< Judges 15 >

1 `Forsothe aftir sum del of tyme, whanne the daies of wheete heruest neiyiden, Sampson cam, and wolde visite his wijf, and he brouyte to hir a `kide of geet; and when he wolde entre in to hir bed bi custom, `the fadir of hir forbeed hym, and seide,
కొన్ని రోజులైన తరువాత గోదుమ పంట కోత సమయంలో సంసోను ఒక మేకపిల్లను తీసుకుని తన భార్యను చూడటానికి వెళ్ళాడు. “నా భార్యను చూడటానికి ఆమె గదిలోకి వెళ్తాను” అనుకున్నాడు. కాని ఆమె తండ్రి అతణ్ణి లోపలికి వెళ్ళనివ్వలేదు.
2 Y gesside that thou haddist hatid hir, and therfor Y yaf hir to thi freend; but sche hath a sistir, which is yongere and fairere than sche, be sche `wijf to thee for hir.
ఆమె తండ్రి “నువ్వు ఆమెను నిజంగా ద్వేషిస్తున్నావని అనుకున్నాను. అందుకే నీ స్నేహితునికి ఆమెను ఇచ్చాను. ఆమె చెల్లి ఆమె కంటే అందకత్తె గదా. ఆమెకు బదులుగా ఆమె చెల్లిని తీసుకో” అన్నాడు.
3 To whom Sampson answeride, Fro this day no blame schal be in me ayens Filistees, for Y schal do yuels to you.
అప్పుడు సంసోను వారితో “ఈ సారి నేను ఫిలిష్తీయులకు కీడు చేసినా నిర్దోషి గానే ఉంటాను” అన్నాడు.
4 And he yede, and took thre hundrid foxis, and ioynede `the tailis of hem to tailis, and boond brondis in the myddis,
సంసోను అక్కడి నుంచి వెళ్లి మూడు వందల నక్కలను పట్టుకున్నాడు. రెండేసి నక్కల తోకలను ముడి పెట్టాడు. ఆ తోకల మధ్యలో ఒక్కో కాగడా కట్టి ఉంచాడు.
5 whiche he kyndlid with fier, and leet hem, that thei schulden renne aboute hidur and thidur; `which yeden anoon in to the cornes of Filisteis, bi whiche kyndlid, bothe cornes `borun now to gidere, and yit stondynge in the stobil, weren brent, in so myche that the flawme wastide vyneris, and `places of olyue trees.
ఆ కాగడాలను మండించి అవి మండుతుండగా ఆ నక్కలను ఫిలిష్తీయుల గోదుమ పొలాల్లోకి తరిమాడు. అవి ధాన్యం కుప్పలనూ, పైరునీ, ద్రాక్ష, ఒలీవ తోటలనూ తగులబెట్టాయి.
6 And Filisteis seiden, Who dide this thing? To whiche it was seid, Sampson, hosebonde of the `douytir of Thannathei, for he took awey Sampsones wijf, and yaf to another man, `wrouyte this thing. And Filisteis stieden, and brenten bothe the womman and hir fadir.
ఫిలిష్తీయులు “ఎవడు చేసాడిలా” అన్నారు. “తిమ్నాతు వాడి అల్లుడైన సంసోను చేశాడు. ఎందుకంటే సంసోను భార్యను ఆ తిమ్నాతు వాడు అతని స్నేహితుడికిచ్చాడు” అనే జవాబు వచ్చింది. అప్పుడు ఫిలిష్తీయులు వెళ్లి ఆమెనూ ఆమె తండ్రినీ సజీవ దహనం చేశారు.
7 To whiche Sampson seide, Thouy ye han do this, netheles yit Y schal axe veniaunce of you, and than Y schal reste.
అప్పుడు సంసోను “మీరు ఇలా చేశారు గనక, నేనూ మీ మీద పగ తీర్చుకునే దాకా ఊరుకోను” అని చెప్పాడు.
8 And he smoot hem with greet wounde, so that thei wondriden, and `puttiden the hyndrere part of the hipe on the thiy; and he yede doun, and dwellide in the denne of the stoon of Ethan.
అతడు వారి తొడలనూ తుంటి ఎముకలనూ విరగగొట్టి ముక్కలు చేసి అనేకమందిని చంపేశాడు. ఆ తరువాత వెళ్లి ఏతాము బండ సందుల్లోని ఒక గుహలో నివసించాడు.
9 Therfor Filisteis stieden in to the lond of Juda, and settiden tentis in the place, that was clepid aftirward Lethi, that is, a cheke, wher `the oost of hem was spred a brood.
అప్పుడు ఫిలిష్తీయులు యూదా దేశంపై యుద్ధం చేయడానికై లేహి అనే ప్రాంతంలో సైన్యాన్ని సమకూర్చారు.
10 And men of the lynage of Juda seiden to hem, Whi `stieden ye ayens vs? Whiche answeriden, We comen that we bynde Sampson, and yelde to hym tho thingis whiche he wrouyte in vs.
౧౦యూదాప్రజలు వారిని “మీరెందుకు మాపై యుద్ధం చేస్తున్నారు?” అని అడిగారు. దానికి ఫిలిష్తీయులు “సంసోనును పట్టుకోడానికే యుద్ధం చేస్తున్నాం. అతడు మాకు చేసినదానికి మేమూ బదులు తీర్చుకోవాలి” అన్నారు.
11 Therfor thre thousynde of men of Juda yeden doun to the denne of the flynt of Ethan; and thei seiden to Sampson, Woost thou not, that Filisteis comaunden to vs? Why woldist thou do this thing? To whiche he seide.
౧౧అప్పుడు యూదా వారిలో మూడువేలమంది ఏతాము బండ సందుల్లోని గుహ దగ్గరికి వెళ్లి సంసోనుతో ఇలా అన్నారు “ఫిలిష్తీయులు మన పాలకులని తెలీదా? మా మీదికి ఏం తెచ్చిపెట్టావో చూడు” అన్నారు. దానికి సంసోను “వాళ్ళు నాకేం చేసారో నేనూ వాళ్ళకూ అదే చేసాను” అన్నాడు.
12 As thei diden to me, Y dide to hem. Thei seien, We comen to bynde thee, and to bitake thee in to the `hondis of Filisteis. To whiche Sampson answeride, Swere ye, and `biheete ye to me, that ye sle not me.
౧౨దానికి వారంతా “మేము నిన్ను కట్టి పడేసి ఫిలిష్తీయులకు అప్పగించడానికి వచ్చాం” అన్నారు. అందుకు సంసోను “మీరు మాత్రం నన్ను చంపం అని ప్రమాణం చేయండి” అన్నాడు.
13 And thei seiden, We schulen not sle thee, but we schulen bitake thee boundun. And thei bounden him with twei newe cordis, and token fro the stoon of Ethan.
౧౩అందుకు వారు “మేము నిన్ను చంపం. కేవలం తాళ్ళతో బంధించి వాళ్లకి అప్పగిస్తాం” అన్నారు. ఇలా చెప్పి వారు అతణ్ణి కొత్తగా పేనిన తాళ్ళతో బలంగా బంధించి తీసుకుని వచ్చారు.
14 And whanne thei hadden come to the place of cheke, and Filisteis criynge hadden runne to hym, the spirit of the Lord felde in to hym, and as stikis ben wont to be wastid at the odour of fier, so and the bondis, with whiche he was boundun, weren scaterid and vnboundun.
౧౪అతడు లేహీకి వచ్చేసరికి ఫిలిష్తీయులు అతణ్ణి ఎదుర్కోడానికి వెళ్లి పెద్దగా కేకలు వేశారు. అప్పుడు దేవుని ఆత్మ అతన్ని బలంగా ఆవహించాడు. అతని చేతులను బంధించిన తాళ్ళు కాలిపోయిన జనపనారలాగా అయ్యాయి. వేసిన సంకెళ్ళు ఊడి పడ్డాయి.
15 And he took a cheke foundun, that is, the lowere cheke boon of an asse, that lay, `and he killyde `with it a thousinde men; and seide,
౧౫అతనికి ఒక పచ్చి గాడిద దవడ దొరికింది. దాన్ని పట్టుకుని దానితో వెయ్యి మందిని కొట్టి చంపాడు.
16 With the cheke of an asse, that is, with the lowere cheke of a colt of femal assis, Y dide hem awey, and Y killide a thousynde men.
౧౬అప్పుడు సంసోను ఇలా అన్నాడు, “నేను గాడిద దవడ ఎముకతో కుప్పలు కుప్పలుగా, గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది మనుషులను చంపాను.”
17 And whanne he songe these wordis, and `hadde fillid, he castide forth fro the hond the lowere cheke; and he clepide the name of that place Ramath Lethi, `which is interpretid, the reisyng of a cheke.
౧౭అతడు ఇలా చెప్పిన తరువాత ఆ దవడ ఎముకను పారవేసి ఆ స్థలానికి “రామత్లేహి” అనే పేరు పెట్టాడు.
18 And he thristide greetly, and criede to the Lord, and seide, Thou hast youe in the hond of thi seruaunt this grettest helthe and victory; and lo! Y die for thyrst, and Y schal falle in to the hondis of vncircumcidid men.
౧౮అప్పుడు అతనికి విపరీతమైన దాహం వేసి యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు. “నీ సేవకునికి గొప్ప విజయం అనుగ్రహించావు. ఇప్పుడు నేను దాహంతో మరణిస్తే ఈ సున్నతి సంస్కారం లేని మనుషుల చేతిలో పడతాను” అంటూ వేడుకున్నాడు.
19 Therfor the Lord openyde a wang tooth in the cheke boon of the asse, and watris yeden out therof, `bi whiche drunkun he refreischide the spirit, and resseuede strengthis; therfor the name of that place was clepid the Welle of the clepere of the cheke `til to present dai.
౧౯అప్పుడు దేవుడు లేహీలో పల్లంగా ఉన్న ఒక స్థలాన్ని నెర్రె విచ్చేలా చేశాడు. దానిలోనుండి నీళ్ళు ఉబికి వచ్చాయి. అతడు ఆ నీటిని తాగాడు. అతడి ప్రాణం ఉపశమనం పొంది తేరుకున్నాడు. కాబట్టి ఆ ప్రాంతానికి “ఏన్ హక్కోరే” అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతం ఇప్పటికీ లేహీ లో ఉంది.
20 And he demyde Israel in the daies of Filistiym twenti yeer.
౨౦సంసోను ఫిలిష్తీయుల రోజుల్లో ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు.

< Judges 15 >