైతే నాశనం చేశాడో ఆ జాతుల దేవుళ్ళను పూజించారు.
26 Alors le Dieu d’Israël excita l’esprit de Poul, roi d’Assyrie, et celui de Tilgat-Pilnésser, roi d’Assyrie, qui déporta les Rubénites, les Gadites et ceux de la demi-tribu de Manassé et les amena à Halah, Habor, Hara, et près du fleuve de Gozân, où ils sont encore aujourd’hui.
౨౬కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజు పూలు (అంటే అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు) ను రెచ్చగొట్టాడు. ఆ రాజు రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళనందర్నీ బందీలుగా హాలహుకీ, హాబోరుకీ, హారాకుకీ, గోజాను నదీ ప్రాంతాలకీ పట్టుకుని పోయాడు. ఈ రోజుకీ వీళ్ళు అక్కడ కనిపిస్తున్నారు.