< Michée 2 >
1 Malheur à ceux qui méditent la vanité et qui préparent le mal sur leurs lits! À la lumière du matin, ils l’exécutent, parce que c’est au pouvoir de leur main.
౧మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ దుర్మార్గాలు చేసేవారికి బాధ తప్పదు. వాళ్లకు అధికారముంది కాబట్టి పగటి వెలుతురులో వాళ్ళు అలా చేస్తారు.
2 Et ils convoitent des champs et les ravissent, et des maisons, et ils s’en emparent; et ils oppriment l’homme et sa maison, l’homme et son héritage.
౨వాళ్ళు పొలాలు ఆశించి లాగేసుకుంటారు. ఇళ్ళు ఆశించి తీసేసుకుంటారు. వ్యక్తినీ అతని ఇంటినీ, వ్యక్తినీ అతని వారసత్వాన్నీ వాళ్ళు అణిచేసి ఆక్రమించుకుంటారు.
3 C’est pourquoi, ainsi dit l’Éternel: Voici, je médite contre cette famille un mal d’où vous ne pourrez pas retirer vos cous; et vous ne marcherez pas la tête haute, car c’est un temps mauvais.
౩కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు, “ఈ వంశం మీదికి విపత్తు పంపించబోతున్నాను. దాని కిందనుంచి మీ మెడలను వదిలించుకోలేరు. గర్వంగా నడవ లేనంతగా అపాయం రాబోతుంది.
4 En ce jour-là, on vous prendra pour proverbe, et on se lamentera dans une douloureuse lamentation; on dira: Nous sommes entièrement détruits; il a changé la portion de mon peuple: comme il me l’a ôtée! À celui qui se détourne [de l’Éternel] il a partagé nos champs.
౪ఆ రోజు మీ శత్రువులు మీ గురించి ఒక పాట పాడతారు. ఎంతో దుఃఖంతో ఏడుస్తారు. వారిలా పాడతారు, ఇశ్రాయేలీయులమైన మనం బొత్తిగా పాడైపోయాం. యెహోవా నా ప్రజల భూభాగాన్ని మార్చాడు. ఆయన నా దగ్గర నుంచి దాన్ని ఎలా తీసేస్తాడు? ఆయన మన భూములను ద్రోహులకు పంచి ఇచ్చాడు.”
5 C’est pourquoi tu n’auras personne qui étende le cordeau pour [faire] un lot dans la congrégation de l’Éternel.
౫అందుచేత చీట్లు వేసి ధనవంతులైన మీకు భూమి పంచిపెట్టడానికి యెహోవా సమాజంలో వారసులెవరూ ఉండరు.
6 Ne prophétisez point, prophétisent-ils. S’ils ne prophétisent pas à ceux-ci, l’ignominie ne s’éloignera pas.
౬“ప్రవచించ వద్దు, ఈ విషయాలను వాళ్ళు ప్రవచించ కూడదు. అవమానం రాకూడదు” అని వారంటారు.
7 Toi qui es appelée la maison de Jacob: l’Éternel est-il impatient? Sont-ce là ses actes? Mes paroles ne font-elles pas du bien à celui qui marche avec droiture?
౭“యాకోబు వంశమా! యెహోవా సహనం తగ్గిపోయిందా? ఆయన ఇలాంటి పనులు చేస్తాడా?” అని చెప్పడం భావ్యమేనా? యథార్థంగా ప్రవర్తించేవారికి నా మాటలు క్షేమం కలిగిస్తాయి గదా!
8 Naguère encore mon peuple s’est levé comme un ennemi: vous enlevez le manteau avec la tunique à ceux qui passent en sécurité, qui se détournent de la guerre;
౮ఇటీవలే నా ప్రజలు శత్రువులయ్యారు. యుద్ధరంగం నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నాం అని సైనికులు అనుకున్నట్టుగా, నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి పై బట్టలను, అంగీని మీరు లాగివేస్తారు.
9 vous avez chassé les femmes de mon peuple des maisons de leurs délices; de dessus leurs enfants, vous avez ôté ma magnificence, pour toujours.
౯వారికిష్టమైన ఇళ్ళల్లోనుంచి నా ప్రజల్లోని స్త్రీలను మీరు వెళ్లగొడతారు. వారి సంతానం మధ్య నా ఘనతను ఎన్నటికీ ఉండకుండాా చేస్తున్నారు.
10 Levez-vous et allez-vous-en! car ce n’est pas ici un lieu de repos, à cause de la souillure qui amène la ruine: la ruine est terrible!
౧౦లేచి వెళ్లిపోండి, అది అపవిత్రం అయిపోయింది కాబట్టి మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు. నేను దాన్ని పూర్తిగా నాశనం చేస్తాను.
11 S’il y a un homme qui marche selon le vent et le mensonge, qui mente, [disant]: Je te prophétiserai au sujet du vin et de la boisson forte! il sera le prophète de ce peuple.
౧౧పనికి మాలిన మాటలు చెబుతూ అబద్ధాలాడుతూ ఎవడైనా ఒకడు వచ్చి, “ద్రాక్షారసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచనం చెబుతాను” అంటే, వాడే ఈ ప్రజలకు ప్రవక్త అవుతాడు.
12 Je te rassemblerai certainement, Jacob, toi, tout entier; je réunirai certainement le résidu d’Israël; je les mettrai ensemble comme le menu bétail de Botsra, comme un troupeau au milieu de son pâturage. Ils bruiront à cause [de la multitude] des hommes.
౧౨యాకోబూ, నేను మిమ్మల్నందరినీ తప్పకుండా పోగు చేస్తాను. ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారిని తప్పక సమకూర్చుతాను. గొర్రెల దొడ్డిలోకి గొర్రెలు చేరుకున్నట్టు నేను వారిని చేరుస్తాను. తమ మేత స్థలాల్లో వారిని చేరుస్తాను. చాలామంది ఉండడం వలన పెద్ద శబ్దం అక్కడ వస్తుంది.
13 Celui qui fait la brèche est monté devant eux; ils ont fait la brèche et ont passé par la porte, et sont sortis par elle, et leur roi est passé devant eux, et l’Éternel est à leur tête.
౧౩వారికి దారి ఇచ్చేవాడు వారి ముందు వెళ్తాడు. వాళ్ళు గుమ్మం పడగొట్టి దాని ద్వారా దాటిపోతారు. వాళ్ళ రాజు వారికి ముందుగా నడుస్తాడు. యెహోవా వారికి నాయకుడుగా ఉంటాడు.