< 1 Timoteukselle 3 >
1 Se on totinen sana: jos joku piispan virkaa pyytää, hän hyvää työtä halajaa.
౧ఎవరైనా సంఘానికి అధ్యక్షుడుగా ఉండాలనుకుంటే అతడు శ్రేష్ఠమైన పనిని కోరుకుంటున్నాడు అనే మాటను నమ్మవచ్చు.
2 Niin pitää siis piispan oleman nuhteettoman, yhden emännän miehen, valppaan, raittiin, siviän, vierasten holhojan, opettavaisen.
౨కాబట్టి అధ్యక్షుడు నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య ఉన్నవాడూ కోరికలు అదుపులో ఉంచుకునేవాడూ వివేచనాపరుడూ మర్యాదస్థుడూ అతిథి ప్రియుడూ బోధించడానికి సమర్థుడూ అయి ఉండాలి.
3 Ei juomarin, ei tappelian, ei ilkiän voiton pyytäjän, vaan armeliaan, ei riitaisen eikä ahneen,
౩అతడు తాగుబోతూ జగడాలమారీ కాక మృదుస్వభావి, ధనాశ లేనివాడూ అయి ఉండాలి.
4 Joka oman huoneensa hyvin hallitsee, jolla kuuliaiset lapset ovat, kaikella kunniallisuudella:
౪తన పిల్లలు తనకు సరైన గౌరవంతో లోబడేలా చేసుకుంటూ తన కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకునేవాడై ఉండాలి.
5 (Mutta jos joku ei taida omaa huonettansa hallita, kuinkas hän Jumalan seurakunnan taitaa hallita?)
౫ఎవడైనా తన కుటుంబాన్నే సరిగా నిర్వహించకపోతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు?
6 Ei äsken kristityn, ettei hän paisuneena laittajan tuomioon lankeaisi.
౬అతడు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఎందుకంటే అతడు గర్విష్టి అయి అపవాది పొందిన శిక్షనే పొందుతాడేమో.
7 Mutta hänellä pitää myös hyvä todistus oleman niiltä, jotka ulkona ovat, ettei hän laittajan pilkkaan ja paulaan lankeaisi.
౭అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండేలా సంఘానికి బయట ఉన్నవారి చేత మంచి పేరు పొందినవాడై ఉండాలి.
8 Niin pitää myös seurakunnan palveliat toimelliset oleman, ei kaksikieliset, ei juomarit, ei häpiällisen voiton pyytäjät,
౮అలాగే పరిచారకులు గౌరవానికి తగినవారుగా, రెండు నాలుకలతో మాట్లాడనివారుగా ఉండాలి. తాగుబోతులుగా, అక్రమ లాభం ఆశించేవారుగా ఉండకూడదు.
9 Jotka uskon salaisuuden puhtaassa omassatunnossa pitävät,
౯వెల్లడైన విశ్వాస సత్యాన్ని పవిత్రమైన మనస్సాక్షితో అంటిపెట్టుకొనే వారుగా ఉండాలి.
10 Jotka pitää ensin koeteltaman, ja palvelkaan sitte kuin he nuhteettomiksi löydetään.
౧౦మొదట వారిని పరీక్షించాలి. తరువాత వారు నిందకు చోటివ్వనివారని తేలితే పరిచారకులుగా సేవ చేయవచ్చు.
11 Heidän emäntänsä pitää myös siviät oleman, ei laittajat, vaan raittiit, kaikissa uskolliset.
౧౧అలాగే వారి భార్యలు కూడా గౌరవించదగినవారూ అపనిందలు ప్రచారం చేయనివారూ తమ కోరికలు అదుపులో ఉంచుకొనేవారూ అన్ని విషయాల్లో నమ్మకమైనవారూ అయి ఉండాలి.
12 Seurakunnan palveliat olkoon yhden emännän miehet, jotka lapsensa ja oman huoneensa hyvin hallitsevat.
౧౨పరిచారకులు ఒకే భార్య కలిగినవారూ, తమ పిల్లలనూ తమ ఇంటివారిని చక్కగా నిర్వహించుకొనేవారుగా ఉండాలి.
13 Sillä jotka hyvin palvelevat, he hyvän menestyksen ansaitsevat ja suuren vapauden uskossa, joka on Kristuksessa Jesuksessa.
౧౩పరిచారకులుగా మంచి సేవ చేసిన వారు మంచి స్థానం సంపాదించుకుని క్రీస్తు యేసు పైని విశ్వాసంలో గొప్ప ధైర్యం పొందుతారు.
14 Näitä minä kirjoitan sinulle, ja toivon pian tulevani sinun tykös;
౧౪త్వరలో నీ దగ్గరికి రావాలని ఆశిస్తున్నాను.
15 Mutta jos minä viivyn, ettäs tietäisit kuinka sinun pitää Jumalan huoneessa vaeltaman, joka on elävän Jumalan seurakunta, totuuden patsas ja perustus.
౧౫ఒకవేళ నేను రావడం ఆలస్యమైతే ఒక వ్యక్తి దేవుని ఇంట్లో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఎలా నడుచుకోవాలో నీకు తెలియాలని ఈ సంగతులు రాస్తున్నాను. ఆ సంఘం సత్యానికి మూల స్తంభమూ, ఆధారమూ.
16 Ja se on julkisesti suuri jumalisuuden salaisuus, että Jumala on ilmoitettu lihassa, vanhurskautettu hengessä, nähty enkeleiltä, saarnattu pakanoille, uskottu maailmassa ja otettu ylös kunniaan.
౧౬మన దైవభక్తిని గురించి వెల్లడైన సత్యం గొప్పది. ఏ సందేహమూ లేదు. ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. ఆయన నీతిపరుడని ఆత్మ తీర్పునిచ్చాడు. ఆయనను దేవదూతలు చూశారు. దేశ దేశాల్లో ఆయన ప్రచారం అయ్యాడు. లోకం ఆయనను నమ్మింది. మహిమతో ఆయన ఆరోహణమయ్యాడు.