< Hezekiel 4 >
1 “Azɔ la, ame vi, tsɔ anyikpe aɖe, dae ɖe wò ŋkume, eye nàta Yerusalem du la ɖe edzi.
౧అయితే నరపుత్రుడా, ఒక పెంకు తీసుకో. దాన్ని నీముఖానికి ఎదురుగా ఉంచుకో. దాని పైన యెరూషలేము పట్టణం నమూనాను చిత్రించు.
2 Na ameawo naɖe to ɖee; tu nu siwo woatsɔ aɖe to ɖee la ɖe eŋu. Tu xɔ tsralawo ɖe eŋu, eye nàtu gligbãnuwo aƒo xlãe.
౨అది శత్రువుల ముట్టడిలో ఉన్నట్టుగా, దాని ఎదుట ప్రాకారాలు నిర్మించినట్టుగా చిత్రించు. దానిపై దాడి చేయడానికి వీలుగా ఉన్నత ప్రాంతాలనూ, దాని చుట్టూ సైనిక శిబిరాలనూ చిత్రించు. ప్రాకారాలను ధ్వంసం చేసే యంత్రాలను చిత్రించు.
3 Emegbe la, nàtsɔ gagba awɔ gagli ɖe wò kple dua ƒe gliwo dome, eye nàdze ŋgɔe. Woaɖe to ɖee, eye nàxaxae ɖo. Esia anye dzesi aɖe na Israel ƒe aƒe la.
౩తరువాత నువ్వు ఒక ఇనుప రేకును తీసుకుని దాన్ని నీకూ పట్టణానికీ మధ్య ఇనుప గోడగా నిలబెట్టు. పట్టణం ముట్టడికి గురౌతుంది కాబట్టి పట్టణానికి అభిముఖంగా నిలబడు. నీవు పట్టణాన్ని ముట్టడిస్తున్నట్టు ఉంటావు. ఇశ్రాయేలు జాతికి ఇది సూచనగా ఉంటుంది.
4 “Ekema nàmlɔ wò miamekpa dzi, eye nàtsɔ Israel ƒe aƒe la ƒe nu vɔ̃wo ada ɖe ɖokuiwò dzi. Ele na wò be nàtsɔ woƒe nu vɔ̃wo ŋkeke ale si nàmlɔ wò miamekpa dzi.
౪ఆ తరువాత నీ ఎడమ వైపుకి తిరిగి పడుకో. ఇశ్రాయేలు జాతి పాపాన్నంతా నీ పైకి వేసుకో. ఇశ్రాయేలు జాతికి వ్యతిరేకంగా నువ్వు ఎన్ని రోజులు అలా పండుకుంటావో అన్ని రోజులు వారి పాపాన్ని మోస్తావు.
5 Metsɔ ŋkekewo ƒe xexlẽme ma ke na wò abe woƒe nu vɔ̃wo ƒe ƒewo ƒe xexlẽme ene. Ale hena ŋkeke alafa etɔ̃ kple blaasieke la, àtsɔ Israel ƒe aƒe la ƒe nu vɔ̃wo.
౫ఆ రోజులను నేనే నిర్ణయిస్తున్నాను. ఇశ్రాయేలు జాతి పాపం చేసిన కాలంలో ఒక్కో సంవత్సరం ఒక్కో రోజుగా నువ్వు భరించాలి. అంటే 390 రోజులు! ఈ విధంగా నువ్వు ఇశ్రాయేలు జాతి పాపాన్ని భరిస్తావు.
6 “Ne èwɔ esia vɔ la, nàgamlɔ anyi, azɔ ɖe wò ɖusimekpa dzi, eye nàtsɔ Yuda ƒe aƒe la ƒe nu vɔ̃wo. Metsɔ ŋkeke blaene na wò, ŋkeke ɖeka ɖe ƒe ɖeka nu.
౬ఆ రోజులన్నీ గడిచిన తరువాత రెండో సారి నీ కుడి వైపుకి పడుకో. ఈ సారి నలభై రోజులు నువ్వు యూదా జాతి పాపాన్ని మోస్తావు. ఒక్కో సంవత్సరానికి ఒక్కో రోజు నీకు నేను నిర్ణయించాను.
7 Trɔ wò mo ɖo ɖe toɖeɖe ɖe Yerusalem gbɔ. Mègatsɔ naneke tsyɔ abɔ o, eye nàgblɔ nya ɖi ɖe Yerusalem ŋu.
౭తరువాత ముట్టడిలో ఉన్న యెరూషలేముకి వ్యతిరేకంగా నిలబడి చొక్కా తీసివేసిన నీ చేతిని ఎత్తి దానికి వ్యతిరేకంగా ప్రవచించాలి.
8 Mabla wò kple ka ale be màte ŋu atrɔ tso axa ɖeka dzi ayi evelia dzi o va se ɖe esime nàwu wò toɖeɖe ɖe du la ƒe ŋkekewo nu.
౮నువ్వు పట్టణాన్ని ముట్టడించినట్టు ఉండే ఆ రోజులు పూర్తయే వరకూ నువ్వు కదలకుండా నిన్ను బంధించి ఉంచుతాను.
9 “Tsɔ bli, lu, ayi, ƒo kple mɔlu dzra ɖo ɖe ze me, tsɔ wo nàƒo aboloe na ɖokuiwò, eye nàɖui le ŋkeke alafa etɔ̃ kple blaasieke siwo me nàmlɔ axadzi.
౯నీ కోసం గోధుమలూ, బార్లీ, చిక్కుడు గింజలూ, కాయ ధాన్యాలూ, జొన్నలూ, సజ్జలూ తెచ్చుకో. వాటన్నిటినీ ఒక పాత్రలో వేసి నువ్వు ఒక వైపున పడుకునే రోజుల లెక్క ప్రకారం రొట్టెలు చేసుకోవాలి. 390 రోజులు నువ్వు ఇలాగే చేసుకుని తినాలి!
10 Da nuɖuɖu gram alafa eve blaatɔ̃ na ɖuɖu gbe sia gbe, eye nàɖui le ɣeyiɣi ɖoɖowo dzi.
౧౦నువ్వు తీసుకునే ఆహారం ఇదే. రోజుకి రెండు వందల గ్రాముల ప్రకారం తీసుకోవాలి. అది ప్రతి రోజూ సమయానికి తింటూ ఉండాలి.
11 Kpe ɖe esia ŋu la, dzidze tsi hin ƒe mama adelia ƒe ɖeka, eye nànoe le ɣeyiɣi ɖoɖowo dzi.
౧౧అలాగే నీళ్ళు కొలత ప్రకారం ప్రతి రోజూ రెండు గ్లాసులు తాగాలి. సమయానికి నీళ్లు తాగుతూ ఉండాలి.
12 Ɖu nu la abe lubolo ene. Mee le ameawo ƒe ŋkume le dzo si wodo kple amegbetɔ ƒe afɔdzi la dzi.”
౧౨బార్లీతో చేసే అప్పడాల్లా వాటిని చేసుకుని తినాలి. అందరూ చూస్తుండగా వాటిని మనిషి మలాన్నే వంట చేయడానికి ఉపయోగిస్తూ కాల్చి తినాలి!
13 Yehowa gblɔ be, “Ale Israelviwo aɖu nu makɔmakɔ le dukɔwo dome, afi si manya wo aɖo ɖo.”
౧౩యెహోవా ఇలా చెప్తున్నాడు. “నేను వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళు వెళ్ళే జాతులమధ్య ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రమైన ఆహారం తినవలసి వస్తుంది.”
14 Tete megblɔ be, “Ao, Yehowa, nyemegblẽ kɔ ɖo na ɖokuinye kpɔ haɖe o. Tso nye ɖekakpuime va se ɖe fifia la, nyemeɖu nu kuku aɖeke alo lã si lã wɔadãwo vuvu la kpɔ o. Lã makɔmakɔ aɖeke mege ɖe nye nu me kpɔ o.”
౧౪కానీ నేను “అయ్యో, ప్రభూ! యెహోవా! నేను ఏనాడూ అపవిత్రం కాలేదు. చిన్నప్పట్నించి చనిపోయిన దాన్ని గానీ, మృగాలు చంపిన దాన్ని గానీ నేను తినలేదు. అపవిత్రమైన మాంసం ఏనాడూ నా నోట్లో ప్రవేశించలేదు” అన్నాను.
15 Egblɔ nam be, “Enyo ŋutɔ; mana nàme wò abolo le dzo si wodo kple nyi ƒe afɔdzi la dzi ɖe esi wodo kple amegbetɔ ƒe afɔdzi teƒe.”
౧౫దానికి ఆయన “చూడు మనిషి మలానికి బదులు నేను నీకు ఆవు పేడను నిర్ణయించాను. నువ్వు పిడకలతో నీ రొట్టెలు చేసుకోవచ్చు” అన్నాడు.
16 Emegbe la, egblɔ nam be, “Ame vi, mana be nuɖuɖu magaɖo Yerusalem o. Amewo aɖu nu si woama na wo le dzitsitsi me, eye woano tsi si woadzidze ama na wo le dziɖeleameƒo me,
౧౬ఇంకా ఆయన నాకు ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, చూడు, నేను యెరూషలేములో రొట్టె అనే ఆధారం లేకుండా చేస్తున్నాను. వాళ్ళు ఆందోళనతో ఒక పరిమితి ప్రకారం రొట్టెలు తింటారు. నీళ్ళు కూడా కొలత ప్రకారం భయంతో తాగుతారు.
17 elabena nuɖuɖu kple tsi magabɔ o. Ne wokpɔ wo nɔewo la, woƒe nu aku, eye woatsrɔ̃ le woƒe nu vɔ̃wo ta.”
౧౭వాళ్లకి ఆహారం, నీళ్ళు కరువై పోతాయి. ప్రతి ఒక్కడూ తన సహోదరుడి వైపు దిగులుతో చూస్తాడు. తాము చేసిన పాపాల వలన నశించిపోతారు.”