< Hawo 3 >
1 Medi ame si nye dzi lɔ̃na la le nye aba dzi zã blibo la katã; medii, gake nyemekpɔe o.
౧(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) రాత్రిపూట పడుకుని నేను నా ప్రాణప్రియుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అతని కోసం నేనెంతగానో ఎదురు చూసినా అతడు కనబడలేదు.
2 Matso azɔ ayi aɖadii le dua me, le ablɔwo dzi kple kpɔdomewo. Matsa adi ame si nye dzi lɔ̃na la, ale medii ʋuu keke, gake nyemekpɔe o.
౨“నేను లేచి వీధుల గుండా పట్టణమంతా తిరిగి నా ప్రాణప్రియుడి కోసం వెతుకుతాను” అనుకున్నాను. నేనతన్ని వెతికినా అతడు కనబడలేదు.
3 Esi mele tsatsam le dua me le edim la, medo go zãdzɔlawo, eye mebia wo be, “Miekpɔ ame si nye dzi lɔ̃na la mahã?”
౩పట్టణంలో గస్తీ తిరిగేవాళ్ళు నాకెదురు పడ్డారు. “మీరు నా ప్రాణప్రియుని చూశారా?” అని అడిగాను.
4 Nyemekpɔ dze le wo ŋu hafi kpɔ ame si nye dzi lɔ̃na la o. Meku ɖe eŋu goŋgoŋgoŋ be madzo o, va se ɖe esime mekplɔe yi danye ƒe aƒe me, yi ɖe ame si dzim la ƒe xɔ me.
౪నేను వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరం ముందుకు వెళితే, ప్రాణప్రియుడు నాకు కనిపించాడు. నేనతన్ని గట్టిగా పట్టుకుని వదలిపెట్టక నా పుట్టింటికి తీసుకొచ్చాను. నేను కడుపున పడ్డ పడకగది లోకి తీసుకొచ్చాను.
5 Yerusalem nyɔnuviwo, meta sãde kple zinɔ le gbe me na mi be, “Migaʋuʋu lɔlɔ̃ alo anyɔe o, va se ɖe esime eya ŋutɔ nalɔ̃ hafi.”
౫(ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి. మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచ వద్దు.
6 Ame kae nye esi gbɔna tso gbegbe abe dzudzɔ babla si wotɔtɔ kple lifi kple atike ʋeʋĩ si wowɔ kple nu vovovo siwo woƒle le asitsalawo si la ene?
౬[మూడవ భాగం] (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) ధూమ స్తంభంలాగా ఎడారి దారిలో వచ్చేది ఏంటది? బోళం, సాంబ్రాణి పరిమళాలతో వర్తకులమ్మే రకరకాల సుగంధ చూర్ణాలతో గుబాళిస్తూ వచ్చేది ఎవరు?
7 Kpɔ ɖa, Solomo ƒe tasiaɖam ye! Kalẽtɔ blaade siwo nye aʋakalẽtɔ akuakuawo tso Israel ƒe aʋakɔwo dome la le eŋu dzɔm.
౭అదుగో సొలొమోను పల్లకి. అరవై మంది వీరులు దాని చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలు వీరులు.
8 Wo katã wota yi ɖe aklito, wobi ɖe aʋawɔwɔ me, woƒe asiwo le woƒe yiwo dzi, eye wole klalo na zãmeŋɔdzi ɖe sia ɖe.
౮వారంతా కత్తిసాములో నిష్ణాతులు. యుద్ధరంగంలో ఆరితేరిన వారు. రాత్రి పూట జరిగే అపాయాలకు సన్నద్ధులై వస్తున్నారు.
9 Fia Solomo ŋutɔe wɔ tasiaɖam la na eɖokui, ewɔe kple ʋuƒo siwo wotsɔ tso Lebanon.
౯లెబానోను మానుతో ఒక పల్లకి సొలొమోనురాజు తనకు చేయించుకున్నాడు.
10 Ewɔ eƒe afɔtiwo kple klosalo, eye wòwɔ egɔme kple sika. Wotsɔ agovɔ nyuitɔ wɔ zikpui si le eme, eye wotsɔ Yerusalem nyɔnuviwo ƒe lɔlɔ̃ ɖo atsyɔ̃ na emee.
౧౦దాని స్తంభాలు వెండితో చేశారు. దాని అడుగుభాగం బంగారుది. దాని దిండ్లు ఊదా రంగువి. యెరూషలేము కుమార్తెలు ప్రేమతో దాని లోపలిభాగం అలంకరించారు.
11 Mi Zion vinyɔnuwo, mido go va kpɔ Fia Solomo si ɖɔ fiakuku, kuku si dadaa ɖɔ nɛ le eƒe srɔ̃ɖegbe, gbe si gbe eƒe dzi kpɔ dzidzɔ vevie la ɖa.
౧౧(యువతి యెరూషలేము స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) సీయోను ఆడపడుచులారా, బయటికి వెళ్లి కిరీటం ధరించిన సొలొమోనురాజును కన్నుల పండగగా చూడండి. అతని పెళ్లి రోజున అతని తల్లి అతనికి ఆ కిరీటం పెట్టింది. అది అతనికి ఎంతో ఆనందకరమైన రోజు.