< 2 Chroniques 4 >

1 Puis il fit un autel d'airain, long de vingt coudées, large de vingt coudées et haut de dix coudées.
సొలొమోను ఇరవై మూరలు పొడవు, ఇరవై మూరలు వెడల్పు, పది మూరలు ఎత్తు ఉన్న ఒక ఇత్తడి బలిపీఠం చేయించాడు.
2 Il fit aussi la mer de fonte, qui avait dix coudées de bord à bord. Elle était ronde, haute de cinq coudées, et avait une circonférence de trente coudées.
పోత పోసిన గుండ్రటి సరస్సు గంగాళం కూడా ఒకటి చేయించాడు. అది ఆ చివరినుండి ఈ చివరి వరకూ 10 మూరల వెడల్పు. దాని ఎత్తు ఐదు మూరలు. దాని చుట్టుకొలత 30 మూరలు.
3 Sous elle, il y avait des bœufs, qui l'entouraient sur dix coudées, et qui entouraient la mer. Les bœufs étaient sur deux rangs, coulés au moment où elle était coulée.
దాని కింద ఎద్దుల రూపాలు ఒక్కొక్క మూరకు 10 చొప్పున ఆ సముద్రపు తొట్టిని ఆవరించి ఉన్నాయి. ఆ ఎద్దులను రెండు వరసల్లో నిలబెట్టి ఆ తొట్టితో సహా పోత పోశారు.
4 Elle reposait sur douze bœufs, trois regardant vers le nord, trois regardant vers l'ouest, trois regardant vers le sud, et trois regardant vers l'est; la mer était posée sur eux par-dessus, et tous leurs membres postérieurs étaient en dedans.
అది 12 ఎద్దుబొమ్మల మీద నిలబడింది. మూడు ఎద్దులు ఉత్తరం వైపు, మూడు పడమర వైపు, మూడు దక్షిణం వైపు, మూడు తూర్పు వైపుకు ఉన్నాయి. ఆ సరస్సు తొట్టిని వాటి పైన నిలబెట్టారు. వాటి వెనక భాగాలు అన్నీ లోపలికి తిరిగి ఉన్నాయి.
5 Elle avait une épaisseur d'un palme. Son bord était fait comme le bord d'une coupe, comme la fleur d'un lis. Il recevait et contenait trois mille baths.
దాని మందం బెత్తెడు. దాని అంచు ఒక గిన్నె అంచులాగా ఉండి తామరపువ్వును పోలి ఉంది. దానిలో దాదాపు 66,000 లీటర్ల నీరు పడుతుంది.
6 Il fit aussi dix bassins, et en plaça cinq à droite et cinq à gauche, pour s'y laver. On y lavait les objets qui appartenaient à l'holocauste, mais la mer était destinée à la toilette des prêtres.
సొలొమోను ఇంకా దహనబలులుగా అర్పించే వాటిని కడగటానికి కుడివైపున ఐదు, ఎడమ వైపున ఐదు మొత్తం పది స్నానపు గంగాళాలు చేయించాడు. అయితే సరస్సు తొట్టిలోని నీళ్ళతో కేవలం యాజకులు మాత్రమే తమను శుద్ధి చేసుకుంటారు.
7 Il fit les dix chandeliers d'or, selon l'ordonnance les concernant, et il les plaça dans le temple, cinq à droite et cinq à gauche.
అతడు తనకు అందిన నమూనా సూచనల ప్రకారం పది బంగారు దీపస్తంభాలను చేయించి, దేవాలయంలో కుడివైపు ఐదు, ఎడమవైపు ఐదు నిలబెట్టాడు.
8 Il fit aussi dix tables, et les plaça dans le temple, cinq à droite et cinq à gauche. Il fit cent bassins d'or.
అలాగే 10 బల్లలు చేయించి దేవాలయంలో కుడి వైపు ఐదు, ఎడమ వైపు ఐదు ఉంచాడు. అతడు 100 బంగారు తొట్లు చేయించాడు.
9 Il fit aussi le parvis des prêtres, le grand parvis, et les portes du parvis, dont il couvrit les portes d'airain.
అతడు యాజకులకు ఒక ఆవరణనూ ఇతరులకి దానికంటే విశాలమైన ఆవరణనూ తలుపులతో సహా చేయించి ఆ తలుపులను ఇత్తడితో పొదిగించాడు.
10 Il plaça la mer sur le côté droit de la maison, à l'est, vers le sud.
౧౦సరస్సు తొట్టిని తూర్పు వైపున కుడి పక్కగా ముఖాన్ని దక్షిణం వైపుకు తిప్పి ఉంచాడు.
11 Huram a fait les pots, les pelles et les bassins. Huram acheva l'ouvrage qu'il avait fait pour le roi Salomon dans la maison de Dieu:
౧౧హూరాము పాత్రలనూ బూడిదెనూ ఎత్తడానికి చేటలనూ తొట్లనూ చేశాడు. సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం దేవుని మందిరానికి చేయాల్సిన పనంతా హూరాము పూర్తి చేశాడు.
12 les deux colonnes, les coupes, les deux chapiteaux qui étaient au sommet des colonnes, les deux réseaux pour couvrir les deux coupes des chapiteaux qui étaient au sommet des colonnes,
౧౨దాని వివరాలు, రెండు స్తంభాలు, వాటి పళ్ళాలు, వాటి పైన ఉంచడానికి పీటలు, వాటి పళ్ళాలు, ఆ స్తంభాల పైన రెండు పళ్లాలను కప్పడానికి రెండు అల్లికలు,
13 et les quatre cents grenades pour les deux réseaux - deux rangées de grenades pour chaque réseau, pour couvrir les deux coupes des chapiteaux qui étaient sur les colonnes.
౧౩ఆ స్తంభాల పైన రెండు పళ్లాలను కప్పే అల్లిక, దానికి రెండేసి వరసల్లో నాలుగు వందల దానిమ్మ పండ్లు.
14 Il fit aussi les bases, et il fit les bassins sur les bases -
౧౪మట్లు, వాటిపైన తొట్టెలు,
15 une mer, et les douze bœufs au-dessous.
౧౫సరస్సు తొట్టి, దాని కింద ఉన్న పన్నెండు ఎద్దులు,
16 Huram-abi fit aussi les marmites, les pelles, les fourchettes et tous ses ustensiles pour le roi Salomon, pour la maison de Yahvé, en bronze brillant.
౧౬పాత్రలు, బూడిద ఎత్తడానికి చేటలు, ముండ్ల కొంకులు మొదలైనవి. వీటిని హూరాము సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరం కోసం మిలమిల మెరిసే ఇత్తడితో చేశాడు.
17 Le roi les fondit dans la plaine du Jourdain, dans la terre argileuse entre Succoth et Tseréda.
౧౭రాజు వాటిని యొర్దాను మైదానంలో సుక్కోతుకు జెరేదాతాకు మధ్య బంకమట్టి నేలలో పోత పోయించాడు.
18 Salomon fabriqua tous ces ustensiles en grande quantité, de sorte qu'il était impossible de déterminer le poids de l'airain.
౧౮తన దగ్గర ఉన్న తూయలేనంత ఇత్తడితో సొలొమోను ఈ వస్తువులను పెద్ద సంఖ్యలో చేయించాడు.
19 Salomon fit tous les ustensiles qui se trouvaient dans la maison de Dieu: l'autel d'or, les tables sur lesquelles étaient posés les pains de proposition,
౧౯దేవుని మందిరానికి కావలసిన వస్తువులూ బంగారు పీఠమూ సన్నిధి రొట్టెలు ఉంచే బల్లలూ,
20 les chandeliers avec leurs lampes pour brûler selon l'ordonnance devant le sanctuaire intérieur, le tout en or pur;
౨౦వాటి గురించి అతడు పొందిన సూచనల ప్రకారం గర్భగుడి ముందు వెలుగుతూ ఉండడానికి ప్రశస్తమైన బంగారు దీపస్తంభాలూ,
21 les fleurs, les lampes et les pinces en or pur;
౨౧పుష్పాలూ, ప్రమిదలూ కత్తెరలూ పట్టుకారులూ తొట్టెలూ గిన్నెలూ ధూపకలశాలూ వీటన్నిటినీ సొలొమోను మేలిమి బంగారంతో చేయించాడు.
22 les éteignoirs, les bassins, les cuillères et les brasiers en or pur. Quant à l'entrée de la maison, ses portes intérieures pour le lieu très saint et les portes de la salle principale du temple étaient en or.
౨౨మందిర ద్వారం లోపలి తలుపులూ అతి పరిశుద్ధ స్థలం లోపలి తలుపులూ దేవాలయపు తలుపులూ అన్నీ బంగారంతో చేయించాడు.

< 2 Chroniques 4 >