< Ephesians 4 >

1 Therfor Y boundun for the Lord biseche you, that ye walke worthili in the clepyng,
కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.
2 in which ye ben clepid, with al mekenesse and myldenesse, with pacience supportinge ech other in charite,
3 bisi to kepe vnyte of spirit in the boond of pees.
4 O bodi and o spirit, as ye ben clepid in oon hope of youre cleping;
ఏ విధంగా మీ పిలుపుకు సంబంధించిన నిశ్చయతతో ఉన్నారో ఆ విధంగా శరీరం ఒక్కటే, ఆత్మా ఒక్కడే.
5 o Lord,
ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే.
6 o feith, o baptym, o God and fadir of alle, which is aboue alle men, and bi alle thingis, and in vs alle.
అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికంటే పైనా, అందరి ద్వారా అందరిలో ఉన్నాడు.
7 But to ech of vs grace is youun bi the mesure of the yyuyng of Crist;
అయితే క్రీస్తు అనుగ్రహించిన కృప కొలతను బట్టి మనలో ప్రతి ఒక్కరికీ వరాలు లభించాయి.
8 for which thing he seith, He stiynge an hiy, ledde caitifte caitif, he yaf yiftis to men.
దీని గురించే ఆయన ఆరోహణమైనప్పుడు బందీలను చెరలోకి కొనిపోయాడనీ తన ప్రజలకు బహుమానాలు ఇచ్చాడనీ లేఖనంలో ఉంది.
9 But what is it, that he stiede vp, no but that also he cam doun first in to the lowere partis of the erthe?
“ఆరోహణమయ్యాడు” అనే మాటకు ఆయన భూమి కింది భాగాలకు దిగాడు అని కూడా అర్థం ఉంది కదా.
10 He it is that cam doun, and that stiede on alle heuenes, that he schulde fille alle thingis.
౧౦అలా దిగినవాడే తానే సమస్తాన్నీ నింపేలా ఆకాశ మహాకాశాలన్నింటినీ దాటి, ఎంతో పైకి ఎక్కిపోయాడు.
11 And he yaf summe apostlis, summe prophetis, othere euangelistis, othere scheepherdis and techeris,
౧౧విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు.
12 to the ful endyng of seyntis, in to the werk of mynystrie, in to edificacioun of Cristis bodi,
౧౨
13 til we rennen alle, in to vnyte of feith and of knowyng of Goddis sone, in to a parfit man, aftir the mesure of age of the plente of Crist;
౧౩మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుడి గురించిన జ్ఞానంలో ఏకీభావం కలిగి ఉండాలనీ క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణ పరిణతికి సమానమైన పరిణతి చెందాలనీ ఆయన ఇలా నియమించాడు.
14 that we be not now litle children, mouynge as wawis, and be not borun aboute with ech wynd of teching, in the weiwardnesse of men, in sutil wit, to the disseyuyng of errour.
౧౪అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము.
15 But do we treuthe in charite, and wexe in him by alle thingis, that is Crist oure heed;
౧౫ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం.
16 of whom alle the bodi set togidere, and boundun togidere bi ech ioynture of vnder seruyng, bi worching in to the mesure of ech membre, makith encreesyng of the bodi, in to edificacioun of it silf in charite.
౧౬ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పని చేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది.
17 Therfor Y seie and witnesse this thing in the Lord, that ye walke not now, as hethene men walken, in the vanyte of her wit;
౧౭కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను.
18 that han vndurstondyng derkned with derknessis, and ben alienyd fro the lijf of God, bi ignoraunce that is in hem, for the blyndenesse of her herte.
౧౮ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు.
19 Which dispeirynge bitoken hem silf to vnchastite, in to the worchyng of al vnclennesse in coueitise.
౧౯వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.
20 But ye han not so lerud Crist, if netheles ye herden hym,
౨౦అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు.
21 and ben tauyt in hym, as is treuthe in Jhesu.
౨౧యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు.
22 Do ye awey bi the elde lyuyng the elde man, that is corrupt bi the desiris of errour;
౨౨కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి
23 and be ye renewlid in the spirit of youre soule;
౨౩మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి.
24 and clothe ye the newe man, which is maad aftir God in riytwisnesse and hoolynesse of treuthe.
౨౪దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.
25 For which thing `ye putte awei leesyng, and speke ye treuthe ech man with his neiybore, for we ben membris ech to othere.
౨౫మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం. కాబట్టి మీరు అబద్ధాలు మానేసి మీ సాటిమనిషితో సత్యమే పలకాలి.
26 Be ye wrooth, and nyle ye do synne; the sunne falle not doun on youre wraththe.
౨౬కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు.
27 Nyle ye yyue stide to the deuel.
౨౭సాతానుకు అవకాశం ఇవ్వకండి.
28 He that stal, now stele he not; but more trauele he in worchinge with hise hondis that that is good, that he haue whereof he schal yyue to nedi.
౨౮దొంగతనం చేసేవాడు దాన్ని విడిచిపెట్టాలి. తన చేతులతో కష్టపడి పనిచేసి అక్కరలో ఉన్నవారికి సహాయం చేయాలి.
29 Ech yuel word go not of youre mouth; but if ony is good to the edificacioun of feith, that it yyue grace to men that heren.
౨౯మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారికి ప్రయోజనం కలిగేలా వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.
30 And nyle ye make the Hooli Goost of God sori, in which ye ben markid in the dai of redempcioun.
౩౦దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకూ మీపై ఉంటుంది.
31 Al bitternesse, and wraththe, and indignacioun, and cry, and blasfemye be takun awey fro you, with al malice;
౩౧సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి.
32 and be ye togidere benygne, merciful, foryyuynge togidere, as also God foryaf to you in Crist.
౩౨హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.

< Ephesians 4 >