< 2 Chroniques 23 >
1 Et la septième année, Jehoïada se fortifia, et fit un pacte avec les chefs de centaines, Azaria, fils de Jerokham, et Ismaël, fils de Jokhanan, et Azaria, fils d’Obed, et Maascéïa, fils d’Adaïa, et Élishaphat, fils de Zicri.
౧ఏడవ సంవత్సరంలో యెహోయాదా, బలం కూడదీసుకున్నాడు. అతడు యెరోహాము కొడుకు అజర్యా, యెహోహానాను కొడుకు ఇష్మాయేలూ, ఓబేదు కొడుకు అజర్యా, అదాయా కొడుకు మయశేయా, జిఖ్రీ కొడుకు ఎలీషాపాతూ అనే శతాధిపతులను ఎంపిక చేసుకుని వారితో ఒడంబడిక చేసుకున్నాడు.
2 Et ils firent le tour de Juda, et assemblèrent les lévites de toutes les villes de Juda, et les chefs des pères d’Israël; et ils vinrent à Jérusalem.
౨వారు యూదా దేశమంతా తిరిగి యూదావారి పట్టణాలన్నిటిలో నుంచి లేవీయులనూ, ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలనూ సమకూర్చారు. వారంతా యెరూషలేముకు వచ్చారు.
3 Et toute la congrégation fit alliance avec le roi dans la maison de Dieu; et [Jehoïada] leur dit: Voici, le fils du roi régnera, selon ce que l’Éternel a dit touchant les fils de David.
౩ప్రజలంతా సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నారు. యెహోయాదా వారితో ఇలా అన్నాడు. “యెహోవా దావీదు కుమారులను గురించి చెప్పిన మాట ప్రకారం, రాజు కుమారుడు పరిపాలన చేయాలి.”
4 C’est ici ce que vous ferez: un tiers d’entre vous qui entrez le [jour du] sabbat, sacrificateurs et lévites, sera chargé de la garde des seuils;
౪“కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే, విశ్రాంతి దినాన సేవచేయడానికి వచ్చే మీలోని యాజకుల్లోనూ లేవీయుల్లోనూ మూడవ భాగం, ద్వారం దగ్గర కాపలా కాయాలి.
5 et un tiers sera dans la maison du roi; et un tiers à la porte de Jesod; et tout le peuple sera dans les parvis de la maison de l’Éternel.
౫మరొక మూడవ భాగం రాజభవనం దగ్గర ఉండాలి. మిగిలిన మూడవ భాగం పునాది గుమ్మం దగ్గర ఉండాలి. ప్రజలంతా యెహోవా మందిర ఆవరణం దగ్గర ఉండాలి.
6 Et que personne n’entre dans la maison de l’Éternel, sauf les sacrificateurs et les lévites qui feront le service: eux, ils entreront, car ils sont saints; et tout le peuple fera l’acquit de la charge de l’Éternel.
౬యాజకులు, లేవీయుల్లో సేవ చేసేవారు తప్ప యెహోవా మందిరం లోపలికి ఇంకెవ్వరూ రాకూడదు. వారు ప్రతిష్టితులు కాబట్టి వారు లోపలికి రావచ్చు గాని ప్రజలంతా యెహోవా ఆజ్ఞ ప్రకారం బయటే ఉండాలి.
7 Et les lévites entoureront le roi de tous côtés, chacun ses armes à la main; et celui qui entrera dans la maison sera mis à mort; et soyez avec le roi quand il entrera et quand il sortira.
౭లేవీయులంతా తమ తమ ఆయుధాలను చేత పట్టుకుని రాజు చుట్టూ ఉండాలి. మందిరం లోపలికి ఇంకెవరైనా వస్తే, వారిని చంపేయండి. రాజు లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మీరు అతనితో ఉండాలి.”
8 Et les lévites et tout Juda firent selon tout ce que Jehoïada, le sacrificateur, avait commandé; et ils prirent chacun ses hommes, ceux qui entraient le [jour du] sabbat et ceux qui sortaient le [jour du] sabbat; car Jehoïada, le sacrificateur, n’avait pas renvoyé les classes.
౮కాబట్టి లేవీయులు, యూదావారంతా యాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించినట్టు చేశారు. యాజకుడైన యెహోయాదా ఏ వంతు వారికీ సెలవియ్యలేదు కాబట్టి యాజకులంతా విశ్రాంతి దినాన సేవ చేయాల్సిన వారిని, సేవ చేసి బయటికి వెళ్లవలసిన వారిని తీసుకు వచ్చారు.
9 Et Jehoïada, le sacrificateur, donna aux chefs de centaines les lances, et les écus, et les boucliers, qui avaient appartenu au roi David, et qui étaient dans la maison de Dieu.
౯యాజకుడైన యెహోయాదా దేవుని మందిరంలో రాజైన దావీదుకు చెందిన ఈటెలనూ, పెద్ద డాళ్ళనూ, చిన్న డాళ్లనూ శతాధిపతులకు అప్పగించాడు.
10 Et il fit tenir là tout le peuple, chacun sa javeline à la main, depuis le côté droit de la maison jusqu’au côté gauche de la maison, vers l’autel et vers la maison, auprès du roi, tout autour.
౧౦అతడు ఆయుధాలు పట్టుకున్న మనుషులందరినీ మందిరపు కుడివైపు నుంచి ఎడమవైపు వరకూ బలిపీఠం పక్కన, మందిరం పక్కన, రాజు చుట్టూ ఉంచాడు.
11 Et ils firent sortir le fils du roi, et mirent sur lui la couronne et le témoignage; et ils le firent roi; et Jehoïada et ses fils l’oignirent, et dirent: Vive le roi!
౧౧అప్పుడు వారు రాకుమారుడిని బయటికి తెచ్చి, అతని తలపై కిరీటం పెట్టి, ధర్మశాస్త్రాన్ని అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేశారు. యెహోయాదా, అతని కొడుకులూ అతనిని అభిషేకించి “రాజు చిరంజీవి అగు గాక” అన్నారు.
12 Et Athalie entendit le cri du peuple qui courait et acclamait le roi, et elle entra vers le peuple dans la maison de l’Éternel.
౧౨రాజును పొగుడుతూ పరుగులు పెడుతున్న ప్రజల శబ్దం అతల్యా విని, యెహోవా మందిరంలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చింది.
13 Et elle regarda, et voici, le roi se tenait sur son estrade, à l’entrée, et les chefs et les trompettes étaient auprès du roi, et tout le peuple du pays se réjouissait et sonnait des trompettes, et les chantres [étaient là] avec des instruments de musique, et ceux qui enseignaient à louer [Dieu]. Et Athalie déchira ses vêtements, et dit: Conspiration! Conspiration!
౧౩ప్రవేశ స్థలం దగ్గర అతనికి ఏర్పాటు చేసిన స్తంభం దగ్గర రాజు నిలబడడం ఆమె చూసింది. అధికారులూ, బాకాలు ఊదేవారూ రాజు దగ్గర ఉండి, దేశంలోని ప్రజలంతా సంతోషిస్తూ, బాకాలతో శబ్దాలు చేస్తూ, గాయకులు సంగీత వాద్యాలతో స్తుతిపాటలు పాడుతూ ఉండడం చూసి బట్టలు చించుకుని “రాజ ద్రోహం! రాజద్రోహం!” అని అరిచింది.
14 Et Jehoïada, le sacrificateur, fit sortir les chefs de centaines qui étaient préposés sur l’armée, et leur dit: Faites-la sortir en dehors des rangs, et que celui qui la suivra soit mis à mort par l’épée; car le sacrificateur dit: Ne la mettez pas à mort dans la maison de l’Éternel.
౧౪అప్పుడు యాజకుడైన యెహోయాదా సైన్యం మీద అధికారులుగా ఉన్న శతాధిపతులను పిలిపించి “యెహోవా మందిరంలో ఆమెను చంపవద్దు. సైనిక పంక్తుల అవతలకు తీసుకెళ్ళి ఆమె పక్షాన ఉన్న వారిని, ఆమెను కత్తితో చంపాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు.
15 Et ils lui firent place; et elle alla par l’entrée de la porte des chevaux dans la maison du roi, et là ils la mirent à mort.
౧౫కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి, రాజ భవనం దగ్గరున్న గుర్రపు ద్వారం ప్రవేశస్థలానికి ఆమె వచ్చినప్పుడు ఆమెను అక్కడ చంపేశారు.
16 Et Jehoïada fit une alliance entre lui et tout le peuple et le roi, qu’ils seraient le peuple de l’Éternel.
౧౬వారంతా యెహోవా ప్రజలుగా ఉండాలని ప్రజలందరితోనూ రాజుతోనూ యెహోయాదా అప్పుడు నిబంధన చేశాడు.
17 Et tout le peuple entra dans la maison de Baal, et ils la démolirent; et ils brisèrent ses autels et ses images, et tuèrent devant les autels Matthan, sacrificateur de Baal.
౧౭అప్పుడు ప్రజలంతా బయలు దేవుడి గుడికి వెళ్లి దాన్ని పడగొట్టారు. బయలు బలిపీఠాలను విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి, బయలు యాజకుడు మత్తానును బలిపీఠం ఎదుట చంపేశారు.
18 Et Jehoïada mit les charges de la maison de l’Éternel entre les mains des sacrificateurs lévites, que David avait établis par classes sur la maison de l’Éternel pour offrir les holocaustes à l’Éternel, comme il est écrit dans la loi de Moïse, avec joie et avec des cantiques, selon les directions de David.
౧౮యెహోవా మందిరంలో దావీదు నియమించినట్టుగానే పనిచేసే వారిని బలులు అర్పించే వారిని లేవీయులైన యాజకుల పర్యవేక్షణలో యెహోయాదా నియమించాడు. వీరు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నట్టే దావీదు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సంతోషంతో సంగీతాలతో సేవ జరిగించారు.
19 Et il plaça les portiers aux portes de la maison de l’Éternel, afin qu’il n’y entre aucune personne impure en quoi que ce soit.
౧౯యెహోవా మందిరంలో ఏ విధంగానైనా మైలబడిన వారు ప్రవేశించకుండా అతడు గుమ్మాల దగ్గర ద్వారపాలకులను ఉంచాడు.
20 Et il prit les chefs de centaines, et les nobles, et ceux qui avaient autorité sur le peuple, et tout le peuple du pays, et il fit descendre le roi de la maison de l’Éternel, et ils entrèrent dans la maison du roi par la porte supérieure; et ils firent asseoir le roi sur le trône du royaume.
౨౦అతడు శతాధిపతులనూ ప్రధానులనూ ప్రజల అధికారులనూ దేశ ప్రజలందరినీ వెంటబెట్టుకుని యెహోవా మందిరంలో నుంచి రాజును తీసుకుని వచ్చాడు. వారు ఎత్తయిన గుమ్మం ద్వారా రాజభవనానికి వెళ్లి రాజ్యసింహాసనం మీద రాజును కూర్చోబెట్టారు.
21 Et tout le peuple du pays se réjouit, et la ville fut tranquille: et ils avaient mis à mort Athalie par l’épée.
౨౧దేశ ప్రజలంతా ఎంతో ఆనందించారు. పట్టణం నెమ్మదిగా ఉంది. వారు అతల్యాను కత్తితో చంపేశారు.