< Mark 12 >
1 And he began to speak to them in similes: 'A man planted a vineyard, and put a hedge around, and digged an under-wine-vat, and built a tower, and gave it out to husbandmen, and went abroad;
౧ఆ తరువాత ఆయన వారితో ఉదాహరణలతో మాట్లాడసాగాడు. “ఒకడు ద్రాక్షతోట వేసి చుట్టూ గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు తొక్కడానికి గానుగ తొట్టి కట్టించి, అక్కడే ఒక కావలి గోపురం కూడా కట్టించాడు. ఆ తరువాత ఆ ద్రాక్షతోటను రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై దూర దేశానికి వెళ్ళాడు.
2 and he sent unto the husbandmen at the due time a servant, that from the husbandmen he may receive from the fruit of the vineyard,
౨పంటకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్షపండ్లలో తనకు రావలసిన భాగం తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి వారి దగ్గరికి పంపాడు.
3 and they, having taken him, did severely beat [him], and did send him away empty.
౩అయితే ఆ రైతులు ఆ సేవకుణ్ణి పట్టుకుని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు.
4 'And again he sent unto them another servant, and at that one having cast stones, they wounded [him] in the head, and sent away — dishonoured.
౪అతడు మళ్ళీ ఇంకొక సేవకుణ్ణి పంపాడు. వారు అతని తలపై గాయపరచి, అవమానించి పంపివేశారు.
5 'And again he sent another, and that one they killed; and many others, some beating, and some killing.
౫అతడు ఇంకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వారు అతణ్ణి చంపేశారు. అతడింకా చాలా మందిని పంపాడు. కాని, ఆ రైతులు వారిలో కొందరిని కొట్టి, ఇంకొందరిని చంపారు.
6 'Having yet therefore one son — his beloved — he sent also him unto them last, saying — They will reverence my son;
౬వారి దగ్గరికి పంపడానికి ఇక తన ప్రియ కుమారుడు ఒక్కడే మిగిలాడు. వారు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకుని చివరిగా అతడు తన కుమారుణ్ణి పంపాడు.
7 and those husbandmen said among themselves — This is the heir, come, we may kill him, and ours shall be the inheritance;
౭కాని ఆ కౌలుదారులు ‘ఇతడే వారసుడు! ఇతన్ని చంపుదాం. అప్పుడు వారసత్వం మనది అవుతుంది’ అని తమలో తాము మాట్లాడుకున్నారు.
8 and having taken him, they did kill, and cast [him] forth without the vineyard.
౮వారు అతన్ని పట్టుకుని, చంపి ఆ ద్రాక్షతోట అవతల పారవేశారు.
9 'What therefore shall the lord of the vineyard do? he will come and destroy the husbandmen, and will give the vineyard to others.
౯అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతులను చంపి, ఆ ద్రాక్షతోటను ఇతరులకు కౌలుకిస్తాడు.
10 And this Writing did ye not read: A stone that the builders rejected, it did become the head of a corner:
౧౦మీరు ఈ లేఖనం చదవలేదా? ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది.
11 from the Lord was this, and it is wonderful in our eyes.'
౧౧అది ప్రభువు మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.’”
12 And they were seeking to lay hold on him, and they feared the multitude, for they knew that against them he spake the simile, and having left him, they went away;
౧౨ఈ ఉపమానం తమ గురించే చెప్పాడని వారు గ్రహించారు. కనుక ఆయనను బంధించాలని చూశారు కాని, ప్రజల గుంపును చూసి జంకారు. అందువల్ల ఆయనను వదిలి వెళ్ళిపోయారు.
13 and they send unto him certain of the Pharisees and of the Herodians, that they may ensnare him in discourse,
౧౩యేసును ఆయన మాటల్లోనే పట్టుకోవాలని వారు పరిసయ్యుల, హేరోదీయుల అనుచరులు కొందరిని ఆయన దగ్గరికి పంపారు.
14 and they having come, say to him, 'Teacher, we have known that thou art true, and thou art not caring for any one, for thou dost not look to the face of men, but in truth the way of God dost teach; is it lawful to give tribute to Caesar or not? may we give, or may we not give?'
౧౪వారు వచ్చి ఇలా అన్నారు, “బోధకా! నీవు నిజం మాట్లాడేవాడివని మాకు తెలుసు. ఎవరినీ లెక్కచేయవని మాకు తెలుసు. నీవు మనుషులను పక్షపాతంతో చూడకుండా, సత్యమార్గాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తావు. సీజరు చక్రవర్తికి పన్నులు కట్టడం న్యాయమా కాదా?
15 And he, knowing their hypocrisy, said to them, 'Why me do ye tempt? bring me a denary, that I may see;'
౧౫మనం పన్నులు కట్టాలా? మానాలా?” అని అడిగారు. అయితే యేసుకు వారి కుయుక్తి తెలిసి వారితో, “నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారం తీసుకు రండి” అన్నాడు.
16 and they brought, and he saith to them, 'Whose [is] this image, and the inscription?' and they said to him, 'Caesar's;'
౧౬వారు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని ఆయన అడిగాడు. వారాయనతో, “సీజరుది” అన్నారు.
17 and Jesus answering said to them, 'Give back the things of Caesar to Caesar, and the things of God to God;' and they did wonder at him.
౧౭అప్పుడు యేసు వారితో, “సీజరుకు చెందింది సీజరుకు ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి” అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు.
18 And the Sadducees come unto him, who say there is not a rising again, and they questioned him, saying,
౧౮అప్పుడు చనిపోయిన వారు తిరిగి బతకరు అని బోధించే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఒక ప్రశ్న వేశారు.
19 'Teacher, Moses wrote to us, that if any one's brother may die, and may leave a wife, and may leave no children, that his brother may take his wife, and raise up seed to his brother.
౧౯“బోధకా, ఒకడి సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరుని భార్యను అతడి సోదరుడు పెళ్ళి చేసుకుని, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేలా చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో రాశాడు.
20 'There were then seven brothers, and the first took a wife, and dying, he left no seed;
౨౦ఏడుగురు అన్నదమ్ములున్నారు. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని సంతానం లేకుండా చనిపోయాడు.
21 and the second took her, and died, neither left he seed, and the third in like manner,
౨౧రెండవవాడు ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. మూడవ వాడికి కూడా అలాగే జరిగింది.
22 and the seven took her, and left no seed, last of all died also the woman;
౨౨ఆ ఏడుగురూ ఆమెను పెళ్ళిచేసుకుని సంతానం లేకుండా చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది.
23 in the rising again, then, whenever they may rise, of which of them shall she be wife — for the seven had her as wife?'
౨౩చనిపోయిన వారు తిరిగి బ్రతికినపుడు ఆమె ఎవరి భార్యగా ఉంటుంది? ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకున్నారు కదా!” అని అడిగారు.
24 And Jesus answering said to them, 'Do ye not because of this go astray, not knowing the Writings, nor the power of God?
౨౪యేసు వారికి జవాబిస్తూ, “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు గనుక పొరబడుతున్నారు.
25 for when they may rise out of the dead, they neither marry nor are they given in marriage, but are as messengers who are in the heavens.
౨౫చనిపోయిన వారు తిరిగి బ్రతికిన తరువాత వివాహం చేసుకోరు. వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు.
26 'And concerning the dead, that they rise: have ye not read in the Book of Moses (at The Bush), how God spake to him, saying, I [am] the God of Abraham, and the God of Isaac, and the God of Jacob;
౨౬ఇక చనిపోయిన వారు బ్రతకడం విషయమైతే, మోషే తాను రాసిన గ్రంథంలో ‘పొదను గురించిన భాగం’ రాసినప్పుడు దేవుడతనితో, ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అతనితో చెప్పాడు.
27 he is not the God of dead men, but a God of living men; ye then go greatly astray.'
౨౭తాను వారికి దేవుణ్ణి అని అన్నప్పుడు ఆయన చనిపోయిన వారి దేవుడు కాదు, బ్రతికి ఉన్నవారికి మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు” అన్నాడు.
28 And one of the scribes having come near, having heard them disputing, knowing that he answered them well, questioned him, 'Which is the first command of all?'
౨౮ధర్మశాస్త్ర పండితుల్లో ఒకడు వచ్చి వారి వాదన విన్నాడు. యేసు చక్కని సమాధానం చెప్పాడని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని ఆయనను అడిగాడు.
29 and Jesus answered him — 'The first of all the commands [is], Hear, O Israel, the Lord is our God, the Lord is one;
౨౯అప్పుడు యేసు, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఇది, ‘ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ప్రభువైన మన దేవుడు, ఆ ప్రభువు ఒక్కడే.
30 and thou shalt love the Lord thy God out of all thy heart, and out of thy soul, and out of all thine understanding, and out of all thy strength — this [is] the first command;
౩౦పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ.
31 and the second [is] like [it], this, Thou shalt love thy neighbour as thyself; — greater than these there is no other command.'
౩౧రెండవది, ‘నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అంతగా ప్రేమించాలి.’ వీటికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు” అని జవాబిచ్చాడు.
32 And the scribe said to him, 'Well, Teacher, in truth thou hast spoken that there is one God, and there is none other but He;
౩౨ఆ ధర్మశాస్త్ర పండితుడు, “అయ్యా, మీరు బాగా చెప్పారు. దేవుడొక్కడే అనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ మీరు చెప్పింది నిజమే.
33 and to love Him out of all the heart, and out of all the understanding, and out of all the soul, and out of all the strength, and to love one's neighbour as one's self, is more than all the whole burnt-offerings and the sacrifices.'
౩౩పూర్ణ హృదయంతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించడం, మనలను ప్రేమించుకున్నట్టే మన పొరుగు వాణ్ణి ప్రేమించడం అన్ని హోమాల కన్నా, బలుల కన్నా ముఖ్యం” అన్నాడు.
34 And Jesus, having seen him that he answered with understanding, said to him, 'Thou art not far from the reign of God;' and no one any more durst question him.
౩౪అతడు వివేకంగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అన్నాడు. ఆ తరువాత ఆయనను ప్రశ్నలు అడగడానికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది.
35 And Jesus answering said, teaching in the temple, 'How say the scribes that the Christ is son of David?
౩౫యేసు దేవాలయంలో ఉపదేశం చేస్తూ, “క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర పండితులు ఎలా అంటున్నారు?
36 for David himself said in the Holy Spirit, The Lord said to my lord, Sit thou on My right hand, till I place thine enemies — thy footstool;
౩౬దావీదు, తానే పరిశుద్ధాత్మ మూలంగా మాట్లాడుతూ, ‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు, నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచే వరకూ నా కుడి పక్కన కూర్చో’ అన్నాడు.
37 therefore David himself saith of him Lord, and whence is he his son?' And the great multitude were hearing him gladly,
౩౭దావీదు స్వయంగా ఆయనను ‘ప్రభువు’ అని పిలిచాడు కదా! అలాంటప్పుడు క్రీస్తు అతనికి కుమారుడు ఎలా అవుతాడు?” అన్నాడు. అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషంతో ఆయన మాటలు విన్నారు.
38 and he was saying to them in his teaching, 'Beware of the scribes, who will in long robes to walk, and love salutations in the market-places,
౩౮ఆయన ఇంకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు, “ధర్మశాస్త్ర పండితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు పొడవాటి దుస్తులు ధరించి, సంత వీధుల్లో తిరుగుతూ ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ,
39 and first seats in the synagogues, and first couches in suppers,
౩౯సమాజ మందిరాల్లో అగ్రస్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను కోరుకుంటారు.
40 who are devouring the widows' houses, and for a pretence are making long prayers; these shall receive more abundant judgment.'
౪౦వారు విధవరాళ్ళ ఇళ్ళను దోచుకుంటూ పైకి మాత్రం నటనగా గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు. అలాంటి వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.”
41 And Jesus having sat down over-against the treasury, was beholding how the multitude do put brass into the treasury, and many rich were putting in much,
౪౧యేసు, దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు.
42 and having come, a poor widow did put in two mites, which are a farthing.
౪౨అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి రెండు నాణాలు ఆ పెట్టెలో వేసింది.
43 And having called near his disciples, he saith to them, 'Verily I say to you, that this poor widow hath put in more than all those putting into the treasury;
౪౩ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది.
44 for all, out of their abundance, put in, but she, out of her want, all that she had put in — all her living.'
౪౪మిగతావారు తాము దాచుకున్న ధనంలో కొంత మాత్రమే వేశారు కాని, ఈమె పేదదైనా తన దగ్గర ఉన్నదంతా వేసింది” అన్నాడు.