< Samuel 2 17 >

1 Azɔ la, Ahitofel gblɔ na Absalom be, “Na ame akpe wuievem ne míati David yome le zã sia me.
అహీతోపెలు అబ్షాలోముతో ఇలా చెప్పాడు “దావీదు బాగా అలసిపోయి బలహీనంగా ఉన్నాడు. కాబట్టి నీకు అంగీకారమైతే నాకు 12,000 మంది సైన్యాన్ని సిద్ధం చేయించు. ఈ రాత్రే దావీదును తరిమి పట్టుకుంటాను” అన్నాడు.
2 Madze edzi esi ɖeɖi te eŋu eye wògbɔdzɔ. Made vɔvɔ̃ lãme nɛ ekema eŋumewo katã asi, agblẽe ɖi. Mawu fia la ɖeɖe ko,
నేను అతనిపై దాడిచేసి అతణ్ణి బెదిరిస్తాను. అప్పుడు అతని దగ్గర ఉన్నవారంతా పారిపోతారు.
3 eye makplɔ ame bubuawo katã vɛ na wò. Ame si dim nèle ƒe ku la anye ame bubuawo ƒe tɔtrɔ gbɔ; nuvevi mawɔ ame bubuawo dometɔ aɖeke o.”
అప్పుడు రాజును మాత్రం చంపివేసి ప్రజలందరినీ నీవైపు తిప్పుతాను. నువ్వు వెతుకుతున్న వ్యక్తిని నేను పట్టుకున్నప్పుడు ప్రజలంతా నీతో రాజీ పడిపోతారు.
4 Absalom kple Israel ƒe ametsitsiwo katã lɔ̃ ɖe ɖoɖo sia dzi.
ఈ మాటలు అబ్షాలోముకు, ఇశ్రాయేలు పెద్దలందరికీ మంచిగా అనిపించాయి.
5 Ke Absalom gblɔ be, “Mina míabia Husai, Arkitɔ la, nu si wòbu tso ɖoɖo sia ŋu.”
అప్పుడు అబ్షాలోము “ఈ విషయంలో అర్కీయుడైన హూషై ఏమి చెబుతాడో విందాం. అతణ్ణి పిలిపించండి” అని ఆజ్ఞాపించాడు. హూషై అబ్షాలోము దగ్గరికి వచ్చాడు.
6 Esi Husai va ɖo la, Absalom gblɔ nya si Ahitofel gblɔ la nɛ eye wòbia Husai be, “Aleke nèbu tso ɖoɖo sia ŋu? Ɖe míazɔ ɖe Ahitofel ƒe aɖaŋu nua? Ne mèda asi ɖe edzi o la, ekema gblɔ nu si nèbu be míawɔ la na mí.”
అబ్షాలోము అహీతోపెలు చెప్పిన పథకం అతనికి తెలియజేశాడు. “అతడు చెప్పినట్టు చేయడం మంచిదా, కాదా? నీ ఆలోచన ఏమిటో చెప్పు” అని అడిగాడు.
7 Husai ɖo eŋu na Absalom be, “Mebu be azɔ ya la, Ahitofel da ƒu.
హూషై అబ్షాలోముతో ఇలా అన్నాడు. “ఇప్పుడు అహీతోపెలు చెప్పిన ప్రణాళిక మంచిది కాదు.
8 Ènya fofowò kple eƒe amewo nyuie, ènya be wonye aʋawɔla sesẽwo. Ɖewohĩ David ƒe mo nyra ɖa abe sisiblisinɔ si ƒe viwo wofi le egbɔ la ene. Aʋawɔla xɔŋkɔ, kpɔnuteƒee fofowò nye, ne zã do la, mamlɔ aʋawɔlawo dome o.
నీ తండ్రి, అతనితో ఉన్నవారు మహా బలమైన యుద్ధ వీరులు. అడవిలో తమ పిల్లలను పోగొట్టుకొన్న ఎలుగుబంటులను పోలినవారై రగిలిపోతూ ఉన్నారని నీకు తెలుసు. నీ తండ్రి యుద్ధవిద్యలో నేర్పరి. అదీకాక అతడు తన మనుషులతో కలసి బసచేయడు.
9 Ɖewohĩ ebe ɖe do alo agado aɖe me ɖa xoxo! Ne edo va dze mia dzi eye wòwu miaƒe ame aɖewo la, vɔvɔ̃ aɖo wò aʋawɔlawo eye ame sia ame ade asi ɣlidodo me be wosi aʋakɔ si kplɔ Absalom ɖo.
అతడు ఏదో ఒక గుహలోనో, లేకపోతే ఏదైనా రహస్య స్థలంలోనో దాక్కుంటాడు. యుద్ధం ఆరంభంలో నీ మనుషులు కొందరు చనిపోతే ప్రజలు వెంటనే దాన్నిబట్టి అబ్షాలోము మనుషులు ఓడిపోయారని చెప్పుకుంటారు.
10 Ekema wò kalẽtɔwo kekeake gɔ̃ hã, nenye dzata ƒe dzie le dɔ me na wo gɔ̃ hã la, vɔvɔ̃ ana woatsi teƒe ɖeka elabena Israel blibo la nya be fofowò bi ɖe aʋawɔwɔ me eye eƒe asrafowo hã nye kalẽtɔwo.
౧౦నీ తండ్రి గొప్ప బలవంతుడని, అతని మనుషులు అత్యంత ధైర్యవంతులని ఇశ్రాయేలీయులందరికీ తెలుసు. అందువల్ల సింహాలవంటి పౌరుషం గలవారు కూడా భీతిల్లిపోతారు.
11 “Nu si mebue nye be nàƒo Israel dukɔ blibo la ƒe aʋakɔ la nu ƒu tso keke Dan va se ɖe Beerseba ale be aʋakɔ gã aɖe nanɔ asiwò. Mebu hã be wò ŋutɔ nàkplɔ aʋakɔ la.
౧౧నా ఆలోచన ఏమిటంటే, దాను నుండి బెయేర్షెబా వరకూ సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఇశ్రాయేలీయులనందరినీ నాలుగు దిక్కులకు సమకూర్చుకుని నువ్వే స్వయంగా యుద్ధానికి బయలుదేరు.
12 Ekema ne mieke ɖe David ŋu la, miate ŋu atsrɔ̃ eƒe aʋakɔ blibo la ale be ame ɖeka pɛ gɔ̃ hã masusɔ anɔ agbe o.
౧౨అప్పుడు అతడు ఎక్కడ కనబడితే అక్కడ మనం అతనిపై దాడి చేయవచ్చు. మంచు నేల మీద ఎలా పడుతుందో ఆ విధంగా మనం అతనిమీద పడితే అతని మనుషుల్లో ఒక్కడు కూడా తప్పించుకోలేడు.
13 Ne David si yi du aɖe me la, Israel ƒe aʋakɔ blibo la anɔ wò kpɔkplɔ te, miatsi kawo ɖe dua ƒe gliwo ŋu eye miahe gliawo ayi aɖakɔ ɖe balime si te ɖe eŋu la me va se ɖe esime kpe aɖeke maganɔ kpe dzi o.”
౧౩అతడు గనుక ఒక పట్టణం వెనుక దాక్కొంటే ఇశ్రాయేలీయులంతా ఆ పట్టణాన్ని తాళ్లు తీసుకుని ఒక చిన్న రాయి కూడా కనబడకుండా దాన్ని నదిలోకి లాగుతారు.”
14 Tete Absalom kple Israelviwo katã gblɔ be, “Husai, Arkitɔ la ƒe aɖaŋu nyo wu Ahitofel tɔ.” Esia va eme elabena Yehowa ɖo be, yeagblẽ Ahitofel ƒe aɖaŋu, si nye nyuitɔ boŋ hafi la me ale be yeahe dzɔgbevɔ̃e va Absalom dzi.
౧౪అబ్షాలోము, ఇశ్రాయేలువారు ఈ మాట విని అర్కీయుడైన హూషై చెప్పిన మాట అహీతోపెలు చెప్పినదానికంటే యోగ్యమైనదని ఒప్పుకున్నారు. ఎందుకంటే యెహోవా అబ్షాలోము మీదికి విపత్తు రప్పించాలని అహీతోపెలు చెప్పిన తెలివైన ప్రణాళిక నిరర్ధకమయ్యేలా చేయాలని నిశ్చయించుకున్నాడు.
15 Husai gblɔ na nunɔla Zadok kple Abiata bena; Ale kple ale Ahitofel ɖo aɖaŋu na Absalom kple Israel ametsitsiwo kple eya ŋutɔ tɔ na nunɔlawo.
౧౫అప్పుడు హూషై, అబ్షాలోము, ఇశ్రాయేలు పెద్దలకందరికీ అహీతోపెలు వేసిన పథకం, తాను చెప్పిన ఆలోచన యాజకులైన సాదోకు, అబ్యాతారులకు తెలియజేశాడు.
16 Egblɔ na wo be, “Afɔ netsɔ! Midi David enumake eye miagblɔ nɛ be, meganɔ Yɔdan tɔsisi la ƒe tɔtsoƒe le zã sia me o ke boŋ ele be wòatso tɔsisi la enumake ayi gbedzi le tɔsisi la godo. Ne mewɔ alea o la, eya ŋutɔ kple eƒe aʋakɔ la katã atsrɔ̃.”
౧౬“మీరు తొందరగా వెళ్లి, రాజు, అతని దగ్గర ఉన్న మనుషులంతా హతం కాకుండా ఉండేలా దావీదుకు ఈ విషయం చెప్పండి. మీరు ఈ రాత్రి అరణ్యంలో నది తీరం దాటే స్థలాల్లో ఉండవద్దు” అని చెప్పాడు.
17 Yonatan kple Ahimaaz nɔ En Rogel ale be amewo makpɔ wo ne woge ɖe dua me alo wodo go le dua me o. Wowɔ ɖoɖo kple nyɔnudɔla aɖe be wòayi aɖagblɔ nya si woagblɔ na David la na wo.
౧౭యోనాతాను, అహిమయస్సు తాము పట్టణం హద్దుకు వచ్చిన సంగతి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఏన్‌రోగేలు దగ్గెర నిలిబడి ఉన్నప్పుడు ఒక పనిమనిషి వచ్చి, హూషై చెప్పిన సంగతి వారికి చెప్పినప్పుడు వారు వెళ్లి రాజైన దావీదుకు ఆ సంగతి చెప్పారు.
18 Ke esi wodzo le En Rogel yina David gbɔ la, ŋutsu aɖe kpɔ wo eye wòyi ɖagblɔe na Absalom. Le ɣeyiɣi sia me la, wosi yi Bahurim eye ŋutsu aɖe ɣla wo ɖe eƒe vudo me le eƒe aƒe godo.
౧౮వారిద్దరినీ అక్కడ చూసిన ఒక పనివాడు అబ్షాలోముకు చెప్పాడు. వారిద్దరూ వెంటనే పరుగెత్తి వెళ్లి బహూరీములో ఒకడి ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి ముందు ఉన్న ఒక బావిలో దిగి దాక్కున్నారు.
19 Ŋutsua srɔ̃ ɖo avɔ aɖe ɖe vudo la nu eye wosia bli ɖe avɔ la dzi ale be ame aɖeke mabu be woanɔ afi ma o.
౧౯ఆ ఇంటి ఇల్లాలు ఒక పరదా తీసుకువచ్చి బావిమీద పరిచి, దానిపైన గోదుమపిండి ఆరబోసింది. కనుక వారు బావిలో ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియలేదు.
20 Esi Absalom ƒe amewo va nyɔnu la gbɔ la, wobia be, “Afi ka Ahimaaz kple Yonatan wole?” Nyɔnu la gblɔ na wo be, “Wotso tɔʋu la xoxo.” Ameawo di wo gake womekpɔ wo o, ale wotrɔ yi Yerusalem.
౨౦అబ్షాలోము సేవకులు ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. అహిమయస్సు, యోనాతాను ఎక్కడ ఉన్నారని అడిగారు. ఆమె “వారు నది దాటి వెళ్లిపోయారు” అని చెప్పింది. వారు వెళ్లి చుట్టుపక్కల అంతా వెతికి వారు కనబడకపోయే సరికి యెరూషలేముకు తిరిగి వచ్చారు.
21 Ame eveawo do le vudo la me eye woɖe abla yi Fia David gbɔ. Wogblɔ nɛ be, “Afɔ netsɔ! Tso Yɔdan tɔsisi la le zã sia me.” Wogblɔ ale si Ahitofel ɖo aɖaŋu na Absalom be wòalée, awui la hã nɛ.
౨౧సేవకులు వెళ్లిపోయిన తరువాత యోనాతాను, అహిమయస్సు బావిలో నుండి బయటికి వచ్చి దావీదు దగ్గరికి వెళ్లి. అహీతోపెలు అతని మీద వేసిన పథకం గురించి చెప్పి “నువ్వు లేచి త్వరగా నది దాటు” అని చెప్పారు.
22 Ale David kple eŋumewo katã tso tɔsisi la le zã ma me eye woɖo tɔsisi la godo hafi ŋu ke.
౨౨దావీదు, అతని దగ్గర ఉన్న మనుషులంతా లేచి యొర్దాను నది దాటారు. తెల్లవారేసరికి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ నది దాటి వెళ్ళిపోయారు.
23 Le ɣeyiɣi ma me la, esi Absalom do ŋukpe Ahitofel le dukɔ la ŋkume eye mexɔ eƒe aɖaŋuɖoɖo o ta la, Ahitofel de eƒe tedzi dzi eye wòyi wo de. Esi wòdzra eƒe aƒe ɖo vɔ la, ede ka ve na eɖokui. Ale Ahitofel ku eye woɖii ɖe fofoa xa.
౨౩అహీతోపెలు తాను చెప్పిన పథకం అమలు కాకపోవడం చూసి, గాడిదకు గంతలు కట్టి ఎక్కి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి, ఇంటి విషయాలు చక్కబెట్టి ఉరి వేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అతన్ని పాతిపెట్టారు.
24 Le ɣeyiɣi kpui aɖe megbe la, David va ɖo Mahanaim. Absalom ƒo Israel dukɔ blibo la nu ƒu eye wòkplɔ ameawo wonɔ tɔsisi la tsom.
౨౪దావీదు మహనయీముకు చేరేటప్పటికి అబ్షాలోము, ఇశ్రాయేలీయులంతా యొర్దాను నది దాటి వచ్చారు.
25 Absalom na Amasa zu aʋafia ɖe Yoab teƒe. Amasa fofoe nye Itra, Ismaeltɔ eye dadae nye Abigail, Nahas ƒe vinyɔnu, ame si nye Yoaz dada, Zeruya nɔvinyɔnu.
౨౫అబ్షాలోము యోవాబును తొలగించి అమాశాను సైన్యాధిపతిగా నియమించుకున్నాడు. అమాశా తండ్రి ఇత్రా, ఇశ్రాయేలీయుడు. యోవాబు తల్లి సెరూయా సహోదరియైన నాహాషు కుమార్తెకు, అబీగయీలుకు ఇత్రా పుట్టాడు.
26 Absalom kple Israel ƒe aʋakɔ la ƒo ƒu ɖe Gileadnyigba dzi.
౨౬అబ్షాలోము, ఇశ్రాయేలీయులు గిలాదు దేశంలో మకాం వేశారు.
27 Esi David va ɖo Mahanaim la, Sobi, Nahas ƒe vi si tso Amon ƒe viwo ƒe Raba kple Makir, Amiel ƒe vi si tso Lo Debar kple Barzilai, Gileadtɔ la si tso Rogelun la
౨౭దావీదు మహనయీముకు చేరుకున్నప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణ వాస్త్యవ్యుడు, నాహాషు కొడుకు షోబీయు, లోదెబారు ఊరివాడు అమ్మీయేలు కొడుకు మాకీరు, రోగెలీము ఊరికి చెందిన గిలాదీయుడు బర్జిల్లయి
28 tsɔ abadzivɔwo, agbawo kple zewo vɛ. Wotsɔ lu kple ƒo, wɔ, bli tɔtɔe, ayi kple
౨౮ఎడారిలో దావీదు, అతని మనుషులు అలసిపోయి, ఆకలి దాహంతో ఉంటారని గ్రహించి, పరుపులు, వంటపాత్రలు, కుండలు, వారంతా తినడం కోసం గోదుమలు, యవల పిండి, పప్పులు, చిక్కుడు కాయలు, పేలాలు,
29 anyitsi, nyinotsi babla, alẽwo kple akpɔnɔ si wowɔ kple nyinotsi la hã vɛ na David kple eƒe amewo be woaɖu. Wogblɔ be, “Dɔ le ameawo wum, ɖeɖi te wo ŋu eye tsikɔ hã le wo wum le gbegbea.”
౨౯తేనె, వెన్న, గొర్రెలు, జున్నుముద్దలు తీసుకువచ్చారు.

< Samuel 2 17 >