< 1 Aikakirja 29 >

1 Ja kuningas David sanoi koko joukolle: Salomon, yhden minun pojistani, on Jumala valinnut, joka vielä nuori ja heikko on, mutta työ on suuri; sillä ei se ole ihmisen asumasia, vaan Herran Jumalan.
తరువాత రాజైన దావీదు సంఘంతో “దేవుడు కోరుకున్న నా కొడుకు సొలొమోను ఇంకా అనుభవం లేని చిన్నవాడే. కట్టే ఈ ఆలయం మనిషి కోసం కాదు. ఇది దేవుడైన యెహోవా కోసం గనుక, ఈ పని చాలా గొప్పది.
2 Ja minä olen kaikesta voimastani valmistanut Jumalani huoneelle kultaa kultakaluiksi, hopiaa hopiaisiksi, vaskea vaskisiksi, rautaa rautaisiksi, puita puuaseiksi, ja onikin kiviä, kiinniliitetyitä rubineja, monen-pilkullisia kiviä, ja kaikkinaisia kalliita kiviä, ja marmorikiviä sangen paljon.
నేను చాలా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుప పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేధికపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన రంగులున్న అనేక రకాల రాళ్ళు, చాలా విలువైన అనేక రకాల రత్నాలు, తెల్ల పాల రాయి విస్తారంగా సంపాదించాను.
3 Ja olen vielä antanut hyvästä tahdostani Jumalani huoneesen mitä minun omani on, kultaa ja hopiaa, ylitse sen kaiken, minkä minä olen valmistanut pyhän huoneesen:
ఇంకా, నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువతో నేను ఆ ప్రతిష్ఠిత మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాకుండా, నా సొంత బంగారం, వెండి, నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తున్నాను.
4 Kolmetuhatta leiviskää ophirin kultaa ja seitsemäntuhatta leiviskää puhdasta hopiaa, silata huonetten seiniä,
గదుల గోడల రేకు అతకడం కోసం బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, పనివాళ్ళు చేసే ప్రతి విధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారం, పద్నాలుగు వేల మణుగుల స్వచ్ఛమైన వెండిని ఇస్తున్నాను.
5 Kultaa kultaisiin, ja hopiaa hopiaisiin ja kaikkinaisiin töihin, tekiäin käden kautta. Ja kuka on hyväntahtoinen täyttämään kättänsä tänäpänä Herralle?
ఈ రోజు యెహోవాకు ప్రతిష్టితంగా, మనస్పూర్తిగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?” అన్నాడు.
6 Niin isäin päämiehet ja Israelin sukukuntain päämiehet, niin myös tuhanten ja satain päämiehet, ja kuninkaan töiden päämiehet olivat hyväntahtoiset,
అప్పుడు పూర్వీకుల ఇళ్ళకు అధిపతులూ, ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, రాజు పని మీద నియామకం అయిన అధిపతులూ కలసి
7 Ja antoivat Jumalan huoneen palvelukseen viisituhatta leiviskää kultaa, ja kymmenentuhatta kultapenninkiä, ja kymmenentuhatta leiviskää hopiaa, kahdeksantoistakymmentä tuhatta leiviskää vaskea, ja satatuhatta leiviskää rautaa.
మనస్పూర్తిగా దేవుని మందిరపు పనికి 188 మణుగుల బంగారం, 10,000 మణుగుల బంగారపు నాణాలు, 375 మణుగుల వెండి, 675 మణుగుల ఇత్తడి, 3, 750 మణుగుల ఇనుము ఇచ్చారు.
8 Ja joiden tyköä kiviä löydettiin, ne he antoivat Herran huoneen tavaroihin, Jehielin Gersonilaisen käden alle.
తమ దగ్గర రత్నాలున్న వాళ్ళు వాటిని తెచ్చి యెహోవా మందిరపు గిడ్డంగులకు అధిపతిగా ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చారు.
9 Ja kansa iloitsi, että he niin hyvästä tahdosta antoivat; sillä he antoivat Herralle vaasta sydämestä, vapaasta tahdostansa. Ja kuningas David oli myös sangen suuresti iloissansa.
వాళ్ళు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చారు గనుక ఆ విధంగా మనస్పూర్తిగా ఇచ్చినందుకు ప్రజలు సంతోషపడ్డారు.
10 Ja David kiitti Herraa kaiken kansan edestä ja sanoi: kiitetty ole sinä Herra, Israelin meidän isämme Jumala ijankaikkisesta ijankaikkiseen!
౧౦రాజైన దావీదు కూడా ఎంతో సంతోషపడి, సమావేశం అందరి ఎదుటా యెహోవాకు స్తోత్రాలు చెల్లిస్తూ “మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, నిరంతరం నువ్వు స్తోత్రానికి అర్హుడవు.
11 Sillä sinun, Herra, on suuruus, ja voima, ja kunnia, ja voitto, ja kiitos; sillä kaikki, mitä taivaassa ja maan päällä on, se on sinun. Sinun Herra on valtakunta, ja sinä olet korotettu kaikkein päämiesten ylitse.
౧౧యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు.
12 Rikkaus ja kunnia ovat sinun edessäs, ja sinä hallitset kaikki kappaleet, ja sinun kädessäs on väki ja voima: sinun kädessäs on kaikki suureksi ja väkeväksi tehdä.
౧౨ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే.
13 Ja nyt meidän Jumalamme! me kiitämme sinua, ja ylistämme sinun kunnias nimeä.
౧౩మా దేవా, మేము నీకు కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావం గల నీ పేరును కొనియాడుతున్నాం.
14 Sillä mikä minä olen, ja mikä on minun kansani, että me olemme niin paljon voineet antaa hyvällä mielellä, niinkuin se nyt tapahtuu? sillä se on kaikki sinulta tullut, ja sinun kädestäs olemme me antaneet sinulle sen.
౧౪ఈ విధంగా మనస్పూర్తిగా ఇచ్చే సామర్ధ్యం మాకు కలగడానికి నేను ఏమాత్రం వాణ్ణి? నా ప్రజలు ఏమాత్రం వాళ్ళు? అన్నీ నీ వలనే కలిగాయి గదా? నీ దానిలో నుంచి కొంత మేము నీకిచ్చాం.
15 Sillä me olemme muukalaiset ja oudot sinun edessäs, niinkuin kaikki meidän isämmekin: meidän ikämme on maan päällä niinkuin varjo, ja ei täällä ole yhtään viipymystä.
౧౫మా పూర్వీకులందరిలా మేము కూడా నీ సన్నిధిలో అతిథులంగా, పరదేశులంగా ఉన్నాం. మా భూనివాస కాలం ఒక నీడ లాంటిది. శాశ్వతంగా ఉండేవాడు ఒక్కడూ లేడు.
16 Herra meidän Jumalamme! kaikki tämä kalun paljous, jonka me olemme valmistaneet sinun pyhälle nimelles rakentaa huonetta, se on kaikki tullut sinun kädestäs, ja ne ovat kaikki sinun.
౧౬మా దేవా యెహోవా, నీ పవిత్ర నామ ఘనత కోసం మందిరం కట్టించడానికి మేము సమకూర్చిన ఈ వస్తువులన్నీ నీ వల్ల కలిగినవే. ఇదంతా నీదే.
17 Minun Jumalani! minä tiedän, ettäs tutkistelet sydämen ja tahdot vakuutta. Sentähden olen myös minä kaikki nämät yksivakaisesta sydämestä antanut vapaalla mielellä. Ja minä näin nyt ilolla tämän sinun kansas, joka tässä on, että se on hyvällä mielellä sinulle antanut.
౧౭నా దేవా, నువ్వు హృదయాన్ని చూస్తూ, నిజాయితీ ఉన్నవాళ్ళను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నేనైతే నిజాయితీగా ఇవన్నీ మనస్పూర్తిగా ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడున్న నీ ప్రజలు కూడా మనస్ఫూర్తిగా నీకు ఇవ్వడం చూసి సంతోషిస్తున్నాను.
18 Herra meidän isäimme Abrahamin, Isaakin ja Israelin Jumala! pidä ijankaikkisesti tämänkaltainen mieli ja tahto kansas sydämessä, ja valmista heidän sydämensä sinun tykös.
౧౮అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అనే మా పూర్వీకుల దేవా యెహోవా, నీ ప్రజలు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశాన్ని నిత్యం కాపాడు. వాళ్ళ హృదయం నీకు అనుకూలంగా ఉండేలా చెయ్యి.
19 Ja pojalleni Salomolle anna täydellinen sydän pitämään sinun käskys, todistukses ja säätys, niin että hän ne kaikki tekis ja rakentais tämän asuinsian, jonka minä olen valmistanut.
౧౯నా కొడుకు సొలొమోను నీ ఆజ్ఞలకు, నీ శాసనాలకు, నీ కట్టడలకు లోబడుతూ, వాటినన్నిటినీ అనుసరించేలా నేను కట్టదలచిన ఈ ఆలయం కట్టించడానికి అతనికి నిర్దోషమైన హృదయం ఇవ్వు” అన్నాడు.
20 Ja David sanoi kaikelle kansalle: kiittäkäät Herraa teidän Jumalaanne! ja kaikki kansa kiitti Herraa isäinsä Jumalaa, kumarsivat ja rukoilivat Herraa ja kuningasta,
౨౦ఈ విధంగా అన్న తరువాత దావీదు “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించండి” అని ప్రజల సమావేశం అంతటితో చెప్పినప్పుడు వాళ్ళందరూ తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిలో రాజు ముందు తల వంచి నమస్కారం చేశారు.
21 Ja he uhrasivat Herralle uhrin, ja toisena päivänä uhrasivat he polttouhrin Herralle, tuhannen mullia, tuhannen oinasta, tuhannen karitsaa, ja heidän juomauhrinsa, ja monta muuta uhria kaiken Israelin edessä.
౨౧తరువాత వాళ్ళు యెహోవాకు బలులు అర్పించారు. తరువాత రోజు, దహనబలిగా వెయ్యి ఎద్దులను, వెయ్యి పొట్టేళ్లను, వెయ్యి గొర్రె పిల్లలను, వాటి పానార్పణలతో పాటు ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగినట్టుగా అర్పించారు.
22 Ja he söivät ja joivat sinä päivänä sangen suurella ilolla Herran edessä, ja tekivät Salomon Davidin pojan toisen kerran kuninkaaksi ja voitelivat hänen Herralle hallitsiaksi ja Zadokin papiksi.
౨౨ఆ రోజు వాళ్ళు యెహోవా సన్నిధిలో ఎంతో సంతోషంతో అన్నపానాలు పుచ్చుకున్నారు. దావీదు కొడుకు సొలొమోనుకు రెండో సారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పరిపాలకుడిగా, సాదోకును యాజకునిగా, అభిషేకించారు.
23 Ja niin Salomo istui Herran istuimelle kuninkaaksi isänsä Davidin siaan, ja oli onnellinen; ja koko Israel oli hänelle kuuliainen.
౨౩అప్పుడు సొలొమోను తన తండ్రి దావీదుకు బదులుగా యెహోవా సింహాసనం మీద రాజుగా కూర్చుని వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు లోబడ్డారు.
24 Niin myös kaikki päämiehet ja voimalliset, ja kaikki kuningas Davidin lapset antoivat itsensä kuningas Salomon alle.
౨౪అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కొడుకులు అందరూ రాజైన సొలొమోనుకు లోబడ్డారు.
25 Ja Herra teki Salomon enemmin ja enemmin suuremmaksi kaiken Israelin edessä, ja antoi hänelle kuuluisan valtakunnan, jonkakaltaista ei yhdelläkään kuninkaalla Israelissa hänen edellänsä ole ollut.
౨౫యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ముందు ఎంతో ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజుకైనా దక్కని రాజ్యప్రభావం అతనికి అనుగ్రహించాడు.
26 Ja niin oli David, Isain poika, koko Israelin kuningas.
౨౬యెష్షయి కొడుకు దావీదు, ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉన్నాడు.
27 Mutta aika, jonka hän oli Israelin kuninkaana, oli neljäkymmentä ajastaikaa. Hebronissa hän hallitsi seitsemän ajastaikaa ja Jerusalemissa kolmeneljättäkymmentä.
౨౭అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలం నలభై సంవత్సరాలు. హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్ఫై మూడు సంవత్సరాలు అతడు ఏలాడు.
28 Ja hän kuoli hyvällä ijällä, ravittuna elämästä, rikkaudesta ja kunniasta; ja hänen poikansa Salomo tuli kuninkaaksi hänen siaansa.
౨౮అతడు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఐశ్వర్యం, ఘనత కలిగి, మంచి పండు వృద్ధాప్యంలో మరణించాడు. అతని తరువాత అతని కొడుకు సొలొమోను అతనికి బదులుగా రాజయ్యాడు.
29 Mutta kuningas Davidin teot ensimäiset ja viimeiset, katso, ne ovat kirjoitetut näkiän Samuelin teoissa, ja prophetan Natanin teoissa, ja näkiän Gadin teoissa,
౨౯రాజైన దావీదు సాధించిన విజయాలు ప్రవక్త సమూయేలు రాసిన చరిత్రలోను, ప్రవక్త నాతాను రాసిన చరిత్రలోను, ప్రవక్త గాదు రాసిన చరిత్రలోను ఉన్నాయి.
30 Kaiken hänen valtakuntansa, väkevyytensä ja aikainsa kanssa, jotka hänen ja Israelin, ja kaikkein maan valtakuntain aikana kuluneet ovat.
౩౦అతని పరిపాలన చర్యలు, అతని విజయాలు, అతనికీ, ఇశ్రాయేలీయులకూ, ఇతర రాజ్యాలన్నిటికీ జరిగిన పరిణామాల గూర్చి వారు రాశారు.

< 1 Aikakirja 29 >