< 2 Chroniques 18 >
1 Josaphat avait des richesses et des honneurs en abondance, et il s'allia à Achab.
౧యెహోషాపాతుకు సంపద, ఘనత, అధికమైన తరవాత అతడు అహాబుతో సంబంధం కలుపుకున్నాడు.
2 Après quelques années, il descendit auprès d'Achab à Samarie. Achab lui tua en abondance des moutons et des bovins, ainsi qu'au peuple qui était avec lui, et il le poussa à monter avec lui à Ramoth Galaad.
౨కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత అతడు షోమ్రోనులో ఉండే అహాబు దగ్గరకి వెళ్ళాడు. అహాబు అతని కోసమూ అతని వెంట వచ్చిన మనుషుల కోసమూ అనేకమైన గొర్రెలనూ, పశువులనూ వధించి విందు చేశాడు. తనతో బాటు రామోతు గిలాదు మీదికి వెళ్ళడానికి అతణ్ణి ప్రేరేపించాడు.
3 Achab, roi d'Israël, dit à Josaphat, roi de Juda: « Veux-tu aller avec moi à Ramoth Galaad? » Il lui répondit: « Je suis comme toi, et mon peuple comme ton peuple. Nous serons avec toi à la guerre. »
౩ఇశ్రాయేలు రాజు అహాబు, యూదా రాజు యెహోషాపాతుతో “నువ్వు నాతో బాటు రామోతు గిలాదుకు వస్తావా” అని అడిగినప్పుడు, యెహోషాపాతు “నేను నీవాణ్ణి, నా ప్రజలు నీ ప్రజలు. మేము నీతోబాటు యుద్ధానికి వస్తాం” అని చెప్పాడు.
4 Josaphat dit au roi d'Israël: « Je te prie de t'enquérir d'abord de la parole de Yahvé. »
౪యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో “ముందు యెహోవా దగ్గర సంగతి విచారణ చేద్దాం రండి” అన్నాడు.
5 Alors le roi d'Israël rassembla les prophètes, quatre cents hommes, et leur dit: « Irai-je à Ramoth Galaad pour combattre, ou dois-je m'abstenir? » Ils ont dit: « Monte, car Dieu la livrera entre les mains du roi. »
౫ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి “నేను రామోతు గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళాలా, వద్దా?” అని వారిని అడిగాడు. అందుకు వారు “వెళ్ళు, దేవుడు దాన్ని రాజు చేతికి అప్పగిస్తాడు” అని చెప్పారు.
6 Mais Josaphat dit: « N'y a-t-il pas ici un prophète de Yahvé en plus, pour que nous le consultions? »
౬అయితే యెహోషాపాతు “వీళ్ళు కాకుండా మనం విచారణ చేయడానికి యెహోవా ప్రవక్తల్లో ఒకడైనా ఇక్కడ లేడా?” అని అడిగాడు.
7 Le roi d'Israël dit à Josaphat: « Il y a encore un homme par qui nous pouvons consulter Yahvé; mais je le déteste, car il ne prophétise jamais rien de bon à mon sujet, mais toujours du mal. C'est Michée, fils d'Imla. » Josaphat a dit: « Que le roi ne le dise pas. »
౭అందుకు ఇశ్రాయేలు రాజు “యెహోవా దగ్గర విచారణ చేయడానికి ఇమ్లా కొడుకు మీకాయా అనేవాడు ఇక్కడ ఉన్నాడు. అయితే అతడు నా గురించి మంచి ప్రవచించడు. ఎప్పుడూ కీడునే ప్రవచిస్తున్నాడు కాబట్టి అతడంటే నాకు కోపం” అన్నాడు. యెహోషాపాతు రాజు “రాజైన మీరు అలా అనవద్దు” అన్నాడు.
8 Alors le roi d'Israël appela un officier et dit: « Va vite chercher Michée, fils d'Imla. »
౮అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలో ఒకణ్ణి పిలిపించి “ఇమ్లా కొడుకు మీకాయాను త్వరగా రప్పించు” అని ఆజ్ఞ ఇచ్చాడు.
9 Le roi d'Israël et Josaphat, roi de Juda, étaient assis chacun sur son trône, revêtus de leurs robes, et ils étaient assis sur une place ouverte à l'entrée de la porte de Samarie; et tous les prophètes prophétisaient devant eux.
౯ఇశ్రాయేలు రాజు, యూదారాజు యెహోషాపాతు షోమ్రోను ఊరు ద్వారం ముందు ఉన్న స్థలం లో తమ రాజవస్త్రాలు ధరించుకుని సింహాసనాల మీద కూర్చుని ఉండగా ప్రవక్తలంతా వారి ముందు ప్రవచిస్తూ ఉన్నారు.
10 Sédécias, fils de Chenaana, se fit des cornes de fer et dit: « Yahvé dit: Avec celles-ci tu pousseras les Syriens jusqu'à ce qu'ils soient consumés. »
౧౦అప్పుడు కెనన్యా కొడుకు సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకుని వచ్చి “సిరియనులు అరామీయులు నాశనమయ్యే వరకూ వీటితో వాళ్ళను నువ్వు పొడుస్తావని యెహోవా సెలవిస్తున్నాడు” అని ప్రకటించాడు.
11 Tous les prophètes l'ont prophétisé, en disant: « Monte à Ramoth Galaad, et prospère, car Yahvé la livrera entre les mains du roi. »
౧౧ప్రవక్తలంతా ఆ విధంగానే ప్రవచిస్తూ “యెహోవా రామోతు గిలాదును రాజు చేతికి అప్పగిస్తాడు, దాని మీదికి వెళ్ళి జయం పొందు” అన్నారు.
12 Le messager qui était allé appeler Michée lui parla ainsi: « Voici, les paroles des prophètes disent du bien au roi d'une seule bouche. Que ta parole soit donc, je te prie, semblable à l'une des leurs, et qu'elle dise du bien. »
౧౨మీకాయాని పిలవడానికి పోయిన దూత అతనితో “ప్రవక్తలు రాజు విషయంలో అంతా మేలునే పలుకుతున్నారు. దయచేసి నీ మాటను వారి మాటలతో కలిపి మేలునే ప్రవచించు” అన్నారు.
13 Michée dit: « L'Éternel est vivant, je dirai ce que mon Dieu dit. »
౧౩మీకాయా “యెహోవా జీవం తోడు, నా దేవుడు దేనిని సెలవిస్తాడో దానినే ప్రవచిస్తాను” అని చెప్పాడు.
14 Lorsqu'il fut arrivé auprès du roi, celui-ci lui dit: « Michée, irons-nous à Ramoth Galaad pour combattre, ou dois-je m'abstenir? » Il a dit: « Monte, et prospère. Ils seront livrés entre tes mains. »
౧౪అతడు ఇశ్రాయేలు రాజు దగ్గరకి వచ్చినప్పుడు రాజు అతణ్ణి చూసి “మీకాయా, రామోతు గిలాదు పైకి మేము యుద్ధానికి వెళ్ళవచ్చా, ఆగిపోవాలా?” అని అడగ్గా, అతడు “వెళ్ళి యుద్ధం చేసి జయించండి. వారు మీ చేతికి చిక్కుతారు” అన్నాడు.
15 Le roi lui dit: « Combien de fois t'adjurerai-je de ne me dire que la vérité au nom de Yahvé? »
౧౫అప్పుడు రాజు “యెహోవా నామంలో అబద్ధం కాక సత్యమే చెప్పమని నేను ఎన్నిసార్లు నీ చేత ఒట్టు పెట్టించుకోవాలి?” అని అతనితో అన్నాడు.
16 Il dit: « J'ai vu tout Israël dispersé sur les montagnes, comme des brebis qui n'ont pas de berger. Yahvé a dit: « Elles n'ont pas de maître. Que chacun retourne en paix dans sa maison ».
౧౬అప్పుడు మీకాయా “కాపరి లేని గొర్రెల్లాగా ఇశ్రాయేలు వారంతా పర్వతాల మీద చెదిరిపోవడం నేను చూశాను. ‘వీరికి యజమాని లేడు. వీరిలో ప్రతివాడూ తన తన ఇంటికి ప్రశాంతంగా తిరిగి వెళ్ళాలి’ అని యెహోవా సెలవిచ్చాడు” అన్నాడు.
17 Le roi d'Israël dit à Josaphat: « Ne t'ai-je pas dit qu'il ne prophétiserait pas du bien à mon sujet, mais du mal? »
౧౭అది విని ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో ఇలా అన్నాడు. “ఇతడు నా విషయంలో కీడునే గాని మేలును ప్రవచించడని నేను నీతో చెప్పలేదా?”
18 Michée dit: « C'est pourquoi écoutez la parole de l'Éternel. J'ai vu l'Éternel assis sur son trône, et toute l'armée des cieux debout à sa droite et à sa gauche.
౧౮అప్పుడు మీకాయా ఇలా అన్నాడు. “యెహోవా మాట వినండి. యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం, పరలోక సైన్యమంతా ఆయన కుడివైపూ ఎడమవైపూ నిలబడి ఉండడం నేను చూశాను.
19 Yahvé dit: Qui séduira Achab, roi d'Israël, pour qu'il monte et tombe à Ramoth Galaad? L'un parlait en disant ceci, et l'autre en disant cela.
౧౯‘ఇశ్రాయేలు రాజు అహాబు రామోతు గిలాదు మీద యుద్ధానికి వెళ్ళి చనిపోయేలా అతణ్ణి ఎవరు ప్రేరేపిస్తారు?’ అని యెహోవా అడిగాడు. అప్పుడు, ఒకడు ఒక రకంగా, ఇంకొకడు మరొక రకంగా జవాబిచ్చారు.
20 Un esprit sortit, se tint devant l'Éternel, et dit: Je le séduirai. « Yahvé lui dit: « Comment?
౨౦అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ముందు నిలబడి, ‘నేను అతణ్ణి ప్రేరేపిస్తాను’ అని చెప్పాడు. యెహోవా, ‘ఏవిధంగా?’ అని అతణ్ణి అడిగాడు.
21 « Il a dit: « J'irai, et je serai un esprit de mensonge dans la bouche de tous ses prophètes ». « Il dit: 'Tu le séduiras, et tu l'emporteras aussi. Va et fais-le.
౨౧అందుకు ఆ ఆత్మ, ‘నేను వెళ్ళి అతని ప్రవక్తలందరి నోట అబద్ధాలాడే ఆత్మగా ఉంటాను’ అని చెప్పాడు. అందుకు యెహోవా ‘నువ్వు అతణ్ణి ప్రేరేపించి సఫలమౌతావు. వెళ్ళి అలా చెయ్యి’ అని సెలవిచ్చాడు.
22 « Maintenant, voici que Yahvé a mis un esprit de mensonge dans la bouche de vos prophètes, et Yahvé a dit du mal de vous. »
౨౨నీ ప్రవక్తలైన వీరి నోటిలో యెహోవా అబద్ధాలాడే ఆత్మను ఉంచాడు. యెహోవా నీకు కీడు నిర్ణయించాడు.”
23 Alors Sédécias, fils de Chenaana, s'approcha, frappa Michée sur la joue et dit: « Par où l'Esprit de Yahvé est-il sorti de moi pour te parler? »
౨౩అప్పుడు కెనన్యా కొడుకు సిద్కియా మీకాయా దగ్గరికి వచ్చి అతణ్ణి చెంప మీద కొట్టి “నీతో మాటలాడటానికి యెహోవా ఆత్మ నా దగ్గర నుండి ఎటు వైపు వెళ్ళాడు?” అన్నాడు.
24 Michée dit: « Voici ce que tu verras ce jour-là, quand tu entreras dans une pièce intérieure pour te cacher. »
౨౪అందుకు మీకాయా “దాక్కోడానికి నువ్వు లోపలి గదిలోకి వెళ్ళే రోజున అది నీకు తెలుస్తుంది” అని చెప్పాడు.
25 Le roi d'Israël dit: « Prends Michée, et tu le porteras à Amon, gouverneur de la ville, et à Joas, fils du roi,
౨౫అప్పుడు ఇశ్రాయేలు రాజు “మీరు మీకాయాను పట్టణపు అధికారి ఆమోను దగ్గరికి, రాకుమారుడు యోవాషు దగ్గరికి తీసుకు పోయి వారితో, రాజు మీకిచ్చిన ఆజ్ఞ ఇదే
26 et tu diras: « Le roi dit: « Mets cet homme dans la prison, et nourris-le de pain d'affliction et d'eau d'affliction, jusqu'à ce que je revienne en paix »".
౨౬నేను సురక్షితంగా తిరిగి వచ్చే వరకూ ఇతన్ని చెరలో ఉంచి కొద్దిగా ఆహారం, నీరు మాత్రం ఇవ్వండి” అన్నాడు.
27 Michée dit: « Si vous revenez en paix, Yahvé n'a pas parlé par moi. » Il dit: « Écoutez, vous tous, peuple, tous! »
౨౭అప్పుడు మీకాయా “నువ్వు సురక్షితంగా తిరిగి వస్తే యెహోవా నా ద్వారా పలకలేదన్న మాటే. ప్రజలంతా ఆలకించండి” అన్నాడు.
28 Le roi d'Israël et Josaphat, roi de Juda, montèrent à Ramoth Galaad.
౨౮అప్పుడు ఇశ్రాయేలు రాజు, యూదా రాజు యెహోషాపాతు, రామోతు గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళారు.
29 Le roi d'Israël dit à Josaphat: « Je me déguiserai, et j'irai au combat; mais toi, mets tes vêtements. » Le roi d'Israël se déguisa donc, et ils allèrent au combat.
౨౯ఇశ్రాయేలు రాజు “నేను మారు వేషం వేసుకుని యుద్ధానికి వెళ్తాను. నువ్వు నీ వస్త్రాలనే ధరించు” అని యెహోషాపాతుతో చెప్పి తాను మారు వేషం వేసుకున్నాడు. తరువాత వారు యుద్ధానికి వెళ్ళారు.
30 Or, le roi de Syrie avait donné cet ordre aux chefs de ses chars: « Ne combattez ni les petits ni les grands, si ce n'est seulement contre le roi d'Israël. »
౩౦సిరియా రాజు “మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధం చేయండి. పెద్దా చిన్న వారితో చేయవద్దు” అని తనతో ఉన్న తన రథాల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు.
31 Lorsque les chefs des chars virent Josaphat, ils dirent: « C'est le roi d'Israël! » Ils firent donc demi-tour pour le combattre. Mais Josaphat cria, et l'Éternel le secourut, et Dieu les poussa à s'éloigner de lui.
౩౧కాగా యెహోషాపాతు కనబడగానే రథాధిపతులు “అడుగో ఇశ్రాయేలు రాజు” అంటూ అతడిపై దాడి చెయ్యడానికి అతణ్ణి చుట్టుముట్టారు. అయితే యెహోషాపాతు యెహోవాకు మొర్రపెట్టడం వలన ఆయన అతనికి సహాయం చేశాడు. దేవుడు అతని దగ్గర నుండి వారు తొలగిపోయేలా చేశాడు.
32 Lorsque les chefs des chars virent que ce n'était pas le roi d'Israël, ils cessèrent de le poursuivre.
౩౨ఎలాగంటే, రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతణ్ణి తరమడం మాని తిరిగి వెళ్ళారు.
33 Un homme tira son arc au hasard et frappa le roi d'Israël entre les jointures de l'armure. Il dit alors au conducteur du char: « Fais demi-tour et emporte-moi hors de la bataille, car je suis gravement blessé. »
౩౩అప్పుడు ఎవడో గురి చూడకుండానే విల్లు ఎక్కుబెట్టి బాణం వేయగా అది ఇశ్రాయేలు రాజు కవచపు సందుల్లో గుచ్చుకుంది. రాజు తన సారధితో “నాకు గాయమైంది. వెనక్కి తిప్పి యుద్ధంలో నుండి నన్ను బయటికి తీసుకు వెళ్ళు” అన్నాడు.
34 La bataille s'intensifia ce jour-là. Cependant, le roi d'Israël se soutint dans son char contre les Syriens jusqu'au soir; et vers le coucher du soleil, il mourut.
౩౪ఆ రోజున యుద్ధం తీవ్రంగా జరిగింది. అయినా ఇశ్రాయేలు రాజు సూర్యాస్తమయం వరకూ సిరియా సైన్యానికి ఎదురుగా తన రథంలో ఆనుకుని నిలబడ్డాడు. పొద్దుగుంకే వేళకి అతడు చనిపోయాడు.