< Psalmien 64 >

1 Davidin Psalmi, edelläveisaajalle. Kuule, Jumala, ääntäni, minun valituksessani: varjele elämäni vihollisen pelvosta.
ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన దేవా, నేను మొర పెట్టినప్పుడు నా మనవి విను. నా శత్రువుల భయం నుండి నా ప్రాణాన్ని కాపాడు.
2 Peitä minua pahain neuvosta, väärintekiäin metelistä,
దుర్మార్గుల కుట్ర నుండి, దుష్టక్రియలు చేసేవారి అల్లరి నుండి నన్ను దాచిపెట్టు.
3 Jotka kielensä hiovat niinkuin miekan: he ampuvat myrkyllisillä sanoillansa niinkuin nuolilla;
ఒకడు కత్తికి పదునుపెట్టేలా వారు తమ నాలుకలకు పదును పెడతారు. చేదు మాటలు అనే బాణాలను వారు ఎక్కుపెట్టారు.
4 Että he salaisesti ampuisivat viatointa: he ampuvat häntä äkisti ilman pelvota.
నిరపరాధులను కొట్టాలని రహస్య స్థలాల్లో ఆ బాణాలు సంధిస్తారు. ఏమాత్రం భయపడకుండా వారు అకస్మాత్తుగా వారిని కొడతారు.
5 He vahvistavat itsensä pahoissa juonissansa ja puhuvat, kuinka he paulat virittäisivät, ja sanovat: kuka taitaa ne nähdä?
వారు దురాలోచనలు చేస్తూ తమను తాము ప్రోత్సాహ పరచుకుంటారు. చాటుగా వల పన్నడానికి ఆలోచిస్తారు. మనలను ఎవరు చూస్తారులే అని చెప్పుకుంటారు.
6 He ajattelevat vääryyttä, ja täyttävät sen minkä he ajatelleet ovat; viekkaat ihmiset ja salakavalat sydämet.
వారు చెడ్డపనులు చేయడానికి కొత్త ప్రణాళికలు తయారు చేస్తారు. ఇది మంచి పన్నాగం, చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేశాం అని వారు చెప్పుకుంటారు. మానవుని హృదయంలోని ఆలోచనలు చాలా లోతైనవి.
7 Mutta Jumala ampuu heitä; äkillinen nuoli on heidän rangaistuksensa.
దేవుడు వారిని బాణాలతో కొడతాడు. ఉన్నట్టుండి వారు గాయాల పాలవుతారు.
8 Heidän oma kielensä pitää heitä langettaman, että jokainen, joka heidät näkee, pakenee heitä.
వారు కూలిపోతారు. దానికి కారణం వారి నాలుకలే. వారిని చూసిన వారంతా తలలు ఊపుతారు.
9 Ja kaikkein ihmisten pitää pelkäämän, ja Jumalan työtä ilmoittaman, ja hänen työnsä ymmärtämän.
మనుషులంతా భయం కలిగి దేవుడు చేసిన పనులు ప్రకటిస్తారు. ఆయన కార్యాలను గూర్చి చక్కగా ఆలోచిస్తారు.
10 Vanhurskaat pitää Herrassa riemuitseman, ja häneen uskaltaman; ja kaikki vaat sydämet kerskatkoon siitä.
౧౦నీతిపరులు యెహోవాను బట్టి సంతోషిస్తూ ఆయనలో ఆశ్రయం పొందుతారు. యథార్థవంతులు ఆయనలో గర్విస్తారు.

< Psalmien 64 >