< 5 Mooseksen 19 >

1 Kuin Herra sinun Jumalas on hävittänyt pakanat, joiden maan Herra sinun Jumalas sinulle antaa, niitä omistaakses ja asuakses heidän kaupungeissansa ja huoneissansa,
“మీ యెహోవా దేవుడు ఎవరి దేశాన్ని మీకిస్తున్నాడో ఆ ప్రజలను యెహోవా దేవుడు నాశనం చేసిన తరువాత మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని, వారి పట్టణాల్లో వారి ఇళ్ళల్లో నివసించాలి.
2 Niin eroita sinulles kolme kaupunkia sen maan keskellä, jonka Herra sinun Jumalas antaa sinun omistaakses,
మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మూడు పట్టణాలను వేరు పరచాలి.
3 Ja valmista sinulles tie, ja jaa maas rajat, jonka Herra sinun Jumalas sinulle antaa perinnöksi, kolmeen osaan, sen paeta, joka miesvahinkoon tullut on.
మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశపు సరిహద్దుల్లో హంతకుడు పారిపోయి తల దాచుకోవడానికి మూడు పట్టణాలకు వెళ్ళే దారులను కొలిచి ఏర్పరచాలి.
4 Ja se olkaan miehentappajan meno, joka sinne paeta ja elää saa: joka tappaa lähimmäisensä tietämätä, ja ei ennen vihannut häntä,
హంతకుడు పారిపోయి బతకడానికి నియమించిన పద్ధతి ఏమిటంటే, ఒకడు అంతకు ముందు తన పక్కనున్న వాడి మీద పగ ఏమీ లేకుండా
5 Vaan niinkuin joku menis metsään lähimmäisensä kanssa puita hakkaamaan, ja nostais käsin kirveensä hakkaamaan puuta maahan, ja kirves lähtis varresta, ja osais loukata lähimmäisensä niin että hän siitä kuolis: sen pitää yhteen näistä kaupungeista pakeneman ja saaman elää,
పొరపాటున వాణ్ణి చంపితే, అంటే ఒకడు చెట్లు నరకడానికి వేరొక వ్యక్తితో అడవికి వెళ్ళి చెట్లు నరకడానికి తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి ఆ వ్యక్తికి తగిలి, వాడు చనిపోతే ఆ హంతకుడు ప్రాణం నిలుపుకునేందుకు వీటిలో ఎదో ఒక పట్టణానికి పారిపోవాలి.
6 Ettei verenkostaja ajaisi miehentappajaa niinkauvan kuin hänen sydämensä on katkera, ja saavuttaisi häntä että matka pitkä on, ja löis hänen kuoliaaksi, vaikka ei hän kuoleman syytä ole tehnyt; sillä ei hän ennen vihannut häntä.
చనిపోయిన వాడి బంధువు కోపంతో హంతకుణ్ణి తరిమి, దారి చాలా దూరం గనక వాణ్ణి పట్టుకుని చంపకుండేలా వాడు ఇలా చెయ్యాలి. అతనికి ఆ వ్యక్తిపై గతంలో ఎలాంటి పగ లేదు కనుక అతడు మరణశిక్షకు పాత్రుడు కాక పోయినా ఇలా జరగవచ్చు.
7 Sentähden käsken minä sinua, sanoen: eroita sinulles kolme kaupunkia.
అందుచేత మూడు పట్టణాలను మీ కోసం ఏర్పరచుకోవాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
8 Ja jos Herra sinun Jumalas sinun maas rajat levittää, niinkuin hän vannoi isilles, ja antaa sinulle kaiken sen maan, jonka hän lupasi isilles antaa,
యెహోవా దేవుడు మీ పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు ఆయన మీ సరిహద్దులను విశాలపరచి, మీ పూర్వీకులకు ఇస్తానని చెప్పిన దేశాన్నంతా మీకిచ్చినప్పుడు మీరు యెహోవా దేవుణ్ణి గౌరవించాలి.
9 Jos muutoin pidät kaikki nämät käskyt, ja teet sen jälkeen kuin minä sinulle tänäpänä käsken, ettäs rakastat Herraa sinun Jumalaas ja vaellat hänen teissänsä kaikkena elinaikanas: niin lisää vielä kolme kaupunkia näihin kolmeen,
ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించినట్టు ఎప్పుడూ ఆయన మార్గాల్లో నడవడానికి ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఈ మూడు పట్టణాలు కాక మరో మూడు పట్టణాలను ఏర్పాటు చేసుకోవాలి.
10 Ettei viatointia verta vuodatettaisi sinun maassas, jonka Herra sinun Jumalas sinulle antaa perinnöksi, ja veren vika tulisi sinun päälles.
౧౦ఎవరినైనా హత్య చేశామన్న నేరారోపణ మీ మీదికి రాకుండా ఉండేందుకు యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇస్తున్న మీ దేశంలో నిర్దోషిని హత్య చేయకూడదు.
11 Mutta jos joku vihaa lähimmäistänsä ja väijyy häntä ja karkaa hänen päällensä ja tappaa hänen, ja se pakenee yhteen niistä kaupungeista;
౧౧ఒకడు తన పొరుగువాడి మీద పగ పట్టి, అతని కోసం కాపు కాసి అతని మీద పడి వాడు చనిపోయేలా కొట్టి
12 Niin vanhimmat hänen kaupungistansa lähettäkään sinne sanan, ja tuokaan hänen sieltä, ja antakaan hänen verenkostajan käsiin, että hän kuolis.
౧౨ఆ పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోతే, ఆ ఊరిపెద్దలు మనుషులను పంపి అక్కడనుంచి వాణ్ణి రప్పించాలి. హత్య విషయం ప్రతీకారం చేసేవాడి చేతికి అతన్ని అప్పగించి చంపించాలి.
13 Ei sinun silmäs pidä armaitseman häntä, ja sinun pitää ottaman pois viattoman veren Israelista, ettäs menestyisit.
౧౩అతడిపై కనికరం చూపించకూడదు. మీకు మేలు కలిగేలా ఇశ్రాయేలు ప్రజల మధ్యనుంచి నిర్దోషి ప్రాణం విషయంలో దోషాన్ని పరిహరించాలి.
14 Ei sinun pidä siirtämän lähimmäises rajaa, jonka entiset panneet ovat sinun perintöös, kuin sinä perit siinä maassa, jonka Herra sinun Jumalas sinulle antaa omistaakses.
౧౪మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీకు వచ్చే మీ వారసత్వంలో పూర్వీకులు నియమించిన మీ పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించ కూడదు.
15 Ei pidä todistajan yksinänsä astuman edes ketäkään vastaan, jostakusta pahasta teosta ja synnistä, mikä ikänä paha teko se olis joka tehdään; mutta kahden eli kolmen todistajan suussa ovat kaikki asiat vahvat.
౧౫ఒకడు జరిగించే పాపం, అపరాధం విషయంలో దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం మీద ప్రతి దానినీ నిర్థారణ చేయాలి.
16 Jos väärä todistaja tulee ja todistaa jotakuta vastaan ja soimaa hänelle jotain syntiä,
౧౬ఒక వ్యక్తిపై అబద్ద నేరం మోపి, అన్యాయ సాక్ష్యం చెబుతున్నట్టు అనిపిస్తే
17 Niin molemmat ne miehet, jotka riitelevät, seisokaan Herran edessä, pappein ja tuomarein edessä, jotka siihen aikaan ovat,
౧౭ఆ వివాదం ఏర్పడిన ఇద్దరూ యెహోవా ఎదుట, అంటే అప్పుడు విధుల్లో ఉన్న యాజకుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.
18 Ja tuomarit visusti tutkistelkaan sitä, ja katso, jos todistaja on väärä todistaja, ja todistaa väärin veljeänsä vastaan;
౧౮ఆ న్యాయాధిపతులు బాగా పరీక్షించిన తరువాత వాడి సాక్ష్యం అబద్ధసాక్ష్యమై తన సోదరుని మీద వాడు అబద్ధసాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైతే వాడు తన సోదరునికి చేయాలని కోరినది వాడి పట్ల జరిగించాలి.
19 Niin tehkäät hänelle niinkuin hän aikoi tehdä veljellensä, ettäs erottaisit pahan sinustas,
౧౯ఆ విధంగా మీ మధ్యనుంచి చెడుతనాన్ని తొలగిస్తారు.
20 Ja muut sen kuulisivat ja pelkäisivät, ja ei tekisi enää senkaltaista pahaa teidän seassanne.
౨౦ఇది తెలుసుకున్న మిగిలినవారు భయం వల్ల మీ దేశంలో అలాంటి దుర్మార్గపు పనులు జరిగించరు.
21 Sinun silmäs ei pidä säästämän häntä: henki hengestä, silmä silmästä, hammas hampaasta, käsi kädestä, jalka jalasta.
౨౧దుష్ట కార్యాలు జరిగించే ఎవరిపైనా కనికరం చూపకూడదు. అలాంటివారి విషయంలో ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు నియమం పాటించాలి.”

< 5 Mooseksen 19 >