< Ezekiel 10 >
1 And Y siy, and lo! in the firmament that was on the heed of cherubyns, as a saphir stoon, and as the fourme of licnesse of a kyngis seete apperide theron.
౧అప్పుడు నేను కెరూబుల తలలకి పైగా ఉన్న గుమ్మటం వైపుకి చూశాను. వాళ్లకి పైగా అది నీలమణిలా మెరుస్తూ కనిపించింది. అది ఒక సింహాసనం ఆకారంలో ఉంది.
2 And he seide to the man that was clothid in lynnun clothis, and spak, Entre thou in the myddis of wheelis, that ben vndur cherubyns, and fille thin hond with coolis of fier, that ben bitwixe cherubyns, and schede thou out on the citee.
౨అప్పుడు యెహోవా నార బట్టలు వేసుకున్న వ్యక్తితో ఇలా చెప్పాడు. “నువ్వు చక్రాల మధ్యకు, కెరూబుల కిందకు వెళ్ళు. కెరూబుల మధ్యలో ఉన్న నిప్పు కణికలతో రెండు చేతులూ నింపుకో. వాటిని పట్టణంలో వెదజల్లు.” నేను చూస్తుండగా ఆ వ్యక్తి వెళ్ళాడు.
3 And he entride in my siyt; forsothe cherubyns stoden at the riyt side of the hous, whanne the man entride, and a clowde fillide the ynnere halle.
౩అతడు లోపలికి వెళ్ళినప్పుడు కెరూబులు మందిరం కుడివైపున నిలబడి ఉన్నారు. లోపలి ఆవరణను మేఘం కమ్మివేసింది.
4 And the glorie of the Lord was reisid fro aboue cherubyns to the threisfold of the hous; and the hous was fillid with a cloude, and the halle was fillid with schynyng of the glorie of the Lord.
౪యెహోవా మహిమ తేజస్సు కెరూబుల పైనుండి పైకి వెళ్ళి మందిరం గడప దగ్గర నిలిచింది. దాంతో మేఘం మందిరాన్ని నింపివేసింది. ఆవరణ అంతా యెహోవా మహిమ తేజస్సుతో వెలిగి పోతూ ఉంది.
5 And the sown of wyngis of cherubyns was herd til to the outermere halle, as the vois of almyyti God spekynge.
౫అప్పుడు బయట ఆవరణలో కెరూబుల రెక్కల చప్పుడు వినబడింది. అది సర్వశక్తిగల దేవుడు మాట్లాడినప్పుడు ఆయన స్వరంలా ఉంది.
6 And whanne he hadde comaundid to the man that was clothid in lynnun clothis, and hadde seid, Take thou fier fro the myddis of the wheelis, that ben bitwixe cherubyns, he entride, and stood bisidis the wheel.
౬అప్పుడు నార బట్టలు వేసుకున్న వ్యక్తిని ఇలా ఆదేశించాడు. “కెరూబుల మధ్యలో ఉన్న చక్రాల దగ్గర ఉన్న అగ్నిని తీసుకో.” అప్పుడు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి ఒక చక్రం పక్కనే నిలబడ్డాడు.
7 And cherub stretchide forth his hond fro the myddis of cherubyns, to the fier that was bitwixe cherubyns; and took, and yaf in to the hondis of hym that was clothid in lynnun clothis; and he took, and yede out.
౭కెరూబుల్లో ఒకడు కెరూబుల మధ్య ఉన్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి నార బట్టలు వేసుకున్న వ్యక్తి చేతుల్లో ఉంచాడు. ఆ వ్యక్తి అగ్నిని చేతుల్లోకి తీసుకుని బయటకి వెళ్ళాడు.
8 And the licnesse of the hond of a man apperide in cherubyns, vndur the wyngis of tho.
౮అప్పుడే కెరూబుల రెక్కల కింద మనిషి హస్తం లాంటిది నాకు కనిపించింది.
9 And Y siy, and lo! foure wheelis weren bisidis cherubyns; o wheel bisidis o cherub, and another wheel bisidis another cherub; forsothe the licnesse of wheelis was as the siyt of the stoon crisolitis.
౯నేను ఇంకా చూస్తూ ఉన్నాను. కెరూబుల దగ్గర నాలుగు చక్రాలున్నాయి. ఒక్కో కెరూబు దగ్గర ఒక్కో చక్రం ఉంది. ఆ చక్రాలు వైఢూర్యంతో చేసినట్టుగా ఉన్నాయి.
10 And the biholdyng of tho was o licnesse of foure, as if a wheel be in the myddis of a wheel.
౧౦ఆ నాలుగు చక్రాలు ఒకే విధంగా ఉన్నాయి. అవి ఒక చక్రంలో మరో చక్రం అమర్చినట్టుగా ఉన్నాయి.
11 And whanne tho yeden, tho yeden in to foure partis; tho turneden not ayen goynge, but to the place to which that that was the firste wheel bowide to go, also othere suyden, and turneden not ayen.
౧౧అవి కదులుతూ ఉన్నప్పుడు అన్ని వైపులకీ వెళ్తున్నట్టుంది. అవి ఏ పక్కకీ తిరగడం లేదు. అవి కెరూబుల ముఖాలు ఏ వైపుకి ఉన్నాయో ఆ వైపుకే వెళ్తున్నాయి. అవి పక్కకి తిరగకుండా ముందుకే వెళ్తున్నాయి.
12 And al the bodi of tho wheelis, and the neckis, and hondis, and wyngis of the beestis, and the cerclis, weren ful of iyen, in the cumpas of foure wheelis.
౧౨ఆ నాలుగు కెరూబుల వీపులూ, చేతులూ, రెక్కలతో సహా వాటి శరీరమంతా కళ్ళు ఉన్నాయి. నాలుగు చక్రాలు కూడా కళ్ళతో చుట్టూ కప్పి ఉన్నాయి.
13 And he clepide tho wheelis volible, ether able to go al aboute, in myn heryng.
౧౩నేను వింటుండగా “చక్ర భ్రమణం” అని వాటిని పిలిచినట్టు విన్నాను.
14 Forsothe o beeste hadde foure faces; o face was the face of cherub, and the secounde face the face of a man, and in the thridde was the face of a lioun, and in the fourthe was the face of an egle;
౧౪ఒక్కో కెరూబుకీ నాలుగు ముఖాలున్నాయి. మొదటి ముఖం కెరూబులా ఉంది. రెండోది మనిషిలా ఉంది. మూడో ముఖం సింహంలా ఉంది. నాలుగోది డేగ ముఖంలా ఉంది.
15 and the cherubyns weren reisid. Thilke is the beeste, which Y hadde seyn bisidis the flood Chobar.
౧౫అప్పుడు ఈ కెరూబులు పైకి లేచాయి. కెబారు నది దగ్గర నాకు కనబడిన జీవులు ఇవే.
16 And whanne cherubyns yeden, also the wheelis bisidis tho yeden to gidere; whanne cherubyns reisiden her wyngis, that tho schulden be enhaunsid fro the erthe, the wheelis abididen not stille, but also tho weren bisidis cherubyns.
౧౬కెరూబులు కదిలినప్పుడల్లా చక్రాలు కూడా వాటితోనే కదిలాయి. కెరూబులు భూమి పైనుండి ఎగరడానికి రెక్కలు విప్పినప్పుడు చక్రాలు తిరగలేదు.
17 The wheelis stooden with tho cherubyns stondynge, and weren reisid with the cherubyns reisid; for the spirit of lijf was in tho wheelis.
౧౭కెరూబులు నిలిచిపోయినప్పుడు చక్రాలు కూడా నిలిచిపోయాయి. కెరూబులు లేచినప్పుడు చక్రాలు కూడా లేచాయి. ఎందుకంటే ఆ జీవుల ప్రాణం చక్రాల్లో ఉంది.
18 And the glorie of the Lord yede out fro the threisfold of the temple, and stood on the cherubyns.
౧౮అప్పుడు యెహోవా మహిమ తేజస్సు మందిరం గడప నుండి లేచి కెరూబులకు పైగా వెళ్ళి ఆగింది.
19 And cherubyns reisiden her wyngis, and weren enhaunsid fro the erthe bifore me; and whanne tho yeden out, also the wheelis sueden; and it stood in the entryng of the eest yate of the hous of the Lord, and the glorie of God of Israel was on tho.
౧౯కెరూబులు నేను చూస్తుండగా తమ రెక్కలు అల్లార్చి బయటకు వెళ్ళాయి. వాటితో పాటు చక్రాలు కూడా వాటి పక్కనే పైకి లేచాయి. అవి యెహోవా మందిరానికి తూర్పున ఉన్న ద్వారం దగ్గర నిలిచాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ తేజస్సు వాటికి పైగా వచ్చి నిలిచింది.
20 Thilke is the beeste, which Y siy vndur God of Israel, bisidis the flood Chobar. And Y vndurstood that foure cherubyns weren;
౨౦కెబారు నది దగ్గర ఇశ్రాయేలు ప్రజల దేవుని కింద నాకు కనబడిన జీవులు ఇవే. అవి కెరూబులని నేను తెలుసుకున్నాను!
21 foure faces weren to oon, and foure wyngys weren to oon; and the licnesse of the hond of a man was vndur the wyngis of tho.
౨౧ఒక్కో దానికి నాలుగు ముఖాలూ నాలుగు రెక్కలూ ఆ రెక్కల కింద మనిషి చేతుల్లాంటివీ ఉన్నాయి.
22 And the licnesse of the cheris of tho weren thilke cheeris whiche Y hadde seyn bisidis the flood Chobar; and the biholdyng of tho, and the fersnesse of ech, was to entre bifor his face.
౨౨వాళ్ళ ముఖాలు కెబారు నది దగ్గర నాకు కలిగిన దర్శనంలో నేను చూసిన రూపాల్లాగే ఉన్నాయి. అవి అన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి.