< 1 Samuel 8 >
1 Lorsque Samuel fut âgé, il établit ses fils comme juges sur Israël.
౧సమూయేలు ముసలివాడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయులపై న్యాయాధిపతులుగా నియమించాడు.
2 Or le nom de son premier-né était Joël, et le nom de son second, Abija. Ils étaient juges à Beersheba.
౨అతని పెద్ద కొడుకు పేరు యోవేలు. రెండవవాడి పేరు అబీయా,
3 Ses fils ne marchèrent pas dans ses voies, mais se détournèrent vers des gains malhonnêtes, acceptèrent des pots-de-vin et pervertirent la justice.
౩వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కొడుకులు తమ తండ్రివంటి మంచి ప్రవర్తనను అనుసరించకుండా ధనంపై ఆశ పెంచుకుని, లంచాలు తీసుకొంటూ తీర్పులను తారుమారు చేశారు.
4 Alors tous les anciens d'Israël se rassemblèrent et vinrent trouver Samuel à Rama.
౪ఇశ్రాయేలు పెద్దలంతా కలసి రమాలో ఉన్న సమూయేలు దగ్గరకి వచ్చి,
5 Ils lui dirent: « Voici, tu es vieux, et tes fils ne marchent pas dans tes voies. Maintenant, fais-nous un roi pour nous juger comme toutes les nations. »
౫“అయ్యా, విను. నువ్వు ముసలివాడివి. నీ కొడుకులు నీలాగా మంచి ప్రవర్తన గలవారు కారు. కాబట్టి ప్రజలందరి కోరికను మన్నించి మాకు ఒక రాజును నియమించు. అతడు మాకు న్యాయం తీరుస్తాడు” అని అతనితో అన్నారు.
6 Mais ce qui déplut à Samuel, c'est qu'ils dirent: « Donne-nous un roi pour nous juger. » Samuel pria Yahvé.
౬“మాకు న్యాయం చేయడానికి ఒక రాజును నియమించు” అని వారు అడిగిన మాట సమూయేలుకు రుచించలేదు. అప్పుడు సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాడు.
7 Yahvé dit à Samuel: « Écoute la voix du peuple dans tout ce qu'il te dira, car ce n'est pas toi qu'il a rejeté, mais c'est moi qu'il a rejeté comme roi sur lui.
౭యెహోవా సమూయేలుకు ఇలా బదులిచ్చాడు. “ప్రజలు నిన్ను కోరినట్టు జరిగించు. వారు తిరస్కరించింది నిన్ను కాదు. తమను పాలించకుండా నన్నే తిరస్కరించారు.
8 Ils ont fait tout ce qu'ils ont fait depuis le jour où je les ai fait monter d'Égypte jusqu'à ce jour, en m'abandonnant et en servant d'autres dieux, et ils te feront de même.
౮వారు నన్ను తిరస్కరించి, ఇతర దేవుళ్ళను పూజించి, నేను ఐగుప్తునుండి వారిని రప్పించినప్పటి నుండి ఇప్పటిదాకా వారు చేస్తూ వస్తున్న పనుల ప్రకారమే వారు నీ పట్ల కూడా జరిగిస్తున్నారు. వారు కోరినట్టు జరిగించు.
9 Maintenant donc, écoutez leur voix. Cependant, tu protesteras solennellement auprès d'eux, et tu leur indiqueras la voie du roi qui régnera sur eux. »
౯అయితే వారికి రాబోయే కొత్త రాజు ఎలా పరిపాలిస్తాడో దానికి నువ్వే సాక్ష్యంగా ఉండి వారికి స్పష్టంగా తెలియజెయ్యి.”
10 Samuel rapporta toutes les paroles de Yahvé au peuple qui lui demandait un roi.
౧౦తమకు రాజు కావాలని కోరిన ప్రజలకి సమూయేలు యెహోవా చెప్పిన మాటలన్నీ వినిపిస్తూ
11 Il dit: « Voici comment agira le roi qui régnera sur vous: il prendra vos fils et les mettra à son service, pour ses chars et pour être ses cavaliers; et ils courront devant ses chars.
౧౧ఇలా చెప్పాడు. “మిమ్మల్ని ఏలబోయే రాజు ఎలా ఉంటాడంటే, అతడు మీ కొడుకులను పట్టుకుని, తన రథాలు నడపడానికి, గుర్రాలను చూసుకోవడానికి వారిని పనికి పెట్టుకుంటాడు. కొందరు అతని రథాల ముందు పరుగెత్తుతారు.
12 Il les nommera chefs de milliers et chefs de cinquantaines, et il en chargera de labourer son sol et de moissonner sa récolte, de fabriquer ses instruments de guerre et les instruments de ses chars.
౧౨అతడు కొందరిని తన సైన్యంలోని వెయ్యిమంది పై అధికారులుగా, యాభైమంది పై అధికారులుగా నియమిస్తాడు. తన పొలాలు దున్నడానికి, పంటలు కోయడానికి, యుద్ధం చేసే ఆయుధాలు, రథాల సామానులు తయారుచేయడానికి వారిని పెట్టుకుంటాడు.
13 Il prendra tes filles pour en faire des parfumeuses, des cuisinières et des boulangères.
౧౩మీ ఆడపిల్లలను వంటలు చేయడానికి, అలంకరించడానికి, రొట్టెలు కాల్చడానికి పెట్టుకొంటాడు.
14 Il prendra tes champs, tes vignes et tes oliviers, même tes meilleurs, et les donnera à ses serviteurs.
౧౪మీ పొలాల్లో, ద్రాక్షతోటల్లో, ఒలీవ తోటల్లో శ్రేష్ఠ భాగాన్ని తీసుకు తన సేవకులకు ఇస్తాడు.
15 Il prendra le dixième de tes semences et de tes vignes, et le donnera à ses officiers et à ses serviteurs.
౧౫మీ పంటలో, ద్రాక్షపళ్ళలో పదవ వంతు తీసుకు తన సిబ్బందికి, పనివారికి ఇస్తాడు.
16 Il prendra tes serviteurs, tes servantes, tes meilleurs jeunes gens et tes ânes, et les affectera à son propre travail.
౧౬మీ స్వంత పనివాళ్ళలో, పనికత్తెల్లో, మీ పశువుల్లో, గాడిదల్లో మంచివాటిని తీసుకు తన కోసం ఉంచుకొంటాడు.
17 Il prendra le dixième de vos troupeaux, et vous serez ses esclaves.
౧౭మీ మందల్లో పదవ భాగం తీసుకొంటాడు. మీకు మీరుగా అతనికి దాసులైపోతారు.
18 Vous crierez en ce jour-là à cause de votre roi que vous vous serez choisi, et Yahvé ne vous répondra pas en ce jour-là. »
౧౮ఇక ఆ రోజుల్లో మీకోసం మీరు కోరుకొన్న రాజు గురించి ఎంతగా వేడుకొన్నా యెహోవా మీ మనవి పట్టించుకోడు.”
19 Mais le peuple refusa d'écouter la voix de Samuel, et ils dirent: « Non, mais nous aurons un roi sur nous,
౧౯ఇలా చెప్పినప్పటికీ, ప్రజలు సమూయేలు మాట పెడచెవిన పెట్టి,
20 afin que nous soyons aussi comme toutes les nations, et que notre roi nous juge, qu'il sorte devant nous et qu'il mène nos combats. »
౨౦“అలా కాదు, ఇతర దేశ ప్రజలు చేస్తున్నట్లు మేము కూడా చేసేలా మాకూ రాజు కావాలి, ఆ రాజు మాకు న్యాయం జరిగిస్తాడు, మాకు ముందుగా ఉండి అతడే యుద్ధాలు జరిగిస్తాడు” అన్నారు.
21 Samuel entendit toutes les paroles du peuple, et il les répéta aux oreilles de l'Éternel.
౨౧సమూయేలు ప్రజలు పలికిన మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిలో వివరించాడు.
22 Yahvé dit à Samuel: « Écoute leur voix, et fais-leur un roi. » Samuel dit aux hommes d'Israël: « Retournez chacun dans votre ville. »
౨౨అప్పుడు యెహోవా “నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించు” అని సమూయేలుకు చెప్పినప్పుడు, సమూయేలు “మీరందరూ మీ మీ గ్రామాలకు వెళ్ళి పొండి” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.