< Acts 21 >

1 And it came to pass, at our sailing, having been parted from them, having run direct, we came to Coos, and the succeeding [day] to Rhodes, and thence to Patara,
మేము వారిని విడిచి ఓడ ఎక్కి నేరుగా వెళ్ళి కోసు పట్టణానికి, మరునాడు రొదు పట్టణానికి, అక్కడ నుంచి పతర రేవుకు వచ్చాం.
2 and having found a ship passing over to Phenicia, having gone on board, we sailed,
అక్కడ ఫేనీకే బయలుదేరుతున్న ఒక ఓడను చూసి దానిలో ఎక్కాం.
3 and having discovered Cyprus, and having left it on the left, we were sailing to Syria, and did land at Tyre, for there was the ship discharging the lading.
దానిపై వెళ్తూ కుప్ర కనిపిస్తూ ఉండగా దానికి ఎడమ పక్కగా ప్రయాణించి, సిరియా వైపుగా వెళ్ళి, తూరులో దిగాం. అక్కడ ఓడలోని సరుకు దిగుమతి చెయ్యాల్సి ఉంది.
4 And having found out the disciples, we tarried there seven days, and they said to Paul, through the Spirit, not to go up to Jerusalem;
మేమక్కడి శిష్యులను కలుసుకుని అక్కడ ఏడు రోజులు ఉన్నాం. వారు ఆత్మ ద్వారా “నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దు” అని పౌలుతో చెప్పారు.
5 but when it came that we completed the days, having gone forth, we went on, all bringing us on the way, with women and children, unto the outside of the city, and having bowed the knees upon the shore, we prayed,
ఆ రోజులు గడిచిన తరువాత మేము ప్రయాణమైనప్పుడు వారంతా భార్యా పిల్లలతో వచ్చి మమ్మల్ని పట్టణం బయటి వరకూ సాగనంపారు. వారూ, మేమూ సముద్రతీరంలో మోకాళ్ళపై ప్రార్థించి ఒకరి దగ్గర మరొకరు సెలవు తీసుకున్నాం.
6 and having embraced one another, we embarked in the ship, and they returned to their own friends.
మేము ఓడ ఎక్కిన తరువాత వారు తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.
7 And we, having finished the course, from Tyre came down to Ptolemais, and having saluted the brethren, we remained one day with them;
మేము తూరు నుండి ప్రయాణించి, తొలెమాయికి వచ్చి, అక్కడి సోదరులను పలకరించి వారి దగ్గర ఒక రోజు గడిపాం.
8 and on the morrow Paul and his company having gone forth, we came to Caesarea, and having entered into the house of Philip the evangelist — who is of the seven — we remained with him,
మరునాడు బయలుదేరి కైసరయ వచ్చి, అపొస్తలులు నియమించిన ఏడుగురిలో ఒకడైన సువార్తికుడు ఫిలిప్పు ఇంటికి వచ్చి అతనితో ఉన్నాం.
9 and this one had four daughters, virgins, prophesying.
ప్రవచన వరం ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉన్నారు. వారంతా కన్యలు.
10 And we remaining many more days, there came down a certain one from Judea, a prophet, by name Agabus,
౧౦మేమక్కడ చాలా రోజులు ఉన్నాం. అగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాడు.
11 and he having come unto us, and having taken up the girdle of Paul, having bound also his own hands and feet, said, 'Thus saith the Holy Spirit, The man whose is this girdle — so shall the Jews in Jerusalem bind, and they shall deliver [him] up to the hands of nations.'
౧౧అతడు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని, దానితో తన చేతులను కాళ్ళను కట్టుకుని, “యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల వ్యక్తిని ఈ విధంగా బంధించి, యూదేతరుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెబుతున్నాడు” అన్నాడు.
12 And when we heard these things, we called upon [him] — both we, and those of that place — not to go up to Jerusalem,
౧౨ఈ మాట విన్నప్పుడు మేమూ, అక్కడివారూ యెరూషలేముకు వెళ్ళవద్దని పౌలును బతిమాలుకొన్నాం.
13 and Paul answered, 'What do ye — weeping, and crushing mine heart? for I, not only to be bound, but also to die at Jerusalem, am ready, for the name of the Lord Jesus;'
౧౩కానీ పౌలు, “ఇదేమిటి? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు? నేను ప్రభు యేసు నామం నిమిత్తం యెరూషలేములో బంధకాలకే కాదు, చనిపోవడానికి సైతం సిద్ధంగా ఉన్నాను” అని చెప్పాడు.
14 and he not being persuaded, we were silent, saying, 'The will of the Lord be done.'
౧౪అతడు మనసు మార్చుకోడని గ్రహించాక మేము, “ప్రభువు చిత్తం జరుగుతుంది గాక” అని ఊరుకున్నాం.
15 And after these days, having taken [our] vessels, we were going up to Jerusalem,
౧౫ఆ రోజులు గడచిన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకుని యెరూషలేముకు ప్రయాణించాం.
16 and there went also of the disciples from Caesarea with us, bringing with them him with whom we may lodge, a certain Mnason of Cyprus, an aged disciple.
౧౬మాతో కలిసి కైసరయ నుంచి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యుడుగా ఉన్న సైప్రసు వాసి మ్నాసోను దగ్గరికి మమ్మల్ని తీసుకుపోయారు. అతని ఇంట్లో మాకు బస ఏర్పాటు చేశారు.
17 And we having come to Jerusalem, the brethren did gladly receive us,
౧౭మేము యెరూషలేము చేరినప్పుడు సోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకున్నారు.
18 and on the morrow Paul was going in with us unto James, all the elders also came,
౧౮మరునాడు పెద్దలంతా అక్కడికి వచ్చినపుడు పౌలు మాతో కలిసి యాకోబు దగ్గరికి వచ్చాడు.
19 and having saluted them, he was declaring, one by one, each of the things God did among the nations through his ministration,
౧౯అతడు వారిని కుశల ప్రశ్నలు అడిగి, తన పరిచర్య వలన దేవుడు యూదేతరుల్లో చేసిన కార్యాలను వివరంగా తెలియజెప్పాడు.
20 and they having heard, were glorifying the Lord. They said also to him, 'Thou seest, brother, how many myriads there are of Jews who have believed, and all are zealous of the law,
౨౦అది విని వారు దేవుణ్ణి మహిమపరచి అతనితో, “సోదరా, యూదుల్లో విశ్వాసులు ఎన్ని వేలమంది ఉన్నారో చూశావు గదా? వారంతా ధర్మశాస్త్రంలో ఆసక్తి గలవారు.
21 and they are instructed concerning thee, that apostasy from Moses thou dost teach to all Jews among the nations, saying — Not to circumcise the children, nor after the customs to walk;
౨౧యూదేతరుల మధ్య నివసించే యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనీ, మన ఆచారాలను పాటించకూడదనీ నీవు చెప్పడం వలన వారంతా మోషేను విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నట్టుగా ఇక్కడి వారికి సమాచారం ఉంది.
22 what then is it? certainly the multitude it behoveth to come together, for they will hear that thou hast come.
౨౨కాబట్టి మనమేం చేద్దాం? నీవు వచ్చిన సంగతి వారికి తప్పకుండా తెలుస్తుంది.
23 'This, therefore, do that we say to thee: We have four men having a vow on themselves,
౨౩మేము నీకు చెప్పినట్టు చెయ్యి. మొక్కుబడి ఉన్న నలుగురు వ్యక్తులు మా దగ్గర ఉన్నారు.
24 these having taken, be purified with them, and be at expence with them, that they may shave the head, and all may know that the things of which they have been instructed concerning thee are nothing, but thou dost walk — thyself also — the law keeping.
౨౪నీవు వారిని తీసుకుపోయి వారితో కూడా శుద్ధి చేసుకుని, వారు తల క్షౌరం చేయించుకోడానికి అయ్యే ఖర్చు నువ్వే భరించు. అప్పుడు నిన్ను గూర్చి తాము విన్న సమాచారం నిజం కాదనీ, నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పాటించే వ్యక్తివనీ వీరు గ్రహిస్తారు.
25 'And concerning those of the nations who have believed, we have written, having given judgment, that they observe no such thing, except to keep themselves both from idol-sacrifices, and blood, and a strangled thing, and whoredom.'
౨౫అయితే విశ్వసించిన యూదేతరుల విషయంలో విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, వారికి రాశాం, జారత్వాన్నీ మానాలని నిర్ణయించి వారికి రాశాం” అని చెప్పారు.
26 Then Paul, having taken the men, on the following day, with them having purified himself, was entering into the temple, announcing the fulfilment of the days of the purification, till the offering was offered for each one of them.
౨౬కాబట్టి పౌలు ఆ మరునాడు మొక్కుబడి ఉన్న ఆ వ్యక్తులను వెంటబెట్టుకుని వెళ్ళి, వారితో కలిసి శుద్ధి చేసుకుని, దేవాలయంలో ప్రవేశించి, వారందరి పక్షంగా కానుక అర్పించే వరకూ శుద్ధిదినాలు నెరవేరుస్తానని చెప్పాడు.
27 And, as the seven days were about to be fully ended, the Jews from Asia having beheld him in the temple, were stirring up all the multitude, and they laid hands upon him,
౨౭ఏడు రోజులు పూర్తి కావచ్చినప్పుడు ఆసియ నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూసి, బలవంతంగా పట్టుకుని అక్కడి ప్రజలందరినీ కలవర పరచి
28 crying out, 'Men, Israelites, help! this is the man who, against the people, and the law, and this place, all everywhere is teaching; and further, also, Greeks he brought into the temple, and hath defiled this holy place;'
౨౮“ఇశ్రాయేలీయులారా, వచ్చి సహాయం చేయండి. ప్రజలకీ, ధర్మశాస్త్రానికీ, ఈ స్థలానికీ విరోధంగా అందరికీ, అన్నిచోట్లా బోధిస్తున్నవాడు వీడే. పైగా వీడు గ్రీకు వారిని దేవాలయంలోకి తెచ్చి ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేశాడు” అని కేకలు వేశారు.
29 for they had seen before Trophimus, the Ephesian, in the city with him, whom they were supposing that Paul brought into the temple.
౨౯ఎఫెసు వాడైన త్రోఫిము అంతకు ముందు పౌలుతో కలిసి ఉండడం వారు చూశారు కాబట్టి పౌలు అతణ్ణి కూడా దేవాలయంలోకి తీసుకుని వచ్చాడని వారు భావించారు.
30 All the city also was moved and there was a running together of the people, and having laid hold on Paul, they were drawing him out of the temple, and immediately were the doors shut,
౩౦పట్టణమంతా గందరగోళంగా ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా పరుగెత్తుకు వచ్చి, పౌలును పట్టుకుని దేవాలయంలో నుండి బయటికి ఈడ్చి తలుపులు మూసేశారు.
31 and they seeking to kill him, a rumour came to the chief captain of the band that all Jerusalem hath been thrown into confusion,
౩౧వారు అతణ్ణి చంపడానికి ప్రయత్నించారు. యెరూషలేము నగరమంతా అల్లకల్లోలంగా ఉందని ప్రధాన సైన్యాధికారికి సమాచారం వచ్చింది.
32 who, at once, having taken soldiers and centurions, ran down upon them, and they having seen the chief captain and the soldiers, did leave off beating Paul.
౩౨వెంటనే అతడు సైనికులనూ, శతాధిపతులనూ వెంటబెట్టుకుని వారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చాడు. వారు ఆ అధికారినీ, సైనికులనీ చూసి పౌలును కొట్టడం ఆపారు.
33 Then the chief captain, having come nigh, took him, and commanded [him] to be bound with two chains, and was inquiring who he may be, and what it is he hath been doing,
౩౩అతడు వచ్చి పౌలును పట్టుకుని, రెండు సంకెళ్లతో అతనిని బంధించమని ఆజ్ఞాపించి, “ఇతడెవడు? ఏమి చేశాడు?” అని అడిగాడు.
34 and some were crying out one thing, and some another, among the multitude, and not being able to know the certainty because of the tumult, he commanded him to be carried to the castle,
౩౪అయితే జనం వివిధ రకాలుగా కేకలు వేస్తూ అల్లరి చేయడం చేత అతడు నిజం తెలుసుకోలేక పౌలును కోటలోకి తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు.
35 and when he came upon the steps, it happened he was borne by the soldiers, because of the violence of the multitude,
౩౫పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు ప్రజలు గుంపులుగా పోగై దాడికి దిగడం వలన సైనికులు అతణ్ణి మోసుకుపోవలసి వచ్చింది.
36 for the crowd of the people was following after, crying, 'Away with him.'
౩౬ఎందుకంటే అతణ్ణి చంపమని ఆ జనసమూహం కేకలు వేస్తూ వారి వెంటబడ్డారు.
37 And Paul being about to be led into the castle, saith to the chief captain, 'Is it permitted to me to say anything unto thee?' and he said, 'Greek dost thou know?
౩౭వారు పౌలుని కోటలోకి తీసుకు పోతుండగా అతడు ఆ సేనాధిపతిని, “నేను నీతో ఒక మాట చెప్పవచ్చా?” అని అడిగాడు. అందుకు అతడు, “నీకు గ్రీకు భాష తెలుసా?’
38 art not thou, then, the Egyptian who before these days made an uprising, and did lead into the desert the four thousand men of the assassins?'
౩౮ఇంతకు ముందు నాలుగు వేలమంది ఉగ్రవాదులను తీసుకుని అరణ్యంలోకి పారిపోయిన ఐగుప్తీయుడివి నువ్వే కదా?” అని అడిగాడు.
39 And Paul said, 'I, indeed, am a man, a Jew, of Tarsus of Cilicia, of no mean city a citizen; and I beseech thee, suffer me to speak unto the people.'
౩౯అందుకు పౌలు, “నేను కిలికియలోని తార్సు పట్టణానికి చెందిన యూదుణ్ణి. ఒక మహా పట్టణపు పౌరుణ్ణి. నాకు ఈ ప్రజలతో మాటలాడే అవకాశం ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నాను” అన్నాడు.
40 And he having given him leave, Paul having stood upon the stairs, did beckon with the hand to the people, and there having been a great silence, he spake unto them in the Hebrew dialect, saying:
౪౦అతడు దానికి అనుమతించాడు. అప్పుడు పౌలు మెట్ల మీద నిలబడి ప్రజలకి చేతితో సైగ చేశాడు. వారు సద్దుమణిగాక అతడు హెబ్రీ భాషలో ఇలా అన్నాడు.

< Acts 21 >