< Genesis 46 >
1 And Israel journeyeth, and all that he hath, and cometh in to Beer-Sheba, and sacrificeth sacrifices to the God of his father Isaac;
౧ఇశ్రాయేలు తనకున్నదంతా తీసుకు ప్రయాణమై బెయేర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు.
2 and God speaketh to Israel in visions of the night, and saith, 'Jacob, Jacob;' and he saith, 'Here [am] I.'
౨అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు “యాకోబూ, యాకోబూ” అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు “చిత్తం ప్రభూ” అన్నాడు.
3 And He saith, 'I [am] God, God of thy father, be not afraid of going down to Egypt, for for a great nation I set thee there;
౩ఆయన “నేనే దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. ఐగుప్తు వెళ్ళడానికి భయపడవద్దు. అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను.
4 I — I go down with thee to Egypt, and I — I also certainly bring thee up, and Joseph doth put his hand on thine eyes.'
౪నేను నీతో కూడా ఐగుప్తు వస్తాను. నేను నిన్ను తప్పకుండా ఇక్కడికి తిరిగి తీసుకువస్తాను. నువ్వు చనిపోయేటప్పుడు యోసేపు తన సొంత చేతులతో నీ కళ్ళు మూస్తాడు.”
5 And Jacob riseth from Beer-Sheba, and the sons of Israel bear away Jacob their father, And their infants, and their wives, in the waggons which Pharaoh hath sent to bear him,
౫యాకోబు లేచి బెయేర్షెబా నుండి తరలి వెళ్ళాడు. ఫరో అతనినెక్కించి తీసుకు రావడానికి పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కొడుకులు తమ తండ్రి యాకోబునూ తమ పిల్లలనూ తమ భార్యలనూ ఎక్కించారు.
6 and they take their cattle, and their goods which they have acquired in the land of Canaan, and come into Egypt — Jacob, and all his seed with him,
౬యాకోబు అతనితో పాటు అతని సంతానమంతా ఐగుప్తు వచ్చారు. వారు తమ పశువులనూ తాము కనానులో సంపాదించిన సంపదనంతా తీసికెళ్లారు.
7 his sons, and his sons' sons with him, his daughters, and his sons' daughters, yea, all his seed he brought with him into Egypt.
౭అతడు తన కొడుకులనూ మనుమలనూ తన కూతుర్లనూ తన కొడుకుల కూతుర్లనూ తన సంతానాన్నంతా తనతో ఐగుప్తు తీసుకు వచ్చాడు.
8 And these [are] the names of the sons of Israel who are coming into Egypt: Jacob and his sons, Jacob's first-born, Reuben.
౮ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కొడుకుల పేర్లు ఇవే.
9 And sons of Reuben: Hanoch, and Phallu, and Hezron, and Carmi.
౯యాకోబు పెద్ద కొడుకు, రూబేను. రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.
10 And sons of Simeon: Jemuel, and Jamin, and Ohad, and Jachin, and Zohar, and Shaul son of the Canaanitess.
౧౦షిమ్యోను కొడుకులు, యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీయురాలి కొడుకు షావూలు.
11 And sons of Levi: Gershon, Kohath, and Merari.
౧౧లేవి కొడుకులు, గెర్షోను, కహాతు, మెరారి.
12 And sons of Judah: Er, and Onan, and Shelah, and Pharez, and Zarah, (and Er and Onan die in the land of Canaan.) And sons of Pharez are Hezron and Hamul.
౧౨యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను, కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు.
13 And sons of Issachar: Tola, and Phuvah, and Job, and Shimron.
౧౩ఇశ్శాఖారు కొడుకులు తోలా, పువ్వా, యోబు, షిమ్రోను.
14 And sons of Zebulun: Sered, and Elon, and Jahleel.
౧౪జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు.
15 These [are] sons of Leah whom she bare to Jacob in Padan-Aram, and Dinah his daughter; all the persons of his sons and his daughters [are] thirty and three.
౧౫వీరు లేయా కొడుకులు. ఆమె పద్దనరాములో యాకోబుకు వారిని అతని కూతురు దీనానూ కన్నది. అతని కొడుకులూ అతని కుమార్తెలూ మొత్తం ముప్ఫై ముగ్గురు.
16 And sons of Gad: Ziphion, and Haggi, Shuni, and Ezbon, Eri, and Arodi, and Areli.
౧౬గాదు కొడుకులు సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదీ, అరేలీ.
17 And sons of Asher: Jimnah, and Ishuah, and Isui, and Beriah, and Serah their sister. And sons of Beriah: Heber and Malchiel.
౧౭ఆషేరు కొడుకులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు. బెరీయా కొడుకులు హెబెరు, మల్కీయేలు.
18 These [are] sons of Zilpah, whom Laban gave to Leah his daughter, and she beareth these to Jacob — sixteen persons.
౧౮లాబాను తన కూతురు లేయా కిచ్చిన జిల్పా కొడుకులు వీరే. ఆమె ఈ పదహారు మందిని యాకోబుకు కన్నది.
19 Sons of Rachel, Jacob's wife: Joseph and Benjamin.
౧౯యాకోబు భార్య అయిన రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను.
20 And born to Joseph in the land of Egypt (whom Asenath daughter of Poti-Pherah, priest of On, hath borne to him) [are] Manasseh and Ephraim.
౨౦యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. వారిని ఐగుప్తుదేశంలో ఓనుకు యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు అతనికి కన్నది.
21 And sons of Benjamin: Belah, and Becher, and Ashbel, Gera, and Naaman, Ehi, and Rosh, Muppim, and Huppim, and Ard.
౨౧బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీరోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు.
22 These [are] sons of Rachel, who were born to Jacob; all the persons [are] fourteen.
౨౨యాకోబుకు రాహేలు కనిన కొడుకులైన వీరంతా పద్నాలుగురు.
23 And sons of Dan: Hushim.
౨౩దాను కొడుకు హుషీము.
24 And sons of Naphtali: Jahzeel, and Guni, and Jezer, and Shillem.
౨౪నఫ్తాలి కొడుకులు యహనేలు, గూనీ, యేసెరు, షిల్లేము.
25 These [are] sons of Bilhah, whom Laban gave to Rachel his daughter; and she beareth these to Jacob — all the persons [are] seven.
౨౫లాబాను తన కూతురు రాహేలుకు ఇచ్చిన బిల్హా కొడుకులు వీరే. ఆమె వారిని యాకోబుకు కన్నది. వారంతా ఏడుగురు.
26 All the persons who are coming to Jacob to Egypt, coming out of his thigh, apart from the wives of Jacob's sons, all the persons [are] sixty and six.
౨౬యాకోబు కోడళ్ళను మినహాయించి అతని వారసులు యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారంతా అరవై ఆరుగురు.
27 And the sons of Joseph who have been born to him in Egypt [are] two persons. All the persons of the house of Jacob who are coming into Egypt [are] seventy.
౨౭ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కొడుకులు ఇద్దరు. ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు మొత్తం డెభ్భై మంది.
28 And Judah he hath sent before him unto Joseph, to direct before him to Goshen, and they come into the land of Goshen;
౨౮యాకోబు గోషెనుకు దారి చూపడానికి యోసేపు దగ్గరికి యూదాను తనకు ముందుగా పంపాడు. వారు గోషెను ప్రాంతానికి వచ్చారు.
29 and Joseph harnesseth his chariot, and goeth up to meet Israel his father, to Goshen, and appeareth unto him, and falleth on his neck, and weepeth on his neck again;
౨౯యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించి తన తండ్రి ఇశ్రాయేలును కలుసుకోడానికి గోషెనుకు వచ్చాడు. యోసేపు అతన్ని చూసి, అతని మెడను కౌగలించుకుని చాలా సేపు ఏడ్చాడు.
30 and Israel saith unto Joseph, 'Let me die this time, after my seeing thy face, for thou [art] yet alive.'
౩౦అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో “నీవింకా బతికే ఉన్నావు. నీ ముఖం చూశాను. కాబట్టి నేనిక చనిపోగలను” అని చెప్పాడు.
31 And Joseph saith unto his brethren, and unto the house of his father, 'I go up, and declare to Pharaoh, and say unto him, My brethren, and the house of my father who [are] in the land of Canaan have come in unto me;
౩౧యోసేపు తన సోదరులతో తన తండ్రి కుటుంబం వారితో “నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి, ‘కనాను దేశంలో ఉన్న నా సోదరులూ నా తండ్రి కుటుంబం వారూ నా దగ్గరికి వచ్చారు.
32 and the men [are] feeders of a flock, for they have been men of cattle; and their flock, and their herd, and all that they have, they have brought.'
౩౨వారు గొర్రెల కాపరులు. పశువులను మేపేవారు. వారు తమకు కలిగినదంతా తీసుకు వచ్చారు’ అని అతనితో చెబుతాను.
33 'And it hath come to pass when Pharaoh calleth for you, and hath said, What [are] your works?
౩౩కాబట్టి ఫరో మిమ్మల్ని పిలిపించి, ‘మీ వృత్తి ఏంటి?’ అని అడిగితే
34 that ye have said, Thy servants have been men of cattle from our youth, even until now, both we and our fathers, — in order that ye may dwell in the land of Goshen, for the abomination of the Egyptians is every one feeding a flock.'
౩౪‘మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ మేమూ మా పూర్వీకులంతా కాపరులం.’ మీరు గోషెను ప్రాంతంలో నివసించేలా ఇలా చెప్పండి. ఎందుకంటే, గొర్రెల కాపరి వృత్తిలో ఉన్నవారంటే ఐగుప్తీయులకు అసహ్యం.”