< Ijob 16 >
1 Ijob respondis kaj diris:
౧అందుకు యోబు ఇలా జవాబు ఇచ్చాడు,
2 Mi aŭdis multe da similaj aferoj; Tedaj konsolantoj vi ĉiuj estas.
౨“ఇలాంటి మాటలు నేను అనేకం విన్నాను. మీరంతా ఆదరించడానికి కాదు, బాధ పెట్టడానికి వచ్చినట్టున్నారు.
3 Ĉu estos fino al la ventaj vortoj? Kaj kio vin incitis, ke vi tiel parolas?
౩నువ్వు చెబుతున్న గాలిమాటలు చాలిస్తావా? నాకిలా జవాబివ్వడానికి నీకేం బాధ కలిగింది?
4 Mi ankaŭ povus paroli, kiel vi. Se vi estus sur mia loko, Mi konsolus vin per vortoj Kaj balancus pri vi mian kapon.
౪నా దుస్థితి మీకు పట్టి ఉంటే నేను కూడా మీలాగా మాట్లాడేవాణ్ణి. మీ మీద లేనిపోని మాటలు కల్పిస్తూ నా తల ఆడిస్తూ మీవైపు చూసేవాణ్ణి.
5 Mi fortigus vin per mia buŝo Kaj konsolus vin per paroloj de miaj lipoj.
౫అయినప్పటికీ నేను మిమ్మల్ని ఓదార్చి ధైర్యపరిచేవాణ్ణి. నా ఆదరణ వాక్కులతో మిమ్మల్ని బలపరిచేవాణ్ణి.
6 Se mi parolos, mia doloro ne kvietiĝos; Se mi ĉesos, kio foriros de mi?
౬ఇప్పుడు నేను ఎన్ని మాటలు మాట్లాడినా దుఃఖం తీరదు, అలాగని మౌనంగా ఉన్నా నాకెలాంటి ఉపశమనం కలగదు.
7 Sed nun Li lacigis min, Li detruis mian tutan esencon.
౭దేవుడు నాకు ఆయాసం కలగజేశాడు. దేవా, నా బంధువర్గమంతటినీ నువ్వు నాశనం చేశావు.
8 Vi faris al mi sulkojn, tio fariĝis atesto; Mia senfortiĝo staras antaŭ mia vizaĝo, kaj parolas.
౮నా శరీరమంతా బక్కచిక్కిపోయింది. క్షీణించిపోయి, మడతలు పడిన నా చర్మం నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నది.
9 Lia kolero disŝiras; Mia malamanto grincigas kontraŭ mi siajn dentojn; Mia premanto briligas kontraŭ mi siajn okulojn.
౯ఆయన కళ్ళు నా మీద కోపంతో ఎర్రబడ్డాయి. నన్ను చూసి పళ్ళు కొరుకుతూ నా మీద పడి నాతో యుద్ధం చేశాడు.
10 Ili malfermegis kontraŭ mi sian buŝon, insulte batas min sur la vangojn; Ĉiuj kune kontentigis sur mi sian koleron.
౧౦మనుషులు నన్ను ఎత్తి పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ తిట్లు నాకు చెంపపెట్టులాంటివి. వాళ్ళంతా ఏకమై నాకు వ్యతిరేకంగా సమకూడుతున్నారు.
11 Dio transdonis min al maljustulo, Ĵetis min en la manojn de malbonuloj.
౧౧దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు. భక్తిహీనుల ఆధీనంలో నన్ను బంధించి ఉంచాడు.
12 Mi estis trankvila; sed Li frakasis min, Li kaptis min je la kolo, disbatis min, Kaj Li faris min por Si celo.
౧౨నేను మౌనంగా ఉండిపోయాను. ఆయన నన్ను ముక్కలు ముక్కలు చేశాడు. నా మెడ పట్టుకుని విదిలించి నన్ను చిందరవందర చేశాడు. నన్ను గురిగా చేసుకుని వేధిస్తున్నాడు.
13 Liaj pafistoj min ĉirkaŭis; Li dishakas miajn internaĵojn kaj ne kompatas, Li elverŝas sur la teron mian galon.
౧౩ఆయన వేసే బాణాలు నా దేహమంతా గుచ్చుకుంటున్నాయి. ఆయన నా మూత్రపిండాలను పొడిచివేశాడు. జాలి, దయ లేకుండా నన్ను వేధిస్తున్నాడు. నాలోని పైత్యరసాన్ని నేలపై కక్కించాడు.
14 Li faras en mi breĉon post breĉo, Li kuras kontraŭ min kiel batalisto.
౧౪దెబ్బ మీద దెబ్బ వేసి నన్ను విరగగొడుతున్నాడు. యుద్ధ వీరుని వలే పరుగెత్తుకుంటూ వచ్చి నా మీద పడ్డాడు.
15 Sakaĵon mi kudris sur mian korpon, Kaj en polvo mi kaŝis mian kornon.
౧౫నా చర్మానికి గోనెపట్ట కప్పుకుని కూర్చున్నాను. నా దేహమంతా బూడిద పోసుకుని మురికి చేసుకున్నాను.
16 Mia vizaĝo ŝvelis de plorado, Kaj sur miaj palpebroj estas morta ombro;
౧౬నేను ఎవ్వరికీ కీడు తలపెట్టలేదు. నేను చేసే ప్రార్థన పరిశుద్ధం.
17 Kvankam ne troviĝas perfortaĵo en miaj manoj, Kaj mia preĝo estas pura.
౧౭ఏడ్చి ఏడ్చి నా ముఖం ఎర్రబడిపోయింది. నా కంటిరెప్పల మీద మరణాంధకారం తేలియాడుతున్నది.
18 Ho tero, ne kovru mian sangon, Kaj mia kriado ne trovu haltejon.
౧౮భూమీ, ఒలుకుతున్న నా రక్తాన్ని కనబడనియ్యి. నేను పెడుతున్న మొరలు ఎప్పుడూ వినిపిస్తూ ఉండాలి.
19 Vidu, en la ĉielo estas mia atestanto, Kaj mia konanto estas en la altaj sferoj.
౧౯ఇప్పటికీ నా తరుపు సాక్షి పరలోకంలో ఉన్నాడు. నా పక్షంగా వాదించేవాడు ఆయన సమక్షంలో ఉన్నాడు.
20 Parolistoj estas por mi miaj amikoj; Sed mia okulo larmas al Dio,
౨౦నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నా కళ్ళు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి.
21 Ke Li decidu inter homo kaj Dio, Inter homo kaj lia amiko.
౨౧ఒక వ్యక్తి తన స్నేహితుని కోసం బ్రతిమిలాడినట్టు నా కోసం దేవుణ్ణి వేడుకునే ఒక మనిషి నాకు కావాలి.
22 Ĉar la nombro de la jaroj pasos, Kaj mi iros sur vojon nereveneblan.
౨౨ఇంకా కొన్ని సంవత్సరాలు గడచిన తరువాత నేను తిరిగిరాని దారిలో వెళ్ళిపోతాను.