< Michée 4 >
1 Mais dans les derniers jours, il arrivera que la montagne du temple de Yahvé soit établie sur le sommet des montagnes, et il sera élevé au-dessus des collines; et les gens y afflueront.
౧తరువాత రోజుల్లో యెహోవా మందిర పర్వతం పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది. కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు.
2 Beaucoup de nations iront et diront, « Venez! Montons sur la montagne de Yahvé, et à la maison du Dieu de Jacob; et il nous enseignera ses voies, et nous marcherons dans ses sentiers. » Car la loi sortira de Sion, et la parole de Yahvé depuis Jérusalem;
౨అనేక రాజ్యాలవారు వచ్చి ఇలా అంటారు, “యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతానికి మనం వెళ్దాం, పదండి. ఆయన తన విధానాలను మనకు నేర్పిస్తాడు. మనం ఆయన దారుల్లో నడుచుకుందాం.” సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు వెలువడతాయి.
3 et il jugera entre de nombreux peuples, et décidera au loin des nations fortes. Ils transformeront leurs épées en socs de charrue, et leurs lances en crochets d'émondage. Une nation ne lèvera pas l'épée contre une autre nation, ils n'apprendront plus la guerre non plus.
౩ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు. దూరంగా ఉండే విస్తారమైన రాజ్యాల వివాదాలను పరిష్కరిస్తాడు. వారు తమ కత్తులను నాగటి నక్కులుగా తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొడతారు. రాజ్యం మీదికి రాజ్యం కత్తి ఎత్తకుండా ఉంటారు. యుద్ధ విద్య నేర్చుకోవడం మానివేస్తారు.
4 Mais chacun s'assiéra sous sa vigne et sous son figuier. Personne ne leur fera peur, car la bouche de l'Éternel des armées a parlé.
౪దానికి బదులు, ప్రతివాడూ ఎవరి భయమూ లేకుండా తన ద్రాక్షచెట్టు కింద తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు. ఇది సేనల అధిపతి యెహోవా నోట వెలువడ్డ మాట.
5 En effet, toutes les nations peuvent marcher au nom de leurs dieux, mais nous marcherons au nom de Yahvé notre Dieu pour toujours et à jamais.
౫ఇతర ప్రజలంతా తమ దేవుళ్ళ పేరుతో నడుచుకుంటారు. మనమైతే మన యెహోవా దేవుని పేరును బట్టి ఎప్పటికీ నడుచుకుంటాము.
6 « En ce jour-là, » dit Yahvé, « Je vais assembler ce qui est boiteux, et je rassemblerai ce qui a été chassé, et ce que j'ai affligé;
౬యెహోవా ఇలా చెబుతున్నాడు, ఆ రోజు నేను కుంటి వారిని పోగుచేస్తాను. అణగారిన వారిని, నేను కష్టపెట్టినవారిని దగ్గరికి చేరుస్తాను.
7 et je ferai de ce qui était boiteux un reste, et celle qui a été rejetée au loin, une nation forte: et Yahvé régnera sur eux sur le mont Sion dès lors, et pour toujours. »
౭కుంటివారిని శేషంగా దూరంగా పంపేసిన వారిని బలమైన ప్రజగా చేస్తాను. యెహోవానైన నేను, సీయోను కొండ మీద ఇప్పటినుంచి ఎప్పటికీ వారిని పాలిస్తాను.
8 Toi, tour du troupeau, colline de la fille de Sion, à vous, il viendra. Oui, l'ancienne domination viendra, le royaume de la fille de Jérusalem.
౮మందల గోపురమా, సీయోను కుమార్తెకు కొండగా ఉన్న నీకు పూర్వపు అధికారం వస్తుంది. యెరూషలేము కుమార్తెమీద నీకు ప్రభుత్వం వస్తుంది.
9 Maintenant, pourquoi criez-vous à haute voix? N'y a-t-il pas de roi en vous? Votre conseiller a-t-il péri, que des douleurs s'emparent de vous comme d'une femme en travail?
౯మీరెందుకు కేకలు వేస్తున్నారు? మీకు రాజు లేడా? మీ సలహాదారులు నాశనమయ్యారా? అందుకే ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా మీరు బాధపడుతున్నారా?
10 Sois dans la douleur, et travaille pour accoucher, fille de Sion, comme une femme en travail; car maintenant vous allez sortir de la ville, et il habitera dans les champs, et viendra jusqu'à Babylone. Là, vous serez secouru. Là, Yahvé te rachètera de la main de tes ennemis.
౧౦సీయోను కూతురా, ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా నొప్పులు పడుతూ కను. ఎందుకంటే మీరు పొలంలో బతికేలా పట్టణం వదిలిపెట్టండి. బబులోను వెళ్తారు. అక్కడ మీకు విడుదల కలుగుతుంది. అక్కడే యెహోవా మీ శత్రువుల చేతిలోనుంచి మిమ్మల్ని విడిపిస్తాడు.
11 Maintenant, beaucoup de nations se sont rassemblées contre toi, et disent, « Qu'elle soit souillée, et que notre œil se réjouisse de Sion. »
౧౧అనేక రాజ్యాల ప్రజలు మీకు విరోధంగా వచ్చి, “సీయోను అపవిత్రం అవుతుంది గాక! దాని నాశనం మేము కళ్ళారా చూడాలి.” అంటారు.
12 Mais ils ne connaissent pas les pensées de Yahvé, ils ne comprennent pas non plus son conseil; car il les a rassemblés comme les gerbes à l'aire de battage.
౧౨ప్రవక్త ఇలా అంటాడు, యెహోవా తలంపులు వారికి తెలియవు. ఆయన ఆలోచన అర్థం కాదు. కళ్లంలో పనలు దగ్గర చేర్చినట్టు ఆయన వారిని చేరుస్తాడు.
13 Lève-toi et frappe, fille de Sion, car je ferai de ta corne du fer, et je rendrai tes sabots d'airain. Vous allez mettre en pièces de nombreux peuples. Je consacrerai leur gain à Yahvé, et leurs biens au Seigneur de toute la terre.
౧౩యెహోవా ఇలా అంటున్నాడు, “సీయోను కుమారీ, లేచి కళ్ళం తొక్కు. మీకు ఇనుప కొమ్ములూ కంచు డెక్కలూ చేస్తాను. నీవు అనేక ప్రజల సమూహాలను అణిచేస్తావు. వారి అన్యాయ సంపదను యెహోవానైన నాకు ప్రతిష్టిస్తాను. వారి ఆస్తిపాస్తులను సర్వలోక ప్రభువునైన నాకు ప్రతిష్టిస్తాను.”