< 1 Samuel 21 >

1 David se rendit à Nob auprès du sacrificateur Achimélec. Achimélec vint à la rencontre de David en tremblant, et lui dit: « Pourquoi es-tu seul, et n'y a-t-il personne avec toi? ».
దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. అహీమెలెకు దావీదు రావడం చూసి భయపడి “నువ్వు ఒంటరిగా వచ్చావెందుకు?” అని అడిగాడు,
2 David répondit au prêtre Achimélec: « Le roi m'a ordonné de faire quelque chose et m'a dit: « Que personne ne sache rien de l'affaire pour laquelle je t'envoie et de ce que je t'ai ordonné. J'ai envoyé les jeunes gens dans un certain lieu.
దావీదు “రాజు నాకు ఒక పని అప్పగించి, ‘నేను నీకు ఆజ్ఞాపించి పంపిస్తున్న పని ఎలాటిదో అది ఎవ్వరితో చెప్పవద్దు’ అన్నాడు. ఒక చోటికి వెళ్ళమని యువకులకు నేను చెప్పాను.
3 Maintenant, qu'est-ce qui est sous ta main? Donnez-moi, je vous prie, cinq pains en main, ou tout ce qui est disponible. »
తినడానికి నీ దగ్గర ఏం ఉన్నాయి? ఐదు రొట్టెలు గానీ ఇంకా ఏమైనా ఉంటే అవి నాకు ఇవ్వు” అని యాజకుడైన అహీమెలెకును అడిగాడు.
4 Le prêtre répondit à David: « Je n'ai pas de pain ordinaire, mais il y a du pain saint, si seulement les jeunes gens se sont tenus à l'écart des femmes. »
యాజకుడు “మామూలు రొట్టెలు నా దగ్గర లేవు. పవిత్రమైన రొట్టెలు మాత్రమే ఉన్నాయి. పనివాళ్ళు స్త్రీలకు దూరంగా ఉన్నట్టైతే వారు ప్రతిష్ఠితమైన రొట్టెలు తినవచ్చు” అని దావీదుతో అన్నాడు.
5 David prit la parole devant le prêtre et lui dit: « En vérité, les femmes ont été éloignées de nous comme d'habitude ces trois jours. Quand je suis sorti, les vases des jeunes gens étaient saints, bien que ce ne fût qu'un voyage ordinaire. Combien plus aujourd'hui leurs vases seront-ils saints? »
అప్పుడు దావీదు “మేము బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు రోజులు నిజంగా స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. పనివాళ్ళ బట్టలు పవిత్రంగానే ఉన్నాయి. ఒకవేళ మేము చేయబోయే పని అపవిత్రమైనదైతే ఏంటి? రాజాజ్ఞ బట్టి అది పవిత్రంగా ఎంచబడుతుంది” అని యాజకునితో అన్నాడు.
6 Et le prêtre lui donna des pains saints; car il n'y avait là que le pain de démonstration qui avait été enlevé devant l'Éternel, pour être remplacé par du pain chaud le jour où il avait été enlevé.
అప్పుడు యెహోవా సన్నిధానం నుండి తీసిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేనందువల్ల, వేడిగా రొట్టెలు చేసే రోజున తీసిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చాడు.
7 Or un homme parmi les serviteurs de Saül était là ce jour-là, détenu devant l'Éternel; il s'appelait Doëg, l'Édomite, le meilleur des bergers qui appartenaient à Saül.
ఆ రోజున సౌలు సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధానంలో ఉన్నాడు. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరులకు నాయకుడు.
8 David dit à Achimélec: « N'y a-t-il pas ici sous ta main une lance ou une épée? Car je n'ai pas apporté avec moi mon épée ou mes armes, parce que les affaires du roi exigeaient la hâte. »
“రాజు పని త్వరగా జరగాలన్న తొందరలో నా కత్తిని, ఆయుధాలను నేను తీసుకు రాలేదు. ఇక్కడ నీ దగ్గర కత్తి గానీ ఈటె గానీ ఉందా?” అని దావీదు అహీమెలెకును అడిగితే,
9 Le prêtre dit: « Voici l'épée de Goliath le Philistin, que tu as tué dans la vallée d'Elah, et qui est ici enveloppée dans un tissu derrière l'éphod. Si tu veux la prendre, prends-la, car il n'y en a pas d'autre ici que celle-là. » David a dit: « Il n'y en a pas de semblable. Donne-le moi. »
యాజకుడు “ఏలా లోయలో నువ్వు చంపిన గొల్యాతు అనే ఫిలిష్తీయుడి కత్తి ఉంది. అదిగో బట్టతో చుట్టి ఏఫోదు వెనక ఉంది. అది తప్ప ఇక్కడ మరి ఏ కత్తీ లేదు. దాన్ని తీసుకోవడం నీకు ఇష్టమైతే తీసికో” అన్నాడు. దావీదు “దానికి మించింది వేరొకటి లేదు. అది నాకివ్వు” అన్నాడు.
10 David se leva et s'enfuit ce jour-là par crainte de Saül, et il alla chez Akish, roi de Gath.
౧౦దావీదు సౌలుకు భయపడినందువల్ల ఆ రోజునే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరికి వచ్చాడు.
11 Les serviteurs d'Akish lui dirent: « Ce David n'est-il pas le roi du pays? Ne chantaient-ils pas l'un l'autre à son sujet dans les danses, en disant, « Saül a tué ses milliers d'hommes, et David ses dix mille? »
౧౧ఆకీషు సేవకులు “ఈ దావీదు ఆ దేశపు రాజు కదా? ఆ దేశపు ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ, సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేల మందిని హతం చేసారని పాడిన పాటలు ఇతని గురించినవే గదా” అని అతని గురించి రాజుతో చెబుతుంటే,
12 David garda ces paroles dans son cœur, et il eut très peur d'Akish, roi de Gath.
౧౨దావీదు ఈ మాటలను తన మనస్సులో పెట్టుకుని గాతు రాజైన ఆకీషుకు చాలా భయపడ్డాడు.
13 Il changea de comportement devant eux et fit semblant d'être fou entre leurs mains, il gribouilla sur les battants de la porte et laissa tomber ses crachats sur sa barbe.
౧౩అందుకని దావీదు వారి ముందు తన ప్రవర్తన మార్చుకుని పిచ్చివాడిలా నటిస్తూ, గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మిని తన గడ్డంపైకి కారనిస్తూ ఉన్నాడు. వారు దావీదును పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి పనులు చేస్తూ వచ్చాడు.
14 Alors Akish dit à ses serviteurs: « Regardez, vous voyez que cet homme est fou. Pourquoi donc me l'amenez-vous?
౧౪అది చూసి ఆకీషు రాజు “మీరు చూశారుగా, అతనికి పిచ్చి పట్టింది, ఇతడిని నా దగ్గరికి ఎందుకు తీసుకువచ్చారు?
15 Est-ce que je manque de fous, pour que vous ayez amené cet homme pour qu'il fasse le fou en ma présence? Cet homme devrait-il entrer dans ma maison? »
౧౫పిచ్చి పనులు చేసేవాడితో నాకేం పని? నా సముఖంలో పిచ్చి పనులు చేయడానికి ఇతడిని తీసుకువచ్చారేంటి? వీడు నా ఇంట్లోకి రావచ్చా?” అని తన సేవకులతో అన్నాడు.

< 1 Samuel 21 >