< Genèse 4 >
1 L'homme connut Eve, sa femme. Elle conçut et donna naissance à Caïn, et dit: « J'ai obtenu un homme avec l'aide de Yahvé. »
౧ఆదాము తన భార్య హవ్వను కలిసినప్పుడు ఆమె గర్భం దాల్చి కయీనుకు జన్మనిచ్చింది. ఆమె “యెహోవా సహాయంతో నేనొక మగ బిడ్డకు జన్మనిచ్చాను” అంది.
2 Elle donna de nouveau naissance à Abel, frère de Caïn. Abel était gardien de moutons, mais Caïn était cultivateur de la terre.
౨తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి. కయీను వ్యవసాయం చేసేవాడు.
3 Au fil du temps, Caïn apporta une offrande à Yahvé avec les fruits du sol.
౩కొంతకాలం తరువాత కయీను వ్యవసాయంలో వచ్చిన పంటలో కొంత యెహోవాకు అర్పణ ఇవ్వడానికి తెచ్చాడు.
4 Abel apporta aussi une partie des premiers-nés de son troupeau et de sa graisse. Yahvé respecta Abel et son offrande,
౪హేబెలు కూడా తన మందలో తొలుచూలు పిల్లల్లో కొవ్వు పట్టిన వాటిని తెచ్చాడు. యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు.
5 mais il ne respecta pas Caïn et son offrande. Caïn fut très irrité, et l'expression de son visage tomba.
౫కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించ లేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు.
6 Yahvé dit à Caïn: « Pourquoi es-tu en colère? Pourquoi l'expression de ton visage est-elle tombée?
౬యెహోవా కయీనుతో “ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు రుసరుసలాడుతున్నావు?
7 Si tu fais bien, ne sera-t-elle pas élevée? Si tu ne fais pas le bien, le péché est accroupi à la porte. C'est toi qu'il désire, mais c'est toi qui dois le dominer. »
౭నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదం లభిస్తుంది కదా. సరైనది చెయ్యకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీపర్చుకోవాలని చూస్తుంది. అయితే, నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి” అన్నాడు.
8 Caïn dit à Abel, son frère: « Allons dans le champ. » Pendant qu'ils étaient dans le champ, Caïn se souleva contre Abel, son frère, et le tua.
౮కయీను తన తమ్ముడు హేబెలుతో మాట్లాడాడు. వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలు మీద దాడి చేసి అతణ్ణి చంపివేశాడు.
9 Yahvé dit à Caïn: « Où est Abel, ton frère? » Il a dit: « Je ne sais pas. Suis-je le gardien de mon frère? »
౯అప్పుడు యెహోవా కయీనుతో “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అన్నాడు. అతడు “నాకు తెలియదు. నేను నా తమ్ముడికి కాపలా వాడినా?” అన్నాడు.
10 Yahvé dit: « Qu'as-tu fait? La voix du sang de ton frère crie vers moi depuis la terre.
౧౦దేవుడు “నువ్వు చేసిందేమిటి? నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు మొరపెడుతూ ఉంది.
11 Maintenant, tu es maudit à cause de la terre, qui a ouvert sa bouche pour recevoir de ta main le sang de ton frère.
౧౧ఇప్పుడు నీ మూలంగా ఒలికిన నీ తమ్ముడి రక్తాన్ని మింగడానికి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండాా నువ్వు శాపానికి గురయ్యావు.
12 Désormais, quand tu laboureras la terre, elle ne te cédera plus sa force. Tu seras un fugitif et un vagabond sur la terre. »
౧౨నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు. నువ్వు భూమి మీద నుంచి అస్తమానం పారిపోతూ, దేశదిమ్మరిగా ఉంటావు” అన్నాడు.
13 Caïn dit à Yahvé: « Mon châtiment est plus grand que ce que je peux supporter.
౧౩కయీను “నా శిక్ష నేను భరించలేనిది.
14 Voici, tu m'as chassé aujourd'hui de la surface de la terre. Je serai caché de ta face, et je serai un fugitif et un vagabond sur la terre. Celui qui me trouvera me tuera. »
౧౪ఈ రోజు ఈ ప్రదేశం నుంచి నువ్వు నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధిలోకి నేనిక రావడం కుదరదు. ఈ భూమి మీద పలాయనం అవుతూ, దేశదిమ్మరిగా ఉంటాను. నన్ను ఎవరు చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు” అన్నాడు.
15 Yahvé lui dit: « C'est pourquoi, si quelqu'un tue Caïn, il se vengera sept fois plus. » Yahvé avait prévu un signe pour Caïn, afin que celui qui le trouverait ne le frappe pas.
౧౫యెహోవా అతనితో “అలా జరగదు. నిన్ను చూసిన వాడు ఎవడైనా నిన్ను చంపితే అతణ్ణి తీవ్రంగా శిక్షిస్తానని తెలియజేసేందుకు నీ మీద ఒక గుర్తు వేస్తాను. నిన్ను నేను శిక్షించిన దానికి ఏడు రెట్లు అలాటి వాణ్ణి శిక్షిస్తాను” అన్నాడు. అప్పుడు యెహోవా కయీను మీద ఒక గుర్తు వేశాడు.
16 Caïn quitta la présence de Yahvé et habita dans le pays de Nod, à l'est d'Eden.
౧౬కాబట్టి కయీను యెహోవా సన్నిధిలోనుంచి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పువైపు ఉన్న నోదు ప్రాంతంలో నివాసం ఉన్నాడు.
17 Caïn connut sa femme. Elle devint enceinte et donna naissance à Hénoc. Il bâtit une ville, et donna à la ville le nom de son fils, Hénoc.
౧౭కయీను తన భార్యను కలిసినప్పుడు ఆమె గర్భం ధరించి హనోకుకు జన్మనిచ్చింది. అతడు ఒక ఊరు కట్టించి దానికి తన కొడుకు పేర హనోకు అని పెట్టాడు.
18 Irad naquit d'Hénoc. Irad devint le père de Mehujael. Mehujael devint le père de Methushael. Methushael engendra Lamek.
౧౮హనోకు ఈరాదుకు తండ్రి. ఈరాదు మహూయాయేలుకు తండ్రి. మహూయాయేలు మతూషాయేలుకు తండ్రి. మతూషాయేలు లెమెకుకు తండ్రి.
19 Lamek prit deux femmes: le nom de la première était Ada, et le nom de la seconde était Zilla.
౧౯లెమెకు ఇద్దరిని పెళ్ళి చేసుకున్నాడు. వారిలో ఒకామె పేరు ఆదా, రెండవ ఆమె సిల్లా.
20 Ada donna naissance à Jabal, qui fut le père de ceux qui habitent dans des tentes et qui ont du bétail.
౨౦ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. అతడు పశువులు పెంపకం చేస్తూ గుడారాల్లో నివాసం ఉండేవాళ్లకు మూలపురుషుడు.
21 Le nom de son frère était Jubal, qui était le père de tous ceux qui manient la harpe et le chalumeau.
౨౧అతని తమ్ముడు యూబాలు. ఇతను తీగె వాయుద్యాలు, వేణువు వాయించే వాళ్ళందరికీ మూలపురుషుడు.
22 Zilla donna aussi naissance à Tubal Caïn, le forgeur de tous les instruments tranchants en bronze et en fer. La sœur de Tubal Caïn était Naama.
౨౨సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. అతడు రాగి, ఇనప పరికరాలు చేసేవాడు. తూబల్కయీను చెల్లి పేరు నయమా.
23 Lamek dit à ses femmes, « Adah et Zillah, entendez ma voix. Femmes de Lamech, écoutez mon discours, car j'ai tué un homme pour m'avoir blessé, un jeune homme pour m'avoir meurtri.
౨౩లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు. “ఆదా, సిల్లా, నా మాట వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరచినందుకు నేను ఒక మనిషిని చంపాను. కమిలిపోయేలా కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను.
24 Si Caïn sera vengé sept fois, vraiment Lamech soixante-dix-sept fois. »
౨౪ఏడంతలు ప్రతీకారం కయీను కోసం వస్తే లెమెకు కోసం డెబ్భై ఏడు రెట్లు వస్తుంది.”
25 Adam connut de nouveau sa femme. Elle donna naissance à un fils, qu'elle appela Seth, en disant: « Dieu m'a donné un autre enfant à la place d'Abel, car Caïn l'a tué. »
౨౫ఆదాము మళ్ళీ తన భార్యను కలిసినప్పుడు ఆమె ఒక కొడుకును కన్నది. అతనికి షేతు అని పేరు పెట్టి “కయీను చంపిన హేబెలుకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును ఇచ్చాడు” అంది.
26 Un fils naquit aussi à Seth, et il le nomma Enosh. En ce temps-là, les hommes commencèrent à invoquer le nom de Yahvé.
౨౬షేతుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఎనోషు. అప్పటినుండి మనుషులు యెహోవాను ఆరాధించడం ఆరంభించారు.