< 1 Kings 9 >
1 Forsothe it was doon, whanne Salomon had perfourmed the bildyng of the hows of the Lord, and the bildyng of the kyng, and al thing that he coueitide, and wolde make,
౧సొలొమోను యెహోవా మందిరం, రాజగృహాల నిర్మాణం, తాను చేయాలని కోరుకున్న దాన్ని చేయడం ముగించిన తరవాత,
2 the Lord apperide to Salomon the secunde tyme, as he apperide to hym in Gabaon.
౨యెహోవా గిబియోనులో అతనికి ప్రత్యక్షమైనట్టు రెండోసారి సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు.
3 And the Lord seide to hym, Y haue herd thi preier, and thi bisechyng, which thou bisouytist bifor me; Y haue halewid this hows, which thou bildidist, that Y schulde sette there my name with outen ende; and myn iyen and myn herte schulen be there in alle daies.
౩యెహోవా అతనితో ఇలా అన్నాడు. “నా సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన విన్నపాలను నేను విన్నాను. నా నామం అక్కడ ఎప్పటికీ నిలిచి ఉండాలని నీవు కట్టించిన ఈ మందిరాన్ని నేను పవిత్ర పరిచాను. నా కళ్ళు, నా మనసు, ఎప్పటికీ దానివైపు ఉంటాయి.
4 Also if thou goist bifore me, as thi fadir yede, in simplenesse of herte, and in equite, and doist alle thingis whiche Y comaundide to thee, and kepist my domes, and my lawful thingis,
౪నీ తండ్రి దావీదులాగా నీవు కూడా యథార్థ హృదయంతో నీతిని అనుసరిస్తే, నేను నీకు ఆజ్ఞాపించిన విధంగా నా కట్టడలనూ, విధులనూ పాటిస్తే,
5 Y schal sette the trone of thi rewme on Israel with outen ende, as Y spak to Dauid, thi fadir, and seide, A man of thi kyn schal not be takun awei fro the trone of Israel.
౫‘నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండాా పోడు’ అని నీ తండ్రి దావీదుకు నేను మాట ఇచ్చినట్టు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనాన్ని చిరకాలం స్థిరపరుస్తాను.
6 Forsothe if bi turnyng awei ye and youre sones turnen awey, and suen not me, and kepen not myn hestis and cerymonyes, whiche Y settide forth to you, but ye goen, and worschipen alien goddis, and onouren hem `bi outward reuerence,
౬అయితే మీరు గాని, మీ సంతానం గాని నానుండి తొలగిపోయి, నా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించకుండా ఇతర దేవుళ్ళకు నమస్కరించి వాటిని పూజిస్తే,
7 Y schal do awei Israel fro the face of the lond which Y yaue to hem; and Y schal caste awei fro my siyt the temple, which Y halewid to my name; and Israel schal be in to a prouerbe and in to a fable, to alle puplis.
౭నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో ఉండకుండాా వారిని లేకుండా చేస్తాను. నా నామం కోసం నేను పవిత్ర పరచిన ఈ మందిరాన్ని నా సన్నిధిలో నుండి కొట్టివేస్తాను. ఇశ్రాయేలీయులు వివిధ ప్రజల మధ్యలోకి చెదరిపోయి ఒక సామెతగా, అపహాస్యంగా అవుతారు.
8 And this hows schal be in to ensaumple of Goddis offence; ech man that schal passe bi it, schal wondre, and schal hisse, and schal seye, Whi hath the Lord do thus to this lond, and to this hows?
౮ఈ మందిరం మీదుగా వెళ్ళేవారంతా చూసి, ఆశ్చర్యపడి, ‘అరెరే, యెహోవా ఈ దేశానికి, ఈ మందిరానికి ఎందుకిలా చేశాడు?’ అని అడుగుతారు.
9 And thei schulen answere, For thei forsoken her Lord God, that ladde the fadris of hem out of Egipt; and thei sueden alien goddis, and worschipiden hem, and onouriden hem; therfor the Lord brouyte in on hem al this yuel.
౯అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు, ‘వారు ఐగుప్తు దేశం నుండి తమ పూర్వీకులను రప్పించిన తమ దేవుడు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళపై ఆధారపడి వాటికి నమస్కరించి పూజించారు కాబట్టి యెహోవా ఈ కీడు అంతా వారి పైకి రప్పించాడు.’”
10 Sotheli whanne twenti yeer weren fillid, aftir that Salomon hadde bildid tweyne housis, that is, the hows of the Lord, and the hows of the kyng, while Hiram,
౧౦సొలొమోను యెహోవా మందిరం, రాజగృహం, రెంటినీ కట్టించడానికి 20 సంవత్సరాలు పట్టింది. తూరు రాజు హీరాము సొలొమోను కోరినంత దేవదారు, సరళ వృక్షపు కలపను, బంగారాన్నీ అతనికి ఇచ్చాడు.
11 kyng of Tire, yaf to Salomon trees of cedre, and of beech, and gold, bi al thing that he hadde nedeful; thanne Salomon yaf to Hiram twenti citees in the lond of Galile.
౧౧కాబట్టి సొలొమోను గలిలయ దేశంలో ఉన్న 20 పట్టణాలను హీరాముకు ఇచ్చాడు.
12 And Hiram yede out of Tyre that he schulde se the citees, whiche Salomon hadde youe to hym, and tho plesiden not hym;
౧౨హీరాము తూరు నుండి వచ్చి సొలొమోను తనకిచ్చిన పట్టణాలను చూసినప్పుడు అవి అతనికి నచ్చలేదు.
13 and he seide, Whethir thes ben the citees, whiche thou, brother, hast youe to me? And he clepide tho citees the lond of Chabul, `til in to this dai.
౧౩కాబట్టి అతడు “సోదరా, నీవు నాకిచ్చిన ఈ పట్టణాలు ఎలాటివి” అన్నాడు. హీరాము అ ప్రదేశాన్ని కాబూల్ అన్నాడు. ఈ రోజు వరకూ వాటికి “కాబూల్” అని పేరు.
14 Also Hiram sente to king Salomon sixe score talentis of gold.
౧౪హీరాము నాలుగు టన్నుల బంగారాన్ని రాజుకు పంపించాడు.
15 This is the summe of `costis, which summe Salomon the kyng yaf to bilde the hows of the Lord, and his house Mello, and the wal of Jerusalem, and Ezer, and Maggeddo, and Gazer.
౧౫యెహోవా మందిరాన్ని, తన స్వంత రాజగృహాన్ని, మిల్లోను, యెరూషలేము ప్రాకారాన్ని, హాసోరు, మెగిద్దో, గెజెరు అనే పట్టణాలను కట్టించడానికి సొలొమోను వెట్టిపనివారిని పెట్టాడు.
16 Farao, kyng of Egipt, stiede, and took Gazer, and brente it bi fier; and he killide Chananei, that dwellide in the citee, and yaf it in to dower to his douytir, the wijf of Salomon.
౧౬అంతకుముందు ఐగుప్తు రాజు ఫరో గెజెరు పైకి దండెత్తి దాన్ని పట్టుకుని, అగ్నితో కాల్చి ఆ పట్టణంలోని కనానీయులను హతమార్చాడు. అతడు తన కుమార్తెను సొలొమోనుకిచ్చి పెళ్లి చేసి ఆ పట్టణాన్ని తన కూతురికి కట్నంగా ఇచ్చాడు.
17 Therfor Salomon bildide Gazer, and the lower Bethoron,
౧౭సొలొమోను గెజెరును తిరిగి కట్టించాడు. కింద ఉన్న బేత్ హోరోనును,
18 and Balaath, and Palmyra in the lond of wildirnesse;
౧౮బయతాతు, అరణ్యంలో ఉన్న తద్మోరు పట్టణాలను,
19 and he made strong alle the townes, that perteyneden to hym, and weren with out wal, and the citees of chaaris, and the citees of knyytis, and what euer thing pleside hym to bilde in Jerusalem, and in the Liban, and in al the lond of his power.
౧౯సొలొమోను భోజన పదార్థాలను నిల్వ చేయడానికి, రథాల కోసం, రౌతుల కోసం పట్టణాలను కట్టించాడు. ఇవి గాక అతడు యెరూషలేములో, లెబానోనులో, తన పాలన కింద ఉన్న దేశమంతటిలో తాను వేటిని కట్టాలని కోరుకున్నాడో వాటన్నిటినీ కట్టించాడు.
20 Salomon made tributaries `til to this dai al the puple, that lefte of Ammorreis, Etheis, and Fereseis, and Eueys, and Jebuseys, that ben not of the sones of Israel,
౨౦అయితే ఆ కాలంలో ఇశ్రాయేలీయులతో సంబంధంలేని అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు, అనే జాతుల్లో కొందరు మిగిలి ఉన్నారు.
21 the sones of these hethen men, that dwelliden in the lond, that is, whiche the sones of Israel myyten not distrye.
౨౧ఇశ్రాయేలీయులు వారిని పూర్తిగా నశింపజేయలేక పోయారు. మిగిలి ఉన్న ఆ జాతుల ప్రజలను సొలొమోను బానిసలుగా నియమించాడు. ఈ రోజు వరకూ వారు అలాగే ఉన్నారు.
22 Sotheli kyng Salomon ordeynede not ony man of the sones of Israel to serue, but thei weren men werriours, and mynystris of him, and princes, and dukis, and prefectis of his chares and horsis.
౨౨అయితే సొలొమోను ఇశ్రాయేలీయుల్లో ఎవరినీ బానిసలుగా చేయలేదు. వారిని సైనికులుగా, తన సేవకులుగా, అధికారులుగా, సైన్యాధిపతులుగా తన రథాలకు, రౌతులకు అధిపతులుగా చేసుకున్నాడు.
23 Sotheli fyue hundrid and fifti `souereynes weren princes ouer alle the werkis of Salomon, whiche princes hadden the puple suget, and comaundiden to werkis ordeyned.
౨౩సొలొమోను చేయించిన పనిని అజమాయిషీ చేయడానికి ఉన్న ముఖ్య అధికారులు 550 మంది. వీరు పనివారి మీద అధికారులుగా ఉన్నారు.
24 Sotheli the douyter of Farao stiede fro the citee of Dauid in to hir hows, `which hows Salomon hadde bildid to hir; thanne he bildide Mello.
౨౪ఫరో కూతురు దావీదుపురం నుండి సొలొమోను తన కోసం కట్టించిన రాజగృహానికి వచ్చిన తరువాత అతడు మిల్లోను కట్టించాడు.
25 Also Salomon offride in thre tymes bi alle yeeris brent sacrifices and pesible sacrifices, on the auter which he hadde bildid to the Lord; and he brente encense bifor the Lord, and the temple was performed.
౨౫సొలొమోను తాను యెహోవాకు కట్టించిన బలిపీఠం మీద సంవత్సరానికి మూడుసార్లు దహనబలులు, శాంతి బలులు అర్పిస్తూ, యెహోవా సన్నిధిలో ఉన్న వేదిక మీద ధూపద్రవ్యాలు వేస్తూ ఉన్నాడు. ఆ విధంగా అతడు మందిరాన్ని కట్టడం పూర్తి చేశాడు.
26 Also king Salomon made `o schip in Asiongaber, which is bisidis Haila, in the brenke of the Reed sea, and in the lond of Idumee.
౨౬సొలొమోను రాజు ఎదోము దేశపు ఎర్ర సముద్ర తీరంలోని ఏలతు దగ్గర, ఎసోన్గెబెరులో, ఓడలను నిర్మించాడు.
27 And Iram sente in that schip hise seruauntis, schipmen, and kunnynge of the see, with the seruauntis of Salomon;
౨౭హీరాము సముద్ర ప్రయాణం బాగా తెలిసిన నావికులైన తన సేవకులను సొలొమోను సేవకులతోబాటు ఓడల మీద పంపించాడు.
28 and whanne thei hadden come in to Ophir, thei brouyten fro thennus gold of foure hundrid and twenti talentis to kyng Salomon.
౨౮వారు ఓఫీరు అనే స్థలానికి వెళ్ళి అక్కడ నుండి 14, 500 కిలోగ్రాముల బంగారాన్ని రాజైన సొలొమోను దగ్గరికి తీసుకువచ్చారు.