< Apocalypse 6 >
1 Je vis que l'agneau ouvrait l'un des sept sceaux, et j'entendis l'un des quatre êtres vivants qui disait, comme d'une voix de tonnerre: « Viens et vois! »
౧ఆ గొర్రెపిల్ల ఆ ఏడింటిలో మొదటి సీలు తెరవడం చూశాను. అప్పుడు ఆ నాలుగు ప్రాణుల్లో ఒకటి గర్జిస్తున్నట్టుగా, “ఇలా రా” అనడం విన్నాను.
2 Alors apparut un cheval blanc, et celui qui le montait tenait un arc. Une couronne lui fut donnée, et il sortit en vainqueur, et pour vaincre.
౨నేను అటు చూస్తుంటే తెల్లని గుర్రం ఒకటి కనిపించింది. దాని మీద కూర్చున్న రౌతు చేతిలో ఒక విల్లు ఉంది. అతనికి ఒక కిరీటం ఇచ్చారు. అతడు జయిస్తూ ఇంకా జయించడానికి బయలుదేరాడు.
3 Quand il ouvrit le second sceau, j'entendis le second être vivant qui disait: « Viens! »
౩గొర్రెపిల్ల రెండవ సీలు తెరచినప్పుడు రెండవ ప్రాణి, “ఇలా రా” అనడం విన్నాను.
4 Un autre sortit, un cheval roux. A celui qui le montait fut donné le pouvoir d'enlever la paix de la terre, et de faire en sorte que les hommes s'entretuent. Une grande épée lui fut donnée.
౪అప్పుడు ఎర్రగా ఉన్న మరో గుర్రం బయల్దేరింది. దాని పైన కూర్చున్న రౌతుకు పెద్ద కత్తి ఇచ్చారు. మనుషులు ఒకరినొకరు హతం చేసుకునేలా భూమి పైన శాంతిని తీసివేయడానికి అతనికి అనుమతి ఉంది.
5 Quand il ouvrit le troisième sceau, j'entendis le troisième être vivant qui disait: « Viens et vois! » Et voici, il y avait un cheval noir, et celui qui le montait tenait une balance dans sa main.
౫ఆ తరువాత గొర్రెపిల్ల మూడవ సీలు తెరిచాడు. అప్పుడు, “ఇలా రా” అని మూడవ ప్రాణి పిలవడం విన్నాను. నేను అప్పుడు ఒక నల్లని గుర్రం చూశాను. దానిమీద కూర్చున్న వ్యక్తి చేతిలో ఒక త్రాసు పట్టుకుని ఉన్నాడు.
6 J'entendis une voix au milieu des quatre êtres vivants qui disait: « Un chœnix de blé pour un denier, et trois chœnix d'orge pour un denier! N'abîmez pas l'huile et le vin! »
౬నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, “రోజు కూలికి ఒక కిలో గోదుమలూ, రోజు కూలికి మూడు కిలోల బార్లీ గింజలు. ఇక నూనెనీ, ద్రాక్షారసాన్నీ పాడు చేయవద్దు” అని పలకడం విన్నాను.
7 Quand il ouvrit le quatrième sceau, j'entendis le quatrième être vivant qui disait: « Viens et vois! »
౭గొర్రెపిల్ల నాలుగవ సీలు తెరచినప్పుడు, “ఇలా రా” అని నాలుగవ ప్రాణి చెప్పడం విన్నాను.
8 Et voici, il y avait un cheval pâle, et le nom de celui qui le montait était la mort. L'Hadès le suivait. Il lui fut donné autorité sur le quart de la terre, pour tuer par l'épée, par la famine, par la mort, et par les bêtes sauvages de la terre. (Hadēs )
౮అప్పుడు బూడిద రంగులో పాలిపోయినట్టు ఉన్న ఒక గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్న వాడి పేరు మరణం. పాతాళం వాడి వెనకే వస్తూ ఉంది. కత్తితో, కరువుతో, వ్యాధులతో, క్రూరమృగాలతో చంపడానికి భూమి మీద నాలుగవ భాగంపై అతనికి అధికారం ఇవ్వడం జరిగింది. (Hadēs )
9 Quand il ouvrit le cinquième sceau, je vis sous l'autel les âmes de ceux qui avaient été tués à cause de la Parole de Dieu et du témoignage de l'Agneau qu'ils avaient.
౯ఆయన అయిదవ సీలు తెరచినప్పుడు దేవుని వాక్కు కోసమూ, తమ సాక్ష్యం కారణంగానూ హతమైన వారి ఆత్మలను ఒక బలిపీఠం కింద చూశాను.
10 Ils criaient d'une voix forte, en disant: « Jusques à quand, Maître, le saint et le vrai, jugeras-tu et vengeras-tu notre sang sur les habitants de la terre? »
౧౦వారు బిగ్గరగా ఇలా అరుస్తున్నారు, “సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యవంతుడా, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్నవారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?”
11 On donna à chacun d'eux une longue robe blanche. On leur dit qu'ils devaient se reposer encore quelque temps, jusqu'à ce que leurs compagnons de service et leurs frères, qui seraient aussi tués comme eux, aient achevé leur course.
౧౧అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ తెల్లని దుస్తులు ఇచ్చారు. “మీలాగే హతం కావాల్సిన మీ తోటి సేవకుల, సోదర సోదరీల లెక్క మొత్తం పూర్తి అయేంతవరకూ ఇంకా కొంత సమయం వేచి ఉండాలి” అని వారికి చెప్పడం జరిగింది.
12 Je vis, quand il ouvrit le sixième sceau, qu'il y eut un grand tremblement de terre. Le soleil devint noir comme un sac de crin, et la lune entière devint comme du sang.
౧౨ఆయన ఆరవ సీలు తెరిచినప్పుడు నేను చూస్తూ ఉండగా పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు గొంగళిలాగా నల్లగా మారిపోయాడు. చంద్రబింబమంతా రక్తంలా ఎర్రగా అయింది.
13 Les étoiles du ciel tombèrent sur la terre, comme un figuier qui laisse tomber ses figues non mûres quand il est secoué par un grand vent.
౧౩పెనుగాలి వీచినప్పుడు అంజూరు చెట్టు నుండి పచ్చి కాయలు రాలినట్టుగా ఆకాశంలోని నక్షత్రాలు భూమిపై రాలాయి.
14 Le ciel fut enlevé comme un rouleau qu'on enroule. Toute montagne et toute île furent déplacées de leur place.
౧౪ఆకాశమంతా చుట్టిన కాగితంలా అదృశ్యమై పోయింది. పర్వతాలూ, ద్వీపాలూ అన్నీ వాటి వాటి స్థానాల నుండి కదిలిపోయాయి.
15 Les rois de la terre, les princes, les chefs militaires, les riches, les forts, tous les esclaves et les hommes libres, se cachèrent dans les cavernes et dans les rochers des montagnes.
౧౫అప్పుడు భూమి మీద ఉన్న రాజులూ, ప్రముఖులూ, సేనాధిపతులూ, సంపన్నులూ, శక్తిమంతులూ, ఇంకా బానిసలూ, స్వేచ్ఛాజీవులూ అంతా పర్వతాల రాళ్ళ సందుల్లోనూ, గుహల్లోనూ దాక్కున్నారు.
16 Et ils disaient aux montagnes et aux rochers: « Tombez sur nous, et cachez-nous devant la face de celui qui est assis sur le trône, et devant la colère de l'agneau,
౧౬వారు, “మీరు మా మీద పడండి! సింహాసనంపై కూర్చున్న ఆయన ముఖకాంతి నుండీ గొర్రెపిల్ల తీవ్ర ఆగ్రహం నుండీ మమ్మల్ని దాచిపెట్టండి.
17 car le grand jour de sa colère est venu, et qui peut subsister? ».
౧౭వారి మహా ఉగ్రత దినం వచ్చేసింది. ఎవరు నిలబడగలరు?” అంటూ పర్వతాలనూ, రాళ్ళనూ బతిమాలుకున్నారు.