< Acts 24 >
1 Five days after this, Ananias the High Priest came down to Caesarea with a number of Elders and a pleader called Tertullus. They stated to the Governor the case against Paul.
౧ఐదు రోజుల తరువాత ప్రధాన యాజకుడు అననీయ, కొందరు పెద్దలు, తెర్తుల్లు అనే ఒక న్యాయవాది కైసరయ వచ్చి, పౌలు మీద మోపిన ఫిర్యాదును గవర్నరుకి తెలియజేశారు.
2 So Paul was sent for, and Tertullus began to impeach him as follows: "Indebted as we are," he said, "to you, most noble Felix, for the perfect peace which we enjoy, and for reforms which your wisdom has introduced to this nation,
౨పౌలు గవర్నర్ ఎదుట నిలబడినప్పుడు తెర్తుల్లు అతని మీద నేరం మోపుతూ ఇలా అన్నాడు.
3 in every instance and in every place we accept them with profound gratitude.
౩“మహా ఘనత వహించిన ఫేలిక్స్, పౌలు గవర్నర్ ఎదుట నిలబడినప్పుడు ఎంతో నెమ్మది అనుభవిస్తున్నామనీ, ఈ దేశ ప్రజలకు కలిగే అనేక సమస్యలు మీ ద్వారా పరిష్కారం అవుతున్నాయనీ ఒప్పుకొంటున్నాము. ఆ కారణంగా మేము అన్ని విధాలా, అన్ని చోట్లా మీ పట్ల పూర్ణ కృతజ్ఞత కలిగి ఉన్నాం.
4 But--not to detain you too long--I beg you in your forbearance to listen to a brief statement from us.
౪నేను మీకు ఎక్కువ విసుగు పుట్టించకుండా క్లుప్తంగా చెప్పే విషయాలను మీరు సహనంతో వినాలని వేడుకొంటున్నాను.
5 For we have found this man Paul a source of mischief and a disturber of the peace among all the Jews throughout the Empire, and a ringleader in the heresy of the Nazarenes.
౫ఈ వ్యక్తి ఒక చీడలాంటి వాడు. భూమిపై ఉన్న యూదులందరినీ తిరుగుబాటుకు రేపుతున్నాడు. ఇతడు నజరేయులనే మతశాఖకు నాయకుడని మేము గమనించాం.
6 He even attempted to profane the Temple, but we arrested him.
౬పైగా ఇతడు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నించాడు. అందువలన మేము అతణ్ణి నిర్బంధించాం
౭అయితే మీ సైనికాధికారి లూసియస్ వచ్చి బలవంతంగా పౌలును మా చేతుల్లోనుంచి విడిపించి తీసుకుపోయాడు.
8 You, however, by examining him, will yourself be able to learn the truth as to all this which we allege against him."
౮వీటిని గురించి మీరు పౌలును ప్రశ్నిస్తే మేము ఇతని మీద మోపుతున్న నేరాలన్నీ వాస్తవమని మీకే అర్థం అవుతుంది.”
9 The Jews also joined in the charge, maintaining that these were facts.
౯యూదులంతా ఏకీభవించి ఈ మాటలు నిజమే అని చెప్పారు.
10 Then, at a sign from the Governor, Paul answered, "Knowing, Sir, that for many years you have administered justice to this nation, I cheerfully make my defence.
౧౦అప్పుడు గవర్నర్, పౌలును మాట్లాడమని సైగ చేశాడు. పౌలు ఇలా అన్నాడు, “మీరు అనేక సంవత్సరాలుగా ఈ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నారని తెలిసి నేను ధైర్యంగా జవాబు చెప్పుకుంటున్నాను.
11 For you have it in your power to ascertain that it is not more than twelve days ago that I went up to worship in Jerusalem;
౧౧నేను యెరూషలేములో ఆరాధించడానికి వెళ్ళి కేవలం పన్నెండు రోజులు మాత్రమే అయ్యిందని మీరు విచారించి తెలుసుకోవచ్చు.
12 and that neither in the Temple nor in the synagogues, nor anywhere in the city, did they find me disputing with any opponent or collecting a crowd about me.
౧౨దేవాలయంలోగానీ, సమాజ మందిరాల్లోగానీ, పట్టణంలోగానీ, నేను ఎవరితోనైనా తర్కించడం, లేదా ప్రజల మధ్య అల్లరి రేపడం ఎవరూ చూడలేదు.
13 Nor can they prove the charges which they are now bringing against me.
౧౩వారు ఇప్పుడు నా మీద మోపే నేరాలను మీకు రుజువు పరచలేరు.
14 But this I confess to you--that in the way which they style a heresy, I worship the God of our forefathers, believing everything that is taught in the Law or is written in the Prophets,
౧౪అయితే ఒక సంగతి మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో రాసి ఉన్నవన్నీ నమ్మి,
15 and having a hope directed towards God, which my accusers themselves also entertain, that before long there will be a resurrection both of the righteous and the unrighteous.
౧౫నీతిపరులకూ అనీతిపరులకూ పునరుత్థానం కలుగుతుందని వీరు నమ్ముతున్నట్టుగానే నేను కూడా దేవునిలో నమ్మకముంచి, వారు మతశాఖ అని పిలిచిన ఈ మార్గంలోనే నా పూర్వీకుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను.
16 This too is my own earnest endeavour--always to have a clear conscience in relation to God and man.
౧౬ఈ విధంగా నేను దేవుని పట్లా, మనుష్యుల పట్లా ఎప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేలా చూసుకుంటున్నాను.
17 "Now after an interval of several years I came to bring alms to my nation, and to offer sacrifices.
౧౭“కొన్ని సంవత్సరాలైన తరువాత నేను నా సొంత ప్రజలకి దాన ధర్మంగా డబ్బు, కానుకలు ఇవ్వడానికి వచ్చాను.
18 While I was busy about these, they found me in the Temple purified, with no crowd around me and no uproar; but there were certain Jews from the province of Asia.
౧౮నేను శుద్ధి చేసుకుని వాటిని అప్పగిస్తుండగా వీరు దేవాలయంలో నన్ను చూశారు. నేనేమీ గుంపు కూర్చలేదు, నా వలన అల్లరీ కాలేదు.
19 They ought to have been here before you, and to have been my prosecutors, if they have any charge to bring against me.
౧౯అయితే ఆసియ నుండి వచ్చిన కొందరు యూదులు ఉన్నారు. నామీద వారికేమైన ఉంటే వారే మీ దగ్గరికి వచ్చి నా మీద నేరం మోపి ఉండవలసింది.
20 Or let these men themselves say what misdemeanour they found me guilty of when I stood before the Sanhedrin,
౨౦లేదా, నేను మహాసభలో నిలబడి ఉన్నప్పుడు, ‘మృతుల పునరుత్థానం గురించి నేడు మీ ఎదుట విమర్శ పాలవుతున్నాను’ అని నేను బిగ్గరగా చెప్పిన ఆ ఒక్క మాట విషయమై తప్ప నాలో మరి ఏ నేరమైనా వీరు కనిపెట్టి ఉంటే అది చెప్పవచ్చు.”
21 unless it was in that one expression which I made use of when I shouted out as I stood among them, "'The resurrection of the dead is the thing about which I am on my trial before you to-day.'"
౨౧
22 At this point Felix, who was fairly well informed about the new faith, adjourned the trial, saying to the Jews, "When the Tribune Lysias comes down, I will enter carefully into the matter."
౨౨ఫేలిక్సుకు ఈ మార్గం గూర్చి బాగా తెలుసు. అతడు, “సహస్రాధిపతి లూసియస్ వచ్చినప్పుడు నీ సంగతి నేను విచారించి తెలుసుకుంటాను” అని చెప్పి విచారణ నిలిపివేశాడు.
23 And he gave orders to the Captain that Paul was to be kept in custody, but be treated with indulgence, and that his personal friends were not to be prevented from showing him kindness.
౨౩పౌలుని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారం చేయడానికి అతని బంధువుల్లో ఎవరినీ ఆటంకపరచవద్దని శతాధిపతికి ఆజ్ఞాపించాడు.
24 Not long after this, Felix came with Drusilla his wife, a Jewess, and sending for Paul, listened to him as he spoke about faith in Christ Jesus.
౨౪కొన్ని రోజుల తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అనే తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తు యేసులో విశ్వాసం గూర్చి అతడు బోధించగా విన్నాడు.
25 But when he dealt with the subjects of justice, self-control, and the judgement which was soon to come, Felix became alarmed and said, "For the present leave me, and when I can find a convenient opportunity I will send for you."
౨౫అప్పుడు పౌలు నీతిని గూర్చీ ఆశానిగ్రహం గూర్చీ రాబోయే తీర్పును గూర్చీ ప్రసంగిస్తుండగా ఫేలిక్సు చాలా భయపడి, “ఇప్పటికి వెళ్ళు, నాకు సమయం దొరికినప్పుడు నిన్ను పిలిపిస్తాను” అని చెప్పాడు.
26 At the same time he hoped that Paul would give him money; and for this reason he sent for him the oftener to converse with him.
౨౬తరువాత పౌలు తనకు ఏమైనా లంచం ఇస్తాడేమోనని ఆశపడి, అతణ్ణి మాటిమాటికీ పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు.
27 But after the lapse of fully two years Felix was succeeded by Porcius Festus; and being desirous of gratifying the Jews, Felix left Paul still in prison.
౨౭రెండు సంవత్సరాల తరువాత ఫేలిక్సుకు బదులుగా పోర్కియస్ ఫేస్తు గవర్నరుగా వచ్చాడు. అప్పుడు ఫేలిక్సు యూదుల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలని, పౌలును చెరసాల్లోనే విడిచిపెట్టి వెళ్ళాడు.