< Luke 13 >

1 There were present at the same time, some that told Him of the Galileans, whose blood Pilate had mingled with their sacrifices.
కొందరు గలిలయ ప్రజలు ఆలయంలో బలులర్పిస్తుంటే పిలాతు తన సైనికులను పంపి వారిని క్రూరంగా చంపించాడు. కొద్ది కాలం క్రితమే జరిగిన ఈ సంగతిని కొందరు యేసుకు తెలియజేశారు.
2 And Jesus answering said unto them, Do ye think that these were sinners above all the Galileans, because they suffered such things?
అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ గలిలయులు ఇలా దారుణంగా చనిపోయారు కాబట్టి వీళ్ళు మిగిలిన గలిలయుల కంటే పాపులని మీరు అనుకుంటున్నారా?
3 I tell you, No: but, unless ye repent, ye shall all likewise perish.
కారని మీతో చెబుతున్నాను. మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు.
4 Or those eighteen, upon whom the tower in Siloam fell, and killed them, do ye think that they were sinners above all the inhabitants in Jerusalem?
అలాగే సిలోయంలో గోపురం కింద పడి చనిపోయిన పద్దెనిమిది మంది సంగతేంటి? వారు యెరూషలేములో నివాసమున్న వారందరి కంటే అపరాధులని అనుకుంటున్నారా?
5 I tell you, No: but, unless ye repent, ye shall all likewise perish.
కానే కాదని మీతో చెబుతున్నా. మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు.”
6 And He spake this parable, A certain man had a fig-tree planted in his vineyard, and he came seeking fruit on it, but found none.
తరవాత ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు, “ఒక మనిషి తన ద్రాక్షతోటలో ఒక అంజూరు చెట్టు నాటాడు. అతడు దాని పండ్లు వెదకడానికి వచ్చి చూస్తే అతనికి పండ్లేమీ కనిపించలేదు.
7 And he said to the vine-dresser, behold, these three years I come seeking fruit on this fig-tree, and find none: cut it down, why should it cumber the ground?
దాంతో అతడు తోటమాలిని పిలిచి అతనితో, ‘మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరు చెట్టు పండ్ల కోసం వస్తున్నాను గానీ నాకేమీ దొరకడం లేదు. దీన్ని నరికెయ్యి. దీని వల్ల భూమి కూడా ఎందుకు వృధా కావాలి’ అన్నాడు.
8 And he said to him, Sir, let it alone this year also, till I dig about it, and lay dung to it:
అయితే ఆ తోటమాలి, ‘అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి, ఎరువు వేస్తాను. అందుకని ఈ సంవత్సరం కూడా దీన్ని ఉండనియ్యి,
9 then perhaps it may bear fruit; if not, afterwards cut it down.
అది ఫలిస్తే సరే, లేకపోతే నరికించి వెయ్యి’ అన్నాడు.”
10 And when He was teaching in one of the synagogues on the sabbath-day,
౧౦ఒక విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నాడు.
11 there was a woman that had a spirit of infirmity eighteen years, and was bowed together, and utterly unable to lift herself upright.
౧౧బలహీనపరచే దయ్యం పట్టిన ఒక స్త్రీ పద్దెనిమిది ఏళ్ళుగా అక్కడ ఉంది. ఆమె నడుం వంగిపోయి ఎంత మాత్రమూ సరిగ్గా నిలబడలేక పోతూ ఉంది.
12 And when Jesus saw her, He called her to Him, and said to her, Woman, thou art loosed from thine infirmity.
౧౨యేసు ఆమెను చూసి, తన దగ్గరికి రమ్మని పిలిచి, “అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు” అని ఆమెతో చెప్పి
13 And He laid his hands upon her; and immediately she was made straight, and glorified God.
౧౩ఆమె మీద చేతులుంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమ పరిచింది.
14 But the ruler of the synagogue, being provoked that Jesus had wrought a cure on the sabbath-day, said to the people, There are six days in which ye ought to work; on these therefore come and be healed, and not on the sabbath-day.
౧౪యేసు విశ్రాంతి దినాన స్వస్థపరచాడని ఆ సమాజ మందిరం అధికారి మండిపడ్డాడు. అతడు జనసమూహాన్ని చూసి, “పని చేయడానికి ఆరు రోజులున్నాయి కదా, ఆ రోజుల్లోనే వచ్చి స్వస్థత పొందండి. విశ్రాంతి దినం మాత్రం రావద్దు” అని చెప్పాడు.
15 The Lord therefore answered him and said, Thou hypocrite, does not any of you on the sabbath loose his ox or his ass from the stall and lead him away to watering?
౧౫అందుకు ప్రభువు, “కపటులారా, మీలో ప్రతివాడూ విశ్రాంతిదినాన తన ఎద్దునైనా గాడిద నైనా గాడి దగ్గరనుంచి విప్పి, తోలుకుపోయి నీళ్ళు పెడతాడా లేదా.
16 And might not this woman, a daughter of Abraham, whom Satan hath bound these eighteen years, be loosed from this bond on the sabbath-day?
౧౬ఇదిగో, పద్దెనిమిది ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినాన ఈ బంధకాల నుండి విడిపించకూడదా?” అన్నాడు.
17 Upon his saying this, all his adversaries were ashamed: but the people rejoiced for all the glorious things that were done by Him.
౧౭ఆయన ఈ మాటలు అన్నప్పుడు ఆయనను ఎదిరించిన వారంతా సిగ్గుపడ్డారు. అయితే జనసమూహమంతా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి సంతోషించారు.
18 Then said He, To what is the kingdom of God like, and to what shall I compare it?
౧౮ఆయన ఇలా అన్నాడు, “దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చగలం?
19 It is like a grain of mustard-seed, which a man took and sowed in his garden, and it grew, and became a great tree, and the birds of the air lodged in it's boughs.
౧౯అది ఒక వ్యక్తి తన తోటలో వేసిన ఆవగింజ లాగా ఉంది. అది పెరిగి పెద్ద చెట్టు అయింది. ఆకాశంలోని పక్షులు దాని కొమ్మలపై నివసించాయి.”
20 And again He said, To what shall I compare the kingdom of God?
౨౦మళ్ళీ ఆయన, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం?
21 It is like leaven, which a woman took and put into three measures of meal, till the whole was leavened.
౨౧ఒక స్త్రీ మూడు కుంచాల పిండి పొంగడానికి, దానిలో వేసే పుల్లని పిండిలాగా ఉంది” అన్నాడు.
22 And he went through the cities and villages teaching, as He journeyed towards Jerusalem.
౨౨ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలోని పట్టణాల్లో గ్రామాల్లో సంచరించి ప్రజలకు బోధించాడు.
23 And one said to Him, Lord, are there but few that shall be saved?
౨౩ఒకడు, “ప్రభూ, రక్షణ పొందేది కొద్ది మందేనా?” అని ఆయనను అడిగాడు.
24 But He said unto them, Strive to enter in at the strait gate; for I tell you, many will desire to enter in, and shall not be able.
౨౪దానికి ప్రభువు ఇలా జవాబిచ్చాడు, “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి. చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారుగానీ వారి వల్ల కాదని చెబుతున్నాను.
25 When the master of the house shall have risen up and shut the door, and ye begin to stand without and knock at the door saying, Lord, Lord, open unto us; and He shall answer and say to you, I know you not, whence ye are:
౨౫ఇంటి యజమాని తలుపు వేసుకున్న తరువాత మీరు బయట నిలబడి తలుపు కొడుతూ, ‘అయ్యా, దయచేసి తలుపు తెరవండి’ అని ప్రార్థిస్తే
26 then shall ye begin to say, We have eaten and drank in thy presence,
౨౬ఆయన, ‘మీరు ఎవరో, ఎక్కడి వారో నాకు తెలియదు’ అని మీతో అంటాడు. అప్పుడు మీరు, ‘నీ ఎదుటనే మేము తిన్నాం, తాగాం, మా వీధుల్లో నువ్వు ప్రచారం చేశావు కదా’ అంటారు.
27 and thou hast taught in our streets, But He will say, I tell you, I know you not, whence ye are; depart from me all ye workers of iniquity:
౨౭అప్పుడు ఆయన, ‘మళ్ళీ చెబుతున్నా, మీరు ఎక్కడి వారో నాకు తెలియదు. మీరంతా అక్రమాలు చేసేవారు. నా దగ్గరనుంచి పొండి’ అంటాడు.
28 and there shall be weeping and gnashing of teeth, when ye see Abraham, and Isaac, and Jacob, and all the prophets in the kingdom of God, and you yourselves shut out.
౨౮అబ్రాహాము ఇస్సాకు యాకోబు, ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉండటం, మిమ్మల్ని బయటకు తోసివేయడం చూసి మీరు ఏడుస్తూ పండ్లు కొరుకుతారు.
29 Yea they shall come from the east, and from the west, and from the north, and from the south, and shall sit down in the kingdom of God.
౨౯ఇంకా ప్రజలు తూర్పు నుండీ పడమర నుండీ ఉత్తరం నుండీ దక్షిణం నుండీ వచ్చి, దేవుని రాజ్యంలో భోజనానికి కూర్చుంటారు.
30 And behold, there are some last who shall be first, and there are first that shall be last.
౩౦ఇదిగో వినండి, చివరి వారు మొదటి వారవుతారు, అలాగే మొదటివారు చివరి వారవుతారు.”
31 At the same time came some of the pharisees, and said to Him, Go out and depart hence, for Herod intends to kill thee.
౩౧అదే రోజున కొందరు పరిసయ్యులు వచ్చి, “నువ్వు ఇక్కడినుంచి వెంటనే వెళ్ళిపో. ఎందుకంటే హేరోదు నిన్ను చంపాలని చూస్తున్నాడు” అని ఆయనతో చెప్పారు.
32 And He said to them, Go, tell that fox, Behold, I cast out demons and perform cures today and to-morrow; and in a little while I am to be perfected:
౩౨ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, ఆ గుంట నక్కతో ఇలా చెప్పండి, ఇదిగో ఈ రోజూ, రేపూ నేను దయ్యాలను వెళ్ళగొడతాను. రోగులను స్వస్థ పరుస్తాను. మూడవ రోజున నా గమ్యం నేను చేరుకుంటాను.
33 but I must procede to-day and to-morrow and the following; for it cannot be supposed that a prophet should be cut off but in Jerusalem.
౩౩అయితే ఈ రోజూ రేపూ ఆ తరువాత కూడా నేను యెరూషలేముకు నా ప్రయాణం కొనసాగించాల్సిందే. ఎందుకంటే యెరూషలేముకు బయట ప్రవక్త హతం కావడం జరగదు.
34 O Jerusalem, Jerusalem, that killest the prophets and stonest them that are sent unto thee, how often would I have gathered thy children, as a hen gathers her brood under her wings, and ye would not?
౩౪“యెరూషలేమా, ఓ యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరికి పంపిన వారిని రాళ్ళతో కొడుతూ ఉండే పట్టణమా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో ఆలాగే నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడ్డాను. కాని నువ్వు కలిసి రాలేదు.
35 Behold, your house is left unto you desolate: and I assure you ye shall not see me again till the time come when ye shall say, Blessed is He that cometh in the name of the Lord.
౩౫ఇదిగో విను! నీ ఇల్లు నీకు పాడుగా విడిచి పెడుతున్నాను. ‘ప్రభువు పేరిట వచ్చే వాడు ధన్యుడు’ అని నువ్వు చెప్పేంతవరకూ నన్ను మళ్ళీ చూడవని నీతో కచ్చితంగా చెబుతున్నాను,” అన్నాడు.

< Luke 13 >