< Luc 5 >
1 Or, un jour que pressé par la foule qui voulait entendre la parole de Dieu, il se tenait sur le bord du lac de Génésareth,
౧ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు. ప్రజలు గుంపుగూడి ఆయనపైకి తోసుకువస్తూ దేవుని వాక్కు వింటూ ఉన్నారు.
2 il vit deux barques qui stationnaient près du rivage; les pêcheurs étaient descendus pour laver leurs filets.
౨ఆ సరస్సు తీరాన ఉన్న రెండు పడవలను ఆయన చూశాడు. చేపలు పట్టేవారు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు.
3 Il monta donc dans une de ces barques, qui était à Simon, et le pria de s’éloigner un peu de terre; puis, s’étant assis, il enseigna le peuple de dessus la barque.
౩పడవల్లో సీమోను పడవ ఒకటి. యేసు ఆ పడవ ఎక్కి ఒడ్డు నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగాడు. అప్పుడాయన దానిలో కూర్చుని ప్రజలకు బోధించాడు.
4 Lorsqu’il eut cessé de parler, il dit à Simon: « Avance en pleine mer, et vous jetterez vos filets pour pêcher. »
౪ఆయన మాట్లాడడం అయిపోయిన తరువాత సీమోనుతో, “పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి” అన్నాడు.
5 Simon lui répondit: « Maître, toute la nuit nous avons travaillé sans rien prendre; mais, sur votre parole, je jetterai le filet. »
౫సీమోను, “స్వామీ, రాత్రంతా మేము కష్టపడ్డాం గాని ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు.
6 L’ayant jeté, ils prirent une si grande quantité de poissons, que leur filet se rompait.
౬వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడి వారి వలలు పిగిలి పోసాగాయి.
7 Et ils firent signe à leurs compagnons, qui étaient dans l’autre barque, de venir à leur aide. Ils y vinrent, et ils remplirent les deux barques, au point qu’elles enfonçaient.
౭వారు వేరే పడవల్లోని తమ సహచరులను వచ్చి తమకు సహాయం చేయమని వారికి సైగలు చేశారు. వారు వచ్చి రెండు పడవల నిండా చేపలు ఎంతగా నింపారంటే ఆ బరువుకు పడవలు మునిగిపోసాగాయి.
8 Ce que voyant Simon Pierre tomba aux pieds de Jésus en disant: « Éloignez-vous de moi, Seigneur, parce que je suis un pécheur. »
౮సీమోను పేతురు అది చూసి, యేసు మోకాళ్ళ ముందు పడి, “ప్రభూ, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు” అన్నాడు.
9 Car l’effroi l’avait saisi, lui et tous ceux qui l’accompagnaient, à cause de la capture de poissons qu’ils avaient faite;
౯ఎందుకంటే అతడూ అతనితో ఉన్న వారంతా తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు.
10 il en était de même de Jacques et de Jean, fils de Zébédée, les associés de Simon. Et Jésus dit à Simon: « Ne crains point, car désormais ce sont des hommes que tu prendras. »
౧౦వీరిలో సీమోను జతగాళ్ళు జెబెదయి కుమారులు యాకోబు, యోహాను కూడా ఉన్నారు. అందుకు యేసు సీమోనుతో, “భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టే వాడివవుతావు” అన్నాడు.
11 Aussitôt, ramenant leurs barques à terre, ils quittèrent tout et le suivirent.
౧౧వారు పడవలను ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయనను అనుసరించారు.
12 Comme il était dans une ville, voici qu’un homme tout couvert de lèpre, apercevant Jésus, se prosterna la face contre terre, et le pria en disant: « Seigneur, si vous le voulez, vous pouvez me guérir. »
౧౨యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే అతడు సాగిలపడి, “ప్రభూ! నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను వేడుకున్నాడు.
13 Jésus, étendant la main, le toucha et lui dit: « Je le veux, sois guéri »; et à l’instant sa lèpre disparut.
౧౩అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకి, “నాకిష్టమే. బాగు పడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు వ్యాధి పోయింది.
14 Et il lui défendit d’en parler à personne; mais: « Va, dit-il, te montrer au prêtre, et offre pour ta guérison ce qu’a prescrit Moïse, pour l’attester au peuple. »
౧౪“ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. అయితే వెళ్ళి యాజకునికి కనబడు. వారికి సాక్ష్యంగా శుద్ధి కోసం మోషే విధించిన దాన్ని అర్పించు” అని యేసు అతన్ని ఆదేశించాడు.
15 Sa renommée se répandait de plus en plus, et l’on venait par troupes nombreuses pour l’entendre et pour être guéri de ses maladies.
౧౫అయితే ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది. ప్రజలు గుంపులు గుంపులుగా, ఆయన బోధ వినడానికీ తమ రోగాలను బాగుచేసుకోడానికీ వచ్చారు.
16 Pour lui, il se retirait dans les déserts et priait.
౧౬అయితే ఆయన తరచుగా జన సంచారం లేని చోటులకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు.
17 Un jour qu’il enseignait, il y avait là, assis autour de lui, des Pharisiens et des docteurs de la Loi, venus de tous les villages de la Galilée, ainsi que de la Judée et de Jérusalem, et la puissance du Seigneur se manifestait par des guérisons.
౧౭ఒక రోజు ఆయన బోధిస్తున్నపుడు గలిలయ, యూదయ ప్రాంతాల్లోని చాలా ఊళ్ళ నుండీ యెరూషలేము నుండీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్రోపదేశకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది.
18 Et voilà que des gens, portant sur un lit un homme paralysé, cherchaient à le faire entrer et à le mettre devant lui.
౧౮కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకు వచ్చారు. అతణ్ణి లోపలికి తెచ్చి, ఆయన ముందు ఉంచాలని చూశారు గాని
19 Et n’en trouvant pas le moyen à cause de la foule, ils montèrent sur le toit et, à travers les tuiles, descendirent le malade avec sa couchette au milieu de tous, devant Jésus.
౧౯ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, వారు ఇంటికప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు.
20 Voyant leur foi, il dit: « Homme, tes péchés te sont remis. »
౨౦యేసు వారి విశ్వాసం చూసి, “అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
21 Alors les Scribes et les Pharisiens se mirent à raisonner et à dire: « Qui est celui-ci qui profère des blasphèmes? Qui peut remettre les péchés, si ce n’est Dieu seul? »
౨౧శాస్త్రులూ పరిసయ్యులూ, “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?” అనుకున్నారు
22 Jésus, connaissant leurs pensées, prit la parole et leur dit: « Quelles pensées avez-vous en vos cœurs?
౨౨యేసు వారి ఆలోచన గ్రహించి, “మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు?
23 Lequel est le plus facile de dire: Tes péchés te sont remis, ou de dire: Lève-toi et marche?
౨౩ఏది సులభమంటారు? ‘నీ పాపాలు క్షమిస్తున్నాను’ అనడమా, ‘లేచి నడువు’ అనడమా?
24 Or, afin que vous sachiez que le Fils de l’homme a sur la terre le pouvoir de remettre les péchés: Je te le commande, dit-il au paralytique, lève-toi, prends ta couchette et va dans ta maison. »
౨౪అయితే మనుష్యకుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి” అన్నాడు. తరువాత పక్షవాత రోగిని చూసి, “లేచి, నీ పరుపు తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు.
25 À l’instant, celui-ci se leva devant eux, prit le lit sur lequel il était couché, et s’en alla dans sa maison en glorifiant Dieu.
౨౫వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి, తాను పడుకున్న పరుపు ఎత్తుకుని, దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు.
26 Et tous étaient frappés de stupeur; ils glorifiaient Dieu, et, remplis de crainte, ils disaient: « Nous avons vu aujourd’hui des choses merveilleuses. »
౨౬అందరూ విస్మయం చెంది, “ఈ రోజు విచిత్రమైన విషయాలు చూశాం” అని దేవుణ్ణి స్తుతిస్తూ భయంతో నిండిపోయారు.
27 Après cela, Jésus sortit, et ayant vu un publicain nommé Lévi, assis au bureau du péage, il lui dit: « Suis-moi. »
౨౭ఆ తరువాత ఆయన బయటికి వెళ్ళి పన్నులు వసూలు చేసే లేవీ అనే ఒక వ్యక్తిని చూశాడు. అతడు పన్నులు కట్టించుకొనే చోట కూర్చుని ఉన్నాడు. ఆయన అతనితో, “నా వెంట రా” అన్నాడు.
28 Et lui, quittant tout, se leva et le suivit.
౨౮అతడు అంతా విడిచిపెట్టి, లేచి ఆయనను అనుసరించాడు.
29 Lévi lui donna un grand festin dans sa maison; et une foule nombreuse de publicains et d’autres personnes étaient à table avec eux.
౨౯లేవీ తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసే వారూ వేరే వారూ వారితో కూడ భోజనానికి కూర్చున్నారు.
30 Les Pharisiens et leurs Scribes murmuraient et disaient à ses disciples: « Pourquoi mangez-vous et buvez-vous avec les publicains et les pécheurs? »
౩౦పరిసయ్యులూ వారి శాస్త్రులూ, “మీరు పన్నులు వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తిని తాగుతున్నారేంటి?” అని శిష్యుల మీద సణుక్కున్నారు.
31 Jésus leur répondit: « Ce ne sont pas les bien portants qui ont besoin de médecin, mais les malades.
౩౧అందుకు యేసు, “రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కర లేదు.
32 Je ne suis pas venu appeler les justes à la pénitence, mais les pécheurs. »
౩౨పశ్చాత్తాప పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు” అన్నాడు.
33 Alors ils lui dirent: « Pourquoi, tandis que les disciples de Jean et ceux des Pharisiens jeûnent et prient souvent, les vôtres mangent-ils et boivent-ils? »
౩౩వారాయనతో, “యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. పరిసయ్యుల శిష్యులు కూడా అలాగే చేస్తారు. కానీ నీ శిష్యులు తిని తాగుతూ ఉన్నారు” అని అన్నారు.
34 Il leur répondit: « Pouvez-vous faire jeûner les amis de l’Époux, pendant que l’Époux est avec eux?
౩౪అందుకు యేసు, “పెళ్ళి కొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్ళి ఇంట్లో ఉన్న వారితో మీరు ఉపవాసం చేయించగలరా?
35 Viendront des jours où l’Époux leur sera enlevé: ils jeûneront ces jours-là. »
౩౫పెళ్ళి కొడుకును వారి దగ్గర నుండి తీసుకు పోయే రోజులు వస్తాయి. ఆ రోజుల్లో వారు ఉపవాసం చేస్తారు” అని వారితో చెప్పాడు.
36 Il leur proposa encore cette comparaison: « Personne ne met à un vieux vêtement un morceau pris à un vêtement neuf: autrement on déchire le neuf, et le morceau du neuf convient mal au vêtement vieux.
౩౬ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు, “ఎవరూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయరు. ఒక వేళ అలా చేస్తే కొత్త బట్ట చింపవలసి వస్తుంది. కొత్తదానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలవదు.
37 Personne non plus ne met du vin nouveau dans de vieilles outres: autrement, le vin nouveau rompant les outres, il se répandra, et les outres seront perdues.
౩౭ఎవడూ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయడు. పోస్తే కొత్త ద్రాక్షారసం వలన ఆ తిత్తులు చినిగిపోతాయి. రసం కారిపోతుంది. తిత్తులు పాడవుతాయి.
38 Mais il faut mettre le vin nouveau dans des outres neuves, et tous les deux se conservent.
౩౮అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోయాలి.
39 Et personne après avoir bu du vieux vin, ne veut aussitôt du nouveau; car on dit: Le vieux vin est meilleur. »
౩౯పాత ద్రాక్షారసం తాగిన తరువాత కొత్త దాన్ని ఎవరూ ఆశించరు. ఎందుకంటే ‘పాతదే బాగుంది,’ అంటారు.”