< Ephesians 6 >
1 Children, be obedient to your parents as a Christian duty, for it is a duty.
౧పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి. ఇది మంచిది.
2 "Honour your father and your mother" --this is the first Commandment which has a promise added to it--
౨“నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది.” ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.
3 "so that it may be well with you, and that you may live long on the earth."
౩
4 And you, fathers, do not irritate your children, but bring them up tenderly with true Christian training and advice.
౪తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు. వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి.
5 Slaves, be obedient to your earthly masters, with respect and eager anxiety to please and with simplicity of motive as if you were obeying Christ.
౫సేవకులారా, భయంతో వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలో మీ యజమానులకు హృదయపూర్వకంగా లోబడండి.
6 Let it not be in acts of eye-service as if you had but to please men, but as Christ's bondservants who are doing God's will from the heart.
౬మనుషులను సంతోషపెట్టేవారు చేసినట్టు పైపైన కాక, క్రీస్తు దాసులుగా దేవుని సంకల్పాన్ని హృదయపూర్వకంగా జరిగిస్తూ,
7 With right good will, be faithful to your duty as service rendered to the Lord and not to man.
౭ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవచేయండి.
8 You well know that whatever right thing any one does, he will receive a requital for it from the Lord, whether he is a slave or a free man.
౮దాసుడైనా, స్వతంత్రుడైనా, మీలో ప్రతివాడూ తాను చేసిన మంచి పనికి ప్రభువు వలన ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.
9 And you masters, act towards your slaves on the same principles, and refrain from threats. For you know that in Heaven there is One who is your Master as well as theirs, and that merely earthly distinctions there are none with Him.
౯యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ, ఆయన పక్షపాతం లేని వాడనీ గ్రహించి, వారిని బెదిరించడం మానండి.
10 In conclusion, strengthen yourselves in the Lord and in the power which His supreme might imparts.
౧౦చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.
11 Put on the complete armour of God, so as to be able to stand firm against all the stratagems of the Devil.
౧౧మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
12 For ours is not a conflict with mere flesh and blood, but with the despotisms, the empires, the forces that control and govern this dark world--the spiritual hosts of evil arrayed against us in the heavenly warfare. (aiōn )
౧౨ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. (aiōn )
13 Therefore put on the complete armour of God, so that you may be able to stand your ground on the day of battle, and, having fought to the end, to remain victors on the field.
౧౩అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
14 Stand therefore, first fastening round you the girdle of truth and putting on the breastplate of uprightness
౧౪మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం,
15 as well as the shoes of the Good News of peace-- a firm foundation for your feet.
౧౫పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి.
16 And besides all these take the great shield of faith, on which you will be able to quench all the flaming darts of the Wicked one;
౧౬వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి.
17 and take the helmet of salvation, and the sword of the Spirit which is the word of God.
౧౭ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.
18 Pray with unceasing prayer and entreaty on every fitting occasion in the Spirit, and be always on the alert to seize opportunities for doing so, with unwearied persistence and entreaty on behalf of all God's people,
౧౮ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి.
19 and ask on my behalf that words may be given to me so that, outspoken and fearless, I may make known the truths (hitherto kept secret) of the Good News--
౧౯సువార్త రహస్యాన్ని ధైర్యంగా తెలియజేసేలా, నేను మాట్లాడనారంభించినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నా కోసం కూడా ప్రార్థించండి.
20 to spread which I am an ambassador in chains--so that when telling them I may speak out boldly as I ought.
౨౦సంకెళ్ళలో ఉన్న నేను ఈ సువార్త నిమిత్తమైన రాయబారిని. నేను ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.
21 But in order that you also may know how I am doing, Tychicus our dearly-loved brother and faithful helper in the Lord's service will tell you everything.
౨౧నా ప్రియ సోదరుడు తుకికు ప్రభువులో నమ్మకమైన సేవకుడు. అతని ద్వారా నేను ఎలా ఉన్నానో, ఏమి చేస్తున్నానో మీకు తెలుస్తుంది.
22 I have sent him to you for the very purpose--that you may know about us and that he may encourage you.
౨౨మా సంగతులు మీరు తెలుసుకోడానికీ, మీ హృదయాలను ప్రోత్సహించడానికీ అతణ్ణి మీ దగ్గరికి పంపాను.
23 Peace be to the brethren, and love combined with faith, from God the Father and the Lord Jesus Christ.
౨౩తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు శాంతినీ విశ్వాసంతో కూడిన ప్రేమను సోదరులకు అనుగ్రహించు గాక
24 May grace be with all who love our Lord Jesus Christ with perfect sincerity.
౨౪మన ప్రభు యేసు క్రీస్తుపై నిత్య ప్రేమను కనపరిచే వారికందరికీ కృప తోడై ఉండుగాక.