< Jonas 3 >
1 La parole de Yahvé fut adressée à Jonas pour la seconde fois, en ces termes:
౧యెహోవా వాక్కు రెండో సారి యోనాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే
2 « Lève-toi, va à Ninive, la grande ville, et prêche-lui le message que je te donne. »
౨“నువ్వు లేచి, నీనెవె మహాపట్టణానికి వెళ్లి నేను నీకు ఆజ్ఞాపించిన సందేశాన్ని దానికి చాటించు.”
3 Et Jonas se leva, et alla à Ninive, selon la parole de l'Éternel. Or Ninive était une ville extrêmement grande, à trois jours de marche.
౩కాబట్టి యోనా లేచి యెహోవా మాటకు లోబడి నీనెవె పట్టణానికి నడచుకుంటూ వెళ్ళాడు. నీనెవె నగరం చాలా పెద్దది. అది మూడు రోజుల ప్రయాణమంత పెద్దది.
4 Jonas commença à entrer dans la ville à une journée de marche, et il s'écria: « Dans quarante jours, Ninive sera renversée! »
౪యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, యింకా 40 రోజుల్లో నీనెవె పట్టణం నాశనమవుతుందని ప్రకటన చేశాడు.
5 Les habitants de Ninive crurent en Dieu, proclamèrent un jeûne et se couvrirent de sacs, depuis le plus grand jusqu'au plus petit.
౫నీనెవె పట్టణం వాళ్ళు దేవునిలో విశ్వాసం ఉంచి ఉపవాసం ప్రకటించారు. గొప్పవాళ్ళూ, సామాన్యులూ అందరూ గోనె పట్ట కట్టుకున్నారు.
6 La nouvelle parvint au roi de Ninive, qui se leva de son trône, ôta sa robe royale, se couvrit d'un sac et s'assit dans la cendre.
౬ఆ సంగతి త్వరలోనే నీనెవె రాజుకు చేరింది. అతడు తన సింహాసనం దిగి, తన రాజవస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదెలో కూర్చున్నాడు.
7 Il fit une proclamation et la publia dans Ninive par l'ordre du roi et de ses nobles, en disant: « Que ni les hommes ni les bêtes, ni le bétail ni le cheptel, ne goûtent rien; qu'ils ne se nourrissent pas et ne boivent pas d'eau;
౭అతడు ఇలా ప్రకటన చేయించాడు “రాజూ ఆయన మంత్రులూ ఆజ్ఞాపించేదేమంటే, మనుషులు ఏమీ తినకూడదు. పశువులు మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు.”
8 mais qu'ils se couvrent d'un sac, hommes et bêtes, et qu'ils crient puissamment à Dieu. Oui, qu'ils détournent chacun de sa mauvaise voie et de la violence qui est dans ses mains.
౮“మనుషులు, పశువులు గోనెపట్ట కట్టుకుని దేవునికి బిగ్గరగా మొర్రపెట్టాలి. అందరూ తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి తాము చేస్తున్న దౌర్జన్యం మానాలి.
9 Qui sait si Dieu ne reviendra pas et ne s'apaisera pas, s'il ne détournera pas son ardente colère, afin que nous ne périssions pas? ».
౯ఒకవేళ దేవుడు తన మనస్సు మార్చుకుని తన కోపాగ్ని చల్లార్చుకుని మనం నాశనం కాకుండా చేస్తాడేమో ఎవరికి తెలుసు?”
10 Dieu a vu leurs œuvres, et ils se sont détournés de leur mauvaise voie. Dieu a renoncé au désastre qu'il avait dit qu'il leur ferait subir, et il ne l'a pas fait.
౧౦నీనెవె వాళ్ళు తమ చెడు ప్రవర్తన వదిలిపెట్టడం దేవుడు చూసి తన మనస్సు మార్చుకుని వాళ్లకు వేస్తానన్న శిక్ష వెయ్యలేదు.