< Isaïe 48 >
1 « Écoutez ceci, maison de Jacob, vous qui êtes appelés par le nom d'Israël, et sont sortis des eaux de Judée. Vous jurez par le nom de Yahvé, et faire mention du Dieu d'Israël, mais pas dans la vérité, ni dans la droiture-
౧యూదా సంతానమా! యాకోబు వంశమా! ఈ మాట విను. నిన్ను ఇశ్రాయేలు అనే పేరుతో పిలుస్తున్నారు. నువ్వు యెహోవా నామం తోడని ప్రమాణం చేస్తావు. ఇశ్రాయేలు దేవుని పేరు స్మరిస్తావు. అయితే యథార్థంగా నిజాయితీతో అలా చేయవు.
2 car ils se disent citoyens de la ville sainte, et s'en remettre au Dieu d'Israël; Yahvé des Armées est son nom.
౨మేము పరిశుద్ధ పట్టణవాసులం అనే పేరు పెట్టుకుని, వాళ్ళు ఇశ్రాయేలు దేవుని ఆశ్రయిస్తారు. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా.
3 J'ai annoncé les choses anciennes dès les temps anciens. Oui, ils sont sortis de ma bouche, et je les ai révélés. Je les ai fait soudainement, et ils sont arrivés.
౩ఈ విషయాలు ఇలా జరుగుతాయని ఎప్పుడో చెప్పాను. అవి నా నోట్లో నుండే వచ్చాయి. నేనే వాటిని తెలియచేశాను. అకస్మాత్తుగా జరిగేలా వాటిని చేశాను.
4 Car je savais que tu étais obstiné, et ton cou est un tendon de fer, et ton front bronze;
౪నువ్వు మూర్ఖుడవనీ నీ మెడ నరాలు ఇనుములాంటివనీ నీ నొసలు కంచులాంటిదనీ నాకు తెలుసు.
5 C'est pourquoi je vous l'ai annoncé dès le début; avant que cela ne se produise, je vous l'ai montré; de peur que vous ne disiez: « C'est mon idole qui les a faites ». Mon image gravée et mon image fondue leur a commandé.
౫అందుకే ఈ విషయాలు ఎప్పుడో చెప్పాను. అవి జరక్కముందే నేను నీకు చెప్పాను. “నా విగ్రహమే వీటిని చేసింది.” లేకపోతే “నేను చెక్కిన బొమ్మ, లేదా నేను పోతపోసిన బొమ్మ దీన్ని నియమించింది” అని నువ్విక చెప్పలేవు.
6 Vous l'avez entendu. Maintenant, voyez tout ça. Et vous, ne le déclarerez-vous pas? « Je vous ai montré des choses nouvelles depuis ce temps, même des choses cachées, que vous n'avez pas connues.
౬నువ్వు ఈ విషయాలు విన్నావు. ఈ వాస్తవమంతా చూడు. నేను చెప్పింది నిజమేనని మీరు ఒప్పుకోరా? ఇక నుంచి కొత్త సంగతులు, నీకు తెలియని గూఢమైన సంగతులు నేను చెబుతాను.
7 Ils sont créés maintenant, et non pas d'autrefois. Avant aujourd'hui, tu ne les entendais pas, de peur que tu ne dises: « Voici, je les connaissais.
౭అవి చాలా కాలం క్రితం కలిగినవి కావు. “అవి ఇప్పుడే కలిగాయి. అవి నాకు తెలిసినవే” అని నువ్వు చెప్పకుండేలా ఇంతకుముందు నువ్వు వాటిని వినలేదు.
8 Oui, vous n'avez pas entendu. Oui, vous ne saviez pas. Oui, depuis longtemps, ton oreille n'a pas été ouverte, car je savais que tu étais très déloyal, et tu as été appelé transgresseur dès le ventre de ta mère.
౮నువ్వెన్నడూ వాటిని వినలేదు. నీకు తెలియదు. ముందే ఈ విషయాలు నీకు చెప్పలేదు. పుట్టినప్పటినుంచి నువ్వు తిరుగుబోతుగా ఉన్నావనీ పెద్ద మోసగాడిగా ఉన్నావనీ నాకు తెలుసు.
9 Pour l'amour de mon nom, je retarderai ma colère, et pour mon éloge, je le retiens pour vous pour que je ne vous coupe pas la route.
౯నా నామం కోసం నేను నిన్ను నిర్మూలం చేయను. నా కోపం చూపించను. నా కీర్తి కోసం మిమ్మల్ని నాశనం చేయకుండా నీ విషయంలో నన్ను నేను తమాయించుకుంటాను.
10 Voici, je vous ai raffiné, mais pas en argent. Je t'ai choisi dans la fournaise de l'affliction.
౧౦నేను నిన్ను పుటం వేశాను. అయితే వెండిలా కాదు. బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను.
11 Pour mon propre bien, pour mon propre bien, je le ferai; car comment mon nom serait-il profané? Je ne donnerai pas ma gloire à un autre.
౧౧నా కోసం, నా కోసమే ఆలా చేస్తాను. ఎందుకంటే నా పేరు అవమానానికి ఎందుకు గురి కావాలి? నా ఘనత మరెవరికీ ఇవ్వను.
12 « Écoute-moi, ô Jacob! et Israël mon appelé: Je suis lui. Je suis le premier. Je suis aussi le dernier.
౧౨యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను. నేనే ఆయన్ని. నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి.
13 Oui, ma main a posé les fondements de la terre, et ma main droite a déployé les cieux. quand je les appelle, ils se lèvent ensemble.
౧౩నా చెయ్యి భూమికి పునాదివేసింది. నా కుడిచెయ్యి ఆకాశాన్ని పరచింది. నేను వాటిని పిలిస్తే అవన్నీ కలిసి నిలుస్తాయి.
14 « Assemblez-vous, vous tous, et écoutez! Qui parmi eux a déclaré ces choses? Celui que Yahvé aime fera ce qu'il aime à Babylone, et son bras sera contre les Chaldéens.
౧౪మీరంతా ఒక చోటికి వచ్చి నా మాట వినండి. మీలో ఎవరు ఈ విషయాలు తెలియచేశారు? యెహోవా మిత్రుడు బబులోనుకు విరోధంగా తన ఉద్దేశాన్ని నేరవేరుస్తాడు. అతడు యెహోవా ఇష్టాన్ని కల్దీయులకు విరోధంగా జరిగిస్తాడు.
15 C'est moi, moi aussi, qui ai parlé. Oui, je l'ai appelé. Je l'ai amené et il fera prospérer son chemin.
౧౫ఔను. నేనే ఇలా చెప్పాను. నేనే అతణ్ణి పిలిచాను. నేనే అతణ్ణి రప్పించాను. అతడు చక్కగా చేస్తాడు.
16 « Approche-toi de moi et écoute ceci: « Dès le début, je n'ai pas parlé en secret; à partir du moment où c'est arrivé, j'étais là. » Le Seigneur Yahvé m'a envoyé avec son Esprit.
౧౬నా దగ్గరికి రండి. ఈ విషయం వినండి. మొదటినుంచి నేను రహస్యంగా మాట్లాడలేదు. అది జరిగేటప్పుడు నేనక్కడే ఉన్నాను. ఇప్పుడు యెహోవా ప్రభువు తన ఆత్మతో నన్ను పంపాడు.
17 Yahvé, votre Rédempteur, le Saint d'Israël, dit: « Je suis Yahvé votre Dieu, qui vous apprend à faire du profit, qui vous conduit par le chemin que vous devez suivre.
౧౭నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను నీ దేవుణ్ణి. యెహోవాను. నువ్వెలా సాధించగలవో నీకు బోధిస్తాను. నువ్వు వెళ్ళాల్సిన దారిలో నిన్ను నడిపిస్తాను.
18 Oh, si vous aviez écouté mes commandements! Alors ta paix aurait été comme une rivière et ta justice comme les vagues de la mer.
౧౮నువ్వు నా ఆజ్ఞలను పాటిస్తే ఎంత బాగుంటుంది! అప్పుడు నీ శాంతి, సౌభాగ్యం నదిలా పారేవి. నీ విడుదల సముద్రపు అలల్లా ఉండేది.
19 Ta descendance aurait été comme le sable. et les descendants de ton corps comme ses grains. Son nom ne sera pas retranché ni détruit devant moi. »
౧౯నీ సంతానం ఇసుకంత విస్తారంగా నీ గర్భఫలం దాని రేణువుల్లాగా విస్తరించేవారు. వారి పేరు నా దగ్గర నుంచి కొట్టివేయడం జరిగేది కాదు.
20 Quittez Babylone! Fuyez les Chaldéens! Avec une voix chantante, annoncez ceci, le raconter jusqu'au bout du monde; dire: « Yahvé a racheté son serviteur Jacob! »
౨౦బబులోను నుంచి బయటికి రండి! కల్దీయుల దేశంలో నుంచి పారిపొండి! యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించాడు” అనే విషయం ఉత్సాహంగా ప్రకటించండి! అందరికీ తెలిసేలా చేయండి! ప్రపంచమంతా చాటించండి!
21 Ils n'ont pas eu soif quand il les a conduits à travers les déserts. Il a fait jaillir les eaux du rocher pour eux. Il a aussi fendu le rocher et les eaux ont jailli.
౨౧ఎడారుల్లో ఆయన వారిని నడిపించినప్పుడు వారికి దాహం వేయలేదు. వారి కోసం బండలోనుంచి నీళ్లు ఉబికేలా చేశాడు. ఆయన ఆ బండ చీల్చాడు. నీళ్లు పెల్లుబికాయి.
22 « Il n'y a pas de paix », dit Yahvé, « pour les méchants ».
౨౨“దుష్టులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెబుతున్నాడు.