< 1 Rois 13 >
1 Voici, un homme de Dieu sortit de Juda, par la parole de l'Éternel, pour se rendre à Béthel; et Jéroboam se tenait près de l'autel pour brûler des parfums.
౧ఒక దైవ సేవకుడు యెహోవా మాట చొప్పున యూదాదేశం నుండి బేతేలుకు వచ్చాడు. ధూపం వేయడానికి యరొబాము ఆ బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నాడు.
2 Il cria contre l'autel, par la parole de l'Éternel, et dit: « Autel! Autel! Autel! Yahvé dit: 'Voici qu'il va naître un fils à la maison de David, nommé Josias. Sur toi, il sacrifiera les prêtres des hauts lieux qui brûlent de l'encens, et ils brûleront sur toi des ossements d'hommes.'"
౨ఆ దైవ సేవకుడు యెహోవా ఆజ్ఞ ప్రకారం బలిపీఠానికి వ్యతిరేకంగా ఇలా ప్రకటన చేశాడు. “బలిపీఠమా! బలిపీఠమా! యెహోవా చెప్పేదేమిటంటే, దావీదు సంతానంలో యోషీయా అనే పేరుతో ఒక మగ బిడ్డ పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఉన్నత పూజా స్థలాల యాజకులను అతడు నీ మీద వధిస్తాడు. అతడు మనిషి ఎముకలను నీ మీద కాలుస్తాడు.”
3 Il donna un signe le même jour, en disant: « Voici le signe que Yahvé a annoncé: Voici que l'autel se fendra et que les cendres qui sont dessus seront répandues. »
౩అదే రోజు అతడు ఒక సూచన ఇచ్చాడు. “ఈ బలిపీఠం బద్దలై దానిమీదున్న బూడిద ఒలికి పోతుంది. యెహోవా చెప్పిన సూచన ఇదే” అన్నాడు.
4 Lorsque le roi entendit la parole de l'homme de Dieu, qu'il criait contre l'autel de Béthel, Jéroboam étendit sa main de l'autel, en disant: « Saisissez-le! » Sa main, qu'il avait étendue contre lui, se dessécha, de sorte qu'il ne put la ramener à lui.
౪బేతేలులోని బలిపీఠాన్ని గురించి ఆ దైవ సేవకుడు ప్రకటించిన మాట యరొబామురాజు విని, బలిపీఠం మీదనుండి తన చెయ్యి చాపి “అతన్ని పట్టుకోండి” అన్నాడు. అతడు చాపిన చెయ్యి చచ్చుబడి పోయింది. అతడు దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేకపోయాడు.
5 L'autel fut aussi fendu, et les cendres furent répandues de l'autel, selon le signe que l'homme de Dieu avait donné par la parole de l'Éternel.
౫యెహోవా మాట ప్రకారం దైవసేవకుడి మాట ప్రకారం బలిపీఠం బద్దలై, దాని మీద నుండి బూడిద ఒలికి పోయింది.
6 Le roi répondit à l'homme de Dieu: « Maintenant, intercède en faveur de l'Éternel, ton Dieu, et prie pour moi, afin que ma main me soit rendue. » L'homme de Dieu intercéda auprès de Yahvé, et la main du roi lui fut rendue à nouveau, et redevint comme avant.
౬అప్పుడు రాజు “నా చెయ్యి తిరిగి బాగయ్యేలా నీ దేవుడు యెహోవా నా మీద దయ చూపేలా నా కోసం వేడుకో” అని ఆ దేవుని మనిషితో అన్నాడు. కాబట్టి దైవ సేవకుడు యెహోవాను వేడుకున్నాడు. రాజు చెయ్యి బాగై మునుపటి లాగా అయింది.
7 Le roi dit à l'homme de Dieu: « Viens chez moi et rafraîchis-toi, et je te donnerai une récompense. »
౭అప్పుడు రాజు “నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో. నీకు బహుమతి ఇస్తాను” అని ఆ దైవసేవకుడితో చెప్పాడు.
8 L'homme de Dieu dit au roi: « Même si tu me donnais la moitié de ta maison, je n'entrerais pas avec toi, et je ne mangerais pas de pain et ne boirais pas d'eau dans ce lieu;
౮అప్పుడు దైవ సేవకుడు రాజుతో ఇలా అన్నాడు “నీవు నీ ఇంట్లో సగం నాకిచ్చినా నీతోబాటు నేను లోపలికి రాను. ఇక్కడ నేనేమీ తినను, తాగను.
9 car c'est ce que m'a ordonné la parole de l'Éternel, en disant: Tu ne mangeras pas de pain, tu ne boiras pas d'eau, et tu ne reviendras pas par le chemin par lequel tu es venu. »
౯ఎందుకంటే, ఇక్కడేమీ తినొద్దనీ తాగొద్దనీ వచ్చిన దారినే తిరిగి వెళ్ళవద్దనీ యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.”
10 Il prit donc un autre chemin, et ne revint pas par le chemin par lequel il était venu à Béthel.
౧౦అందుకని అతడు బేతేలుకు వచ్చిన దారిన కాకుండా ఇంకొక దారిలో వెళ్ళిపోయాడు.
11 Or, un vieux prophète habitait à Béthel, et l'un de ses fils vint lui raconter toutes les œuvres que l'homme de Dieu avait faites ce jour-là à Béthel. Ils racontèrent aussi à leur père les paroles qu'il avait dites au roi.
౧౧బేతేలులో ఒక ముసలి ప్రవక్త నివసించేవాడు. అతని కొడుకుల్లో ఒకడు వచ్చి బేతేలులో ఆ దైవ సేవకుడు ఆ రోజు చేసినదంతా అతనికి చెప్పాడు. అతడు రాజుతో చెప్పిన మాటలు కూడా అతని కొడుకులు అతనికి చెప్పారు.
12 Leur père leur dit: « Par où est-il allé? » Or ses fils avaient vu par où allait l'homme de Dieu, qui venait de Juda.
౧౨వారి తండ్రి “అతడు ఏ దారిన వెళ్ళాడు?” అని వారినడిగాడు. అతని కొడుకులు యూదాదేశాన్నుంచి వచ్చిన దేవుని మనిషి ఏ దారిలో వెళ్ళాడో చెప్పారు.
13 Il dit à ses fils: « Sellez-moi l'âne. » Ils sellèrent donc l'âne pour lui, et il monta dessus.
౧౩తరువాత అతడు తన కొడుకులను పిలిచి “నాకోసం గాడిద మీద జీను వేయండి” అని చెప్పాడు. వారు అతని కోసం గాడిదపై జీను వేశారు. అతడు దాని మీద ఎక్కి బయలుదేరాడు.
14 Il poursuivit l'homme de Dieu, et le trouva assis sous un chêne. Il lui dit: « Es-tu l'homme de Dieu qui est venu de Juda? » Il a dit: « Je le suis. »
౧౪సింధూర వృక్షం కింద దేవుని మనిషి కూర్చుని ఉండగా చూసి “యూదాదేశం నుండి వచ్చిన దైవ ప్రవక్తవు నువ్వేనా?” అని అడిగాడు. అతడు “నేనే” అన్నాడు.
15 Et il lui dit: « Viens à la maison avec moi et mange du pain. »
౧౫అప్పుడు అతడు “నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి” అన్నాడు.
16 Il dit: « Je ne retournerai pas avec vous et je n'entrerai pas avec vous. Je ne mangerai pas de pain et ne boirai pas d'eau avec vous dans ce lieu.
౧౬అతడు “నేను నీతో రాలేను. నీ ఇంటికి రాను. నీతో కలిసి ఇక్కడ ఏదీ తిననూ తాగను.
17 Car il m'a été dit par la parole de l'Éternel: Tu ne mangeras pas de pain et tu ne boiras pas d'eau dans ce lieu, et tu ne te retourneras pas pour prendre le chemin par lequel tu es venu. »
౧౭నీవు అక్కడ ఏదీ తినొద్దనీ తాగొద్దనీ నీవు వచ్చిన దారిలో వెళ్ళ వద్దనీ యెహోవా నాతో చెప్పాడు” అన్నాడు.
18 Il lui dit: « Moi aussi, je suis prophète comme toi, et un ange m'a parlé par la parole de Yahvé, en disant: « Ramène-le chez toi, dans ta maison, pour qu'il mange du pain et boive de l'eau. » Il lui a menti.
౧౮అప్పుడు ఆ ముసలి ప్రవక్త అతనితో “నేను కూడా నీలాంటి ప్రవక్తనే. యెహోవా ఆజ్ఞ ప్రకారం ఒక దేవదూత ‘భోజనం చేయడానికి అతన్ని వెంటబెట్టుకుని తీసుకు రా’ అని నాతో చెప్పాడు” అన్నాడు. అలా అతడు ఆ దేవుని మనిషితో అబద్ధమాడాడు.
19 Il s'en retourna donc avec lui, mangea du pain dans sa maison et but de l'eau.
౧౯అతడు ఆ ముసలి ప్రవక్త వెంట వెళ్లి అతని ఇంట్లో భోజనం చేశాడు.
20 Comme ils étaient assis à table, la parole de Yahvé vint au prophète qui l'avait ramené
౨౦వారు భోజనం చేస్తూ ఉంటే అతన్ని వెనక్కి తీసుకొచ్చిన ఆ ప్రవక్తతో యెహోవా మాట్లాడాడు.
21 et il cria à l'homme de Dieu venu de Juda: « Yahvé dit: 'Parce que tu as désobéi à la parole de Yahvé et que tu n'as pas observé le commandement que Yahvé ton Dieu t'avait prescrit,
౨౧అతడు యూదాదేశాన్నుండి వచ్చిన దేవుని మనిషితో “యెహోవా ఇలా చెబుతున్నాడు, నీ దేవుడు యెహోవా నీకు చెప్పిన మాట వినక, ఆయన ఆజ్ఞాపించిన దాన్ని పాటించకుండా
22 mais que tu es revenu, que tu as mangé du pain et bu de l'eau dans le lieu dont il t'avait dit: « Ne mange pas de pain et ne bois pas d'eau », ton corps ne viendra pas au tombeau de tes pères.'"
౨౨వెనక్కి వచ్చి, నీవు అక్కడ భోజనం చేయొద్దని ఆయన చెప్పిన చోట భోజనం చేశావు కాబట్టి నీ శవాన్ని నీ పూర్వీకుల సమాధులకు చేరదు” అని బిగ్గరగా చెప్పాడు.
23 Après avoir mangé du pain et après avoir bu, il sella l'âne pour le prophète qu'il avait ramené.
౨౩వారు భోజనం చేసిన తరువాత ఆ ప్రవక్త తాను వెనక్కి తీసుకు వచ్చిన ఆ దైవసేవకుని గాడిదపై జీను వేశాడు.
24 Comme il était parti, un lion le rencontra sur le chemin et le tua. Son corps fut jeté sur le chemin, et l'âne se tenait près de lui. Le lion aussi se tenait près du corps.
౨౪అతడు బయలుదేరి వెళ్లి పోతుంటే దారిలో ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపేసింది. అతని శవం దారిలోనే పడి ఉంది. గాడిద దాని దగ్గర నిలబడి ఉంది, సింహం కూడా శవం దగ్గర నిలబడి ఉంది.
25 Voici que des gens passaient par là et voyaient le corps jeté sur le chemin et le lion qui se tenait près du corps; ils vinrent le raconter dans la ville où habitait le vieux prophète.
౨౫కొంతమంది అటుగా వెళ్తూ శవం దారిలో పడి ఉండడం, సింహం శవం దగ్గర నిలబడి ఉండడం చూసి, ఆ ముసలి ప్రవక్త నివసిస్తున్న ఊరు వచ్చి ఆ విషయం చెప్పారు.
26 Lorsque le prophète qui l'avait ramené du chemin l'apprit, il dit: « C'est l'homme de Dieu qui a désobéi à la parole de l'Éternel. C'est pourquoi l'Éternel l'a livré au lion, qui l'a déchiqueté et l'a tué, selon la parole que l'Éternel lui avait adressée. »
౨౬దారిలో నుండి అతన్ని తీసుకు వచ్చిన ఆ ప్రవక్త ఆ విషయం విని “యెహోవా మాట వినక ఎదురు తిరిగిన దైవ సేవకుడు ఇతడే. యెహోవా సింహానికి అతన్ని అప్పగించేసాడు. యెహోవా చెప్పినట్టు, అది అతన్ని చీల్చి చంపేసింది” అని చెప్పాడు.
27 Il dit à ses fils: « Sellez-moi l'âne », et ils le sellèrent.
౨౭తన కొడుకులను పిలిచి “నా కోసం గాడిదను ప్రయాణానికి సిద్ధం చేయండి” అని చెప్పాడు. వారు అతని కోసం గాడిదను సిద్ధ పరిచారు.
28 Il s'en alla et trouva son corps jeté sur le chemin, et l'âne et le lion debout près du corps. Le lion n'avait pas mangé le corps ni malmené l'âne.
౨౮అతడు వెళ్లి అతని శవం దారిలో పడి ఉండడం, గాడిద, సింహం శవం దగ్గర నిలిచి ఉండడం, సింహం గాడిదను చీల్చివేయకుండా శవాన్ని తినకుండా ఉండడం చూసి
29 Le prophète prit le corps de l'homme de Dieu, le mit sur l'âne et le ramena. Il se rendit dans la ville du vieux prophète pour le pleurer et l'enterrer.
౨౯ఆ ముసలి ప్రవక్త అ దేవుని మనిషి శవాన్ని ఎత్తి గాడిద మీద వేసుకుని దుఃఖించడానికీ శవాన్ని పాతి పెట్టడానికీ తన స్వగ్రామం వచ్చాడు.
30 Il mit son corps dans son propre sépulcre, et l'on pleura sur lui en disant: « Hélas, mon frère! »
౩౦అతడు తన సొంత సమాధిలో ఆ శవాన్ని పాతిపెట్టాడు. ప్రజలు “అయ్యో! నా సోదరా” అంటూ ఏడ్చారు.
31 Après l'avoir enterré, il parla à ses fils en disant: « Quand je serai mort, enterrez-moi dans le tombeau où est enterré l'homme de Dieu. Mettez mes os à côté de ses os.
౩౧అతన్ని పాతిపెట్టిన తరువాత, ఆ ముసలి ప్రవక్త తన కొడుకులతో “నేను చనిపోయినప్పుడు ఆ ప్రవక్తను ఉంచిన సమాధిలోనే నన్నూ పాతిపెట్టండి. నా ఎముకలను అతని ఎముకల దగ్గరే పెట్టండి.
32 Car ce qu'il a crié par la parole de Yahvé contre l'autel de Béthel et contre toutes les maisons des hauts lieux qui sont dans les villes de Samarie, arrivera certainement. »
౩౨ఎందుకంటే యెహోవా మాటను బట్టి బేతేలులో ఉన్న బలిపీఠానికి వ్యతిరేకంగా, సమరయ పట్టణంలో ఉన్న ఉన్నత స్థలాల్లో ఉన్న మందిరాలన్నిటికీ వ్యతిరేకంగా అతడు ప్రకటించినది తప్పకుండా జరుగుతుంది” అని చెప్పాడు.
33 Après cela, Jéroboam ne revint pas de sa mauvaise voie, mais il établit de nouveau des prêtres des hauts lieux parmi tout le peuple. Il consacrait celui qui le voulait, afin qu'il y ait des prêtres des hauts lieux.
౩౩ఇది జరిగిన తరువాత కూడా యరొబాము తన దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు. మరో సారి సాధారణ మనుషులను ఉన్నత పూజాస్థలాలకు యాజకులుగా నియమించాడు. పూజ చేయడానికి ఇష్టపడిన వారందరినీ యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత పూజా స్థలాలకు యాజకులుగా నియమించాడు.
34 Cette chose devint un péché pour la maison de Jéroboam, au point de l'exterminer et de la faire disparaître de la surface de la terre.
౩౪యరొబాము వంశాన్ని నిర్మూలించి భూమి మీద లేకుండా చేయడానికి కారణమైన పాపం ఇదే.