< Psalms 120 >
1 A Song of Ascents. In my distress, I cried to the LORD. He answered me.
౧యాత్రల కీర్తన నా దీన స్థితిలో నేను యెహోవాను వేడుకున్నాను. ఆయన నా మొర ఆలకించాడు.
2 Deliver my soul, LORD, from lying lips, from a deceitful tongue.
౨యెహోవా, అబద్ధాలు పలికే పెదాల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడు.
3 What will be given to you, and what will be done more to you, you deceitful tongue?
౩మోసకరమైన నాలుకా, ఆయన నీకేం చేస్తాడో, ఎలాంటి కీడు కలిగిస్తాడో తెలుసా?
4 Sharp arrows of the mighty, with coals of juniper.
౪తంగేడు నిప్పుల వంటి బాణాలు, శూరులు ఎక్కుపెట్టిన పదునైన బాణాలు ఆయన నీ మీదికి వదులుతాడు.
5 Woe is me, that I live in Meshech, that I dwell amongst the tents of Kedar!
౫అయ్యో, నేను మెషెకు ప్రజల వద్ద విదేశీయునిగా ఉన్నాను. కేదారు గుడారాల దగ్గర నివసిస్తున్నాను.
6 My soul has had her dwelling too long with him who hates peace.
౬విరోధుల మధ్య నేను చాలాకాలం నుండి నివసిస్తున్నాను.
7 I am for peace, but when I speak, they are for war.
౭నాకు కావలసింది శాంతి సమాధానాలే. అయినా నా నోటి వెంట మాట రాగానే వాళ్ళు నాతో యుద్ధానికి సిద్ధమవుతారు.