< 2 Samuel 20 >
1 And there hath been called there a man of worthlessness, and his name [is] Sheba, son of Bichri, a Benjamite, and he bloweth with a trumpet, and saith, 'We have no portion in David, and we have no inheritance in the son of Jesse; each to his tents, O Israel.'
౧బెన్యామీను గోత్రానికి చెందిన బిక్రి కొడుకు షెబ అనే పనికిమాలినవాడు ఒకడున్నాడు. వాడు “ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా మీ మీ సొంత స్థలాలకు వెళ్ళిపొండి. దావీదులో మనకు పాలు లేదు, యెష్షయి కుమారుడిలో మనకు వాటా ఎంతమాత్రమూ రాదు” అంటూ బాకా ఊది గట్టిగా ప్రకటించాడు.
2 And every man of Israel goeth up from after David, after Sheba son of Bichri, and the men of Judah have cleaved to their king, from the Jordan even unto Jerusalem.
౨ఇశ్రాయేలు వారంతా దావీదును విడిచిపెట్టి బిక్రి కొడుకు షెబను వెంబడించారు. అయితే యొర్దాను నది నుండి యెరూషలేము వరకూ ఉన్న యూదావారు రాజు దగ్గరే ఉండిపోయారు.
3 And David cometh in unto his house at Jerusalem, and the king taketh the ten women-concubines — whom he had left to keep the house, and putteth them in a house of ward, and sustaineth them, and unto them he hath not gone in, and they are shut up unto the day of their death, in widowhood living.
౩దావీదు యెరూషలేములోని తన నగరానికి వచ్చాడు. తన ఇంటికి కాపలాగా ఉంచిన తన ఉపపత్నులు పదిమంది స్త్రీలను కాపాడుతూ వారిని పోషిస్తున్నాడు గానీ వారితో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. వారు కాపలాలో ఉండి జీవించినంత కాలం వితంతువుల వలె ఉండిపోయారు.
4 And the king saith unto Amasa, 'Call for me the men of Judah [in] three days, and thou, stand here,'
౪తరువాత రాజు అమాశాను పిలిపించి “మూడు రోజుల్లోగా నువ్వు యూదా వారినందరినీ సమకూర్చి నా దగ్గర హాజరు పరుచు” అని ఆజ్ఞాపించాడు.
5 and Amasa goeth to call Judah, and tarrieth beyond the appointed time that he had appointed him;
౫అమాశా యూదా వారిని సమీకరించడానికి వెళ్లిపోయాడు. అమాశా ఆలస్యం చేయడంతో అతనికిచ్చిన సమయం ముగిసిపోయింది.
6 and David saith unto Abishai, 'Now doth Sheba son of Bichri do evil to us more than Absalom; thou, take the servants of thy lord, and pursue after him, lest he have found for himself fenced cities, and delivered himself [from] our eye.'
౬అప్పుడు దావీదు అబీషైని పిలిపించాడు. “బిక్రి కొడుకు షెబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేస్తాడు. వాడు ఎత్తయిన గోడలు గల పట్టణాల్లో దాక్కుని మనకు దొరకడేమో. కాబట్టి నీవు నా సేవకులను వెంటబెట్టుకుని వెళ్లి వాడిని తరిమి పట్టుకో” అని ఆజ్ఞాపించాడు.
7 And the men of Joab go out after him, and the Cherethite, and the Pelethite, and all the mighty men, and they go out from Jerusalem to pursue after Sheba son of Bichri;
౭కాబట్టి యోవాబు మనుషులు, కెరేతీయులు, పెలేతీయులు, యోధులందరూ అతనితో కూడ యెరూషలేములో నుండి బిక్రి కొడుకు షెబను తరమడానికి బయలుదేరారు.
8 they [are] near the great stone that [is] in Gibeon, and Amasa hath gone before them, and Joab [is] girded; his long robe he hath put on him, and upon it a girdle — a sword [is] fastened upon his loins in its sheath; and he hath gone out, and it falleth.
౮వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరికి వచ్చినప్పుడు వారిని కలిసేందుకు అమాశా వచ్చాడు. యోవాబు తొడుక్కున్న చొక్కాకు పైన బిగించి ఉన్న నడికట్టుకు వేలాడుతున్న వరలో కత్తి పెట్టుకుని ఉన్నాడు. ఆ వర వదులైనందువల్ల కత్తి నేలపై జారి పడింది.
9 And Joab saith to Amasa, 'Art thou [in] peace, my brother?' and the right hand of Joab layeth hold on the beard of Amasa to give a kiss to him;
౯అప్పుడు యోవాబు అమాశాను చూసి “నా సోదరా, క్షేమంగా ఉన్నావా?” అని అడుగుతూ, అమాశాను ముద్దు పెట్టుకొంటున్నట్టు తన కుడి చేత్తో అతని గడ్డం పట్టుకున్నాడు.
10 and Amasa hath not been watchful of the sword that [is] in the hand of Joab, and he smiteth him with it unto the fifth [rib], and sheddeth out his bowels to the earth, and he hath not repeated [it] to him, and he dieth; and Joab and Abishai his brother have pursued after Sheba son of Bichri.
౧౦యోవాబు చేతిలో ఉన్న కత్తిని అమాశా చూడలేదు కనుక తనను కాపాడుకోలేక పోయాడు. యోవాబు కత్తి తీసి అతని కడుపులో బలంగా పొడిచాడు. కత్తి కడుపులో దిగిన వెంటనే అతని పేగులు జారి నేలపై పడడంతో ఆ దెబ్బతోనే అతడు చనిపోయాడు. తరువాత యోవాబు, అతని సోదరుడు అబీషైలు బిక్రి కొడుకు షెబను తరమడానికి వెళ్ళిపోయారు.
11 And a man hath stood by him, of the young men of Joab, and saith, 'He who hath delight in Joab, and he who [is] for David — after Joab!'
౧౧యోవాబు సైనికుడు ఒకడు అతని దగ్గర నిలబడి “యోవాబును ఇష్టపడేవారు, దావీదు పక్షంలో ఉన్నవారు అంతా యోవాబును వెంబడించండి” అని ప్రకటించాడు.
12 And Amasa is rolling himself in blood, in the midst of the highway, and the man seeth that all the people have stood still, and he bringeth round Amasa out of the highway to the field, and casteth over him a garment, when he hath seen that every one who hath come by him — hath stood still.
౧౨అమాశా రక్తంలో దొర్లుతూ దారి వెంట పడి ఉన్నాడు. ఆ చోటికి వచ్చినవారంతా నిలబడి చూస్తూ ఉండడం సైనికుడు చూసి, అమాశాను దారిలో నుండి పక్కన ఉన్న పొలంలోకి లాగివేసి, ఆ దారిలో నడిచేవారు ఎవ్వరూ చూడకుండా ఆ శవం మీద ఒక గుడ్డను కప్పివేశాడు.
13 When he hath been removed out of the highway, every man hath passed on after Joab, to pursue after Sheba son of Bichri.
౧౩శవం దారిలో నుండి తీసిన తరువాత ప్రజలంతా బిక్రి కొడుకు షెబను తరమడానికి యోవాబు వెంట వెళ్ళారు.
14 And he passeth over through all the tribes of Israel to Abel, and to Beth-Maachah, and to all the Berites, and they are assembled, and go in also after him,
౧౪యోవాబు, ఇశ్రాయేలు గోత్రపువారు, ఆబేలు బేత్మయకా, బెరీయుల గోత్రాలవారి దగ్గరికి వచ్చాడు. వారంతా కలసికట్టుగా అతణ్ణి వెంబడించారు.
15 and they go in and lay siege against him, in Abel of Beth-Maachah, and cast up a mount against the city, and it standeth in a trench, and all the people who are [are] with Joab are destroying, to cause the wall to fall.
౧౫ఈ విధంగా వారు వచ్చి ఆబేల్బేత్మయకాలో బిక్రిని ముట్టడించారు. పట్టణ ముఖ్య ద్వారం ముందు బురుజు కట్టారు. యోవాబు మనుషులు ప్రాకారాన్ని పడగొట్టి పాడు చేయడానికి పూనుకున్నారు.
16 And a wise woman calleth out of the city, 'Hear, hear; say, I pray you, unto Joab, Come near hither, and I speak unto thee.'
౧౬అప్పుడు ఆబేలులో ఉన్న తెలివి గల ఒక స్త్రీ ప్రాకారపు గోడ ఎక్కి “అయ్యలారా వినండి, నేను యోవాబుతో మాట్లాడాలి గనుక అతణ్ణి ఇక్కడకి రమ్మని చెప్పండి” అని కేకలు వేసింది. యోవాబు ఆమె దగ్గరికి వచ్చాడు.
17 And he cometh near unto her, and the woman saith, 'Art thou Joab?' and he saith, 'I [am].' And she saith to him, 'Hear the words of thy handmaid;' and he saith, 'I am hearing.'
౧౭అప్పుడు ఆమె “యోవాబువు నువ్వేనా?” అని అతణ్ణి అడిగింది. అతడు “నేనే” అని జవాబిచ్చాడు. అప్పుడామె “నీ దాసురాలనైన నేను నీతో మాట్లాడవచ్చా?” అని అడిగినప్పుడు, అతడు “మాట్లాడవచ్చు” అన్నాడు.
18 and she speaketh, saying, 'They spake often in former times, saying, Let them diligently ask at Abel, and so they finished.
౧౮ఆమె “పూర్వకాలంలో ప్రజలు ‘సమస్య ఏదైనా ఉంటే ఆబేలులో పరిష్కరించుకోవాలి’ అని చెప్పుకునేవారు. ఆ విధంగా చేసి తమ సమస్యలు తీర్చుకొనేవారు.
19 I [am] of the peaceable — faithful ones of Israel; thou art seeking to destroy a city, and a mother in Israel; why dost thou swallow up the inheritance of Jehovah?
౧౯నేను ఇశ్రాయేలు గోత్రంలో నెమ్మదస్తురాలు, నిజాయితీ పరురాలు అని పేరు పొందిన దాన్ని. ఇశ్రాయేలీయుల పట్టణాల్లో ముఖ్యమైన ఒక పట్టణాన్ని నాశనం చేయాలని నువ్వు తలపెడుతున్నావు. అలా చేసి యెహోవా సంపదను నువ్వెందుకు నిర్మూలం చేస్తావు?” అని అడిగింది.
20 And Joab answereth and saith, 'Far be it — far be it from me; I do not swallow up nor destroy.
౨౦అందుకు యోవాబు “నిర్మూలం చెయ్యను, అలా చేయడం నాకు దూరమవుతుంది గాక. అసలు సంగతి అది కానే కాదు.
21 The matter [is] not so; for a man of the hill-country of Ephraim — Sheba son of Bichri his name — hath lifted up his hand against the king, against David; give ye up him by himself, and I go away from the city.' And the woman saith unto Joab, 'Lo, his head is cast unto thee over the wall.'
౨౧బిక్రి కొడుకు షెబ అనే ఒక ఎఫ్రాయిము గోత్రంవాడు రాజైన దావీదు పట్ల ద్రోహం చేశాడు. మీరు వాణ్ణి మాత్రం మాకు అప్పగించండి. వెంటనే నేను ఈ పట్టణం విడిచి వెళ్ళిపోతాము” అని చెప్పాడు. ఆమె యోవాబుతో “అయ్యా, అలాగే, వాడి తల ప్రాకారపు గోడపై నుండి పడవేస్తాం” అని చెప్పి లోపలికి వెళ్లి,
22 And the woman cometh unto all the people in her wisdom, and they cut off the head of Sheba son of Bichri, and cast [it] unto Joab, and he bloweth with a trumpet, and they are scattered from the city, each to his tents, and Joab hath turned back to Jerusalem unto the king.
౨౨తాను తెలివిగా యోవాబుతో మాట్లాడిన మాటలను అక్కడి ప్రజలందరికీ చెప్పినప్పుడు వారు బిక్రి కొడుకు షెబ తల నరికి గోడపై నుండి యోవాబు ముందు పడవేశారు. అప్పుడు యోవాబు బాకా ఊదించాడు. ప్రజలంతా ఆ పట్టణాన్ని విడిచి ఎవరి నివాసాలకు వారు బయలుదేరారు. యోవాబు యెరూషలేములో ఉన్న రాజు దగ్గరికి తిరిగి వచ్చాడు.
23 And Joab [is] over all the host of Israel, and Benaiah son of Jehoiada [is] over the Cherethite, and over the Pelethite,
౨౩ఇశ్రాయేలు సైన్యం అంతటికీ యోవాబు అధికారిగా నియామకం అయ్యాడు. కెరేతీయులకు, పెలేతీయులకు యెహోయాదా కొడుకు బెనాయా అధిపతిగా ఉన్నాడు.
24 and Adoram [is] over the tribute, and Jehoshaphat son of Ahilud [is] the remembrancer,
౨౪పన్నువసూలు చేసే పనివారి మీద అదోరాము,
25 and Sheva [is] scribe, and Zadok and Abiathar [are] priests,
౨౫రాజ్యపు దస్తావేజులు, పత్రాల మీద అహీలూదు కొడుకు యెహోషాపాతు అధికారులుగా నియామకమయ్యారు. షెవా ప్రధానమంత్రి.
26 and also, Ira the Jairite hath been minister to David.
౨౬సాదోకు, అబ్యాతారు యాజక వృత్తి నిర్వహించే వారు. యాయీరీయుడైన ఈరా దావీదుకు ముఖ్య సలహాదారు.