< Jean 7 >
1 Après cela, Jésus parcourut la Galilée, ne voulant pas aller en Judée, parce que les Juifs cherchaient à le faire mourir.
౧ఆ తరువాత యేసు గలిలయకు వెళ్ళి అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యూదయలో యూదులు ఆయనను చంపాలని వెతుకుతూ ఉండటంతో అక్కడ సంచరించడానికి ఆయన ఇష్టపడలేదు.
2 Or, la fête des Juifs, celle des Tabernacles, était proche.
౨ఇంతలో యూదుల పర్ణశాలల పండగ సమీపించింది.
3 Ses frères lui dirent donc: « Pars d’ici, et va en Judée, afin que tes disciples aussi voient les œuvres que tu fais;
౩అప్పుడు ఆయన తమ్ముళ్ళు ఆయనతో, “నువ్వు చేసే కార్యాలు నీ శిష్యులు చూడాలి కదా. అందుకే ఈ స్థలం వదిలి యూదయకు వెళ్ళు.
4 car personne ne fait une chose en secret, lorsqu’il désire qu’elle paraisse. Si tu fais ces choses, montres-toi au monde. »
౪అందరూ మెచ్చుకోవాలని చూసేవాడు తన పనులు రహస్యంగా చేయడు. నువ్వు నిజంగా ఈ కార్యాలు చేస్తున్నట్టయితే లోకమంతటికీ తెలిసేలా చెయ్యి. నిన్ను నువ్వే చూపించుకో” అన్నారు.
5 Car ses frères mêmes ne croyaient pas en lui.
౫ఆయన తమ్ముళ్ళు కూడా ఆయనలో విశ్వాసం ఉంచలేదు.
6 Jésus leur dit: « Mon temps n’est pas encore venu; mais votre temps à vous est toujours prêt.
౬అప్పుడు యేసు, “నా సమయం ఇంకా రాలేదు. మీ సమయం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.
7 Le monde ne saurait vous haïr; moi, il me hait, parce que je rends de lui ce témoignage, que ses œuvres sont mauvaises.
౭లోకం మిమ్మల్ని ద్వేషించదు. కానీ దాని పనులన్నీ చెడ్డవని నేను సాక్ష్యం చెబుతున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తూ ఉంది.
8 Montez, vous, à cette fête; pour moi, je n’y vais pas, parce que mon temps n’est pas encore venu. »
౮మీరు పండక్కి వెళ్ళండి. నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు. కాబట్టి నేను ఈ పండక్కి ఇప్పుడే వెళ్ళను” అని వారితో చెప్పాడు.
9 Après avoir dit cela, il resta en Galilée.
౯వారికి ఇలా చెప్పి ఆయన గలిలయలో ఉండిపోయాడు.
10 Mais lorsque ses frères furent partis, lui-même monta aussi à la fête, non publiquement, mais en secret.
౧౦కానీ తన తమ్ముళ్ళు పండక్కి వెళ్ళిన తరువాత ఆయన బహిరంగంగా కాకుండా రహస్యంగా వెళ్ళాడు.
11 Les Juifs donc le cherchaient durant la fête, et disaient: « Où est-il? »
౧౧ఆ ఉత్సవంలో యూదులు ‘ఆయన ఎక్కడ ఉన్నాడు’ అంటూ ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు.
12 Et il y avait dans la foule une grande rumeur à son sujet. Les uns disaient: « C’est un homme de bien. — Non, disaient les autres, il trompe le peuple. »
౧౨ప్రజల మధ్య ఆయనను గురించి పెద్ద వాదం ప్రారంభమైంది. కొందరేమో, “ఆయన మంచివాడు” అన్నారు. మరికొందరు, “కాదు. ఆయన మోసగాడు” అన్నారు.
13 Cependant personne ne s’exprimait librement sur son compte, par crainte des Juifs.
౧౩అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరూ బయటకు మాట్లాడలేదు.
14 On était déjà au milieu de la fête, lorsque Jésus monta au temple, et il se mit à enseigner.
౧౪పండగ ఉత్సవాల్లో సగం రోజులు గడిచాక యేసు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉపదేశించడం ప్రారంభించాడు.
15 Les Juifs étonnés disaient: « Comment connaît-il les Écritures, lui qui n’a pas fréquenté les écoles? »
౧౫ఆయన ఉపదేశానికి యూదులు ఆశ్చర్యపడి, “చదువూ సంధ్యా లేని వాడికి ఇంత పాండిత్యం ఎలా కలిగింది” అని చెప్పుకున్నారు.
16 Jésus leur répondit: « Ma doctrine n’est pas de moi, mais de celui qui m’a envoyé.
౧౬దానికి యేసు, “నేను చేసే ఉపదేశం నాది కాదు. ఇది నన్ను పంపిన వాడిదే.
17 Si quelqu’un veut faire la volonté de Dieu, il saura si ma doctrine est de Dieu, ou si je parle de moi-même.
౧౭దేవుని ఇష్టప్రకారం చేయాలని నిర్ణయం తీసుకున్నవాడు నేను చేసే ఉపదేశం దేవుని వలన కలిగిందో లేక నా స్వంత ఉపదేశమో తెలుసుకుంటాడు.
18 Celui qui parle de soi-même, cherche sa propre gloire; mais celui qui cherche la gloire de celui qui l’a envoyé, est véridique, et il n’y a pas en lui d’imposture.
౧౮తనంతట తానే బోధించేవాడు సొంత గౌరవం కోసం పాకులాడతాడు. తనను పంపిన వాని గౌరవం కోసం తాపత్రయ పడేవాడు సత్యవంతుడు. ఆయనలో ఎలాంటి దుర్నీతీ ఉండదు.
19 Est-ce que Moïse ne vous a pas donné la Loi? Et nul de vous n’accomplit la loi.
౧౯మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా! కానీ మీలో ఎవరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించరు. మీరు నన్ను చంపాలని ఎందుకు చూస్తున్నారు?” అన్నాడు.
20 Pourquoi cherchez-vous à me faire mourir? » La foule répondit: « Tu es possédé du démon; qui est-ce qui cherche à te faire mourir? »
౨౦అందుకు ఆ ప్రజలు, “నీకు దయ్యం పట్టింది. నిన్ను చంపాలని ఎవరు కోరుకుంటారు?” అన్నారు.
21 Jésus leur dit: « J’ai fait une seule œuvre, et vous voilà tous hors de vous-mêmes?
౨౧యేసు వారితో, “నేనొక కార్యం చేశాను. దానికి మీరంతా ఆశ్చర్యపడుతున్నారు.
22 Moïse vous a donné la circoncision (non qu’elle vienne de Moïse, mais des Patriarches), et vous la pratiquez le jour du sabbat.
౨౨మోషే మీకు సున్నతి అనే ఆచారాన్ని నియమించాడు. ఈ ఆచారం మోషే వల్ల కలిగింది కాదు. ఇది పూర్వీకుల వల్ల కలిగింది. అయినా విశ్రాంతి దినాన మీరు సున్నతి కార్యక్రమం చేస్తున్నారు.
23 Que si, pour ne pas violer la loi de Moïse, on circoncit le jour du sabbat, comment vous indignez-vous contre moi, parce que, le jour du sabbat, j’ai guéri un homme dans tout son corps?
౨౩విశ్రాంతి దినాన సున్నతి పొందినా మోషే ధర్మ శాస్త్రాన్ని అతిక్రమించినట్టు కాదు గదా! అలాంటప్పుడు నేను విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేస్తే నా మీద ఎందుకు కోపం చూపుతున్నారు?
24 Ne jugez pas sur l’apparence, mais jugez selon la justice. »
౨౪బయటకు కనిపించే దాన్ని బట్టి కాక న్యాయసమ్మతంగా నిర్ణయం చేయండి” అన్నాడు.
25 Alors quelques habitants de Jérusalem dirent: « N’est-ce pas là celui qu’ils cherchent à faire mourir?
౨౫యెరూషలేము వారిలో కొందరు, “వారు చంపాలని వెదకుతున్నవాడు ఈయన కాదా?
26 Et le voilà qui parle publiquement sans qu’on lui dise rien. Est-ce que vraiment les chefs du peuple auraient reconnu qu’il est le Christ?
౨౬చూడండి, ఈయన బహిరంగంగా మాట్లాడుతున్నా ఈయనను ఏమీ అనరు. ఈయనే క్రీస్తని అధికారులకి తెలిసి పోయిందా ఏమిటి?
27 Celui-ci, néanmoins, nous savons d’où il est; mais quand le Christ viendra, personne ne saura d’où il est. »
౨౭అయినా ఈయన ఎక్కడి వాడో మనకు తెలుసు. క్రీస్తు వచ్చినప్పుడైతే ఆయన ఎక్కడి వాడో ఎవరికీ తెలియదు” అని చెప్పుకున్నారు.
28 Jésus, enseignant dans le temple, dit donc à haute voix: « Vous me connaissez et vous savez d’où je suis!... et pourtant ce n’est pas de moi-même que je suis venu: mais celui qui m’a envoyé est vrai: vous ne le connaissez pas;
౨౮కాబట్టి యేసు దేవాలయంలో ఉపదేశిస్తూ, “మీకు నేను తెలుసు. నేను ఎక్కడ నుండి వచ్చానో కూడా మీకు తెలుసు. నేను నా స్వంతంగా ఏమీ రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన మీకు తెలియదు.
29 moi, je le connais, parce que je suis de lui, et c’est lui qui m’a envoyé. »
౨౯నేను ఆయన దగ్గర నుండి వచ్చాను. ఆయనే నన్ను పంపాడు కాబట్టి నాకు ఆయన తెలుసు” అని గొంతెత్తి చెప్పాడు.
30 Ils cherchèrent donc à le saisir; et personne ne mit la main sur lui, parce que son heure n’était pas encore venue.
౩౦దానికి వారు ఆయనను పట్టుకోడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన సమయం ఇంకా రాలేదు. కాబట్టి ఎవరూ ఆయనను పట్టుకోలేకపోయారు.
31 Mais beaucoup, parmi le peuple, crurent en lui, et ils disaient: « Quand le Christ viendra, fera-t-il plus de signes que n’en a fait celui-ci? »
౩౧ప్రజల్లో అనేక మంది ఆయనలో విశ్వాసముంచారు. “క్రీస్తు వచ్చినప్పుడు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడా ఏమిటి” అని వారు చెప్పుకున్నారు.
32 Les Pharisiens entendirent la foule murmurant ces choses au sujet de Jésus; alors les Princes des prêtres et les Pharisiens envoyèrent des satellites pour l’arrêter.
౩౨ప్రజలు ఆయనను గురించి ఇలా మాట్లాడుకోవడం పరిసయ్యుల దృష్టికి వెళ్ళింది. అప్పుడు ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ ఆయనను పట్టుకోడానికి సైనికులను పంపించారు.
33 Jésus dit: « Je suis encore avec vous un peu de temps, puis je m’en vais à celui qui m’a envoyé.
౩౩యేసు మాట్లాడుతూ, “నేను ఇంకా కొంత కాలం మాత్రమే మీతో ఉంటాను. ఆ తరువాత నన్ను పంపినవాడి దగ్గరికి వెళ్ళిపోతాను.
34 Vous me chercherez, et vous ne me trouverez pas, et où je suis vous ne pouvez venir. »
౩౪అప్పుడు మీరు నన్ను వెతుకుతారు. కానీ నేను మీకు కనిపించను. నేను ఉండే చోటికి మీరు రాలేరు” అన్నాడు.
35 Sur quoi les Juifs se dirent entre eux: « Où donc ira-t-il, que nous ne le trouverons pas? Ira-t-il vers ceux qui sont dispersés parmi les Gentils, et ira-t-il les instruire?
౩౫దానికి యూదులు, “మనకు కనిపించకుండా ఈయన ఎక్కడికి వెళ్తాడు? గ్రీసు దేశం వెళ్ళి అక్కడ చెదరి ఉన్న యూదులకు, గ్రీకు వారికి ఉపదేశం చేస్తాడా?
36 Que signifie cette parole qu’il a dite: Vous me chercherez et vous ne me trouverez pas, et où je suis, vous ne pouvez venir? »
౩౬‘నన్ను వెతుకుతారు. కానీ నేను మీకు కనిపించను. నేను ఉండే చోటికి మీరు రాలేరు’ అన్న మాటలకి అర్థం ఏమిటో” అంటూ తమలో తాము చెప్పుకుంటూ ఉన్నారు.
37 Le dernier jour de la fête, qui en est le jour le plus solennel, Jésus debout, dit à haute voix: « Si quelqu’un a soif, qu’il vienne à moi, et qu’il boive.
౩౭ఆ పండగలో మహాదినమైన చివరి దినాన యేసు నిలబడి, “ఎవరికైనా దాహం వేస్తే నా దగ్గరికి వచ్చి దాహం తీర్చుకోవాలి.
38 Celui qui croit en moi, de son sein, comme dit l’Ecriture, couleront des fleuves d’eau vive. »
౩౮లేఖనాలు చెబుతున్నాయి, నాపై విశ్వాసముంచే వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి” అని బిగ్గరగా చెప్పాడు.
39 Il disait cela de l’Esprit que devaient recevoir ceux qui croient en lui; car l’Esprit n’était pas encore donné, parce que Jésus n’avait pas encore été glorifié.
౩౯తనపై నమ్మకం ఉంచేవారు పొందబోయే దేవుని ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. యేసు అప్పటికి తన మహిమా స్థితి పొందలేదు కనుక దేవుని ఆత్మ దిగి రావడం జరగలేదు.
40 Parmi la foule, quelques-uns, qui avaient entendu ces paroles, disaient: « C’est vraiment le prophète. »
౪౦ప్రజల్లో కొందరు ఆ మాట విని, “ఈయన నిజంగా ప్రవక్తే” అన్నారు.
41 D’autres: « C’est le Christ. — Mais, disaient les autres, est-ce de la Galilée que doit venir le Christ?
౪౧మరికొందరు, “ఈయన క్రీస్తే” అన్నారు. దానికి జవాబుగా ఇంకా కొందరు, “ఏమిటీ, క్రీస్తు గలిలయ నుండి వస్తాడా?
42 L’Écriture ne dit-elle pas que c’est de la race de David, et du bourg de Bethléem, où était David, que le Christ doit venir? »
౪౨క్రీస్తు దావీదు వంశంలో పుడతాడనీ, దావీదు ఊరు బేత్లెహేము అనే గ్రామంలో నుండి వస్తాడనీ లేఖనాల్లో రాసి లేదా?” అన్నారు.
43 C’est ainsi que le peuple était partagé à son sujet.
౪౩ఈ విధంగా ప్రజల్లో ఆయనను గురించి భేదాభిప్రాయం కలిగింది.
44 Quelques-uns voulaient l’arrêter; mais personne ne mit la main sur lui.
౪౪వారిలో కొందరు ఆయనను పట్టుకోవాలని అనుకున్నారు కానీ ఎవరూ ఆయనను పట్టుకోలేదు.
45 Les satellites étant donc revenus vers les Pontifes et les Pharisiens, ceux-ci leur dirent: « Pourquoi ne l’avez-vous pas amené? »
౪౫పరిసయ్యులు పంపిన సైనికులు తిరిగి వచ్చారు. ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ, “మీరు ఆయనను ఎందుకు తీసుకురాలేదు?” అని అడిగారు.
46 Les satellites répondirent: « Jamais homme n’a parlé comme cet homme. »
౪౬దానికి ఆ సైనికులు, “ఆ వ్యక్తి మాట్లాడినట్టు ఇంతకు ముందు ఎవరూ మాట్లాడలేదు” అని జవాబిచ్చారు.
47 Les Pharisiens leur répliquèrent: « Vous aussi, vous êtes-vous laissés séduire?
౪౭దానికి పరిసయ్యులు, “మీరు కూడా మోసపోయారా?
48 Y a-t-il quelqu’un parmi les Princes du peuple qui ait cru en lui? Y en a-t-il parmi les Pharisiens?
౪౮అధికారుల్లో గానీ పరిసయ్యుల్లో గానీ ఎవరైనా ఆయనను నమ్మారా?
49 Mais cette populace qui ne connaît pas la Loi, ce sont des maudits! »
౪౯ధర్మశాస్త్రం తెలియని ఈ ప్రజల పైన శాపం ఉంది” అని సైనికులతో అన్నారు.
50 Nicodème, l’un d’eux, celui qui était venu de nuit à Jésus, leur dit:
౫౦అంతకు ముందు యేసు దగ్గరికి వచ్చిన నికోదేము అనే పరిసయ్యుడు,
51 « Notre loi condamne-t-elle un homme sans qu’on l’ait d’abord entendu, et sans qu’on sache ce qu’il a fait? »
౫౧“ఒక వ్యక్తి చెప్పే మాట వినకుండా అతడేం చేశాడో తెలుసుకోకుండా మన ధర్మశాస్త్రం అతడికి తీర్పు తీరుస్తుందా?” అన్నాడు.
52 Ils lui répondirent: « Toi aussi, es-tu Galiléen? Examine avec soin les Écritures, et tu verras qu’il ne sort pas de prophète de la Galilée. »
౫౨దానికి వారు, “నువ్వు కూడా గలిలయుడవేనా? ఆలోచించు, గలిలయలో ఎలాంటి ప్రవక్తా పుట్టడు” అన్నారు.
53 Et ils s’en retournèrent chacun dans sa maison.
౫౩ఇక ఎవరి ఇంటికి వారు వెళ్ళారు.