< Isaïe 16 >
1 Envoyez les agneaux pour le chef du pays, de Sélah au désert, à la montagne de la fille de Sion.
౧నిర్జన ప్రదేశం వైపు ఉన్న సెల నుంచి దేశాన్ని పరిపాలన చేసే వాడికి, సీయోను కుమార్తె పర్వతానికి పొట్టేళ్లను పంపండి.
2 Car, comme des oiseaux errants, comme un nid dispersé, ainsi seront les filles de Moab aux gués de l'Arnon.
౨గూటి నుంచి చెదిరి ఇటు అటు ఎగిరే పక్షుల్లా అర్నోను రేవుల దగ్గర మోయాబు కుమార్తెలు కనిపిస్తారు.
3 Donnez des conseils! Rendez la justice! Fais ton ombre comme la nuit au milieu du midi! Cache les proscrits! Ne trahis pas le fugitif!
౩“ఆలోచన చెప్పు. న్యాయం అమలు చెయ్యి. చీకటి కమ్మినట్టు మధ్యాహ్నం పూట నీ నీడ మా మీద ఉండనివ్వు. పలాయనంలో ఉన్నవాళ్ళను దాచి పెట్టు. పారిపోయిన వాళ్ళను పట్టిచ్చి ద్రోహం చెయ్యకు.
4 Laisse mes exilés habiter chez toi! Quant à Moab, sois pour lui un refuge contre la face du destructeur. Car l'extorqueur est réduit à néant. La destruction cesse. Les oppresseurs sont consumés hors du pays.
౪మోయాబు నుంచి పలాయనం అయిన వాళ్ళను నీతో నివాసం ఉండనివ్వు. నాశనం చేసే వాళ్ళు వాళ్ళ మీదకి రాకుండా వాళ్లకు దాక్కునే చోటుగా ఉండు.” ఎందుకంటే బలాత్కారం ఆగిపోతుంది. నాశనం నిలిచిపోతుంది. అణగదొక్కేవాళ్ళు దేశంలో నుండి అదృశ్యం అవుతారు.
5 Un trône sera établi dans la bonté. Un homme s'y assiéra dans la vérité, dans la tente de David, jugeant, recherchant la justice, et prompt à pratiquer la droiture.
౫నిబంధనా నమ్మకత్వంతో సింహాసన స్థాపన జరుగుతుంది. దావీదు గుడారంలోనుంచి ఒకడు అక్కడ నమ్మకంగా కూర్చుంటాడు. అతడు తీర్పు తీరుస్తాడు, న్యాయం వెదకుతాడు, నీతి జరిగిస్తాడు.
6 Nous avons entendu parler de l'orgueil de Moab, de sa grande fierté, de son arrogance, de son orgueil et de sa colère. Ses fanfaronnades ne sont rien.
౬మోయాబు గర్వం గురించి మేము విన్నాం. అతని అహంకారం, అతని ప్రగల్భాలు, అతని క్రోధం గురించి విన్నాం. కానీ అతని ప్రగల్భాలు వట్టివి.
7 C'est pourquoi Moab se lamentera sur Moab. Tout le monde se lamentera. Vous pleurerez sur les gâteaux de Kir Hareseth, frappés de mort.
౭కాబట్టి మోయాబీయులు మోయాబును గూర్చి విలపిస్తారు. అందరూ విలపిస్తారు. మీరు పూర్తిగా పాడైన కీర్ హరెశెతు ద్రాక్షపళ్ళ గుత్తుల కోసం మూలుగుతారు.
8 Car les champs de Hesbon languissent avec la vigne de Sibma. Les seigneurs des nations ont brisé ses sarments de choix, qui atteignaient jusqu'à Jazer, qui s'égaraient dans le désert. Ses sarments se sont répandus. Elles passaient au-dessus de la mer.
౮ఎందుకంటే హెష్బోను పొలాలు, సిబ్మా ద్రాక్షాతీగెలు వాడిపోయాయి. దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జాతుల అధికారులు అణగదొక్కారు. అవి యాజరు వరకూ వ్యాపించాయి, ఎడారిలోకి పాకాయి. దాని తీగెలు విశాలంగా వ్యాపించి సముద్రాన్ని దాటాయి.
9 C'est pourquoi je pleurerai avec les pleurs de Jaezer sur la vigne de Sibma. Je t'arroserai de mes larmes, Hesbon et Élealé; car sur tes fruits d'été et sur ta moisson est tombé le cri de guerre.
౯యాజరుతో కలిసి నేను సిబ్మా ద్రాక్షాతీగెల కోసం ఏడుస్తాను. హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లతో నిన్ను తడుపుతాను. ఎందుకంటే నీ వేసవికాల ఫలాల మీద, నీ పంట మీద నీ కేరింతలను నేను అంతమొందించాను.
10 L'allégresse a disparu, la joie s'est retirée du champ fructueux; dans les vignes, il n'y aura plus de chant, plus de bruit joyeux. Personne ne foulera le vin dans les pressoirs. J'ai fait cesser les cris.
౧౦ఆనంద సంతోషాలు ఫలభరితమైన పొలాల నుంచి అదృశ్యం అవుతాయి. నీ ద్రాక్షల తోటలో సంగీతం వినిపించదు. ఉత్సాహ ధ్వని వినబడదు. గానుగుల్లో ద్రాక్షగెలలను తొక్కేవాడు లేడు. ద్రాక్షల తొట్టి తొక్కేవారి సంతోషభరితమైన కేకలు నేను నిలుపు చేశాను.
11 C'est pourquoi mon cœur résonne comme une harpe pour Moab, et mes entrailles pour Kir Hérès.
౧౧మోయాబు కోసం నా గుండె కొట్టుకుంటోంది. కీర్ హరెశెతు కోసం నా అంతరంగం తీగవాయిద్యంలా నిట్టూర్పు విడుస్తోంది.
12 Quand Moab se présentera, quand il se fatiguera sur le haut lieu, quand il viendra prier dans son sanctuaire, il ne prévaudra pas.
౧౨మోయాబీయులు ఉన్నత స్థలానికి వచ్చి సొమ్మసిల్లి ప్రార్థన చెయ్యడానికి తమ గుడిలో ప్రవేశించినప్పుడు, వారి ప్రార్థనల వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
13 Telle est la parole que l'Éternel a prononcée autrefois sur Moab.
౧౩ఇంతకు ముందు యెహోవా మోయాబు గురించి చెప్పిన మాట ఇదే.
14 Mais maintenant, l'Éternel a parlé, en disant: « Dans trois ans, comme un ouvrier lié par contrat les compterait, la gloire de Moab sera méprisée, avec toute sa grande multitude; et le reste sera très petit et faible. »
౧౪మళ్ళీ యెహోవా మాట్లాడుతున్నాడు. “మూడేళ్ళలోపు మోయాబు ఘనత అదృశ్యం అవుతుంది. అతనికి అనేకమంది జనం ఉన్నా చాలా తక్కువగానూ ప్రాముఖ్యత లేనివాళ్ళుగానూ ఉంటారు.”