< Ezra 8 >
1 Now these are the heads of their fathers’ households, and this is the genealogy of those who went up with me from Babylon, in the reign of Artaxerxes the king:
౧అర్తహషస్త చక్రవర్తి పరిపాలనలో బబులోను దేశం నుంచి నాతో కలసి వచ్చిన కుటుంబ నాయకుల వంశావళి ఇది.
2 Of the sons of Phinehas, Gershom. Of the sons of Ithamar, Daniel. Of the sons of David, Hattush.
౨ఫీనెహాసు వంశంనుంచి గెర్షోము. ఈతామారు వంశం నుంచి దానియేలు. దావీదు వంశం నుంచి హట్టూషు.
3 Of the sons of Shecaniah, of the sons of Parosh, Zechariah; and with him were listed by genealogy of the males one hundred and fifty.
౩పరోషు వంశంలో ఉన్న షెకన్యా వంశంనుంచి జెకర్యా, అతనితో పాటు 150 మంది పురుషులు.
4 Of the sons of Pahathmoab, Eliehoenai the son of Zerahiah; and with him two hundred males.
౪పహత్మోయాబు వంశంలో ఉన్న జెరహ్య కొడుకు ఎల్యోయేనై, అతనితో పాటు 200 మంది పురుషులు.
5 Of the sons of Shecaniah, the son of Jahaziel; and with him three hundred males.
౫షెకన్యా వంశంలో ఉన్న యహజీయేలు కొడుకు, అతనితో పాటు 300 మంది పురుషులు.
6 Of the sons of Adin, Ebed the son of Jonathan; and with him fifty males.
౬ఆదీను వంశంలో ఉన్న యోనాతాను కొడుకు ఎబెదు, అతనితో పాటు 50 మంది పురుషులు.
7 Of the sons of Elam, Jeshaiah the son of Athaliah; and with him seventy males.
౭ఏలాము వంశంలో ఉన్న అతల్యా కొడుకు యెషయా, అతనితో పాటు 70 మంది పురుషులు.
8 Of the sons of Shephatiah, Zebadiah the son of Michael; and with him eighty males.
౮షెఫట్య వంశంలో ఉన్న మిఖాయేలు కొడుకు జెబద్యా, అతనితో పాటు 80 మంది పురుషులు.
9 Of the sons of Joab, Obadiah the son of Jehiel; and with him two hundred and eighteen males.
౯యోవాబు వంశంలో ఉన్న యెహీయేలు కొడుకు ఓబద్యా, అతనితో పాటు 218 మంది పురుషులు.
10 Of the sons of Shelomith, the son of Josiphiah; and with him one hundred and sixty males.
౧౦షెలోమీతు వంశంలో ఉన్న యోసిప్యా కొడుకు, అతనితో పాటు 160 మంది పురుషులు.
11 Of the sons of Bebai, Zechariah the son of Bebai; and with him twenty-eight males.
౧౧బేబై వంశంలో ఉన్న బేబై కొడుకు జెకర్యా, అతనితో పాటు 28 మంది పురుషులు.
12 Of the sons of Azgad, Johanan the son of Hakkatan; and with him one hundred and ten males.
౧౨అజ్గాదు వంశంలో ఉన్న హక్కాటా కొడుకు యోహానాను, అతనితో పాటు 110 మంది పురుషులు.
13 Of the sons of Adonikam, who were the last, their names are: Eliphelet, Jeuel, and Shemaiah; and with them sixty males.
౧౩అదోనీకాము సంతానంలోని చిన్న కొడుకులు ఎలీపేలెటు, యెహీయేలు, షెమయా, వారితో పాటు 60 మంది పురుషులు.
14 Of the sons of Bigvai, Uthai and Zabbud; and with them seventy males.
౧౪బిగ్వయి వంశంలో ఉన్న ఊతై, జబ్బూదు, వారితో ఉన్న 70 మంది పురుషులు.
15 I gathered them together to the river that runs to Ahava; and there we encamped three days. Then I looked around at the people and the priests, and found there were none of the sons of Levi.
౧౫నేను వీరందరినీ అహవా వైపు ప్రవహించే నది దగ్గర సమకూర్చాను. అక్కడ మేము మూడు రోజులు గుడారాలు వేసుకుని ఉన్నాం. అప్పుడు నేను అక్కడి ప్రజలను, యాజకులను పరిశీలించగా ఒక్క లేవీ గోత్రికుడూ నాకు కనబడలేదు.
16 Then I sent for Eliezer, for Ariel, for Shemaiah, for Elnathan, for Jarib, for Elnathan, for Nathan, for Zechariah, and for Meshullam, chief men; also for Joiarib and for Elnathan, who were teachers.
౧౬అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లం అనే వారిని, ఉపదేశకులైన యోయారీబు ఎల్నాతాను అనే వారిని పిలిపించాను.
17 I sent them out to Iddo the chief at the place Casiphia; and I told them what they should tell Iddo and his brothers the temple servants at the place Casiphia, that they should bring to us ministers for the house of our God.
౧౭కాసిప్యా ప్రాంతంలో ఉండే ఇద్దో అనే అధికారి దగ్గరికి వారిని పంపించాను. మా దేవుని మందిరంలో సేవ చేసేందుకు పరిచారకులను మా దగ్గరికి తీసుకు వచ్చేలా కాసిప్యా ప్రాంతంలో ఉండే ఇద్దోతో, అతని బంధువులైన దేవాలయ సేవకులతో చెప్పవలసిన మాటలు వారికి తెలియజేశాను.
18 According to the good hand of our God on us they brought us a man of discretion, of the sons of Mahli, the son of Levi, the son of Israel, namely Sherebiah, with his sons and his brothers, eighteen;
౧౮మన దేవుని కరుణా హస్తం మాకు కాపుదలగా ఉన్నందువల్ల వారు షేరేబ్యాను, అతని కుమారులు, సహోదరులతో కలిపి మొత్తం 18 మందిని వెంటబెట్టుకు వచ్చారు. ఈ షేరేబ్యా గొప్ప మేధావి. ఇతడు ఇశ్రాయేలుకు పుట్టిన లేవి వంశస్థుడైన మహలి కొడుకుల్లో ఒకడు.
19 and Hashabiah, and with him Jeshaiah of the sons of Merari, his brothers and their sons, twenty;
౧౯వారు హషబ్యాను, అతనితో మెరారీ వంశీయుడు యెషయాను అతని బంధువులను, వారి కొడుకులను మొత్తం 20 మందిని తీసుకువచ్చారు.
20 and of the temple servants, whom David and the princes had given for the service of the Levites, two hundred and twenty temple servants. All of them were mentioned by name.
౨౦లేవీయులు జరిగించే సేవలో సహాయం చేయడానికి దావీదు, అతని అధిపతులు నియమించిన దేవాలయ సేవకుల్లో 220 మంది వచ్చారు. వీరందరినీ వారి పేరుల ప్రకారం నియమించారు.
21 Then I proclaimed a fast there at the river Ahava, that we might humble ourselves before our God, to seek from him a straight way for us, for our little ones, and for all our possessions.
౨౧అప్పుడు దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుని మాకూ, మా సంతానానికి, మా ఆస్తిపాస్తులకు క్షేమకరమైన ప్రయాణం జరిగేలా దేవుణ్ణి వేడుకోవడానికి అహవా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించాలని ప్రకటించాను.
22 For I was ashamed to ask of the king a band of soldiers and horsemen to help us against the enemy on the way, because we had spoken to the king, saying, “The hand of our God is on all those who seek him, for good; but his power and his wrath is against all those who forsake him.”
౨౨ఆయన్ను వేడుకునే వారికి క్షేమం కలిగించడానికి మన దేవుని హస్తం కాపుదలగా ఉంటుంది గానీ, ఆయనను తిరస్కరించే వారి పైకి ఆయన తీవ్రమైన కోపం రగులుకొంటుందని మేము రాజుతో చెప్పాం. అందువల్ల దారి మధ్యలో శత్రువుల బారి నుండి మమ్మల్ని కాపాడడానికి సైనికులను, గుర్రపు రౌతులను సహాయంగా పంపమని రాజును అడిగేందుకు నాకు సిగ్గు అనిపించింది.
23 So we fasted and begged our God for this, and he granted our request.
౨౩ఈ విషయాన్ని బట్టి మేము ఉపవాసం ఉండి దేవుని వేడుకొన్నప్పుడు ఆయన మా విన్నపం ఆలకించాడు.
24 Then I set apart twelve of the chiefs of the priests, even Sherebiah, Hashabiah, and ten of their brothers with them,
౨౪నేను యాజకుల్లో ముఖ్యమైన 12 మందిని, షేరేబ్యా, హషబ్యా, వీరి బంధువుల్లో 10 మందిని సిద్ధం చేశాను.
25 and weighed to them the silver, the gold, and the vessels, even the offering for the house of our God, which the king, his counsellors, his princes, and all Israel there present, had offered.
౨౫మన దేవుని ఆలయం నిలబెట్టడానికి దేశపు రాజు, అతని మంత్రులు, అధిపతులు, ఇంకా అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులంతా సమర్పించిన వెండి బంగారాలను, ఇతర సామగ్రిని బరువు తూచి వారికి అప్పగించాను.
26 I weighed into their hand six hundred and fifty talents of silver, one hundred talents of silver vessels, one hundred talents of gold,
౨౬1, 300 మణుగుల వెండి, 200 మణుగుల వెండి వస్తువులు, 200 మణుగుల బంగారం,
27 twenty bowls of gold weighing one thousand darics, and two vessels of fine bright bronze, precious as gold.
౨౭7,000 తులాల బరువున్న 20 బంగారపు గిన్నెలు, బంగారమంత ఖరీదైన పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలు లెక్కబెట్టి
28 I said to them, “You are holy to the LORD, and the vessels are holy. The silver and the gold are a free will offering to the LORD, the God of your fathers.
౨౮వారికి అప్పగించి “మీరు యెహోవాకు ప్రతిష్ట అయినవారు, పాత్రలు కూడా ప్రతిష్ట అయినాయి. ఈ వెండి బంగారాలు మీ పూర్వీకుల దేవుడైన యెహోవా కోసం ఇచ్చిన అర్పణలు.
29 Watch and keep them until you weigh them before the chiefs of the priests, the Levites, and the princes of the fathers’ households of Israel at Jerusalem, in the rooms of the LORD’s house.”
౨౯కాబట్టి మీరు యెరూషలేములో ఉన్న యెహోవా ఆలయం ఖజానా గదుల్లో యాజకుల, లేవీయుల, ఇశ్రాయేలు పెద్దల, ప్రధానుల సమక్షంలో వాటి బరువు తూచి లెక్క అప్పగించేదాకా వీటిని జాగ్రత్తగా ఉంచండి” అని వారితో చెప్పాను.
30 So the priests and the Levites received the weight of the silver, the gold, and the vessels, to bring them to Jerusalem to the house of our God.
౩౦యాజకులు, లేవీయులు వాటి లెక్క, బరువు సరిచూసుకుని, యెరూషలేములో ఉన్న మన దేవుని మందిరానికి తీసుకు వెళ్ళడానికి ఆ వెండి బంగారు పాత్రలను, ఇతర సామగ్రిని తీసుకున్నారు.
31 Then we departed from the river Ahava on the twelfth day of the first month, to go to Jerusalem. The hand of our God was on us, and he delivered us from the hand of the enemy and the bandits by the way.
౩౧మేము మొదటి నెల 12 వ రోజుకు యెరూషలేము చేరుకోవాలని అహవా నది దగ్గర నుండి బయలుదేరాం. మా దేవుని హస్తం మాకు కావలిగా ఉండి, శత్రువుల బారి నుండి, దారిలో కాపు కాసి ఉన్నవారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందువల్ల
32 We came to Jerusalem, and stayed there three days.
౩౨మేము యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడ బస చేశాం.
33 On the fourth day the silver and the gold and the vessels were weighed in the house of our God into the hand of Meremoth the son of Uriah the priest; and with him was Eleazar the son of Phinehas; and with them were Jozabad the son of Jeshua, and Noadiah the son of Binnui, the Levites.
౩౩నాలుగో రోజు వెండి బంగారు పాత్రలను మన దేవుని మందిరంలో యాజకుడైన ఊరియా కొడుకు మెరేమోతు కాటా వేశాడు. అతనితో పాటు ఫీనెహాసు కొడుకు ఎలియాజరు, లేవీ గోత్రికుడైన యేషూవ కొడుకు యోజాబాదు, బిన్నూయి కొడుకు నోవద్యా కూడా అక్కడ ఉన్నారు.
34 Everything was counted and weighed; and all the weight was written at that time.
౩౪తీసుకువచ్చిన సామగ్రి లెక్క ప్రకారం, బరువు ప్రకారం అన్నిటినీ సరిచూసి వాటి మొత్తం బరువు ఎంతో పుస్తకంలో రాశారు.
35 The children of the captivity, who had come out of exile, offered burnt offerings to the God of Israel: twelve bulls for all Israel, ninety-six rams, seventy-seven lambs, and twelve male goats for a sin offering. All this was a burnt offering to the LORD.
౩౫చెరలోకి వెళ్ళిన వారికి పుట్టి చెర నుండి విడుదలై, తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలు దేవునికి దహన బలులు అర్పించారు. ఇశ్రాయేలీయులందరి పక్షంగా 12 ఎద్దులను, 96 పొట్టేళ్ళను, 77 గొర్రెపిల్లలను అర్పించారు. పాపపరిహారార్థ బలి కోసం 12 మేకపోతులు తెచ్చి అన్నిటినీ దహనబలిగా యెహోవాకు అర్పించారు.
36 They delivered the king’s commissions to the king’s local governors and to the governors beyond the River. So they supported the people and God’s house.
౩౬చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్న దస్తావేజులను నది ఇవతల ఉన్న రాజు సేనాధిపతులకు, అధికారులకు అప్పగించారు. అప్పుడు వారు ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని ఆలయం పనికి సహాయం చేశారు.