< Yeremia 35 >
1 Esia nye nya si va na Yeremia tso Yehowa gbɔ esi Yehoyakim, Yosia ƒe vi le fia ɖum le Yuda.
౧యోషీయా కొడుకూ, యూదా రాజు అయిన యెహోయాకీము రోజుల్లో యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా అన్నాడు,
2 “Yi ɖe Rekabi ƒomea gbɔ, eye nàkpe wo ayi ɖe Yehowa ƒe gbedoxɔ ƒe xɔŋuxɔewo dometɔ ɖeka me eye nàku wain na wo woano.”
౨“నువ్వు రేకాబీయుల దగ్గరికి వెళ్లి, వాళ్ళతో మాట్లాడి, యెహోవా మందిరంలో ఉన్న గదుల్లో ఒకదానిలోకి వాళ్ళను తీసుకొచ్చి, తాగడానికి వాళ్లకు ద్రాక్షారసం ఇవ్వు.”
3 Ale meyi be mayɔ Yazania, Yeremia ƒe vi, Habazinia ƒe vi, nɔvia ŋutsuwo kple via ŋutsuwo kple Rekabi ƒomea katã.
౩కాబట్టి నేను, యిర్మీయా కొడుకూ, యజన్యా మనవడూ అయిన హబజ్జిన్యాను, అతని సోదరులను, అతని కొడుకులందరినీ అంటే రేకాబీయుల కుటుంబికులను తీసుకొచ్చాను.
4 Mekplɔ wo va Yehowa ƒe gbedoxɔ mee eye míege ɖe Mawu ƒe ame, Igdalia ƒe vi, Hanan ƒe viŋutsuwo ƒe xɔ me enye xɔ si te ɖe dɔdzikpɔlawo ƒe xɔ ŋu eye wòle agbonudzɔla, Salum ƒe vi Maaseya ƒe xɔ tame.
౪యెహోవా మందిరంలో దైవజనుడైన యిగ్దల్యా కొడుకు, హానాను కొడుకుల గదిలోకి వాళ్ళను తీసుకొచ్చాను. అది రాజుల గదికి దగ్గరలో ఉన్న ద్వారపాలకుడూ, షల్లూము కొడుకు అయిన మయశేయా గదికి పైగా ఉంది.
5 Tete metsɔ goe siwo wain yɔ banaa la kple kpluwo ɖo Rekabi ƒomea ƒe ŋutsuwo kɔme hegblɔ na wo be, “Mino wain.”
౫నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షా రసంతో నిండిన పాత్రలు, గిన్నెలు పెట్టి “ద్రాక్షా రసం తాగండి” అని వాళ్ళతో చెప్పాను.
6 Gake woɖo eŋu nam be, “Míenoa wain o, elabena mía tɔgbuigã, Yonadab, Rekab ƒe vi de se sia na mí be, ‘Miawo ŋutɔwo loo, alo miaƒe dzidzimeviwo mekpɔ mɔ ano wain gbeɖe o.
౬కాని వాళ్ళు “మా పితరుడైన రేకాబు కొడుకు యెహోనాదాబు, ‘మీరు గానీ మీ సంతానం గానీ ఎప్పుడూ ద్రాక్షారసం తాగకూడదు,’ అని మాకు ఆజ్ఞాపించాడు గనక, మేం ద్రాక్షారసం తాగం.
7 Gawu la, miatu xɔwo, aƒã nuku alo ade waingble gbeɖe o; nu siawo ƒe ɖeke mekpɔ mɔ anɔ mia si o, ke boŋ mianɔ avɔgbadɔwo me ɣe sia ɣi. Ekema mianɔ agbe didi le anyigba la dzi, afi si mienye tsatsalawo le.’
౭ఇంకా, ‘మీరు ఇళ్ళు కట్టుకోవద్దు, విత్తనాలు చల్ల వద్దు, ద్రాక్షతోట నాటవద్దు, అది మీకు ఉండనే ఉండకూడదు, మీరు పరదేశులుగా ఉంటున్న దేశంలో దీర్ఘాయుష్మంతులయ్యేలా మీ రోజులన్నీ గుడారాల్లోనే మీరు నివాసం చెయ్యాలి,’ అని అతడు మాకు ఆజ్ఞాపించాడు.
8 Míewɔ ɖe nu sia nu si ƒe se mía tɔgbuigã, Yehonadab, Rekab ƒe vi la de na mí la dzi. Míawo ŋutɔ loo alo mía srɔ̃nyɔnuwo, alo mia viŋutsuwo kple vinyɔnuwo meɖɔ wain kpɔ,
౮కాబట్టి మా పితరుడైన రేకాబు కొడుకు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన అన్ని విషయాల్లో అతని మాటను బట్టి మేము, మా భార్యలు, మా కొడుకులు, మా కూతుళ్ళు ద్రాక్షారసం తాగడం లేదు.
9 alo tu xɔwo be mianɔ wo me, alo de waingble, agblewo, alo xa nukuwo kpɔ o.
౯మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన దానికి మేము విధేయులం అయ్యేందుకు, మేము ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండం. ద్రాక్ష తోటలు, పొలాలు, విత్తనాలు మా ఆస్తులుగా ఉండవు.
10 Agbadɔxɔwo me koe míenɔna eye míewɔ ɖe se siwo katã mía tɔgbuigã, Yonadab de na mí la dzi.
౧౦గుడారాల్లోనే నివాసం ఉంటాం.
11 Gake esi Babilonia fia, Nebukadnezar va dze anyigba sia dzi la, míegblɔ be, ‘Miva míayi ɖe Yerusalem, ne míasi le Babilonia kple Aramea ƒe aʋakɔwo nu.’ Ale míetsi Yerusalem.”
౧౧కాని, బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశం మీద దాడి చేసినప్పుడు, ‘కల్దీయుల సైన్యం, సిరియనుల సైన్యం నుంచి మనం తప్పించుకుని యెరూషలేముకు వెళ్దాం రండి’ అని మేము చెప్పుకున్నాం కాబట్టి మేము యెరూషలేములో నివాసం ఉంటున్నాం” అని చెప్పారు.
12 Tete Yehowa ƒe nya va na Yeremia be,
౧౨అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమంటే,
13 “Ale Yehowa, Dziƒoʋakɔwo ƒe Aƒetɔ, Israel ƒe Mawu la gblɔe nye esi: Yi nàgblɔ na Yuda ŋutsuwo kple Yerusalem nɔlawo be, ‘Miele nu srɔ̃ ge awɔ ɖe nye nyawo dzi oa?’ Yehowae gblɔe.
౧౩నువ్వు వెళ్లి యూదా వాళ్ళకూ, యెరూషలేము నివాసులకూ ఈ మాట ప్రకటించు, ‘యెహోవా వాక్కు ఇదే, మీరు దిద్దుబాటుకు లోబడి నా మాటలు వినరా?’ ఇదే యెహోవా వాక్కు.
14 ‘Yehonadab, Rekab ƒe vi de se na via ŋutsuwo be womegano wain o, eye wolé eƒe sea me ɖe asi. Va se ɖe egbeŋkekea dzi womenoa wain o, elabena wolé wo tɔgbui ƒe sea me ɖe asi. Gake nye ya meƒo nu na mi edziedzi, ke miegbe toɖoɖom.
౧౪‘ద్రాక్షారసం తాగొద్దు,’ అని రేకాబు కొడుకు యెహోనాదాబు తన కొడుకులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నాయి, ఈ రోజు వరకూ తమ పితరుడి ఆజ్ఞకు విధేయులై వాళ్ళు ద్రాక్షారసం తాగడం లేదు. కాని, నేను ఉదయాన్నే లేచి మీతో ఎంతో శ్రద్ధగా మాట్లాడినా, మీరు నా మాట వినరు.
15 Meɖo nye dɔla nyagblɔɖilawo ɖe mi enuenu, wogblɔ na mi be. “Mia dometɔ ɖe sia ɖe netrɔ tso eƒe mɔ vɔ̃wo dzi ne wòaɖɔ eƒe agbenɔnɔ ɖo eye migadze mawu tutɔwo yome be miasubɔ wo o. Ekema mianɔ anyigba si metsɔ na mi kple mia fofowo la dzi.” Gake mietsɔ ɖeke le eme alo ɖo tom o.
౧౫ఉదయాన్నే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ దగ్గరికి పంపుతూ, ‘ప్రతివాడూ తన దుర్మార్గత విడిచి మంచి పనులు చేయాలి, అన్యదేవుళ్ళ వెంట పడకూడదు. వాటిని పూజించకూడదు. నేను మీకూ, మీ పితరులకూ ఇచ్చిన దేశానికి తిరిగి వచ్చి దానిలో నివాసం ఉండాలి’ అని నేను ప్రకటించాను గాని, మీరు పట్టించుకోలేదు. నా మాట వినలేదు.
16 Rekab ƒe vi, Yehonadab, ƒe dzidzimeviwo wɔ ɖe se si wo tɔgbui de na wo la dzi, ke dukɔ sia ya meɖo tom o.’
౧౬రేకాబు కొడుకు యెహోనాదాబు సంతానం తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చారు. కాని ఈ ప్రజలు నా మాట వినరు.
17 “Eya ta ale Yehowa, Dziƒoʋakɔwo ƒe Mawu, Israel ƒe Mawu la gblɔe nye esi: ‘Miɖo to! Mahe gbegblẽ si meɖe gbeƒãe la ava Yuda kple ame sia ame si le Yerusalem la dzi. Meƒo nu na wo, gake womeɖo tom o meyɔ wo gake wometɔ o.’”
౧౭కాబట్టి, ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘చూడు, నేను వాళ్ళతో మాట్లాడాను గాని వాళ్ళు వినలేదు. నేను వాళ్ళను పిలిచాను గాని వాళ్ళు పలకలేదు. గనుక యూదా, యెరూషలేము నివాసులందరి మీదకీ తీసుకొస్తానని నేను చెప్పిన కీడంతా వాళ్ళ మీదకి తీసుకురాబోతున్నాను.’”
18 Ale Yeremia gblɔ na Rekabi ƒomea be, “Ale Yehowa, Dziƒoʋakɔwo ƒe Aƒetɔ la, Israel ƒe Mawu la gblɔe nye si, ‘Miewɔ ɖe mia tɔgbui Yehonadab ƒe sedede dzi eye miewɔ ɖe eƒe ɖoɖowo kple nu siwo katã wòɖo anyi na mi la dzi.’
౧౮యిర్మీయా రేకాబీయులను చూసి ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ పాటించి, అతడు మీకు ఆజ్ఞాపించినవన్నీ చేస్తున్నారు.
19 Eya ta ale Yehowa, Dziƒoʋakɔwo ƒe Aƒetɔ, Israel ƒe Mawu la gblɔe nye esi: ‘Yonadab, Rekab ƒe vi magbe ame si asubɔe la kpɔkpɔ gbeɖe o.’”
౧౯కాబట్టి, ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా చెప్పేదేమంటే, ‘నాకు సేవ చెయ్యడానికి, రేకాబు కొడుకు యెహోనాదాబు సంతతివాడు ఒకడు ఎప్పుడూ ఉంటాడు.’”