< Lamentations 2 >

1 Comment, dans sa colère, l'Éternel a couvert d'un nuage la fille de Sion? Il a fait descendre du ciel à la terre la beauté d'Israël, et ne s'est pas souvenu de son marchepied au jour de sa colère.
ప్రభువు తన కోపంతో సీయోను కుమారిని నల్లటి మేఘంతో పూర్తిగా కప్పేశాడు. ఆయన ఇశ్రాయేలు అందాన్ని ఆకాశం నుంచి భూమి మీదికి పడేశాడు. తాను కోపగించిన దినాన ఆయన తన పాదపీఠాన్ని గుర్తు చేసుకోలేదు.
2 Le Seigneur a englouti toutes les habitations de Jacob. sans pitié. Il a renversé dans sa colère les forteresses de la fille de Juda. Il les a fait descendre jusqu'au sol. Il a profané le royaume et ses princes.
యాకోబు పట్టణాల్లో ఒక్క దాని మీద కూడా కనికరం లేకుండా ప్రభువు అన్నిటినీ మింగివేశాడు. తన ఆగ్రహంతో ఆయన యూదా కుమార్తె కోటలను కూలగొట్టాడు. ఆయన వాటిని నేల కూల్చి సిగ్గు పరిచాడు. దాని రాజ్యాన్నీ, దాని అధిపతులను ఆయన అవమానపరిచాడు.
3 Il a coupé toute la corne d'Israël dans une colère ardente. Il a retiré sa main droite de devant l'ennemi. Il a brûlé Jacob comme un feu ardent, qui dévore tout autour.
తీవ్రమైన కోపంతో ఆయన ఇశ్రాయేలు ప్రజల బలాన్ని అణచివేశాడు. శత్రువుల ముందు ఆయన తన కుడి చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. చుట్టూ ఉన్న వాటన్నిటినీ కాల్చే రగులుతున్న అగ్నిజ్వాలలు కాల్చినట్టు ఆయన యాకోబును కాల్చేశాడు.
4 Il a bandé son arc comme un ennemi. Il s'est tenu avec sa main droite comme un adversaire. Il a tué tout ce qui était agréable à l'œil. Dans la tente de la fille de Sion, il a déversé sa colère comme un feu.
ఒక శత్రువులా ఆయన తన విల్లు ఎక్కుపెట్టాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న ప్రత్యర్ధి బాణం విసరడానికి తన చెయ్యి చాపినట్టు. ఆయన నిలబడి ఉన్నాడు. చూపుకు శ్రేష్ఠమైన ప్రజలందరినీ ఆయన హతం చేశాడు. సీయోను కుమార్తె గుడారంలో తన ఆగ్రహాన్ని అగ్ని వర్షంలా కుమ్మరించాడు.
5 Le Seigneur est devenu comme un ennemi. Il a englouti Israël. Il a englouti tous ses palais. Il a détruit ses forteresses. Il a multiplié les deuils et les lamentations dans la fille de Juda.
ప్రభువు శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగివేశాడు. దాని రాజమందిరాలన్నీ మింగివేశాడు. దానికి పట్టున్న ప్రాంతాలన్నీ నాశనం చేశాడు. యూదా కుమారిలో దుఃఖం, సంతాపం అధికం చేశాడు.
6 Il a violemment enlevé son tabernacle, comme si c'était un jardin. Il a détruit son lieu de rassemblement. Yahvé a fait en sorte que l'assemblée solennelle et le sabbat soient oubliés en Sion. Dans l'indignation de sa colère, il a méprisé le roi et le prêtre.
ఒక తోట మీద దాడి చేసినట్టు ఆయన తన గుడారం మీద దాడి చేశాడు. సమాజ పవిత్ర ప్రాంగణాన్ని నాశనం చేశాడు. ఆరాధన సమావేశం, విశ్రాంతి దినం సీయోనులో మరుపుకు వచ్చేలా యెహోవా చేశాడు. కోపావేశంలో ఆయన రాజూ యాజకుడూ ఇద్దరినీ తోసిపుచ్చాడు.
7 L'Éternel a rejeté son autel. Il a abhorré son sanctuaire. Il a livré les murs de ses palais aux mains de l'ennemi. Ils ont fait du bruit dans la maison de Yahvé, comme au jour d'une assemblée solennelle.
ప్రభువు తన బలిపీఠం తోసిపుచ్చాడు. తన పవిత్ర ప్రాంగణం నిరాకరించాడు. దాని కోట గోడలను శత్రువుల చేతికి అప్పగించాడు. ఏర్పరచిన రోజు సమాజ ప్రాంగణంలో వినిపించే ధ్వనిలా వాళ్ళు యెహోవా మందిరంలో ఉత్సాహ ధ్వని చేశారు.
8 Yahvé a décidé de détruire la muraille de la fille de Sion. Il a étiré la ligne. Il n'a pas retiré sa main de la destruction; Il a fait pleurer les remparts et les murs. Ils se languissent ensemble.
సీయోను కుమారి ప్రాకారాలు పాడు చెయ్యాలని యెహోవా ఉద్దేశపూర్వకంగా నిర్ణయించాడు. చెయ్యి చాపి కొలత గీత గీశాడు. గోడ నాశనం చెయ్యడానికి తన చెయ్యి వెనక్కు తీయలేదు. ఆయన ప్రహరీలు విలపించేలా చేశాడు. ప్రాకారాలు బలహీనం అయ్యేలా చేశాడు.
9 Ses portes se sont enfoncées dans le sol. Il a détruit et brisé ses barreaux. Son roi et ses princes sont parmi les nations où la loi n'existe pas. Oui, ses prophètes ne trouvent aucune vision de Yahvé.
యెరూషలేము పట్టణపు గుమ్మాలు భూమిలోకి కుంగిపోయాయి. దాని అడ్డ గడియలు ఆయన విరిచేశాడు. దాని రాజూ, అధిపతులూ అన్యప్రజల మధ్య ఉన్నారు. అక్కడ మోషే ధర్మశాస్త్రం లేదు. దాని ప్రవక్తలకు యెహోవా దర్శనం దొరకలేదు.
10 Les anciens de la fille de Sion sont assis à terre. Ils gardent le silence. Ils ont jeté de la poussière sur leurs têtes. Ils se sont vêtus de sacs. Les vierges de Jérusalem baissent la tête vers le sol.
౧౦సీయోను కుమారి పెద్దలు మౌనంగా నేల మీద కూర్చుని ఏడుస్తున్నారు. వాళ్ళ తలల మీద దుమ్ము పోసుకున్నారు. వాళ్ళు గోనెపట్ట కట్టుకున్నారు. యెరూషలేము కన్యలు తల నేలకు దించుకుని ఉన్నారు.
11 Mes yeux sont pleins de larmes. Mon cœur est troublé. Ma bile est versée sur la terre, à cause de la destruction de la fille de mon peuple, parce que les jeunes enfants et les nourrissons se pâment dans les rues de la ville.
౧౧నా కన్నీళ్లు ఎండిపోయాయి. నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నా అంతరంగం కలవరంతో ఉంది. నా ప్రజల కుమారి అణిచివేత కారణంగా నా పేగులు నేల మీద ఒలికి పోయాయి. పిల్లలు, పాలు తాగే చంటిబిడ్డలు నిస్సహాయంగా గ్రామ వీధుల్లో నీరసంగా పడి ఉన్నారు.
12 Ils demandent à leurs mères, « Où sont le blé et le vin? » quand ils s'évanouissent comme des blessés dans les rues de la ville, quand leur âme est versée dans le sein de leur mère.
౧౨పట్టణ వీధుల్లో గాయాలతో పడి ఉన్న వారిలాగా మూర్చపోతూ. “ధాన్యం, ద్రాక్షరసం ఏవి?” అంటూ తమ తల్లుల ఒడిలో ప్రాణాలు విడుస్తున్నారు.
13 Que vous dirai-je? Que te ressemblerai-je, fille de Jérusalem? Que dois-je comparer à vous, pour que je puisse te réconforter, vierge fille de Sion? Car ta brèche est aussi grande que la mer. Qui peut vous guérir?
౧౩యెరూషలేము కుమారీ, నీ గురించి నేనేమనాలి? నిన్ను దేనితో పోల్చి ఆదరించాలి? సీయోను కుమారీ, కన్యకా, నీ పతనం సముద్రమంత విస్తారమైనది. నిన్ను స్వస్థపరచగల వాడెవడు?
14 Vos prophètes ont eu pour vous des visions fausses et insensées. Ils n'ont pas découvert votre iniquité, pour inverser votre captivité, mais ont vu pour vous de fausses révélations et des causes de bannissement.
౧౪నీ కోసం నీ ప్రవక్తలు మోసపూరితమైన బుద్ధిహీనపు దర్శనాలు చూశారు. నువ్వు చెర లోకి వెళ్ళకుండా తప్పించడానికి వాళ్ళు నీ పాపాన్ని నీకు వెల్లడి చెయ్యలేదు. వాళ్ళు నీ కోసం మోసపూరితంగా దర్శనాలు గ్రహించారు.
15 Tous les passants te frappent dans les mains. Ils sifflent et remuent la tête contre la fille de Jérusalem, en disant, « Est-ce la ville que les hommes appelaient 'La perfection de la beauté', la joie de toute la terre'? »
౧౫దారిలో వెళ్ళేవాళ్ళందరూ నిన్ను చూసి చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు యెరూషలేము కుమారిని చూసి ఎగతాళి చేస్తూ ఈల వేస్తూ, తల ఊపుతూ. “పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అనీ, సమస్త భూనివాసులకు ఆనందకరమైన నగరం అనీ ప్రజలు ఈ పట్టణం గురించేనా చెప్పారు?” అంటున్నారు.
16 Tous tes ennemis ont ouvert la bouche contre toi. Ils sifflent et grincent des dents. Ils disent: « Nous l'avons engloutie ». C'est certainement le jour que nous attendions. Nous l'avons trouvé. Nous l'avons vu. »
౧౬నీ శత్రువులందరూ నిన్ను చూసి పెద్దగా నోరు తెరిచారు. వాళ్ళు ఎగతాళి చేసి పళ్ళు కొరుకుతూ “దాన్ని మింగివేశాం! కచ్చితంగా ఈ రోజు కోసమేగా మనం కనిపెట్టింది! అది జరిగింది. దాన్ని మనం చూశాం” అంటున్నారు.
17 L'Éternel a accompli ce qu'il avait prévu. Il a accompli sa parole qu'il a commandée dans les temps anciens. Il s'est jeté à terre, et n'a pas eu pitié. Il a fait en sorte que l'ennemi se réjouisse à votre sujet. Il a exalté la corne de tes adversaires.
౧౭తాను అనుకున్న పని యెహోవా ముగించాడు. తాను పూర్వం ప్రకటించిన మాట ఆయన నెరవేర్చాడు. నీ పట్ల కనికరం లేకుండా ఆయన నాశనం చేశాడు. నిన్ను బట్టి నీ శత్రువులు సంతోషించేలా చేశాడు. నీ విరోధుల బలం హెచ్చించాడు.
18 Leur cœur a crié à l'Éternel. O mur de la fille de Sion, laisse les larmes couler comme une rivière jour et nuit. Ne vous donnez aucun répit. Ne laissez pas vos yeux se reposer.
౧౮ప్రజల హృదయం యెహోవాకు కేకలు పెడుతూ. “సీయోను కుమారి ప్రాకారమా, నదీప్రవాహంలా పగలూ రాత్రి నీ కన్నీరు కారనివ్వు. జాప్యం జరగనివ్వకు. నీ కంటి నుంచి వెలువడే కన్నీటిధార ఆగనివ్వకు.
19 Lève-toi, crie dans la nuit, au début des montres! Répands ton cœur comme de l'eau devant la face du Seigneur. Levez vos mains vers lui pour la vie de vos jeunes enfants, qui s'évanouissent de faim au bout de chaque rue.
౧౯రాత్రి పూట నువ్వు లేచి మొర్ర పెట్టు. నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువు సన్నిధిలో నీ హృదయం కుమ్మరించు. ప్రతి వీధి మొదట్లో ఆకలితో సతమతమౌతున్న నీ పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులు ఆయన వైపు ఎత్తు.”
20 « Regarde, Yahvé, et vois à qui tu as fait cela! Les femmes devraient-elles manger leur progéniture, les enfants qu'ils tenaient et faisaient rebondir sur leurs genoux? Le prêtre et le prophète doivent-ils être tués dans le sanctuaire du Seigneur?
౨౦యెహోవా, చూడు. నువ్వు ఎవరి పట్ల ఈ విధంగా చేశావో గమనించు. తమ గర్భఫలాన్ని, తాము ఎత్తుకుని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు తినడం తగునా? యాజకుడూ ప్రవక్తా ప్రభువు పవిత్ర ప్రాంగణంలో హతం కాదగునా?
21 « Le jeune et le vieillard sont couchés par terre dans les rues. Mes vierges et mes jeunes hommes sont tombés par l'épée. Tu les as tués au jour de ta colère. Vous avez massacré, et pas plaint.
౨౧యువకులూ, వృద్ధులూ వీధుల్లో నేల మీద పడి ఉన్నారు. నా కన్యకలూ, నా యోధులూ కత్తి చేత కూలి పోయారు. నీ ఉగ్రత దినాన నువ్వు వాళ్ళను హతం చేశావు. జాలి లేకుండా వాళ్ళందరినీ నువ్వు చంపావు.
22 « Tu as appelé, comme au jour d'une assemblée solennelle, mes terreurs de toutes parts. Il n'y eut personne qui échappa ou resta au jour de la colère de Yahvé. Mon ennemi a consumé ceux dont j'ai pris soin et que j'ai élevés.
౨౨ఆరాధన దినాన ప్రజలు వచ్చినట్టు నాలుగు వైపుల నుంచి నువ్వు నా మీదికి భయం రప్పించావు. యెహోవా ఉగ్రత దినాన ఎవరూ తప్పించుకోలేదు. ఎవరూ బతకలేదు. నేను పెంచి పోషించిన వాళ్ళను నా శత్రువులు అంతం చేశారు.

< Lamentations 2 >